Monday, 30 March 2026

పార్లమెంట్‌లో బాలల సంక్షేమంపై కీలక చర్చ ..... ఆత్మీయ పుత్రిక పురందేశ్వరి గారి మెసేజ్ ఫేస్బుక్ నుండి

🏛️ పార్లమెంట్‌లో బాలల సంక్షేమంపై కీలక చర్చ

✨ ఈ రోజు పార్లమెంట్‌లో నేను చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్స్ (CCIs) లో ఉన్న పిల్లల సంక్షేమంపై చర్చించడం జరిగింది.

🔸 CCIs లో ఉన్న పిల్లల సమగ్ర అభివృద్ధి, ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
🔸 కఠిన నియమావళి కారణంగా పిల్లలకు తగిన భావోద్వేగ మద్దతు అందడం లేదనే సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందా?
🔸 పిల్లల మానసిక అభివృద్ధి కోసం దీర్ఘకాలిక, సమగ్ర ప్రణాళికలు ఏమిటి?
🔸 గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు ఉన్నాయా?
తెలియజేయాలని కోరుతూ....
ఈ సందర్భంగా, NIMHANS వంటి ప్రముఖ సంస్థలతో కలిసి ట్రామా-ఇన్‌ఫార్మ్డ్ కేర్ పై తప్పనిసరి డిజిటల్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.దీని ద్వారా CCIs సూపరింటెండెంట్లు పిల్లల మానసిక అవసరాలను మెరుగ్గా అర్థం చేసుకుని సేవలందించగలరని సూచించడం జరిగింది.

✨దీనికి మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి శ్రీ Savitri ఠాకూర్  సమాధానమిస్తూ.....
▪️ పిల్లలకు కౌన్సెలింగ్, జీవన నైపుణ్య శిక్షణ, విద్య మరియు ఆరోగ్య సేవలు ఇప్పటికే అందిస్తున్నాము.
▪️ పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవలను నిరంతరం మెరుగుపరుస్తున్నాము.
▪️ పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలియజేసారు. వారికి నా ధన్యవాదములు.. 🙏

No comments:

Post a Comment