Tuesday, 17 February 2026

ఆకాశమే ఆకారమైభూమియే విభూధియైఅగ్నియే త్రినేత్రమైవాయువే చలనమై

ఆకాశమే ఆకారమై
భూమియే విభూధియై
అగ్నియే త్రినేత్రమై
వాయువే చలనమై

జలమే జగమెలు మందహాసమై
పంచభూతాధార ప్రపంచేశ్వర
విధాత విశ్వనాథ
భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం

అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం
శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం
జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం

ఓం నమః శివాయ
ఓం నమః శివాయ

పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా
గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు

సురగంగా వరగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి
అది విని అల్లాడేను భూమి
కాపాడ రావయ్యా స్వామి

కనులు ముడని నీకు ఓ శివయ్య
గంగానపగా గర్వపడి రాకయ్యా
తుళ్లిపడకే చాలు చెల్లవింకా
గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా
ఆదుకో కైలాస లింగ దూకవే ఆకాశగంగా

ప్రియాగంగా కనులెలా పొంగే
నిను ముడితే నా మనసుగిపోయే
ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం

రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి

హర వర ఎలారా సద శివ బ్రోవర
సఖి సతి పార్వతి ప్రియే ఇదే సమ్మతి

శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర

లోక కళ్యాణమును కోరి శివుడు
పార్వతి కల్యాణ వరుడాయెను
సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయె
నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు

శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం
శ్రీ మంజునాథ నీ చరితం
మధురం మధురం మహానంద శిఖరం

మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం





ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

శక్తికి రక్తికి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే
దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
మంజునాథ మంజునాథ
గరిసించే మనసు ఉంటె నీలోనే ఉన్నానన్నావు
లోకాల దొర కాదు దొంగవని చాటాను
మంజునాథ మంజునాథ
నా పాపా రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు

శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భావహార శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధార
జయ జయ శంభో జయ జయ గంగాధర

నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాథ మంజునాథ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు

దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భావహార శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధార
జయ జయ శంభో జయ జయ గంగాధర

మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ




ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్
మఃఓంకార రూపం శివమ్ శివమ్
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం

మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాథమ్
ఓం ఓం ఓం
నమః శంకరాయచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ
బావహారయాచా

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
హృదశహృదయంగమం
చతురుధాది సంగమం
పంచభూతాత్మకం శతశత్రునాశకం
సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం
నవరసమానోహరం దశదిశసువిమలామ్

ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం
ప్రస్తుతివ శంకరం
ప్రణత జన కింకరం
దుర్జనభయంకరం సజ్జనశుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం
భువన భవ్య భావదాయకం
భాగ్యాత్మకం రక్షకమ్

ఈశం సురేశం ఋషేశం పారేశేమ్
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమోహరాయచ స్వరాహారయాచా
పురహరాయచ రుద్రయచ భద్రయచ
ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

దండండ దండండ
దండండ దండండ
దాన్కదినదా నవ
తాండవ డంబరం
తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ
ధిమిధిమ్మీ సంగీత సాహిత్య
శుభ కమల భంభారం

ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర
మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం
సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం
పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం

నాకారం మకరం శిఖరం వికారం
ఎకరం నిరాకరసకరసరం
మహాకాలాకాలం మహా నీలకంఠం
మహానందనందం మహత్తట్టహాసం
ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం
జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం

మహాకాశంబ్యాసం మహాభానులింగం
మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం
వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం వామలిగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం
త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ కేదార లింగేశ్వరం

అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం

అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్

ఓం నమః
సోమయాచ సౌమ్యయాచ
భవ్యయచ భాగ్యాయాచ
శాంతాయచ శౌర్యాయచ
యోగయచ భోగాయచ
కలయచ కాంతాయచ
రమ్యయచ గమ్యాయచ
ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా

No comments:

Post a Comment