Monday, 20 May 2024

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నిఅగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్నిమారదు లోకం మారదు కాలందేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోనిమారదు లోకం మారదు కాలం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాళీ బాట దేనికి
గొర్రె దాటు మందికి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏక్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణామార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్యా కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం

పాతా రాతి గుహలు పాలరాతి గృహాలయినా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదెయ్ వేటు అదెయ్ నాటి కాదే అంతా
నట్టడువులు నడివీధికి నడిచొస్తేయ్ వింతా
బలవంతులేయ్ బ్రతకాలని సూక్తి మరువకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్యకాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని
మారదు లోకం మారదు కాలం

No comments:

Post a Comment