Mighty Blessings from Darbar Peshi of...Lord Jagadguru His Majestic Holi Highness, Sovereign Adhinayaka Shrimaan, Eternal, immortal Father, Mother and Masterly abode of sovereign Adhinayaka Bhavan New Delhi--110004. Erstwhile Rashtrapati Bhavan, New Delhi ,GOVERNMENT OF SOVEREIGN ADHINAYAKA SHRIMAAN, RAVINDRABHARATH,-- Reached his abode Adhinayaka Darbar at Adhinayaka Bhavan New Delhi.(Online mode) Inviting articles power point presentations audio videos blogs writings as document of bonding
Thursday, 19 February 2026
లలితామ్మ పారాయణం చేయడం వల్ల స్త్రీ శక్తి పెరిగిపోయి పురుష శక్తి తగ్గిపోతుందని ఆ పురుష శక్తిని సమతుల్యం చేయడం కోసం శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయాలని లేకపోతే కుటుంబంలో వివాదాలు భర్తతో గొడవలు వస్తాయని చెప్పారన్నమాట ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ఈరోజు లలితామ్మ గురించి ఎన్నో రహస్యాలు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఈ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి
లలితామ్మ పారాయణం చేయడం వల్ల స్త్రీ శక్తి పెరిగిపోయి పురుష శక్తి తగ్గిపోతుందని ఆ పురుష శక్తిని సమతుల్యం చేయడం కోసం శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయాలని లేకపోతే కుటుంబంలో వివాదాలు భర్తతో గొడవలు వస్తాయని చెప్పారన్నమాట ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం ఈరోజు లలితామ్మ గురించి ఎన్నో రహస్యాలు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఈ ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయి వారిలో మీకు ఇష్టమైన భగవంతుడు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు కొంతమంది విష్ణువు అంటారు ఇంకొందరు శివుడు అంటారు మరికొందరు లక్ష్మీదేవి అంటారు ఇలా వారు తమ తమ పరిస్థితులను బట్టి కారణాల ఆధారంగా భగవంతుని ఎంచుకునే అవకాశాన్ని తీసుకుంటారన్నమాట కానీ లలితామ్మ విషయంలో కథ పూర్తిగా మారిపోతుంది ముందుగా లలితామ్మ అంటే ఎవరో తెలుసుకోవాలి చూడండి జీవులకి సృష్టి స్థితి లయకి కారణమైన వాళ్ళు త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే ఎవరు బ్రహ్మ సరస్వతి మహావిష్ణువు లక్ష్మీదేవి శివుడు పార్వతి వీరిని మనం దేవతలుగా ఆరాధిస్తాం అయితే ఈ త్రిమూర్తులు కూడా ఆరాధించే పరమశక్తి ఒకరు ఉన్నారన్నమాట ఎవరు వారు అంటే జగదాంబిక అంటే లలితా త్రిపుర సుందరి అన్నమాట చూడండి లలితామ్మ నుండి వరాలను పొంది ఆ వరాలనే జీవులకి అనుగ్రహంగా ఇస్తున్నవారు ఈ త్రిమూర్తులు అంటే దేవతలకే దేవత అయిన లలిత తమ్మ మీద మన మనుషులకి ఎంత భక్తి ఉంటుందో దేవతలకు కూడా అంతే భక్తి ఉంటుంది అలాంటి దేవతలకే దేవత అయిన లలితామ్మ మీద భక్తి రావాలంటే మరి ఒక జన్మ సరిపోతుంది అంటారా ఆలోచించి చూడండి అందుకే లలితామ్మను మనం ఎంచుకునే స్థితిలో మనం ఉండలేము అన్నమాట అమ్మవారి నుండే పిలుపు రావాలి ఆ పిలుపు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అమ్మవారిని మనం పొందాలి అంటే ఈ జన్మలో ఈ క్షణంలో ఒక గంట సాధన చేస్తేనో లేదా ఒక సంవత్సర కాలం సాధన చేస్తేనో లేదా ఒక జన్మ సాధన చేస్తేనో సరిపోవున్నమాట అమ్మని చేరుకోవాలంటే జన్మ జన్మల సాధన ఉండాలి అప్పుడు కూడా అమ్మవారు మన సాధనని వినిపించుకుంటారో లేదో తెలియదు ఎందుకంటే లలితామ్మ సాధనలో ఒకవైపు మనుషులు ఉంటే మరొకవైపు త్రిమూర్తులు ఇతర దేవతలు కూడా ఉంటారన్నమాట అలాంటి స్థాయిలో పోటీ ఉండగా మనుషులకి గెలవాల్సిన అవసరం లేదు ఆ పోటీలో పాల్గొనడమే సరిపోతుందన్నమాట చూడండి అమ్మవారి దృష్టి మన ఆత్మ మీద పడితే అదే పిలుపు అన్నమాట అది ఏ జన్మలో అయినా కలగొచ్చు ఆ పిలుపు వచ్చిన క్షణం నుండే మన నోట అమ్మ నామం మొదలవుతుందన్నమాట అమ్మ నామం రాగానే ఆ నామంతో సాధన మొదలు పెట్టిన కొన్ని రోజులకి మనకి తెలియకుండానే మన చేతిలో లలితా సహస్రనామం పడుతుందన్నమాట ఆ సహస్రనామ పారాయణం మొదలు పెట్టగానే అక్కడి నుంచి అమ్మవారి పని మొదలవుతుంది చూడండి మన జీవితంలో మార్పులు కనిపిస్తుంటాయి కొన్నిసార్లు అర్థం కాని కష్టాలు వస్తాయి మనసు లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది మన అనుకునే వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా మనకి దూరంగా వెళ్ళిపోతుంది అన్నమాట ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అమ్మ మనల్ని భక్తులుగా కాకుండా తన బిడ్డలుగా మార్చాలి అనుకుంటున్నారు కనుక అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అందరికీ చూడండి బిడ్డలుగా మార్చి అమ్మవారు ఏం చేసుకుంటారు అని ఉదాహరణకి మనకి కన్నతల్లి లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా కానీ అటువంటి కన్నతల్లికి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది ఏంటది అంటే శరీరం ఉన్నంతవరకు కు మాత్రమే కన్నతల్లి రక్షిస్తుందన్నమాట శరీరం పోయిన తర్వాత ఆత్మ ఒంటరిగా అవుతుంది అప్పుడు ఆ ఆత్మకు తోడు ఎవరు ఉంటారు ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే పరమశివుడు తోడుంటాడు అని కానీ శివుడికి లయకార్యాన్ని ఇచ్చింది ఎవరు లలితమ్మ అందుకే శరీరం విడిచిన తర్వాత కూడా ఇది అమ్మ బిడ్డ అని పరమశివుడు ఎంతో జాగ్రత్తగా ఆ ఆత్మను తీసుకొని అమ్మవారి దగ్గరకి చేర్చుతారు అన్నమాట లలితామ్మ బిడ్డలకు ఒంటరితనం అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి అమ్మవారు మన పక్కన ఖచ్చితంగా ఉంటుందన్నమాట అలాంటి వారికి మనం పడిపోయినట్లు అనిపిస్తుంటుంది కానీ ఏదో ఒక చెయ్యి మనల్ని లేపటానికి సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి అలాంటి వాళ్లందరికీ కూడా ఏదో తెలియని దారిలో మనం నడుస్తున్నామని మనకు అనిపిస్తుంటుంది కానీ అమ్మవారు మనకి ముందే ఆ దారిని సిద్ధం చేసి ఉంచారని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ జన్మలో లలితా అమ్మవారి నామం పలకడం అంటే ఇంతటి అదృష్టం ఈ జన్మలో మనకు దొరికిందంటే మనకి ఇంకేం కావాలి డబ్బు స్థాయి పేరు ఇవన్నీ కూడా ఒకరోజు వచ్చి ఇంకోరోజు పోతాయి కానీ అమ్మవారి బంధం ఆత్మతో ఉంటుందన్నమాట అందుకే అమ్మ పారాయణం చేయడం అన్నా అమ్మ నామస్మరణ చేయడం అంటే అది ఈ జన్మలో ఈ క్షణంలో ఒక గంట ఒక సంవత్సరమో చేసిన సాధన కాదు అది ఎన్నో జన్మల పుణ్యఫలం అని గుర్తుపెట్టుకోవాలిన్నమాట అంత గొప్ప పూర్వజన్మ పుణ్యఫలం ఉంది కాబట్టే లలితామ్మవారి భక్తులకు లభించే అద్భుతమైన వరమే లలితా సహస్రనామం సహస్రనామం అంటే అమ్మవారి యొక్క స్వరూపమే అది ప్రతి నామం కూడా ఒక శక్తి ఒక కరుణ ఒక ఆశీర్వాదం లాంటిదే మనం చదువుతున్నట్లు అనిపించినా నిజానికి అమ్మవారే మన చేత చదివిస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరికీ పడితే వాళ్ళకి ఈ అవకాశం రాదు ఎంతో మంది దేవుళ్ళని పిలుస్తుంటారు కానీ అమ్మవారి సహస్రనామం దగ్గరికి వచ్చే ఆత్మలు మాత్రం కొన్నే ఉంటాయి ఎందుకంటే ఇది కోరికల వల్ల కలిగే భక్తి భక్తి కాదు ఇది ఆత్మ బంధం ఇక సహస్రనామ పారాయణం చేస్తే స్త్రీ శక్తి పెరగటం పురుష శక్తి తగ్గిపోవటం అనేది దీన్ని కానీ గమనించినట్లయితే ఎక్కడా కూడా అమ్మవారి సహస్రనామంలో కేవలం అమ్మవారి గురించి చెప్పిన నామం అనేది లేదు శివశక్తుల ఐక్యత తత్వాన్ని సూచిస్తూ చెప్పినదే లలితా సహస్రనామం చూడండి అగ్ని మరియు దాని నుంచి వచ్చే వేడి ఇవి రెండు వేరు కాదు కదా అలానే శివుడు మరియు శక్తి కూడా వేరు కాదన్నమాట శక్తి లేకుండా శివుడు నిశ్చలుడు శివ తత్వం లేకుండా శక్తి తత్వం వ్యక్తం కాదు అందుకే లలితా తత్వంలో శ్రీ పురుష భేదం లేదన్నమాట సమతుల్యత మాత్రమే ఉంటుంది అమ్మవారి దగ్గర అసమతుల్యత ఉండదు మనలో ఉన్న త్రిగుణాలను అంటే సత్వరజ తమోగుణాలను క్రమంగా శాంతింపజేస్తూ ఉంటుందన్నమాట లలితామ్మ పారాయణం వల్ల అహంకారం మెల్లగా కరిగిపోతుందన్నమాట నేను నాది అని గట్టితనం తగ్గిపోయి వినయం పెరుగుతుంది కోపం త్వరగా రాకుండా ఉంటుందన్నమాట మాటలు మృదువైపోతుంటాయి నిర్ణయాలు స్పష్టంగా మారుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇంట్లో గొడవలన్నీ తగ్గుతాయా పెరుగుతాయా తగ్గిపోతూ అపార్థాలు కరిగిపోతూ ఉంటాయన్నమాట అందుకే మీరు గమనించినట్లయితే అమ్మవారి పారాయణాలు చేసేటప్పుడు సౌందర్య లహరిలో కానీ లలితా సహస్రనామంలో కానీ లేదా లలితా అష్టోత్తరంలో కానీ ఎక్కడ చూసినా కూడా ఒకటే సత్యం కనిపిస్తుంటుంది శివశక్తి సమత్వం అమ్మవారిని ఎక్కడా ఒంటరిగా వర్ణించి చెప్పలేదు ఎందుకంటే శక్తి మరియు శివుడు ఎక్కడా కూడా వేరు కాదు శివుడు అంటే చైతన్యం శక్తి అంటే ఆ చైతన్యానికి ప్రదర్శన అగ్ని మరియు దాని వేడి వేరు ఎలా అయితే కాదో సూర్యుడు మరియు అతడి అక్కడి కాంతి ఎలా అయితే వేరు కాదో శివుడు మరియు శక్తి కూడా అలా వేరు కాదన్నమాట అందుకే సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలోనే శంకరుల వారు తేల్చి చెప్పేశరు శివశక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం అంటే శక్తి కలిసినప్పుడే శివుడు సృష్టి చేయగలడు అని అంటే శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు అని అర్థం అన్నమాట అలానే లలితా సహస్రనామంలో కూడా ఇదే తత్వం చెప్పబడుతుంది చూడండి అమ్మవారిని శివశక్తి తైక్య రూపిని కామేశ్వర ప్రాణనాడి శివకామేశ్వరాంకస్త అని పిలుస్తూ నామాలు చెప్తుంటారుఅన్నమాట అంటే అమ్మవారు శివుడితో ఏక రూపంలో చెప్పారన్నమాట వేరు చేసి చెప్పలేదు అష్టోత్తరంలో కూడా అమ్మవారిని శివస్వరూపిని శివాన్విత శివప్రియ అనే చెప్పబడుతుంది అమ్మవారిని ఎక్కడా కూడా ఒంటరి దేవతగా చెప్పలేదుఅన్నమాట శివుడితో సమత్వంతోనే ఉన్న పరాశక్తి అని చెప్పారు అలాంటప్పుడు అమ్మవారి పారాయణం చేస్తే శ్రీశక్తి పెరిగిపోయి పురుషసత్వం తక్కువైపోయేది ఏంటి ఇంకా రెండిటిని సమతుల్యం చేయటమే ఈ సృష్టి యొక్క రహస్యం ఉదాహరణకి మన శరీరాన్ని తీసుకోండి ఆత్మ శరీరం అని రెండు ఉంటాయి ఆత్మ అంటే ఏంటి ఆత్మ ఏమి చేయలేదు అలా నిశ్చలంగా ఉంటూ సాక్షిగా మాత్రమే ఉంటుంది ఏం చేయాలన్నా కూడా ఈ శరీరమే చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ ఏమీ చేయకుండా నిశ్చలంగా సాక్షి లాగా ఉంటూ చూస్తున్న ఆత్మని శివతత్వం అనుకుంటే శక్తి ప్రవాహాన్ని ప్రాణశక్తిగా అమ్మవారి రూపంలో మన శరీరంతో తీసుకుంటున్నారన్నమాట అంటే ప్రాణశక్తి లేకపోతే శరీరానికి విలువ ఉండదు శరీరం లేకపోతే ప్రాణ ప్రవాహం జరగదన్నమాట అలానే శివశక్తులు కూడా విడదీయలేనివి అని అర్థం చూడండి ఇక్కడ అమ్మవారిని పొందిన వారికి శివుణని ప్రత్యేకంగా పొందవలసిన అవసరం ఉండదు శివుణని పొందిన వారికి ప్రత్యేకంగా శక్తిని పొందవసి అవసరం కూడా ఉండదు కుండలిని కూడా ఇదే చెప్తుందన్నమాట మూలాధారా నుండి శక్తిని పైకి లేపి సహస్రారంలోకి కలిపితే అదే శివశక్తులని ఏకం చేయడం అన్నమాట అదే నిజమైన మోక్షం అని అర్థం అందుకే ఈ క్షణం నుంచి ఒక చిన్న అడుగు వేసి చూడండి ఒక్కసారి నిజంగా హృదయంతో అమ్మవారిని పిలవండి అదే మీ మార్పుకి ప్రారంభం అవుతుంది ఈ క్షణం నుంచే అమ్మ నామాన్ని జపించడం మొదలు పెట్టండి నమ్మకంతో చేయండి మీరు అడిగిందంతా వెంటనే జరగకపోవచ్చు కానీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగడం మొదలవుతాయి మీరు ఆ క్షణం నుంచి ఒంటరిగా ఉండరు లలితాంబికే మీ ఆత్మకి తోడుగా ఉంటుందన్నమాట ఆ ఆత్మ పడిపోతే లేపుతుంటుంది చీకటికి దారి చూపిస్తుంటుంది భయంలో ధైర్యం అవుతుంది చివరికి మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు అమ్మని వెతకలేదు అమ్మవారే మిమ్మల్ని తన వారుగా చేసుకుంటుంది అని అర్థమవుతుంది ఈ జన్మలో లలితావారి నామాన్ని పలికిన సహస్రనామాన్ని చదివినా అదేదో చిన్న అదృష్టం లాగా కాదు అది ఆత్మకు లభించిన గొప్ప వరం లాంటిది అన్నమాట ఆ వరం ఉన్నప్పుడు మనలో ఒకటే భావం ఉండాలి కృతజ్ఞత అమ్మ నన్ను గుర్తుపెట్టుకున్నావు అమ్మా నన్ను పిలిచావు అమ్మా నన్ను నీ బిడ్డగా స్వీకరించావు ఇంకా నాకు ఏం కావాలి తల్లి అనే భావం మనలో ఏర్పడాలి ఆ భావం వచ్చినప్పుడు అదే నిజమైన భక్తి అది ఆత్మకి శాంతిని కలిగిస్తుందన్నమాట అందుకే ఈ రోజు నుంచి ప్రేమతో అమ్మని పిలవడం మొదలు పెట్టండి ఎందుకంటే అమ్మని పొందినవాడు ఒంటరిగా ఉండడు అమ్మ తన ఆత్మలో కలిపేసుకుంటుందన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి లలితాంబికా తత్వం మీ హృదయాన్ని ఎంతవరకు తాకిందో కామెంట్స్ లో తెలియజేయండి శ్రీ మాత్రే నమః
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment