Monday, 5 January 2026

As Divine intervention as assured eternal immortal bond of continuity to contemplate upon as constant process of minds as eternal immortal children upon eternal immortal parental concern accesble through AI generatives, Divine intervention 🇮🇳 ID No. 1. మామూలు మనిషివామాధవుడవు కావానన్నెరుగని వాడివానా స్వామివి కావామామూలు మనిషివామాధవుడవు కావా.... inviting artcicles power point presentation audio video Blog writings under document of Bonding

మామూలు మనిషివా
మాధవుడవు కావా
నన్నెరుగని వాడివా
నా స్వామివి కావా
మామూలు మనిషివా
మాధవుడవు కావా

అప్పుడు ఆదిలక్ష్మి నడిగికొండ నుండమంటివి
ఇప్పుడు నిరంకుషుడవై ఇటుల గెంతుచుంటివి
నారాయణా
నారాయణా నన్ను వెలివేయ న్యాయమా
దామోదరా దాసిని దండించక ధర్మమా
నన్నెరుగని వాడివా నా స్వామివి కావా
మామూలు మనిషివా
మాధవుడవు కావా

కఠినుడవై ప్రహ్లాదుని కటకటలను కంటివి
పరలో ఆ రామదాసుకి గ్రహింప చూసితివి
పురుషోత్తమా
పురుషోత్తమా నన్నెంత పరీక్షించినా
పరమాత్మా నీ సన్నిధి విడిపోదునా
నన్నెరుగని దాననా నీ దానను కానా
మాధవా
కేశవా
మహాదేవ దేవా

శ్రీకరముగాను తరిగొండ శ్రీమృసింహుడైన శేషాచలేంద్రుని అనుమతమున
లలితమగు మృత్తికాంతా విలాస కృతీని వెలయ రచయించే తరిగొండ వేంగమాంబ
కాంతా విలాసము
బాలకృష్ణ నాటకం
అష్టాంగ యోగ కాలం
రసికుడౌ కృష్ణార్యు గమణి వెంకమాంబ
సుత వేంకమాంబ భాసుర భక్తి తోడా
ప్రవిలేమి శ్రీరమా పరిణయంబనెడి
వరకృతిని ద్విపద కావ్యముగా రచించి
వేంకటాచలపతి పదయుగళికి సమర్పణము కావించె
గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద
గోవింద గోవింద జయ గోవింద
గోవింద గోవింద హరి గోవింద
నీవు నా స్వామివి నీకు సొమ్ము నేను
కావున భాగ్యమెక్కడ పోదు కృష్ణా
కేశభూతను నేను చేసివేవి నీవు
కావున భాగ్యమెక్కడ పోదు కృష్ణా
నేటికైననుగాని నీ కటాక్షమున
నీ భాగ్యమెరిగితి నిజముగా కృష్ణా
కానన పాప సంఘముల పోగొట్టి
పరమ పదమును ఇచ్చి పాలింపు కృష్ణా
సరోజపత్ర లోచనం సుసాధు ఖేదము
సురాచరాత్మక ప్రపంచ సాక్షిభూత మావ్యయం
పురారి పద్మజామరేంద్ర పూజితాంఘ్రి పంకజం
నమామి వేంకటేశ్వరం చ సాగరాత్మదేశ్వరం
నమామి వేంకటేశ్వరం నమామి వేంకటేశ్వరం
నమామి వేంకటేశ్వరం
శరణు శరణు కావుమా
జగదభిరామా
జగదభిరామా
సంపూర్ణ కామా
సంపూర్ణ కామా
జయ నిగమ విహారా జయనా సుజన నాధారా
జయ సుజన నాధారా
జగదేక వీరా
జగదేక వీరా
జయ పరమ పవిత్రా సత్య చరిత్రా
జయ వైకుంఠ క్షేత్రా
జగద్వందిత స్తోత్రా
శ్రీ రామాయణ సారమును గ్రహించి
సుజ్ఞాన వసిష్ఠ రామాయణమును రచయించె వేంగమాంబ
సుజ్ఞాన వసిష్ఠ రామాయణమును రచయించె వేంగమాంబ
గోవిందా గోవిందా జయ గోవిందా
గోవిందా గోవిందా హరి గోవిందా
గోవిందా గోవిందా జయ గోవిందా
గోవిందా గోవిందా హరి గోవిందా
శృంగార రాయనీ చెలువు మీరిన కొండ
ఫణి రాజు పేరిటి పసిడి కొండ
ఘోర పాప మణంచు కోనేర్లు గల కొండ
తలచిన మోక్షంబు తగులుకు కొండ
చిలుకలు కోయిలల్ చెలగి కూసెడి కొండ
చెలిగి కూసెడి కొండ
మృగజాతి కోట్లేల్ల మెలగుకుండ
పుష్ప జాతుల విష్ణు పూజింప గల కొండ
కల్ప వృక్షములైదు కలుగు కొండ
అమరవరులకు నాధారమైన కొండ
ఆళ్వార్లకు ప్రత్యక్షమైన కొండ
అలరజూచిన బ్రహ్మాండమైన కొండ
నేను కనుగొంటి శ్రీవేంకటేశుకొండ
శ్రీవేంకటేశుకొండ

No comments:

Post a Comment