మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
గానమిది..నీ ధ్యానమిది..
ధ్యానములో నా ప్రాణమిది..
ప్రాణమైన మూగగుండె రాగమిది..
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
ముత్యాల పాటల్లో కోయిలమ్మా..ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వులో వెన్నెలమ్మా..దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం..ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం..నీకేలా ఇంత పంతం..
నింగి నేలా..కూడే వేళ..నీకు నాకు దూరాలేల
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
ఛైత్రాన కూసేను కోయిలమ్మా..గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మా..నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో నీణా నాదం..కోరింది ప్రణయ వేదం
వేసారు గుండెల్లో రేగే గాయం..పాడింది మధుర గేయం..
ఆకాశాన..తారా తీరం..అంతే లేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
దూరమిది..జత కూడనిది..
చూడనిది..మది పాడనిది
మాటరాని మౌనమిది..మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది..కొమ్మచాటు అందమిది
No comments:
Post a Comment