Monday, 20 May 2024

హే ఎక్కడ వీడుంటే నిండుగాఅక్కడ నెలంతా పండగాచుట్టూ పక్కల చీకటి పెల్లగించగాఅడుగేసాడంటా కాచే దొరలాగామంచుని మంటని ఒక తీరుగాలెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా

ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటాలాక్షయా
ఓం నమో భస్మాఙ్గాయ
ఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయ
ధిమి ధిమి తాండవకేళి లోలాయ

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ
పొంగిపోయినాదే పల్లె కాసీ

హే సూపుల సుక్క నీ దారిగా
సుక్కల తివాసీ నీదిగా
సుడాసక్కని సామి దిగినాడు రా
ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా

హే రంగుల హంగుల పొడ లేదు రా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా
నీ తాపం శాపం తీర్చే వాడే రా

పై పైకలా భైరాగిలా
ఉంటాది రా ఆ లీలా
లోకాల నెలే టోడు నీకు
సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు
నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్
అండ్ సే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే
ఓం నమఃశివా జై జై జై
హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే
సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్
ఔర్ పెయిన్ అవే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసీ
పొంగిపోయినాదే పల్లె కాసీ

హే ఎక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నెలంతా పండగా
చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా
అడుగేసాడంటా కాచే దొరలాగా
మంచుని మంటని ఒక తీరుగా
లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా
ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా

సామికి అంటే హామీ తానై
ఉంటాడురా చివరంటా
లోకాలనేలే తోడూ నీకు
సాయం కాక పోడూ
హే నీలోనే కొలువున్నోడు
నిన్ను దాటి పోనే పోడూ

ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా జై జై జై
ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్
అండ్ సే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే
ఓం నమఃశివా జై జై జై
హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే
సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్
ఔర్ పెయిన్ అవే జై జై జై
సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ
శంభో అల్ ది వే

No comments:

Post a Comment