మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
చిన్నుతున్న నవ్వులలోన స్నానాలాడనా
కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా
జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైట నే కోరిన కోట
తెలుగు భాషలోని వేల పదములు తరగుతున్నవి
నా వలపు భాషలోన చెలియ పదమే మిగిలి ఉన్నది
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచనా
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాధించనా
నాచెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది
No comments:
Post a Comment