గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...
గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై... ||2||
కృష్ణ జై... కృష్ణ జై... కృష్ణ జై... బాలకృష్ణ జై...
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగ
చిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ
వెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగా
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా...ఆ ఆ ఆ ఆ ..
ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగా
చీరకొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభరంగా రంగ రంగా...
గోకులాన ఆడినావు నాడే రాసలీల ఇప్పుడి గోల ఇలా నీ లా
ఎలా గోపాల బాల రంగా రంగ రంగా
రంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ
గోపికామాలహారిప్యారి మాయమీర వన విహారి
మదనమోహన మురళీధారి కృష్ణ జై... ||2||
కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై...
పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగా
కాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగా
వేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటా
నీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా ||గోవింద|
No comments:
Post a Comment