Sunday, 6 October 2024

🇮🇳🇮🇳🇮🇳ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీలవెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ

ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల
వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయమనీ
నీ బరువూ...నీ పరువూ...మోసేదీ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

రాజనీ...పేదనీ, మంచనీ...చెడ్డనీ...భేదమే ఎరుగదీ యమపాశం
కోట్ల ఐశ్వర్యమూ...కటిక దారిద్ర్యమూ...హద్దులే చెరిపెనీ మరుభూమి
మూటలలోని మూలధనం...చేయదు నేడు సహగమనం
నీ వెంట...కడకంటా...నడిచేదీ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

నలుగురూ మెచ్చినా...నలుగురూ తిట్టినా...విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే...సంఘమే కోరుతూ...మందిలో మార్గమే వేశావూ
నలుగురు నేడు పదుగురిగా...పదుగురు వేలు వందలుగా
నీ వెనకే...అనుచరులై ...నడిచారూ...
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

పోయిరా నేస్తమా...పోయిరా ప్రియతమా...నీవు మా గుండెలో నిలిచావు
ఆత్మయే నిత్యమూ...జీవితం సత్యమూ...చేతలే నిలుచురా చిరకాలం
బతికిన నాడు బాసటగా...పోయిన నాడు ఊరటగా
అభిమానం...అనురాగం...చాటేదీ....
ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...ఆ నలుగురూ...

No comments:

Post a Comment