🏛️ ఈ రోజు పార్లమెంట్‌లో ‘పప్పుధాన్యాలు & నూనెగింజల కోసం సమగ్ర ఈ-మానిటరింగ్ వ్యవస్థ’ పై ప్రశ్నోత్తరాల సందర్భంగా నేను లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ గారు సమాధానమిచ్చారు.
✨ ప్రశ్నలు : సమాధానాలు
(a) పప్పుధాన్యాలు మరియు నూనెగింజల కోసం రియల్‌టైమ్ డేటా ట్రాకింగ్ కోసం సమగ్ర ఈ-మానిటరింగ్ వ్యవస్థ అమలు చేశారా?
జవాబు: ప్రభుత్వం పప్పుధాన్యాల కోసం సమగ్ర డిజిటల్ పోర్టల్‌ను అభివృద్ధి చేసి అమలు చేసింది.
Krishi Mapper, SATHI వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా పప్పు & నూనెగింజల మిషన్ కార్యక్రమాలు మానిటర్ అవుతున్నాయి.
Digital Agriculture Mission కింద AgriStack, Soil Fertility Map వంటి డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి అవుతున్నాయి.
(b) & (c) ఈ ప్లాట్‌ఫార్మ్ లక్ష్యాలు ఏమిటి?మా రాజమండ్రి నియోజకవర్గంలో ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతోంది?
జవాబు:
🔸 జిల్లా స్థాయిలో ప్రణాళిక & అమలు ట్రాకింగ్
🔸 పారదర్శకతతో మానిటరింగ్
🔸 API ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ (ఉత్పత్తి, ధరలు, దిగుబడి)
🔸 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్ సహా) వార్షిక కార్యాచరణ ప్రణాళికలు సమర్పిస్తున్నాయి
🔸 రైతులు, అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం
(d) ఇతర వ్యవసాయ డేటాబేస్‌లతో అనుసంధానం ఎలా ఉంది?
జవాబు:
🔹 Krishi Mapper (జియో-ట్యాగింగ్)
🔹 AGMARKNET (మార్కెట్ ధరలు)
🔹 Soil Health Card (భూమి పోషకాలు)
🔹 NAFED & NCCF (కొనుగోలు సమాచారం)
🔹 UPAG (ఉత్పత్తి & దిగుబడి అంచనాలు)
ప్లాట్‌ఫార్మ్‌లతో అనుసంధానమైంది.
(e) ఈ వ్యవస్థ వల్ల రైతులకు ప్రయోజనం ఏమిటి?
జవాబు:
🔸 ఉత్పత్తి & దిగుబడి పెంపు కోసం కీలక ప్రాంతాల గుర్తింపు
🔸 రియల్‌టైమ్ ధరలు & కొనుగోలు ద్వారా మార్కెట్ స్థిరత్వం
🔸 సమయానుకూల పాలసీ నిర్ణయాలు
🔸 పారదర్శక వ్యవసాయ విలువ గొలుసు
🔸 వేగవంతమైన నిర్ణయాలు & మెరుగైన ఫలితాలు
No comments:
Post a Comment