Monday, 20 May 2024

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనినన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవని
నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవని

ప్రతి పూటా పువ్వై పుడతా నిన్నే చేరి మెరిసేలా
ప్రతి అడుగు కోవెలనావతా నువ్వే నెలవు తీరేలా

నూరేళ్లు నన్ను నీ నివేదనవని

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

వెన్ను తట్టి మేలు కొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేలవే నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఎలా వలసిన దొరవూ నువ్వే

రమణి చెరను దాటించే రామ చంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామా సుందరా

మానసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగా పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనెవని

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమా నీదే సుమ
గంగ పొంగునాప గలిగిన కైలాసమా
కొంగు ముడ్లలోనే ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంతా కరిగించి దారపోయన
ఆయువంతా వెలిగించి హారతియ్యనాఆ

నిన్నే నిన్నే నిన్నేఈ ఒహ్హ్హ్హ్ నిన్నే నిన్నే నిన్నే

No comments:

Post a Comment