Wednesday 30 August 2023

.నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా......నీ బాట ఏమిటో ఏ జంటకి చూపవు కదా.............. . ఇట్లు మీ రవీంద్ర భారతి

.నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా......
నీ బాట ఏమిటో ఏ జంటకి చూపవు కదా.............. . ఇట్లు మీ రవీంద్ర భారతి

నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా.....
నా కళ్ళు ఎదురుగా నిలుచున్నది నువ్వే కదా....
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా....
మౌనమో మధుర గానము తనది అడగవే హృదయమా...
ఇంతలో చేరువై..... అంతలో దూరమై....
అందవా.... స్నేహమా.....
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా....
నా కళ్ళు ఎదురుగా నిలుచున్నది నువ్వే కదా....
రెక్కలు తొడిగిన తలపు నీవే కాదా.... నేస్తమా....
ఎక్కడ వాలను చెప్పు నువ్వే... సావాసమా.....
హద్దులు చేరిపిన చెలిమి నువ్వై..... నడిపే దీపమా....
వద్దకు రాకని ఆపకు ఇలా...... అనురాగమా....
నడకలు నేర్పిన ఆశవు కదా...... తడబడనియ్యకు కదిలిన కథ..... వెతికే మనసుకు noమమతే పంచుమా.....
నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా.....
నా కళ్ళు ఎదురుగా నిలుచున్నది...
ప్రేమ నీతో పరిచయమే ఏదో పాపమా....
అమృతం అనుకుని నమ్మడమే ఒక శాపమా......
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాదే ఫలితమా.....
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా.....
పెదవులపై చిరునవ్వుల కథ.....
నీటికి ఆరని మంటల రూపమా.....
నీ ఆట ఏమిటో ఏ నాటికి ఆపవు కదా.....
నీ బాట ఏమిటో ఏ జంటకి చూపవు కదా....
తెంచుకొనివు పంచుకోనీవు ఇంత చలగాటమా....
చెప్పుకోనివ్వవు తప్పుకోనివ్వవు నీకు ఇది న్యాయమా.....
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా.....
పంతమా.... బంధమా......
నీ ఆటేమిటో ఏనాటికి ఆపవు కదా......
నీ బాట ఏమిటో ఏ జంటకి చూపవు కదా.....

No comments:

Post a Comment