ముసలితనము రాకుండా
చిరకాలం జీవిస్తూ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి యవ్వనంతో ఉన్నటువంటి శరీరంతో, కాంతిమయమైన శరీరంతో నివసించేటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడాను హిమాలయాలలో ఉన్నారు చాలా మంది. మా కుర్తాళం నుంచి ఒకాయన వెళ్ళాడు 19వ శతాబ్దంలో. ఆ వెళ్ళినటువంటి వాడు ఇప్పటికీ కూడా ఉన్నాడు పాతికేళ్ల వాడు లాగా ఉంటాడు. అలానే ఈ మధ్య ఒక మా మిత్రుడు కనిపించాడు నాకు. నేను గుర్తుపట్టావు కదా అని అన్నావు అన్నాడు. గుర్తుపట్టానయ్యా అన్నాను. మనమిద్దరము 600 సంవత్సరాల కింద ఇక్కడ కలిసి చదువుకున్నాం. మనం క్లాస్‌మేట్స్ అయ్యా అన్నాడు. మీరందరూ చాలామంది మహనీయుడైనటువంటి మహా అవతార్ బాబా చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు. ఆయన మూడో శతాబ్దంలో కుర్తాళంలో సిద్ధుడైనవాడు ఆయన. ఇవాళ కూడా ఆయన హిమాలయాలలో ఉన్నాడు. మూడో శతాబ్దం నుంచి ముసలితనము రాని భౌతిక శరీరంతో ఇప్పటికీ ఉన్నాడు ఆయన. ముసలితనం.
No comments:
Post a Comment