Monday, 20 May 2024

అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటిఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటిఅలనాటి రామ చంద్రుడికన్నింటా సాటిఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటిఅనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ ఆ ఆ ఆ




అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నింట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ ఆ ఆ ఆ

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ ఆ ఆ ఆ

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
ఆ ఆ ఆ ఆ ఆ

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కాలాలకు దొరకని కళ కళ జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ ఆ ఆ ఆ ఆ

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా

No comments:

Post a Comment