Monday, 29 December 2025

message from facebook

Book fair Day 10...
ఆదివారం కావటం, బుక్ ఫెయిర్ ముగింపు దశకు రావడంతో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది! మేము 12 కి వెళ్ళే సమయానికే బారులు తీరారు!

మేము వెళ్లడం హడావుడిగా సిద్ధం చేసుకోవడం జరిగిపోయింది!

అంతలో మొదటగా మన గ్రూప్ సభ్యులు లగిశెట్టి ప్రభాకర్ గారు మిత్రులతో కలిసి రావడం జరిగింది! అలాగే తెలికిచర్ల విజయలక్ష్మి గారు కుటుంబంతో వచ్చారు! 

ఆ తరువాత ఒక్కొక్కరే మన గ్రూప్ సభ్యులు వచ్చారు!

ఈ రోజు ముఖ్యంగా తిరుపతి కృష్ణవేణి గారు కుటుంబంతో కలిసి వచ్చారు! ఇక నిశీధి పలుకులు పుస్తక రచయిత్రి సరదాగా book fair కి వచ్చి, ఆవిడ పుస్తకం మన స్టాల్ లో ఉండటం చూసి సర్ప్రైజ్ అయ్యారు! మన గ్రూప్ లో లేకపోవడం వల్ల మేడమ్ పుస్తకం పెట్టామని ఆవిడకు తెలియలేదు!

ఇక నవీన్ గారు, విజయా రంగనాథం గారు మరికొందరు(పేర్లు గుర్తు లేవు, ఏమి అనుకోకండి).

వచ్చారు.

ఇక ఈ రోజు చెప్పుకోతగ్గ విషయాలు అంటే, 

మొదటగా మాధవి కృష్ణ గారి గురించి! మేడమ్ మంచి రచయిత్రి అని తెలుసుకానీ, మంచి పాఠకురాలు అని ఈ రోజే తెలిసింది, మన స్టాల్ లో మాత్రమే 5,000 కంటే ఎక్కువ విలువైన పుస్తకాలు కొన్నారు! Book FAIR మధ్యలో చేతికి వచ్చిన పుస్తకం "నేనే నీ సగమై" - నవల ఇప్పటికే పదుల సంఖ్యలో కాపీస్ అమ్ముడుపోయాయి!

కానీ మేడమ్ వచ్చారన్న సందర్భంగా ఈ రోజు ఆ పుస్తకాన్ని మన స్టాల్ ముందు ఆవిష్కరించడం జరిగింది!

ఇక మధ్యాహ్నం 2- 4 వరకు మన స్టాల్ వద్ద మేడమ్ ఉంటారని ముందే చెప్పడం వల్ల ఆవిడ అభిమానులు చాలా మంది వచ్చి, కలిసి మాట్లాడి మేడమ్ చేతుల మీదగా సంతకం పెట్టిన పుస్తకం తీసుకుని వెళ్లారు! 

ఇక ఆ తర్వాత 5 గంటల సమయంలో డ్రీమ్ టేల్స్ నుండే వచ్చిన మరో పుస్తకం.. శ్రీ సాయి జ్యోతి గారి నవల చేయి వీడని చెలిమి, ప్రముఖ రచయిత  కిరణ్ కుమార్ సత్యవోలు మరియు ప్రముఖ పుస్తక రివ్యూయర్ ఆరుద్ర ఈశ్వర్ మరియు వారి బృందం చేతుల మీదగా విడుదల చెయ్యడం జరిగింది! 

ఆ తర్వాత శ్రీమతి కిల్లారి మాధవిలత గారి కొత్త పుస్తకం కూడా వారి చేతుల మీదగా విడుదల చెయ్యడం జరిగింది! 

ఇక సందర్శకులు హడావుడి మధ్య ఈ రోజు పుస్తకాలు బాగానే అమ్ముడుపోయాయి.

మేము కూడా 20- 50% ఆఫర్స్ అంటూ పెట్టడం జరిగింది! ఇక మిగిలింది రేపు ఒక్క రోజు మాత్రమే..

వీలైనంత ఎక్కువ మందికి మన పుస్తకాలు చేరేలా చూడాలని అనుకుంటున్నాం!

కాబట్టి అతి తక్కువ రేట్స్ కి కొన్ని పుస్తకాలు అమ్మేయాలని భావిస్తున్నాం!

రేపు ఎంట్రీ మన వైపు ఉండటం, ఆఖరి రోజు కావడంతో హడావుడి ఎక్కువగానే ఉంటుందని అనుకుంటున్నాం!

హైదరాబాద్ లో ఉండి, ఇంకా బుక్ ఫెయిర్ కి రాలేక పోయిన వారు ఎవరైనా ఉంటే రేపు తప్పకుండా రాండి. కలుద్దాం!.

ఒకవేళ ఎవరి గురించైనా మర్చిపోయి ఉన్నా, చెప్పకపోయినా అన్యధా భావించకండి!

మళ్ళీ రేపు కలుద్దాం.

శుభరాత్రి.

మీ 

తపస్వి. 

@everyone

No comments:

Post a Comment