సంద్రాన ఒంటరిగా మిగలదా నావ
ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా
మమతలు పెంచి మనసులు విరిచి
చెలగాటమాడతావు న్యాయమా ఓ ఓఓఓ
ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా
రెక్కలొచ్చి గువ్వలు ఎగిరి వెళ్ళిపోయినా
గూటి గుండెలో ఇలా ఈటె గుచ్చి వెల్లవే
మూళ్ళ చెట్టు కొమ్మలైన ఎంత పైకి వెళ్లిన
తల్లి వేరు పై ఇలా కత్తి దూసి ఉండవె
మీరే తన లోకమని బ్రతికిన సోదరుని
చాల్లే ఇక వెళ్ళమని తరిమిన మిమ్ముగాని
అనురాగమెంత చిన్నబోయెనో ఓ ఓఓఓ
ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా
నారు పోసి దేవుడు నీరు పోయలేదని
నెత్తురంతా ధారపోసి పెంచడమే పాపమా
ఏరు దాటి వెంటనే పడవ కాల్చు వారిలా
అయినా వాళ్ళు మారిపోతే అంతకన్నా శాపమా
నిన్నే తమ దైవమని కొలిచిన వారేనా
యముడై వేదించకని నిను వెలివేసేన
అనుబంధమైంత నేరానాయేనా ఓ ఓఓఓ
ఓ కాలమా ఇది నీ జాలమా
ఓ కాలమా ఇది నీ జాలమా
మమతలు పెంచి మనసులు విరిచి
చెలగాటమాడతావు న్యాయమా ఓ ఓఓఓ
No comments:
Post a Comment