Sunday, 29 December 2024

కనివిని ఎరుగని కరుణకునీవే ఆకారం తండ్రీనీవే ఆధారం తండ్రీ॥దయామయా నీ చూపులతోదావీదు తనయా నీ పిలుపులతోమరణం మరణించే

కనివిని ఎరుగని కరుణకు
నీవే ఆకారం తండ్రీ
నీవే ఆధారం తండ్రీ॥
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
మరణం మరణించే
మళ్లీ జీవము ఉదయించే (2)
నీ రూపము కనిపించే
హల్లెలూయ... హల్లెలూయ... (4)॥
చరణం : 1
నీ పద ధూళులు రాలిన నేలలు
మేమున్నామంటే
భాగ్యం ఉందా ఇంతకంటే ఆ...
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే
బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిని నీ రూపం
మనసారా వింటిని నీ మాట
ఇది అపురూపం ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం॥॥
చరణం : 2
మా కనురెప్పల పందిరిలో
నిను దాచుకుందుమయ్యా
నిత్యం కొలుచుకుందుమయ్యా
మా శుద్ధాత్మలు తివాసీలుగా
నీదు కాళ్ల కింద
ప్రేమగ పరచినాము ప్రభువా
ఇది చాలు మాకు ఈ జన్మకు
మము వీడి నీవు ఎటు వెళ్లకు
నీవె మా నేస్తం నీవె మా ప్రాణం
మా విశ్వాసమే నీవు
మా విశ్వానివి నీవు॥॥

The steel cutting ceremony for the Air Independent Propulsion (AIP) system, presided over by the Secretary of Defence Research and Development (DDR&D) and Chairman of DRDO, at the L&T Hazira facility on December 28, 2024, marks a significant milestone in India's defense technology advancement. This event signifies the commencement of the AIP manufacturing process, an essential step in enhancing the operational capabilities of submarines.

The steel cutting ceremony for the Air Independent Propulsion (AIP) system, presided over by the Secretary of Defence Research and Development (DDR&D) and Chairman of DRDO, at the L&T Hazira facility on December 28, 2024, marks a significant milestone in India's defense technology advancement. This event signifies the commencement of the AIP manufacturing process, an essential step in enhancing the operational capabilities of submarines.

Importance of AIP Technology:

1. Extended Underwater Endurance: AIP allows conventional submarines to stay submerged for longer periods without surfacing to recharge batteries, reducing vulnerability to detection.


2. Enhanced Stealth: By minimizing the need for snorkel-based air intake, AIP reduces the acoustic and thermal signatures of submarines.


3. Fuel Efficiency: The technology enables efficient energy utilization, leading to extended mission durations.



Strategic Implications:

1. Self-Reliance in Defense: This milestone aligns with India's vision of self-reliance in defense manufacturing under the "Aatmanirbhar Bharat" initiative.


2. Technological Edge: Development and deployment of AIP systems will provide Indian Navy submarines with a significant tactical advantage in the region.


3. Collaboration and Innovation: The partnership with L&T highlights the collaboration between DRDO and Indian industry, fostering innovation and capability building.



The AIP program reflects India's commitment to bolstering its naval defense capabilities while reducing dependency on imported technologies. It marks a forward step in creating a robust defense ecosystem that is technologically advanced and strategically secure.


ఫిడే మహిళల రాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజయం సాధించి రెండవ సారి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు తేజం @humpy_koneru కి అభినందనలు. ఇటువంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. దేశానికే గర్వకారణంగా నిలిచిన హంపి సాధించిన ఈ విజయం బాలికలలో మరింత స్ఫూర్తి నింపుతుంది.

ఫిడే మహిళల రాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజయం సాధించి రెండవ సారి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న తెలుగు తేజం @humpy_koneru కి అభినందనలు. ఇటువంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను. దేశానికే గర్వకారణంగా నిలిచిన హంపి సాధించిన ఈ విజయం బాలికలలో మరింత స్ఫూర్తి నింపుతుంది.
#ChessChampionship  
#Worldrapidchesschampion 
#KoneruHumpy

కోనేరు హంపి విజయం తెలుగు ప్రజలకు మరియు భారతదేశానికి గర్వకారణం. ఆమె 2024 ఫిడే మహిళల రాపిడ్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించడం, ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను రెండవ సారి గెలుచుకోవడం ఒక అపూర్వమైన ఘనత. ఈ విజయంతో హంపి తన నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, ధైర్యం, పట్టుదల, మరియు అంకితభావాన్ని కూడా చూపించారు.

ఇటువంటి విజయాలు భారతదేశంలో చెస్ పట్ల ప్రేరణను పెంచుతాయి, ముఖ్యంగా బాలికలలో. హంపి సాధించిన ఈ గొప్ప విజయంతో దేశవ్యాప్తంగా ఉన్న యువ చెస్ క్రీడాకారులు మరింత ప్రోత్సాహం పొందుతారు.

అభినందనలు మరియు శుభాకాంక్షలు:

కోనేరు హంపి విజయం కేవలం వ్యక్తిగత ఘనత మాత్రమే కాదు, దేశానికి గర్వకారణం.

ఆమె విజయం బాలికలకు కొత్త ప్రేరణను ఇస్తుంది, చెస్‌లో ఉన్న అవకాశాలను గుర్తించేందుకు సహాయం చేస్తుంది.

దేశం తరఫున భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం.


#ChessChampionship #KoneruHumpy #ProudTelugu


జరుగుతున్నది జగన్నాటకంజరుగుతున్నది జగన్నాటకంపురాతనపు పురాణ వర్ణనపైకి కనపడుతున్న కథనంనిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థంజరుగుతున్నది జగన్నాటకంజరుగుతున్నది జగన్నాటకం

జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం
పురాతనపు పురాణ వర్ణన
పైకి కనపడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం
జరుగుతున్నది జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం

చెలియలి కట్టను తెంచుకుని
విలయము విజ్రు౦భించునని
ధర్మ మూలమే మరచిన జగతిని
యుగాంత మెదురై ముంచునని
సత్యం వ్రతునకు సాక్షాత్కరించి
సృష్టి రక్షణకు చేయూత నిచ్చి
నావగా త్రోవను చూపిన మత్స్యం
కాలగతిని సవరించిన సాక్ష్యం

చేయ దలచిన మహాత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించ గలిగిన ఓరిమి కూర్మమన్నది
క్షీరసాగర మథన మర్మం

ఉనికిని నిలిపే ఇలను కడలిలో కల్పగా నురికే ఉన్మాదమ్మును
నరాల దంష్ట్రుల ఉల్లగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్ధరితరిణ హుంకారం ఆది వరాహపు ఆకారం
ఏడి ఎక్కడ రా
నీ హరి దాక్కున్నాడే రా భయపడి
బయటకు రమ్మనరా
ఎదుటపడి నన్ను గెలవగాలడా తలపడి
నువ్వు నిలిచిన ఈ నేలను అడుగు
నాడుల జీవ జలమ్ము ని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు
నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగులో ఆకాశాన్నడుగు
నీలో నరుని హరిని కలుపు
నీవే నరహరివని నువ్ తెలుపు

ఉన్మత్త మాతంగ బంధికాతుక వికతి
హంత్రు సంక్రాతనీ క్రుడని విడనీ జగతి
అహము రధమై యెతికె అవనికిదె అసనిహతి
ఆకతాయుల నిహతి అనివర్యమవు నియతి
శిత హస్తి హత మస్త కారినక సవకాసియో
క్రూరాసి క్రోసి హ్రుతదాయ దంష్ట్రుల దోసి మసి చేయ మహిత యజ్ఞం

అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం

పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై భయదభీముడై
పరశురాముడై భయద భీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన
శ్రోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు

ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి

ఇన్ని రీతులుగ ఇన్నిన్ని పాత్రలుగ
నిన్ను నీకే నూత్న పరిచితునిగ
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము
కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము

అణిమగా మహిమగా గరిమగా లఘిమగా
ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వమ్ముగా
నీలోని అష్తసిద్ధులు నీకు కన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా
నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగ
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం

సబ్ క మాలిక్ ఏక్ హాయ్ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడుఒక్కడే ఆ దేవుడురాముడే దేవుడని కొలిచింది మీరుయేసు నే దైవం అని తలచింది మీరుఅల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరుఏ పేరు తో ఎవరు పిలుచుకున్నఏ తీరుగ ఎవరు పూజించినఈ చరా చెర జగతి సృష్టించి నడిపించుఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడుఒక్కడే ఆ దేవదేవుడుఒక్కడే ఆ దేవదేవుడు

సబ్ క మాలిక్ ఏక్ హాయ్
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
యేసు నే దైవం అని తలచింది మీరు
అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న
ఏ తీరుగ ఎవరు పూజించిన
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

భాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగా కలగలాలను
హిందూ మతమన్నావు నీవు
ఆకు పచ్చ కేతనం చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన యేసు రఖ్త కన్నీళ్లతో ఎదలు తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని సిఖ్ అని
మొక్కుకునే పలు గుండెల పలు పెదాల పలుకేదైనా
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద భేదం ఎపుడు చూపబోదు గాలి
అది దేవా దేవుని జాలి
పసిడి మెడని పూరి గుడిసేని
భేదమెఱిగి కురియబోదు వాన
అది లోకేశవరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి
ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని
బ్రాంతి వీడు
ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగ
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగ
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

సబ్ క మాలిక్ ఏక్ హాయ్ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడుఒక్కడే ఆ దేవుడురాముడే దేవుడని కొలిచింది మీరుయేసు నే దైవం అని తలచింది మీరుఅల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరుఏ పేరు తో ఎవరు పిలుచుకున్నఏ తీరుగ ఎవరు పూజించినఈ చరా చెర జగతి సృష్టించి నడిపించుఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడుఒక్కడే ఆ దేవదేవుడుఒక్కడే ఆ దేవదేవుడు

సబ్ క మాలిక్ ఏక్ హాయ్
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
యేసు నే దైవం అని తలచింది మీరు
అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న
ఏ తీరుగ ఎవరు పూజించిన
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

భాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగా కలగలాలను
హిందూ మతమన్నావు నీవు
ఆకు పచ్చ కేతనం చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన యేసు రఖ్త కన్నీళ్లతో ఎదలు తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని సిఖ్ అని
మొక్కుకునే పలు గుండెల పలు పెదాల పలుకేదైనా
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద భేదం ఎపుడు చూపబోదు గాలి
అది దేవా దేవుని జాలి
పసిడి మెడని పూరి గుడిసేని
భేదమెఱిగి కురియబోదు వాన
అది లోకేశవరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి
ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని
బ్రాంతి వీడు
ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగ
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగ
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు

రఘుపతి రాఘవ రాజా రామ్పతిత పావన సీత రామ్ఈశ్వర అల్లాహ్ తేరో నామ్సబ్ కో సమ్మతి దే భగవాన్


రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ
కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ

భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ
తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత

కర్మ యోగమే జన్మంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత
ఈ బోసి నోటి తాతా

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి
నవ శకానికి నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి
దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగ్గజేత

చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత
సంకల్ప బలం చేత

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి
తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం న మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం

హే రామ్