వేణుమాధవా వేణుమాధవా
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నినుచేరని మాధవా
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా
మురళి సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిద
తనువును నిలువునా తొలిచిన గాయములే
తన జన్మకి
తరగని వరములా సిరులని
తలచినదా
కృష్ణ నిన్ను చేరింది
అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి
వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిది
ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమౌతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక
కనుపాపకి
నలువైపులా నడిరాతిరి ఎదురవధ
అల్లరి నీ అడుగుల సడి వినబడక
హృదయానికి
అలజడితో అణువణువూ తడబడదా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవ నీ సన్నిధి
గ గరి గరి సరి గ గరికిరి సరి
గపాదా సస ధప గారి సరి
గాపాదపద గాపాదస్పద దాపగరిగా
దపద స స దపద స స
దపద రి రి దపద రి రి
దాసరి గారి సరి
గారి సరి ద రి గారి సరిగా
రిసా గప గగగపా ప గగగదా ద
గగగసా స దాపగప దాసరి
సరి సరి రిగారిస దాసరి
గదాపా సాగారి పగప దాసరి
సరిగా పగరి
సదా పాదప సదస్స పాదప సదస్స
పాదప రిసారి పాదప రిసారి
పాద సరి గారి సదా
పదస గగస రిదాస
సరిగా పాద సరిగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాధికా హృదయ రాగాఅంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి
No comments:
Post a Comment