పెళ్లీడుకు వచ్చిన ఒంటిగా ఉన్నాను పినిమిటేట్ల ఉండాలో కలలు కన్నాను
ఏడ తానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడునా ఊహలో అందగాడు
సుగుణాభి రాముడు సమరాన్న భీముడు
ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు చేసిందే చెప్పేవాడు ఎవరో ఎవరో
అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు
జీన్స్ ప్యాంటు కట్టిన గళ్ళ లుంగి చుట్టిన
నీటుగాడు
జానపద పాటైనా జాగ్ బీటు రూట్ అయినా పాటగాడు
మగువలకే మరుడు మదనుడికి గురుడు
మాటలు తను అనడు చేతలకిక ఘనుడు
ముక్కు మీద కోపం వాడు ముక్కుసూటిగా వెళ్లేవాడు
ముక్కుతాడు నాకే వేస్తాడు
అతల వితల సత్య భూతల
భువనాలన్నీ ప్రణమిల్లు పురుషుడు
ఒక్కమగాడు ఒక్క మగాడు
కొమ్ములు తిరిగిన కండలు కలిగిన కథలో మెదిలే మొనగాడు... ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆకు చాటు పిందైన ఆకసాన చుక్కైనా వేటగాడు
లక్ష మంది అడ్డున్న లక్ష్యం అంటూ ఏదైనా
పోటుగాడు
మగసిరి గలరేడు మనసున పసివాడు
శతమధ గజబలుడు అతనికి ఎదురు ఎవడు
పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకై పుట్టాడు
రౌద్ర కరుణ రౌద్రవీర అద్భుత శృంగార శృంగారాది రస లీల దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు
సుగుణాభి రాముడు సహనాన్న భీముడు
ఎవడో ఎవడో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆంధ్రుల తనయుడు అనితర సాధ్యుడు నా కథనడిపే నాయకుడు
No comments:
Post a Comment