Thursday 21 December 2023

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నాననిఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

గెలుపే అయినా ఓటమి అయినా తమది కాదు అనుకొంటేనే.....ఎవరిదో తెలుసుకొని ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం......

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కెళ్లాలని

కన్నుల నీటిని కళల సాగుకై వాడుకోవాలని
కాల్చె నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని

గుండె తో ధైర్యం చెప్పెను
చూపు తో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

ఎవ్వరు లేని ఒంటరి జీవి కి తోడు దొరికిందని
అందరు ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మ కు ఏరగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని

శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని

నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

No comments:

Post a Comment