Monday 12 June 2023

అందరి బంధువయ భద్రాచల రామయ్యఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యకోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్యఅందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యరామా రామా

అందరి బంధువయ భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్యా కోదండరామయ్య
అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
రామా రామా
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదిలి అడవికి ఏ జనగా ఏగేనయ్యా
మహిలో జనులను కావగా వచ్చిన మహావిష్ణు అవతార మయా
ఆలిని రాక్షసుడు అపహరిస్తే ఆక్రోశించనయా
అసురుని దించి అమ్మని తెచ్చి అగ్నిపరీక్ష విధించినయా
చాకలి నిందకు సత్యము చటగా కుల సతినే విడనాడినయ
నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
కరుణా హృదయుడు శరణు అనువారికి అభయం వసంగునయ్య
అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభు ఓ అయోధ్య రామయ్య
భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమ భక్తీతో రామదాసు ఈ ఆలయమును కట్టించినయా
సీతా రాముల లక్ష్మణ లకు ఆభరణములే చేయించినయా
పంచవటిని పర్ణశాల 
సీతారాములు జలకములాడిన శేష తీర్థం అదిగో
రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్థము దర్శించిన జన్మ ధన్యమయ్య అందరి బంధువయ భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్యా ఆ సీతారామయ్య


No comments:

Post a Comment