Wednesday, 10 December 2025

స్వామి వారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా????

స్వామి వారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము మీరు ఎంత యాక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా????


 నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభం అవుతుంది అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం అని మన చెయ్యే మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూనే దాంట్లో దేవతలు ఉంటారు లక్ష్మి సరస్వతి గోవిందుడు ఉంటారు వాళ్ళను ఉన్నట్టుగా భావించి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది తెల్లవారి జామున ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి ఏమనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురువుగారు అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారు ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో అమ్మ వయస్సు అంటే దీంట్లో ఒక సంప్రదాయం ఉన్నది ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలం కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి నేను సిద్ధేశ్వర్యాణము అనే ఒక గ్రంథం రాశాను అందులో నా 5000 సంవత్సరాల జీవిత విశేషాలన్నీ గ్రంథంగా రాశాను అప్పటినుంచి ఇప్పటిదాకా కనుక నా వయస్సు ఎంత అని అంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి ఈ శరీరానికి వయస్సు ఎంత 90 సంవత్సరాలు ఆశ్చర్యకరంగాను సంతోషంగాను ఉంది గురువుగారు ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మా అందరికీ మంచిని బోధించడము విశ్వరేచ్ఛ గురువుగారు నాకున్న ఒక సందేహం ఏంటి అంటే హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా అది నిజంగా ఉందా గురువుగారు నేను ఒక గ్రంథం రాశానమ్మా సిద్ధాశ్రమ యోగులు అనే ఒక గ్రంథం రాశా దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము అక్కడ ఉండే యోగులు అక్కడ ఉండే స్ఫటిక సరస్సు మిగతా మానస సరస్సు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనబడవు వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనబడతాయని అది ఒక పెద్ద గ్రంథం రాశాను నేను సిద్ధాశ్రమంలో ఉండే యోగుల గురించి అలా సిద్ధాశ్రమం ఉంది స్ఫటిక సరస్సు ఉన్నది అయితే అందరికీ కనబడదు సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే అది కనిపిస్తుంది స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది చావు ఉండదు వాళ్ళ వయస్సు పెరగదు అని అంటున్నారు కదా అది నిజమా గురువుగారు నిజమైన శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్లి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్ళకు ముసలితనం ఉండదు చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా అది ఉందా ఉంటే ఎక్కడ ఉంది శంబాల అనేటువంటి గ్రామము ఉన్నది అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది అయితే ఇది ఎక్కడ ఉన్నది అన్న దాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు మరి కొంతమంది అమెరికాలో పాశ్చాత్య దేశాల్లో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు అమెరికన్ సేనాపతి ఒకడు విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తర ధృవ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు విమానం ఇంజిన్ చెడిపోయింది ఆగిపోయింది అయిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు అనుకుంటే అక్కడ ఒక మంచు పెళ్ళ పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటికి వచ్చాడు బయటికి వచ్చి మా నా తో రా అన్నాడు తీసుకెళ్లి ఏమిటండి అంటే ఇది శంబళ గ్రామము అన్నాడు అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్న వాళ్ళు ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు అక్కడ అనేక విశేషాలు ఉన్నవి జరిగినవి ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవరు అని అంటే ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్ళు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో వీనికి విష్ణువు నారాయణుడు అధిపతి మా మేము కూడా ఎప్పుడో తప్ప వారి దర్శనము మనకు దొరకదు మీకు ఒక ప్రత్యేకమైన కార్య నిర్దేశనము చేయటము కోసము మేము ఇక్కడికి మేము పిలిపించాము నువ్వు వచ్చానే నువ్వు అనుకుంటున్నావు మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి నీకు కొన్ని విశేషాలు చెప్తాము అని అక్కడ విశేషాలు కొన్ని తెలియజేశారు అలా శంబళ గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తరధృవ ప్రాంతంలోని భూమిలో ఉండేటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెద్ద గ్రంథంగా కూడా వచ్చినాయి శంబళ గ్రామాన్ని గురించి వాటిని గురించి అలా ఉండేటువంటి ఆ గ్రంథం ఇంకా అనేకులు అనేకులు మేము శంబళ గ్రామం వెళ్ళాము అనేటి వాళ్ళు అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు అమెరికాలో మాస్ శాస్త్రాల దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పోటో శంబాలా అనే అక్కడ పేర్లే పెట్టుకుంటారండి కూడా అక్కడ శంబాల ఉన్నది మా కొండల్లో ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయని ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి చెప్తే రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు మానవులు ఎవరూ అక్కడ ప్రవేశించలేరు అటువంటి శంబళం గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం గానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు పదవ అవతారం దశావతారాలలో పదవ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా శంబాల సిద్ధాశ్రమం గురించి మనకి శక్తిపీఠం దగ్గర శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అదే సంబంధం ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు నాకు తెలుసు ఆ సంగతి నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు అలానే సిద్ధులు ఇక్కడికి అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ శక్తిపీఠము అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్లొచ్చాము మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా మరి మనం ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు నమ్మవచ్చు అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే ఇవాళ దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారు అనుకోండి ఎంతవరకు నమ్మొచ్చు వెంటనే ఏం అడుగుతారు నాకు చూపిస్తారా అని అడుగుతారు అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది అందువల్ల ఇటీవల వీటిలో వాళ్ళకు ఎట్లా ఉంటుంది అని అంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ అందరినీ మనం నమ్మలేము నమ్మాలని మనకు అనిపించదు ఎవరో మహాపురుషుడు మహనీయుడైనటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం రమణ మహర్షి చెబితే నమ్ముతాం అలానే మహనీయులైన సిద్ధ పురుషులు చెబితే నమ్ముతాం కనుక ఆ చెప్పిన యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి దాన్ని బట్టి నమ్ముతాం గాని ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు అందువల్ల ఎట్లా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒకసారి ఒకచోట అనుగ్రహ భాషణం ఇవ్వడానికి వెళ్ళాను ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు అంటే సంతోషం అన్నాను అట్లా కాదండి నేను చెబితే ఎవరు నమ్మడం లేదు మీరు చెబితే నమ్ముతారు కాస్త మైకులో ఈయన విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు అలా ఉంటే ఇవన్నీ ఈ వేళ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటూ ఉంటాయి అందువల్ల ఇటీవల కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి ఆయన గొప్ప అంతర సిద్ధుడు ఆయన నేను చూశాను అని చెప్పి నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను అక్కడి వాడినే నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుషులను సెలెక్ట్ చేసి ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళను కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి ఇదే సిద్ధాశ్రమం అని ఒక రెండు గ్రామాలు చూపించాడు అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనం లేని చావు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒక భాగానికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఆయన అలా ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వీడు వెదవళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవటమే అనుకోవాల్సి ఉంటుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా ఇది మనం ఎలా నమ్మొచ్చు అంటారు స్వామి వారు పురాణాలలో భవిష్య పురాణము అని ఒకటి ఉంది తెలుసు కదా భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తవి ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి అవన్నీ కొన్ని సరిపోతున్నాయి కొన్ని సరిపోవడం లేదు పురాణాలలో కూడా ఎట్లా వచ్చింది అని అంటే అనేకులు తర్వాత దాంట్లో కలిపారని ఉన్నవి లేనివి రకరకాలైనటువంటివి కనిపాయని కూడా ఒరిజినల్ గ్రంథమేది అనేటువంటి దాని దగ్గర కూడా చాలా మందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి అందుకని వీరబ్రహ్మం గారు గొప్ప యోగీశ్వరుడు కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన ఆయన చెప్పింది మహానే ఉంది అయితే ఏమిటంటే అక్షరమక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారు వాళ్ళ యొక్క ఆలోచనా విధానం అంటే ఇంగ్లీష్ లో మనకు ఫిగరిటివ్లీ అని సే అంటాం ఆలంకారికమైన పద్ధతి రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి ఆ తర్వాత ఔటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతవి అని విశ్వసిస్తున్నాము ఆయన టైం ఏం చెప్పలేదు ఇదిగో ఇంకొన్నాళ్ళ అయ్యేసరికి చాలా చిన్న చిన్న వాళ్ళు పుడతారు తంగేడు చెట్లకు నిచ్చెలు వేసుకొని ఎక్కే వాళ్ళు పుడతారు అంటాడు పుడతారో ఏమో భవిష్యత్తు ఎట్లా ఉన్నదో కనుక ఆయన మహాపురుషుడు యోగీశ్వరుడు అంతవరకు తెలుసుకోవచ్చు ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేం మనం ఒకప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించే వాళ్ళు విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదివాం శాస్త్రాలు చదివాం మేము గురువులం సాధువులం అని చెప్పేసి అంటున్నారు అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలం అంటారు నిజమైన గురువును మనం ఎప్పుడూ గుర్తించలేము గురువులే శిష్యులను గుర్తిస్తారు వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళను ఎన్నుకొని వాళ్ళను వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు అంటే ఈ జన్మకు రాకముందే దివ్య లోకాలలోనే నేను మానవ లోకానికి వెళ్తున్నాను నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమిలాడుకుంటే ఆయన వచ్చాడు అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యుని ఎన్నుకుంటాడు ఆయన అంటే సిద్ధ గురువులు మహనీయులైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటారు వాళ్ళ ఇష్టం అందువల్ల గురువులు శిష్యులను ఎన్నుకోగలరు శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే వీడు సిద్ధుడు అయితే కదా ఆయన సిద్ధుడు అవునో కాదో తెలిసేది గురువు ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నది ఉందో లేదో తెలియదు వారికి మహిమ ఉన్నాయని అంటున్నారు తెలుసుకోవాలంటే నువ్వు అంత వాడివైతే కదా నీకు తెలిసేది అంత వాడివైతే నువ్వు శిష్యుడివి ఎందుకైతావు కనుక శిష్య గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము ఫలానా పండితుడు గొప్పవాడు మహనీయుడు చదువుకుందాం అని వెళ్తాం అంటే మామూలు శాస్త్రమును వేదమును చదువుకోవడం వేరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని సిద్ధత్వాన్ని పొందటం వేరు ఇది తెలుసుకోవడం కష్టం దానికి ఏముంది మిగితా నిదులను తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు కానీ ఇది తెలుసుకోవడం మాత్రం అంత సులభం కాదు అందువల్ల శిష్యుడు ప్రయత్నం చేయాలా చేస్తూ ఉంటే ఆరాట పడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది నెమ్మదిగా వస్తాడు పెట్టుకుంటే ఆ శిష్యుడు దగ్గరికి వచ్చేటివి చేసుకుంటాడు కాక ఇంకోటి కూడా నాకు మంత్రం చేయాలండి నాకు మంత్ర సిద్ధుడైన గురువు దొరకలేదు నేను ఎట్లా మంత్రం చేయటం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పాడు నీకు నచ్చిన గురువు దొరకకపోతే నీకు సిద్ధుడు అని నీవు అనుకున్న గురువు దొరకకపోతే దేవాలయానికి వెళ్లి శివాలయానికి వెళ్లి నేను చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాగితం మీద అంటే పాతకాలంలో అయితే తాటేకులు వేవాళ్ళని వేవాళ్ళు రాసి శివలింగం ముందు పెట్టు స్వామి నా గురువు దొరకలేదు నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసి చేసుకుంటే అది చేయవచ్చని మేరు తంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది కనుక గురువును వెతుక్కోవడం అంత సులభం కాదు చాలా గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి మీ కష్టాలన్నిటిని కూడా మేము తీరుస్తామని చెప్పేసి జనాలతో అంటున్నారు జనాలు కూడా వాళ్ళకున్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు అంటే ఇది ప్రచార యుగము ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు ఇవాళ ఈ మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది అందువల్ల ఒక్కోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్ళకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగింది అని చెబుతారు జరగకపోతే జరగలేదు అని అనుకుంటారు కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే సంతోషమే ఈ పక్కన ఒకటున్నది ఇవాళ ఈ యుగ లక్షణాది యుగ లక్షణాది బట్టి మహా సిద్ధులు కావడానికి వీలు లేదు లేక కొంత సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొందితే పొంది ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు కానీ కేవలం ప్రచారాన్ని బట్టి మాత్రం నమ్మటానికి లేదు ఏ విధంగా మనం గుర్తించగలం అంటారు అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకున్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు శాస్త్రంలో ఆయన చెప్పారంటే మీరు జపం చేయండి ధ్యానం చేయండి మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించాల్సిన పని లేదు ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహా సిద్ధుడు అవునో కాదో మనకు తెలియదు కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడు అయినాడు మనకు మామూలుగా మనకు గురువులు వాళ్ళు ప్రపంచంలో ఎట్లా వచ్చింది అని అంటే మనం కష్టపడకుండా మనం జపం చేయకుండా మనం హోమాలు చేయకుండా మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాలి ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం నేను తీసుకుంటున్నాను పో నీ కష్టాలు అంటాడు ఒక ఆయన నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు పోతాయో పోవో పోయిన వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు తర్వాత కొన్ని సహజంగానే కష్టాలు పోవచ్చుగా ఇప్పుడు వాళ్ళ మాటలు వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా అందువల్ల వీలైనంత వరకు తాను స్వయంగా తపస్సు చేయాలి తపస్సు చేసి సాధించాలి కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి ఇప్పుడు నేను దండాయలు పట్టుకొని నేను నాకు బలం కావాలి నేను బయలుదేరాలని అంటే ఎట్లా చెయ్ చేయమని శాస్త్రం చెబుతున్నది కాకుండా తొందరగా కావాలి నాకు కావాలి అని చెప్పి వాళ్ళను వీళ్ళను ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే తప్పేం లేదు తపన ఉండాలని కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు కనుక జాగ్రత్తగా మీకు మీరు తపస్సు చేయండి ఉపనిషత్తులలో పురాణాలలో అదే చెప్పారు ఏ ఈ సద్గురువు దగ్గరికైనా వెళ్లి స్వామి అయ్యా నాకు ఇది కావాలి అని అంటే తపస్సు చేయి అని చెప్పారే గానీ నేను నీకు ఇస్తాను అని ఎవడు అనలే ఈ యోగ్యుడైన వ్యక్తి కొన్ని నాళ్ళు శుశ్రూష చేసి ఆ మహనీయుడికి అనుగ్రహం కలిగితే ఇప్పుడు ఎవరైనా కొద్దిమందిని అనుగ్రహిస్తారు అనుగ్రహించవచ్చు కానీ జనరల్ రూల్ తపస్సు చేయి మేము గురువులము మీ కష్టాలను తీరుస్తాం అన్నప్పుడు అలా గుడ్డిగా వాళ్ళ వైపు వెళ్లకుండా ముందు మన తరపు నుంచి తపస్సు ధ్యానం లాంటివి చేసి భగవంతుడి అనుగ్రహం పొంది కష్టాలను తొలగించుకునే మార్గం అయితే ఉంది అంటారా అవును అదే ప్రధానమైన మార్గం స్వామివారు జనాలు అందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు గుడికి తెగ వెళ్తూ ఉంటారు ప్రతి సోమవారము శుక్రవారము వెళ్లి చాలా పూజలు అనేది చేస్తూ ఉంటారు ఒక నమ్మకంతో వాళ్ళ కష్టాలన్నీ పోతాయి అని చెప్పి సాధారణంగా మనుషులు గుడికి వెళ్ళినప్పుడు చేసే తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఏంటో చెప్తారా ఇక మీదటైనా అవి చేయకుండా ఉండడానికి తప్పులంటూ ఏమి ఉండవు భక్తి లేకపోవటమే తప్పు భక్తి లేకుండా గుడికి వెళ్లి ప్రయోజనం లేదు తప్పులు అంటే మామూలు జనరల్ రూల్స్ ఏవో ఉంటాయి కదా ఆ సామాన్యమైనటువంటి సాధారణ సామాజిక ధర్మములను పాటించాలి జనరల్ రూల్స్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నీకు నువ్వు జాగ్రత్తగా దర్శనం చేసుకొని రావాలి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన వల్ల ఇతరులు కష్టపడకూడదు అని అందువల్ల పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులను ఇబ్బంది పెడితే పాపం వస్తుంది ఇతరులు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది మరి గుడిలోకి వెళ్లి దేవతలు చూస్తే ఏమి వస్తుంది ఆ ప్రశ్న అడగలేదు మీరు మనశ్శాంతి కలుగుతుంది కష్టాలు తీరుతాయి అన్న నమ్మకం మనశ్శాంతి కలగటానికైతే కాదు దేవత చేయవలసింది ఏమిటి అని అంటే మనం ఏమి అడుగుతామో అది చేయాలి ఏమి కోరతామో అది చేయాలి కానీ అందరికీ జరుగుతున్నాయా పనులు రోజుకు కొన్ని వందల మంది వేల మంది వెళ్తున్నారు కదా వీళ్ళందరికీ కష్టాలు గుడిలో నుంచి బయటకు రాంగానే తీరుతున్నాయా తీరటం లేదు అంటే దేవత ఏం చేస్తుంది అని అంటే తన చూపుతో తన ప్రసాదంతో తన తీర్థంతో భక్తులలోకి కొంత చైతన్యాన్ని ప్రవేశపెడుతుంది అంటే నీ నీ భక్తికి తగినట్లుగా నీలో ఉన్నటువంటి కష్టాలు పోయేటట్లుగా కొంత శక్తి ప్రవేశపెడుతుంది ఆ శక్తి వల్ల కొంత మార్పు వస్తుంది అట్లా నువ్వు గుడికి రావటం దేవత యొక్క కంటి ముందు పడాలి దేవత చూపు మన పడాలి మనం మహాక్షేత్రాలకెందుకు వెళ్ళటం కాశీ ఎందుకు ఉన్నామని ఎందుకు శ్రీశైలం దేనికి అని అంటే అక్కడ మహాశక్తి ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నాము దేవుడు అన్ని చోట్ల ఉంటాడు నువ్వు నువ్వు ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని చోట్ల దేవుడు ఉంటే మనం క్షేత్రానికి వెళ్ళటం దేనికి అంటే నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆమె దగ్గర ఇంకా స డబ్బులు ఉన్నాయి నీ యజమాని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి అంటే కొంచెం ఉంది కొంత తేడా తేడా తేడా ఉంటుంది అలానే ఇక్కడ కంటే ఈ మూల దేవాలయంలో శక్తి ఎక్కువ ఉంటుంది క్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది మహాక్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్న చోటికి వెళ్తే తొందరగా మన లోకి వస్తుంది ఆ శక్తి కనుక మహాక్షేత్రాలను దర్శనం చేసుకోవటం వల్ల తీర్థ స్నానాలు చేయటం వల్ల వీలైనంత వరకు అక్కడ ఎక్కువ కాలం కనిపి తపస్సు చేసినందువల్ల తొందరగా చెడు కర్మ పోయి శుభములు జరుగుతాయి కష్టాలు తీరుతాయి స్వామివారు కొంతమంది మనస్ఫూర్తిగా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకున్న కష్టాలు అనేవి తొలగిపోవు ఇంకా సమస్యల్లో ఉండటము ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు అంటే పూర్వజన్మలో చేసినటువంటి బలవత్తరమైన పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు తొందరగా పోవు ఎంతో కష్టపడాలా ఎంతో చేయాలా కానీ కొంత దూరం అయ్యేటప్పటికి ఏమవుతుంది అని అంటే ఇంత చేసాము ఇన్ని లక్షలు మంత్రం చేసాము ఇన్ని క్షేత్రాలకు వెళ్ళాము మా పనులు కాలేదు అని నిరాశ కలిగి కొన్నాళ్లకు కొంతమంది అసలు భగవంతుని స్మరించడం కూడా మానేస్తారు కర్మ దేవతలకు కావాల్సింది అదే నువ్వు కష్టాలు పడాలి అందుకని నిన్ను నీకు నిరాశ కలిగిస్తారు నిరాశతో నువ్వు మానుకున్నావు అనుకో కష్టాలన్నీ అనుభవించాల్సి వస్తుంది కనుక నిరాశ పడకుండా నమ్మకంతో పట్టుదలతో చేస్తే దేవుడు ఇచ్చి తీరుతాడు దాంట్లో సందేహం ఏం లేదు ఎటువంటి సందేహము చెందవలసిన అవసరం లేదు ఓపిక ఉండాలి పట్టుదల ఉండాలి గుడిలో ఉన్నప్పుడు దేవుడికి మొక్కేటప్పుడు ఎన్నో మొక్కులు కోరుకుంటాము దేవుడా నీకు ముడుపు కడతాము అని కూడా చెప్తూ ఉంటాం కదా మరి కొన్నిసార్లు మనుషులు కష్టాలు తీరగానే దేవుడిని మర్చిపోతూ ఉంటారు కొంతమంది అలాగే ఈ ముడుపులని కూడా మర్చిపోవడం అనేది కొన్ని సందర్భాల్లో కావాలని కాకపోయినా కూడా కొన్నిసార్లు జరుగుతుంది కదా గురువుగారు అప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది ఎప్పుడైనా మర్చిపోతే తప్పు తప్పు వల్ల పాపం వస్తుంది పాపాన్ని ఏదో రూపంలో అనుభవించాల్సి వస్తుంది అందువల్ల మనం ఉపకారం చేసిన గురువును సిద్ధులను దేవతలను మనం మర్చిపోకూడదు ఎప్పుడు ఆ ఆదిత్య హృదయంలో చెబుతారు కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయే నమః కృతఘ్నులైనటువంటి వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడు కనుక ఏమిటంటే ఎప్పుడూ నీ గురువును మర్చిపోకూడదు తల్లిదండ్రులను మర్చిపోకూడదు దేవతను మర్చిపోకూడదు మర్చిపోకుండా అట్టే పెట్టుకోవాలి అలా ఉంటే వాళ్ళు రక్షిస్తూ ఉంటారు మర్చిపోతే రక్షించరు అనుకో మానేస్తారు వాళ్ళు కూడా మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు కనుక మనం కాస్త నాలుగు అడుగులన్నా వేయాలి కాస్త జపం కాస్త తపస్సు కాస్త ధ్యానం చేయాలా చేస్తే తప్పకుండా వాళ్ళు మనం చేసిన దానికి కొన్ని వందల రెట్లు ఫలితం ఇస్తారు మనం ఏం చేస్తున్నాం గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి స్వామి నన్ను మంత్రిని చేయి ఎమ్మెల్యేని చేయి అధికారిని చేయి ఐఏఎస్ వచ్చేటట్లు చేయి ఐపీఎస్ వచ్చేటట్లు చేయి అని అడుగుతున్నాం కానీ దేవుడికి ఇస్తుంది ఏమిటి కొబ్బరికాయ నువ్వు ఈ కొబ్బరికాయ తీసుకుంటే ఆయన ఈ పనులన్నీ చేయాలి వేస్తాడు అంటే ఏమిటంటే భక్తితో అడగాలా మనం పిలిస్తే వచ్చేటట్లుగా చేయాలి గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న స్వామి దిగి వచ్చాడు అంటే వాళ్ళకు వినిపించేటట్లుగా మనం చేయాలి అంటే ఏదో పెద్దగా కేకని పెట్టి మైక్ పెట్టడం కాదు భక్తితో హృదయాంతరాలలో ఆ స్వామి కోసం అని చెప్పి ఆవేదనతో ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు అన్ని పనులు చేస్తారు ఈ మొక్కులు ముడుపులు మనం చెల్లించడానికి కుదరనప్పుడు దీనికి దోషం అనేది కలుగుతుంది కదా స్వామివారు దీన్ని మనం ఎందుకు కలుగుతుంది నేను ఇస్తామని ఇవ్వకపోతున్నాను ఇస్తామని ఇవ్వకపోతేనా ఆ నేను 108 ప్రదక్షణలు చేస్తాను అని చెప్పో లేదంటే నేను కొండెక్కి వస్తాను అని చెప్పో ఇలాంటి మొక్కులు కోరుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేని పరిస్థితుల్లో ఎలా దీనికి మనం దోషం ఉంటుందా పరిహారం ఉంటుందా దాంట్లో ఒక పాయింట్ ఉన్నది ఏంటంటే వాళ్ళకు మొక్కు ఉన్నటువంటిది తీర్చి తీరాలి తీర్చి తీరాలి లేని పక్షంలో నువ్వు ఒకటి ఉన్నది తప్పు చేస్తాము అప్పుడు చేస్తే పురాణం ఏం చెప్తుంది నువ్వు తప్పు చేశావు అనుకో దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది అంటే మనసారా స్వామి నేను చేయలేకపోయినాను నన్ను క్షమించు అని భక్తితో ప్రార్థిస్తే క్షమిస్తారు ఇప్పుడు దానికి అట్లా ఉంటుంది అంటే చిన్నప్పుడు కృష్ణ శతకంలో చెబుతాడు హరియను రెండక్షరములు హరియించును పాతక సంపు లమ్ము భుజేనాత హరి అంటే పాపాలన్నీ పోతవి అన్నారు ఇప్పుడు హరి అనంగానే మన పాపాలు పోయినాయా ఇప్పుడు అంటే ఎట్లా అనాలా హరిని భక్తితో ఆర్తితో అనాలా అంటే నేను ఏవో కారణాల వల్ల చేయలేకపోయినాను స్వామి అందువల్ల నన్ను క్షమించు అంటే తప్పకుండా క్షమిస్తాడు అంటే మనం ఆయన క్షమించేటట్లుగా అడగగలగాలా అని నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి మనము తలుచుకొని క్షమాపణ కోరుకుంటే ఏ దోషమైనా ఏ పాపమైనా ఏ పాపమైనా పోతుంది దాంట్లో సందేహం ఏమి ఉన్నది ఏం సందేహం లేదు చక్కగా చెప్పారు స్వామివారు ఇంకొకటి మనందరం కూడా ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకుంటున్నప్పుడు ముహూర్త బలం అనేది చాలా ఎక్కువగా చూస్తాము దానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం కదా ముహూర్త బలం అంటే ఏంటి దానికి ఉన్న విశిష్టత తెలియజేస్తారా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నది పురాణాలలో ఉన్నది కాలము కర్మము స్థలము అన్నింటికీ ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడు అక్కడ ఉన్నాము ఎండ పైన పడుతుంది ఇక్కడ ఉన్నాము నీడగా ఉంటుంది ఏసీ పెట్టుకున్నాము కాస్త చల్లగా ఉంటుంది అంటే స్థలానికి కూడా ఒక ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడు సమయానికి ప్రాధాన్యం ఉంటుంది సమయం అంటే ఏమిటి మనం ధ్యానం చేయాలి జపం చేయాలి మహర్షులు జపం చేసే సమయంలో మనం కూడా కూర్చున్నాము అనుకో వాళ్ళు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నా వాళ్ళ వైబ్రేషన్స్ మన దగ్గరికి వస్తాయి అందుకే తెల్లార్జామున చేయండి బ్రహ్మ ముహూర్తంలో చేయండి సంధ్యా సమయంలో చేయండి అని కారణం ఏమిటి అంటే ఇదే కారణం అలానే ముహూర్తం అంటే ప్రతి టైం కు కూడా ఒక శక్తి ఉన్నది అని జ్యోతిష్య శాస్త్రం కనుక్కున్నది అందువల్ల పొద్దున్న ఎప్పుడు మధ్యాహ్నం సాయంకాలం ఇవన్నీ ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో ఒక మాట చెప్పారు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ముహూర్తం చక్కగా చూసుకొని వెళ్ళాలి మనం ముహూర్తం మనకు బాగున్నప్పుడే అక్కడ ఇంటర్వ్యూ పెడతాడా వాడు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మనం వెళ్ళాలి మనకు బాగున్నా లేకపోయినా అయితే మరి ఎట్లా అని అంటే ఉష్యశ్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంచ బృహస్పతే మనశ్శుద్ధర్ వ్యాసమతం విప్ర వాక్యం హరేర్వతం అభిజిత్ సర్వ సన్యాసం అన్నారు ఉషక్కాలంలో బయలుదేరితే అన్ని పనులు అయితవని గార్గ్య మహర్షి చెప్పాడు బృహస్పతి అన్నాడు శకునం చూసుకొని బయలుదేరు అన్నారు మన ఇళ్ళల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే అమ్మ మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు ఎదురుగా రాలేని పెట్టు ఆయనని పిలుస్తారు అంటే ఏమిటి శకునం క్రియేట్ చేసుకుంటాం మనం అంటే దేనైనా మంచిది ఏదనుకో మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు ఉంటే మంచిది జరుగుతుంది అని వ్యాసుడు అన్నాడు అట్లనే ఇవేమీ ఉండవు ఏం చేయాలో తోచు భయం భయంగా ఉంటుంది అంటే పెద్దల దగ్గరికి వెళ్లి వాళ్ళకు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నట్లయితే తొందరగా అయితవి వాళ్ళ అను ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది ఏవీ కుదరలేదు అభిజి లగ్నం అన్నారు అంటే మిట్టమధ్యాహ్నం పల్లెటూర్లలో దాన్ని గడ్డపార లగ్నం అంటారు అంటే గడ్డపార నీడ గడ్డపార మీద పడేటప్పుడు మనం నడి నెత్తిన సూర్యుడు ఉండేటప్పుడు బయలుదేరితే ఏ పనైనా చేయొచ్చు నువ్వు అన్నారు అయితే మనం సాయంత్రం సాయంకాలం ఐదు పెట్టెకని పోయి కదా మనం మిట్టమధ్యాహ్నం అభిజి లగ్నంలో పోయి నాలుగు గంటలు అక్కడ కూర్చోలేం గా కనుక ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి కాలమునకు ప్రభావం ఉన్నది అంటే ఏమైనా సరే శక్తి ఉన్నది ఆ శక్తి ఎట్లా ఎట్లా ఉంటుందో శాస్త్రంలో చెప్పారు ఇందాక మీరు చెప్తూ బ్రాహ్మీ ముహూర్తం గురించి అన్నారు కదా స్వామివారు ఒక్కసారి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత చెప్పారా తెల్లార్జాము చాలా చాలా పడుతుంది గంట టైము ఆ సమయంలో బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళందరూ కూడా సంధ్యావందనం చేస్తూ ఉంటారు ధ్యానం చేస్తూ ఉంటారు సూర్యుడు రాబోయే సమయం అన్నమాట ఆ సమయంలో చదువుకుంటే బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని అంటుంటారు అంటే చదువుకోవచ్చు అయినా ధ్యానం చేయమన్నారు పెద్దలు రోజు ఒక అరగంట ధ్యానం చేసేటట్లయితే అది నాలుగు గంటలు చదువుకోకుండా ఒక గంటలోనే మీకు చదువు వస్తుంది ధ్యానానికి ఆ శక్తి ఉన్నది ఇదంతా తెలుసుకున్నాం కదా ఏ విధంగా మనం మొక్కాలి మనస్సు శుద్ధితోనే మనం నిజంగా ఏకాగ్రతతో మనశ్శుద్ధితో మొక్కుకుంటే అన్నీ జరుగుతాయి ఏదైనా తప్పులు చేస్తే కూడా కంప్లీట్ గా పశ్చాత్తాపంతోనే మనం దేవునికి క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా ఆ పాపం అనేది తొలగిపోతుంది అని అనుకున్నాం కదా అసలు మనకి దేవతల అనుగ్రహం కలిగింది మన పట్ల అని మనం ఏ విధంగా గుర్తించగలం అంటారు అంటే దానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు దేవత అనుగ్రహం కలిగింది అంటే దేవతే తెలియజేస్తుంది నీకు ఓ మంత్రం సిద్ధించింది అంతర జపం చేశారు దేవత కనబడాలా నీతో మాట్లాడాలా మాట్లాడతారు దేవతలు మంత్రం సందేహం ఏం లేదు మనం దానికి ఏదో ఎవరో వచ్చి నీకు దేవతలిందని అనుగ్రహించుకుంటే చెప్పడం కాదు నీకు నీకు తెలియవలె అని తెలియటమే తెలియజేస్తారు దేవతలు నువ్వు జపం చేస్తే ధ్యానం చేస్తే కొన్నాళ్ళకు దేవత కనిపిస్తుంది లేని పక్షంలో కొన్ని ముందు సిగ్నల్స్ కనిపిస్తాయి కొన్నాళ్ళు కొన్ని లైట్లు కనిపిస్తాయి మాటలు వినిపిస్తాయి కాంతి కనిపిస్తుంది ఇవన్నీ వస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ వస్తుంది అల్టిమేట్ గా దేవత కనిపిస్తుంది మాట్లాడుతుంది అదే తప్ప వేరే ప్రూఫ్ ఏం చేయాలి దానికి ఎవరో వచ్చి నీకు దేవతలు దీనికి అనుగ్రహించుకున్నది చెప్పడం కాదు నీకు నీకు తెలియాలి తెలుస్తుంది తెలియజేస్తారు స్వామివారు మనం అప్పటి నుండి దైవశక్తి గురించి మాట్లాడుతూ వచ్చాం కదా ఇప్పుడు ఎలా అయితే దైవశక్తి ఉందో దుష్ట శక్తులు కూడా ఉంటాయి అంటారా ఉంటాయి ఎలా అంటారు ఎలా అంటే ఇప్పుడే చెప్పాను కదా వాళ్ళని కనిపిస్తారా ఇప్పుడు మనం సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది మానవులు జన్మ జన్మ కర్మ సిద్ధాంతం ఉన్నది జన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి భూతములు ప్రేతములు పిశాచములు ఎన్నో ఉన్నాయే దేవుడు ఎట్లా ఉన్నాడో దేవతలు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది బాధిస్తూ ఉంటారు ఆ బాధించడానికి అనేక కారణాలు ఉంటాయి అదొక ప్రత్యేకమైనటువంటి విభాగం అది దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పాలి ఉన్నవి బాధిస్తారు ఉపకారాలు చేసే వాళ్ళు ఉన్నారు అపకారాలు చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలైన దివ్య శక్తులు ఉన్నాయి మనం జీవితంలో బాగా ఎదుగుతున్నప్పుడు చెడు దృష్టి అనేది మన మీద పడితే కొంతమంది పడని వాళ్ళు మన పైన ద్వేషం పెట్టుకున్న వాళ్ళు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు దిష్టి ఇలాంటివి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కదా మరి మనం ఏ విధంగా వీటి నుంచి రక్షించబడాలి అదే ఇంకోళ్ళు ప్రయోగం చేశారు చెడు చేశారో లేదో తెలుసుకునే శక్తి మీకు లేదు ఎవరో ఎవరి దగ్గరికి వెళ్తారు ఇవాళ ఏమైంది అంటే నూటికి 90 చోట్ల మీకు మీరు ఎవడో ప్రయోగం చేశాడు నేను ఏదో హోమాలు చేసి పోగొడతాను అనుకుంటాను ప్రయోగం చేస్తే హోమం చేసి పోగొట్టవచ్చు కానీ దాంట్లో ఏమిటి అని అంటే ఎక్కువ భాగం మోసాలు జరుగుతున్నాయి లోకంలో ఇవాళ అందువల్ల మీరు మంత్రం చేయండి జపం చేయండి హోమం చేయండి మీకు మీరే పోగొట్టుకోవచ్చు మీకు మంత్రోపదేశం చేసిన గురువు మంత్రాధికారం కలిగిన సిద్ధుడు అయ్యేటట్లయితే ఆయన హోమాలు చేసి పోగొడతాడు జపం చేసి పోగొడతాడు ఆశీర్వదించి పోగొడతాడు కనుక పెద్దలను ఆశ్రయించండి ఆశ్రమాలలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి వీలైనంత వరకు స్వశక్తి మీద ఆధారపడిన పెద్ద కష్టం కాదు ఈ పోగొట్టుకోవటం జరగాలి ఎటు ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడానికి మనం ఏమైనా చిన్న పరిహారాలు ఫాలో అవ్వచ్చంటారా కావచ్చమ్మా అంటే ఒకటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే మంత్రం చేయాలా మంత్రం చేస్తే అన్ని పనులు జరుగుతాయి ధ్యానం చేస్తే అన్ని పనులు జరుగుతాయి ఇంట్లో చేసింది దానికంటే గుడిలో చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది మహాక్షేత్రంలో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది ఏ శ్రీశైలము ఏ తిరుపతి కొండ మీద వెళ్లి ఆలయానికి వెళ్ళిన దగ్గర కూర్చొని చేస్తే కొన్ని వందల రెట్లు శక్తి వస్తుంది ఒకప్పటి కాలంలో అందరూ కూడా దేవుణ్ణి చాలా బాగా నమ్మే వాళ్ళు పురాణాలు శాస్త్రాలు అనేటివి పెద్దలు పిల్లలకు నేర్పించే వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాయో మొత్తం మానవ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో జీవన శైలి అనేది మారిపోయింది ఈ తరంకి మీరు ఏదైనా ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నారా సందేశం ఇచ్చేసాను నేను ఆల్రెడీ తద్ది తపస్ తద్ది తపస్ తద్ది తపః తపస్సు చేయండి తపస్సు చేయండి తపస్సు చేయండి అంటే ఇవాళ ఏమైంది అని అంటే మేము ఇంత బిజీ లైఫ్ లో ఉన్నాము పొద్దున్న లేస్తే పరిగెత్తాలి ఆఫీస్ కు మేము ఏం చేస్తామండి అంటాం మీరు పరిగెత్తేటప్పుడు రామ రామ అనకూడదు అని ఎవరు అనలేదుగా ఎవరు అనలేదుగా మీరు కార్ లో వెళ్తారు బస్సులో వెళ్తారు మనస్సులో అనుకోవడానికి ఎవరు అడ్డం ఉన్నారు ఆ అందువల్ల నిరంతరం మనస్సులో చేయండి కూర్చొని చేయలేకపోవచ్చు కానీ మీరు మనస్సులో చేసిన దేవుడు కనపడతాడు కనుక మీరు నాకు టైం లేదు అనేటువంటి మాట అంగీకరించదగింది కాదు నాకు వీలు కాదు అనేటువంటి మాట ఒప్పుకోకూడదు సంకల్పం ఉంటే టైం ఉంటుంది ఇక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్తూ చేయండి కాలేజీ కి వెళ్తూ చేయండి సాయంకాలం తిరిగి వస్తూ చేయండి అందువల్ల చేయాలి అని పట్టుదల ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు తెల్లార్జాము చేయొచ్చు అర్ధరాత్రి చేయొచ్చు అపరాధరాత్రి చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు చేయాలా చేసి తీరాలి శక్తి సంపాదించాలి మీకు మీరే కష్టాలు పోగొట్టుకోవాలి గురువును ఆశ్రయించండి సద్గురువు మీకు మంత్రోపదేశం చేస్తారు మంత్రోపదేశం చేస్తే మంత్ర సాధన వల్ల తప్పకుండా పందై చాలా చక్కగా మా సందేహాలన్నిటిని కూడా మీరు ఈరోజు తెలియజేశారు నివృత్తి చేశారు మా సందేహాలన్నిటిని కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురువుగారు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నారాయణ నారాయణ

No comments:

Post a Comment