అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, గుంటూరు ప్రాంతం పరిపాలించిన జమీందారు మరియు కమ్మరాజు. అమరావతి సంస్థాన పాలకుడు. వాసిరెడ్డి నాయక రాజులలో ప్రసిద్ధి పొందిన ప్రభువు. అమరావతి సంస్థాన పాలకుడు. కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించిన
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారి జయంతి జ్ఞాపకం !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
వాసిరెడ్డి వంశానికి చెందిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు హైదరాబాద్ నిజాం మరియు తరువాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో చింతపల్లికి (తరువాత అమరావతి) వంశపారంపర్య జమీందారుగా ఉన్నారు . గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో మరియు వాటి పరిసర ప్రాంతాలలో ఉన్న మధిర, ఖమ్మం, కలిదిండి, కొండపల్లి, కొండవీడు, వినుకొండ, పొన్నూరు, నిజాంపట్నం మరియు రాజమండ్రి సమీపంలోని పలివెల సహా కృష్ణా జిల్లా సరిహద్దుల్లో ఉన్న 552 గ్రామాలు మరియు పట్టణాలను అతను పాలించాడు. ఈ గ్రామాలు మరియు పట్టణాలు ఆయన నియంత్రణలో ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తి చెంది, ఆయన చింతపల్లిలోని తన వంశపారంపర్య రాజభవనాన్ని విడిచిపెట్టి, ధరణికోట పక్కన ఉన్న ప్రాచీన శాతవాహన రాజధాని ప్రదేశంలో అమరావతి అనే కొత్త రాజభవనాన్ని మరియు పట్టణాన్ని స్థాపించారు
......
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు 1761, ఏప్రిల్ 27 న
జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు.
పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రకారం,
జగ్గభూపతి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. వెంకటాద్రి నాయుడు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు వారు మరణించారు. జగ్గ భూపతి మరణానంతరం అతని భార్య అచ్చమాంబ సతీసమేతంగా వ్రతం చేసింది. అప్పుడు నాలుగేళ్ల వయసున్న వెంకటాద్రి నాయుడును అతని మామ రామన్న పెంచారు. రామన్న మరణానంతరం, నాయుడు తన తండ్రి మరియు మామ ఇద్దరి ఆస్తులను వారసత్వంగా పొందినట్లు తెలుస్తోంది. సా.శ. 1413 నుండి తీరాంధ్రదేశంలోని ఒక భాగాన్ని పాలించిన వాసిరెడ్డి వంశానికు చెందినవాడు వేంకటాద్రి నాయుడు.
.......
ఈ వంశం వారందరికి చాళుక్య నారాయణ అనే బిరుదును బట్టి వీరు చాళుక్య వంశానికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి రాజధాని. కమ్మ కులానికి చెందిన వాసిరెడ్డి వంశం వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్కొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగా ఉన్నారు.
▪️రాజ్యాభిషేకం.....
వేంకటాద్రి నాయుడు సా.శ. 1783 లో పరిపాలన చేపట్టారు. ఇతని పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉన్నాయి. అయితే 1214 ఫసలీ ప్రకారం వాటిలో 22 గ్రామాలు ఇతరులకు విక్రయించినట్లు ఉంది. కృష్ణా మండలంలోని చింతపల్లి వీరి తొలి రాజధాని. ఇతను నిజాం సుల్తాన్ నుండి 'మన్నె సుల్తాన్, మనసబ్ దార్ ' అనే బిరుదులు పొందారు.
......
సా.శ. 1791-92లో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామాలలో వేలమంది ప్రజలు మరణించారు. మరుసటి సంవత్సరం తీవ్రమైన కరవు వచ్చింది. నాయుడు గారు ఏడు సంవత్సరాలుగా పేరుకుపోయిన పన్నులు, మూడున్నర లక్ష్లల బంగారు నాణాలు ప్రజల కొరకు వినియోగించుటకు బ్రిటీషు ప్రభుత్వానికి తెలియచేశారు. మచిలీపట్టణం లోని అధికారులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంతలో గవర్నర్ జనరల్ కార్న్ వాలిస్ సంస్కరణలలో ఈ విషయం మరుగున పడింది.
▪️అమరావతి....
వేంకటాద్రి నాయుని సైన్యంలో మూడు వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. సామంతులు, జమిందారుల తిరుబాటు చేస్తారన్న సాకుతో వారి సైనిక బలం తగ్గించటానికి బ్రిటీషు ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా నాయనింగారి సైనికులను నిరాయుధులను చేసింది. ఆగ్రహించిన వేంకటాద్రి నాయుడు గుంటూరు మండలంలోని ధరణికోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణం, రాజ భవనాలు కట్టించి రాజధానిని 1796 లో చింతపల్లి నుండి తరలించారు. 1797లో అమరావతి పట్టణం దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధాలుగా పొగిడారు.
......
వేంకటాద్రి గొప్ప కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనాలు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానాలు జరుగుతుండేవి.
▪️ములుగు పాపయారాధ్య రాజా వాసిరెడ్డి వెంకటాద్రి రాజాచార్యుడు మరియు ఆస్థాన కవి....
ములుగు పాపయ్య మరియు సంగమేశ్వర శాస్త్రి అని కూడా పిలువబడే ములుగు పాపయారాధ్య , (1756-1852) తెలుగు మరియు సంస్కృత పండితుడు, ఉపదేశకుడు, అనువాదకుడు మరియు రచయిత, సంస్కృతం నుండి దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువదించినందుకు ప్రసిద్ధి చెందాడు మరియు అమరావతి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి రాజాచార్యుడు మరియు ఆస్థాన కవి. ములుగు పాపయారాధ్య ప్రముఖ వీర శైవ ఆచార్యుడు వీరనారాధ్య మరియు అక్కాంబ దంపతులకు జన్మించాడు. అతను ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతిలో నివసించాడు . తెలుగు, సంస్కృత భాషల్లో వందకు పైగా రచనలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. [ 1 అతనికి అభినవ కాళిదాసు అనే బిరుదు ఉంది. ఇతను వీర శైవ ఆచార్యుడు (బోధకుడు).
......
దేవీ భాగవత పురాణాన్ని తెలుగులోకి అనువదించిన తొలి కవిగా ములుగు పాపయారాధ్య గుర్తింపు పొందారు. ఈ అనువాదం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కుమారుడి అభ్యర్థన మేరకు జరిగింది మరియు పాపయారాధ్య దీనిని శివుని రూపమైన కాశీ విశ్వనాథకు అంకితం చేశారు. అతను రచించిన వందకు పైగా రచనల నుండి, కళ్యాణచంపు , ఏకాదశివ్రతచంపు , ఆర్యసతి , శివస్తోత్ర , మరియు వేదాంతసారసంగ్రహం వంటివి సంస్కృత రచనలలో ప్రముఖమైనవి. పాపయారాధ్య అహల్య సంక్రందన విలాసమును కూడా రచించారు.
▪️చెంచులు (పిండారీల) అణిచివేత....
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలనా కాలంలో 1816లో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి అతను 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు "నరుకుళ్ళపాడుగా" మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, అతని అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించారు.
▪️దేవాలయాల నిర్మాణం.....
కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 దేవాలయాలు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. అమరావతి లోని అమరేశ్వర దేవాలయం పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు. ఇది 15 మీటర్లు (49 అడుగులు) వెడల్పు, 46.7 మీటర్లు (153 అడుగులు) ఏత్తు కలిగి దేశంలో ఉన్న రాజ గోపురాలలో ద్వితీయ స్థానంలో ఉంది.1803 లో బాపట్ల లోని భావన్నారాయణ స్వామి ఆలయానికి భూదానం చేసాడు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించాడు. గుంటూరు రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసలిలో ఉంది.
......
అతను చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించాడు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించాడు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశాడు. వేంకటాద్రి నాయుడితో పాటుగా అతని మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు సా.శ.1802, మరికొన్ని సా.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది. 1806 లో వీరు ఒకసారి బంగారంతోనూ, రెండు సార్లు వెండితోనూ తులాభారం తూగి పండితులకు పంచిపెట్టాడు. 66 గ్రామాలలో బ్రాహ్మణ అగ్రహారాలు ఏర్పాటు చేసాడు. ఇవి కాకుండా మరో 30 గ్రామాలలో నాయుడు చేసిన దానాల గురించి లోకల్ రికార్డులలో ఉన్నాయి.
▪️నూతన జనవాసాల నిర్మాణం.....
అతని తండ్రి జగ్గ భూపతి పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు.తల్లి అచ్చమాంబ పేరు తో అచ్చంపేట అనే గ్రామాన్ని నిర్మించాడు. తన పేరుతో రాజాపేట, నాయుడి పేట నిర్మించారు.
▪️మరణం.....
వేంకటాద్రి నాయుడు తన శేషజీవితం అమరేశ్వరుని పాదాలకాడ గడిపాడు. అతను 1817, ఆగష్టు 17 న మరణించాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఇద్దరికి సంతానం కలుగనందున జగన్నాధబాబు, రామనాధబాబు అనే ఇద్దరిని దత్తుతీసుకున్నాడు. ఇతని తదనంతరం జగన్నాధ బాబు పాలనలోకి వచ్చారు.
▪️ వేంకటాద్రి నాయుడు గారి అనంతర వారసత్వం...
వాసిరెడ్డి శ్రీరామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ ముక్త్యాల రాజు. ఆయన ఆయుర్వేదం, క్యాన్సర్‌పై విస్తృత పరిశోధనలు చేసి 'శ్రీ ధన్వంతరి' పత్రికను ప్రచురించారు. చారిత్రాత్మకంగా ముఖ్యమైన పనిముట్లు, కళాఖండాలు మరియు కత్తులు అమరావతిలోని మహేంద్ర విలాస్‌లో భద్రపరచబడ్డాయి.
......
ఇతని పూర్వీకులు వాసిరెడ్డి దాశరధి నాయుడు, రామనాథబాబు, ముఖ్యేశ్వర ప్రసాద్, వెంకటాద్రి నాయుడు, ఉమా మహేశ్వర ప్రసాద్, చంద్ర మౌళీశ్వర ప్రసాద్, ఎర్లగడ్డ అంకినీడు ప్రసాద్, మల్లిఖార్జున ప్రసాద్, శివరామ ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్ వంటి వారు ఒకప్పుడు ముక్త్యాల, కొండవీడు, చల్లపల్లి, జయంతి, చల్లపల్లి తదితర ప్రాంతాలలో విశాలమైన కోటలు, కోటలలో నివసించారు.
......
రాజా వాసిరెడ్డి శ్రీరామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ 20వ శతాబ్దం ప్రారంభంలో ముక్త్యాల పాలకులుగా ఉండగా, అదే సమయంలో రాజా వాసిరెడ్డి బాల చంద్రశేఖర వరప్రసాద్ అమరావతికి రాజుగా ఉన్నారు. వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ మరియు బాల చంద్రశేఖర వరప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధులు, వీరు కవిత్వం, నృత్యం, సంగీతం మరియు ఆయుర్వేదం పట్ల తమ ఆసక్తికి ప్రసిద్ధి చెందారు.
.......
నీటి ఎద్దడి ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి మహేశ్వర ప్రసాద్ ప్రతిపాదించారు, కానీ ఆయకట్టు చాలా తక్కువగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. కాబట్టి, నీటిపారుదల ప్రాజెక్టుకు ఉత్తమమైన ప్రదేశాన్ని కనుగొనడానికి 60 లక్షల రూపాయలు పరిశోధనపై ఖర్చు చేసిన తర్వాత, ఆయన నందికొండను గుర్తించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలను ప్రారంభించారు.
.......
మూడు అంతస్తుల ముక్త్యాల కోట 'హరిహర విలాస్'లో దశాబ్దాల పాటు క్యాన్సర్‌పై వివిధ రకాల పరిశోధనలు జరిగిన 'అర్ష రసాయనశాల' అనే ప్రయోగశాలను స్థాపించిన వ్యక్తి కూడా ఆయనే.
......
బౌద్ధమత ప్రేమికుడిగా, అతను ముక్త్యాల మరియు అమరావతిలో మ్యూజియంలను ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక వేసి, ఆ ప్రయోజనం కోసం వేలాది కళాఖండాలను సేకరించాడు. 1930వ దశకంలో వాసిరెడ్డి బాల చంద్రశేఖర వరప్రసాద్ అమరావతిలోని రాజభవనాన్ని పునర్నిర్మించి దానికి 'మహేంద్ర విలాస్' అని పేరు మార్చారు. ముక్త్యాల రాజా కుటుంబం మొదట్లో ప్రతి సంవత్సరం సుమారు ఆరు నెలల పాటు అమరావతిలోని మహేంద్ర విలాస్‌లో నివసించేవారు. తదనంతరం వారు రెండు నెలల పాటు, ఆపై శివరాత్రి కాలంలో 15 రోజుల పాటు అక్కడ నివసించేవారు. మహేంద్ర విలాస్‌లో వాసిరెడ్డి కుటుంబం తరతరాలుగా వారసత్వంగా పొందిన చారిత్రాత్మకంగా ముఖ్యమైన అనేక పనిముట్లు, కళాఖండాలు మరియు కత్తులు కూడా ఉన్నాయి.
....
హరిహర విలాస్‌ను ఇప్పుడు కేసీపీ సిమెంట్స్ వారు అతిథి గృహంగా ఉపయోగిస్తుండగా, మహేంద్ర విలాస్‌ను వాసిరెడ్డి కుటుంబం అప్పుడప్పుడు వాడుతోంది. ఆయన సామాన్యుల సంక్షేమం కోసం పనిచేసే చాలా మంచి వ్యక్తిగా పేరు పొందారు. నాగార్జున సాగర్ నిర్మాణ ఆలోచన వెనుక ఉన్నది ఆయనే మరియు ఉత్తమమైన ప్రదేశాన్ని గుర్తించడానికి చేసిన పరిశోధనపై లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
.....
ముక్త్యాల రాజా ఒక కవి, రచయిత మరియు ఆయుర్వేదంపై ఆసక్తి కలవారు. ఆయన ఆయుర్వేదం మరియు క్యాన్సర్‌పై విస్తృత పరిశోధన చేసి, 50 సంవత్సరాలకు పైగా 'శ్రీ ధన్వంతరి' పత్రికను ప్రచురించారు. కోటలో క్యాన్సర్‌పై ప్రచురించని అనేక పరిశోధనా పత్రాలు, పుస్తకాలు, వేలాది బౌద్ధ కళాఖండాలు ఉన్నాయి మరియు అవి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి.
▪️వారసత్వ గుర్తింపు.....
1) ధరణికోట - అమరావతి లో 1968 లో స్థాపించిన కళాశాలకు 'రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుని కళాశాల ' గా పేరు పెట్టారు
2) ముదిగొండ శివప్రసాదు నాయుడుపై 'పట్టాభి' అను చారిత్రక నవల వ్రాశాడు.నాయుడు వంశీయులు రాజావాసిరెడ్డి ఫౌండేషన్ ఏర్పరచి సాహిత్య సేవ గావిస్తున్నారు.
3)2021 లో నవలా రచయిత నర్రా ప్రవీణ్ రెడ్డి రాసిన చారిత్రాత్మక, ఉద్యమ నవల పొత్తికి రాజా వాసిరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం అందించారు.
4) "ఆంధ్రుల రాజధాని అమరావతి" 460 పేజీలతో ఒక పుస్తకం ఉన్నం సోదరులిద్దరూ రాసారు. 2019లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా ఉన్నం వెంకటేశ్వర్లు గారి రచనా శైలి ఆకట్టుకునేలా సాగింది. ఎన్నో గొప్ప సంగతులు, వాస్తవాలను ఆయన కళ్లకు కట్టేలా పుస్తకంలో ఆవిష్కరించారు.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
No comments:
Post a Comment