Wednesday, 25 March 2026

జగదానంద కారకజయ జానకి ప్రాణ నాయకఆ ఆజగదానంద కారకజయ జానకి ప్రాణ నాయకశుభ స్వాగతం ప్రియ పరిపాలకజగదానంద కారకజయ జానకి ప్రాణ నాయకశుభ స్వాగతం ప్రియా పరిపాలక



జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
ఆ ఆ
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక

మంగళకరమవు నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ పాలనా శ్రీకారమవుగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవుగాక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక

సార్వబౌమునిగా పూర్ణ ఖుమ్బములు స్వగాతాలు పలికే
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే

నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే
న్యాయ దేవతై శంఖమూదగా పుల వాన కురిసే
రాజమకుటమే వొసగెలే నవరత్న కాంతి నీ రాజనం
సూర్యవంశం సింహాసనం పులకించి చేసే అభివందనం
సామ్రాజ్య లక్ష్మి ఈ పాద స్పర్శకి పరవశించే పోయే

జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక

రామ పాలనము కామధేనువాని వ్యోమసీమ చాటే
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే
రామ దర్శనము జన్మ ధన్యమని రాయి కూడా తెలిపే
రామ రాజ్యమే పౌరులందరిని నీతి బాటనడిపే
రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం
రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం
ఈ రామ చంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే

జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియా పరిపాలక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక

మంగళకరమవు నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమే ఇక పావనమవుగాక
నీ పాలనా శ్రీకారమవుగాక
సుఖశాంతులు సంపదలిడుగాక
నీ రాజ్యము ప్రేమసుధామయమవగాక
జగదానంద కారక
జయ జానకి ప్రాణ నాయక
శుభ స్వాగతం ప్రియ పరిపాలక

No comments:

Post a Comment