సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పేది ఎవరు ఏ కంటికైనా
రెప్పలా దుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతి నైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
యేవో జ్ఞాపకాల సుడి ధాటి బైటపడ లేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చంద్రుడి ఎదలో మంటని
వెన్నెల అనుకుంటారని
నిజమైన నమ్మేస్తామా
భ్రమలో పడమా తెలిసి
జాబిలి ని వెలివేస్తామా
తన తో చెలిమె హే విడిచి
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికి పైన అనుమాన పడరు ఎపుడైనా
నిను నీవై సరిగా కనలేవీ మానస
నడిరాతిరి నడక కడతేరాడు తెలుసా
పోయింది వెతికే వేదన
ఉండుండి ఏదో పోల్చున
సంద్రం లో ఎగిసే ఆలకి అలజడి నిలిచే దెపుడో
సందేహం కలిగే మదికి కలతని తీర్చేదెవరో
శాపం లాగా వెంట పడుతున్న గతం ఏదయియ్ నాఆ
దీపం లాగా తగిన దారేదో చూప గలిగేనా
No comments:
Post a Comment