కాలజ్ఞానం. 2026 లో జరగబోయే కొన్ని మార్పుల గురించి . అయితే చాలా మందికి ఒక సందేహం వస్తుంది. స్వామీజీ కేవలం ప్రకృతి వైపరీత్యాల గురించే చెప్పారా? లేదా మన దేశానికి రాజకీయకంగా, శత్రువుల పరంగా ఏమైనా గండాలు ఉన్నాయని కూడా చెప్పారా? చెప్పారు. బ్రహ్మం గారు కేవలం వరదల గురించి మాత్రమే చెప్పలేదు. రాబోయే కాలంలో రాజ్యాలు ఎలా కూలిపోతాయి, ప్రజలు ఎలా పిట్టల్లా రాలిపోతారు, ముఖ్యంగా మన భారతదేశానికి ఏ దిక్కు నుంచి పెద్ద ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలను ఆయన పూస గుచ్చినట్లు వివరించారు. ఈరోజు వీడియోలో కాలజ్ఞానంలో దాగి ఉన్న ఆ భయంకరమైన పేజీని మనం తెరవేయబోతున్నాం. 2027 నాటికి ప్రపంచ పటం మారిపోనుంది. కోటి మందికి ఒక్కడే వైద్యుడు మిగులుతాడా? వీరభోగ వసంతరాయల ఆగమనానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఉన్న లింక్ ఏంటి? ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఈ నిగూఢ నిజాలను ఇప్పుడు చూద్దాం.
ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది దేశానికి పొంచి ఉన్న గండం గురించి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో స్పష్టంగా ఒక మాట రాశారు. ఈశాన్య దిక్కున ఆకాశం ఎర్రబడుతుంది. పడమర దేశాల్లో అల్లకల్లోలం రేగుతుంది. దీని అర్థం ఏంటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈశాన్యం అంటే మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న దేశాలే. ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు గమనించారా? ఒకవైపు పొరుగు దేశాల కుట్రలు, మరోవైపు అంతర్గత గొడవలు. బ్రహ్మం గారు ఏమని చెప్పారంటే నెల్లూరు సీమలో నడిరాత్రి సమయాన కేకలు వినిపిస్తాయి. పగటి పూటే చుక్కలు కనిపిస్తాయి. దీనిని పండితులు రెండు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఒకటి ఏదైనా భారీ విస్ఫోటనం జరగడం వల్ల పగలే చీకటి కమ్ముకోవడం లేదా ఆకాశం నుంచి అగ్నివర్షం కురవడం. ముఖ్యంగా మాయదారి మనుషులు పాలకులు అవుతారు, పాలకులు చోరులు అవుతారు అని ఆయన చెప్పిన మాటలు ఈ కలియుగ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. రాబోయే రెండేళ్ళలో, అంటే 2026, 2027 నాటికి రెండు పెద్ద దేశాల మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంటుంది. అది ఎంతలా అంటే నీళ్లను కూడా మనం కొనుక్కోలేని పరిస్థితి వస్తుందట. ఆ సమయంలో ప్రజలు ఆహారం కోసం, నీళ్ల కోసం రోడ్ల మీదకు వస్తారని, అప్పుడే అసలైన కళ్ళకల్లోలం మొదలవుతుందని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది. యుద్ధం ఒకవైపు ఉంటే అంతకంటే భయంకరమైనది మరొకటి ఉంది అదే వింత రోగాలు. గతంలో మనం కరోనాని చూసాం. కానీ బ్రహ్మం గారు చెప్పింది దాని గురించి మాత్రమే కాదు. మనిషి నిలువుగా ఉన్నవాడు ఉన్నట్టే ప్రాణం వదులుతాడు. రోగం ఏంటో వైద్యులకు కూడా అంతుచిక్కదు అని ఆయన తాళపత్ర గ్రంథాల్లో రాశారు. దీనికి ఒక ఉదాహరణ ఆయన ఇలా చెప్పారు. గండభేరుండ పక్షులు వచ్చి ఊళ్ల మీద పడతాయి, వాటిని చూసి జనం భయపడి చస్తారు. ఇక్కడే గండభేరుండ పక్షులు అంటే నిజమైన పక్షులు కాకపోవచ్చు. అవి ఆకాశంలో ఎగిరే విమానాలు లేదా డ్రోన్లు కావచ్చు, లేదా గాలి ద్వారా వ్యాపించే విషవాయువులు కావచ్చు.
(music)
వాయువులు కావచ్చు. ముఖ్యంగా 2026 దాటాక మనుషుల ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయట. బావి వరసలు ఉండవు. దైవభక్తి సన్నగిల్లుతుంది. డబ్బు కోసం కన్నవాళ్లను కూడా చంపే రోజులు వస్తాయి. ఈ పాపం ఎప్పుడైతే పీక్ స్టేజ్ కు వెళ్తుందో అప్పుడే ప్రకృతి తన ప్రతాపం చూపిస్తుంది. నదులు రక్తం రంగులోకి మారుతాయి. సముద్రం పొలిమెర దాటి ఊళ్లల్లోకి వస్తుంది. ఇది వింటుంటేనే ఒళ్ళు గగుర్పడుస్తుంది కాదు. కానీ ఇది కాలజ్ఞానంలో అక్షరాలా లిఖించబడిన సత్యం. మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయం ఆర్థిక వ్యవస్థ. మనం ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుందని ఎగబడి కొంటున్నాం, భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ బ్రహ్మం గారు ఏం చెప్పారో తెలుసా? సిరి సంపదలు శాశ్వతం కాదు, బంగారం విలువ మట్టిలో కలుస్తుంది, జొన్నల విలువ పెరుగుతుంది. దీని అర్థం చాలా లోతుగా ఉంది. భవిష్యత్తులో వచ్చే కరువు వల్ల మనిషికి బంగారం కంటే ఆహారం దొరకడమే కష్టమైపోతుందట. చేతిలో కట్టల కొద్దీ డబ్బులు ఉన్నా, గుప్పెడు బియ్యం దొరకదని రోజులు వస్తాయని ఆయన చెప్పారు. రూపాయికి విలువ ఉండదు, వస్తు మార్పిడి పద్ధతి మళ్ళీ వస్తుంది. అంటే ఆకలి వేసినప్పుడు మీ దగ్గర ఉన్న బంగారు గొలుసులు ఇచ్చినా సరే ఒక్క రొట్టె ముక్క దొరకదే పరిస్థితి ఏర్పడొచ్చు. 2027 నాటికి ప్రపంచ ఎకానమీ మొత్తం కూలిపోతుందని పెద్ద పెద్ద ధనవంతులు కూడా సామాన్యులుగా మారిపోతారని కాలజ్ఞానం ఘోషిస్తుంది. అసలు వీరభోగ వసంతరాయలు ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు వస్తారు? దీని గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. కొందరు ఆయన ఉత్తరాదిన ఉన్న శంబాళలో పుడతారని అనుకుంటారు. కానీ మన తెలుగు నేల మీద పుట్టిన బ్రహ్మం గారు తన కాలజ్ఞాన గోవింద వాక్యాలలో ఏం రాశారో తెలుసా? శ్రీశైల పర్వతాన శేష శైలమునందు క్షేమముగా నేను శ్రీ మల్లికార్జునుని సేవించుచున్నాను అని స్వయంగా ఆయనే రాసుకున్నారు. అంటే ఆయన ఎక్కడో లేరు, మన శ్రీశైల అడవుల్లో ఆ మల్లికార్జునుడి సాక్షిగా అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే ఆయన రాసిన సౌజన్య పత్రికలు మరో విషయం ఉంది. నేను వచ్చే సమయానికి కొన్ని గుర్తులు కనిపిస్తాయి. మహానందిలోని కోనేరులో నీరు తగ్గుతుంది, యాగంటి బసవన్న రంకె వేస్తాడు. అప్పుడే నేను మళ్ళీ వస్తాను అని స్పష్టంగా ఉంది. దీనిని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది? 2027 నాటికి గ్రహ స్థితులు మారుతున్నాయి, పాపాత్ములను శిక్షించడానికి, ధర్మాత్ములను రక్షించడానికి ఆయన శ్రీశైలం నుంచి బయలుదేరే సమయం దగ్గరపడింది. ఆయన వచ్చేటప్పుడు చేతిలో కత్తి పట్టి అగ్నివర్షం కురిపిస్తూ వీరభోగ వసంతరాయలుగా దర్శనమిస్తారని కాలజ్ఞానం భోషిస్తోంది. ఇంత భయానకమైన విషయాలు విన్నాక సహజంగానే మనకు భయం వేస్తుంది. మరి దీనికి పరిష్కారం లేదా? మనం ఏం చేయాలి? దీనికి కూడా బ్రహ్మం గారే సమాధానం చెప్పారు. నా భక్తులకు, ధర్మాన్ని నమ్ముకున్న వారికి ఎటువంటి భయం లేదు. ఆయన చెప్పిన ఒకే ఒక మార్గం నామస్మరణ. కలియుగంలో యజ్ఞాలు, యాగాలు చేయక్కర్లేదు, కేవలం భగవంతుడి నామాన్ని స్మరిస్తే చాలు. ఎవరైతే మోసాలు చేయకుండా, జీవహింస చేయకుండా, సత్యం వైపు ఉంటారో వారిని ఆ పంచభూతాలే కాపాడుతాయి. సో ఫ్రెండ్స్ 2027 లో ఏం జరగబోతుందో కాలజ్ఞానం ద్వారా తెలుసుకున్నాం కదా. ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి మాత్రమే. జాగ్రత్తగా ఉందాం, ధర్మాన్ని కాపాడుదాం.
No comments:
Post a Comment