Saturday 26 August 2023

ధర్మమూలమే మరచిన జగతిని...... యుగాంతం ఎదురై ముంచునని....... సత్యం వ్రతునకు సాక్షాత్కారమిచ్చి....... సృష్టి రక్షణకు చేయూతనిచ్చి...... నావగ త్రోవను చూపిన మత్స్యం..... కాలగతిని సవరించిన సాక్ష్యం......

జరుగుతున్నది జగన్నాటకం...... 
జరుగుతున్నది జగన్నాటకం....
పురాతనపు పురాణ వర్ణన.... పైకి కనపడుతున్న కథనం.... నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం..... జరుగుతున్నది జగన్నాటకం...... జరుగుతున్నది జగన్నాటకం......
చెలియని కట్టను తెంచుకొని...... విలయము:⁠-⁠| విజృంభించునని...... ధర్మమూలమే  మరచిన జగతిని...... యుగాంతం ఎదురై ముంచునని....... సత్యం వ్రతునకు సాక్షాత్కారమిచ్చి....... సృష్టి రక్షణకు చేయూతనిచ్చి...... నావగ త్రోవను చూపిన మత్స్యం..... కాలగతిని సవరించిన సాక్ష్యం......
చేయదలచిన మహత్కార్యము మోయ జాలని  భారమైతే..... పొందగోరిన గందలే... నిరాశలో అణగారిపోతే...... బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు ..... నీరసించక...... ఓటమిని ఓడించగలిగిన...... ఓరిమి ఈ కూర్మం ...... అన్నది....... క్షీర సాగర మధన.... మర్మం......
ఉనికిని నిలిపే ఇలను కడలిలో... కలుపగా  ఉరికే.  ఉన్మాదములు..... కరాల ధంసుల కుల్లగించి..... ఈ ధరాతనమును ఉద్ధరించగల.....
దీరో ధతిరణ హూకారం...... ఆది వరాహపు..... ఆకారం
ఏది ఎక్కడ రా నీ హరి దాక్కున్నాడే రా...... భయపడి బయటకు రమ్మనరా...... ఎదుటపడి నన్ను గెలవగలడా...... తలపడి.....
నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు.....
నాడుల జీవజలంబుని అడుగు నీ నెత్తుటి వెచ్చదనాన్ని అడుగు....
నీ ఊపిరిలో గాలిని అడుగు.....
నీ అడుగుల ఆకాశాన్ని అడుగు....
నీలో నరుని హరిని కలుపు....
నీవే నరహరి అని నీవు తెలుపు.....
ఉన్నత మాతంగ బంధికాతుక..... ఆతతాయులైన నీహతి అనివార్యమవునీహతి...... సుకమస్తి.... రాసి ఓసి మృత.......... మసి చేయ మహిత యజ్ఞం....

....... అమేయం అనూహ్యం  అనంత విశ్వం.... ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం..... ఈ మానుష రూపం..... కుబ్ జాగృతి జాగృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం...... ముజ్జగాలను మూడడుగులతో కొలిచే......  త్రైవిక్రమ విస్తరణం.... జరుగుతున్నది జగన్నాటకం...... జగ జగ జగ జగమే నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగమే నాటకం..... పాపపు తరువై పుడమికి బరువై...... పెరిగిన ధర్మ గ్లానిని  పేరుకగా ... పరశురాముడై బయోదయముడై..... ధర్మాగ్రహ విగ్రహముడై..... స్తోత్రియా   క్షత్రియ తత్వమే భార్గవుడు........

ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మము లేక..... మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి..... మహిత చరితగా మిగలగలిగే  మనికి... సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలిచే......
ఇన్ని రీతులుగా....... ఇన్ని ఇన్ని పాత్రలుగా...... నిన్ను నీకే నూతన పరిచితునిగా ..... దర్శింప చేయగల జ్ఞాన...... దర్పణము కృష్ణావతారమే సృష్టి ఆవరణ తరణము......
అనిమగా.. మహిమగా ... గరీమగా  లగిమా........ ప్రాప్తిగా ........ప్రాధాన్యవర్తిగా...... ఈ సత్వముగా వసిత్వముగా...... నీలోని... అష్టసిద్ధులు.. నీకు కనిపెట్టగా.....
స్వస్వరూపమే విశ్వరూపంముగా....
నరుడి లోపల పరుడిపై దృష్టి పెట్టగా .......తలవంచి కైముడ్చి.... శిష్యుడవు నీవైతే..... నీ ఆర్తి కడతెర్చు ఆచార్యుడు నీవే.....
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం

కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం....
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం......
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.......
కృష్ణం వందే జగద్గురుం......

No comments:

Post a Comment