Monday 20 May 2024

ఘల్లు ఘల్లుమని మువ్వా సవ్వడుల ముద్దు బాలుడేవారేవెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరేఆ ఆ ఆఆ ఆ ఆ

ఘల్లు ఘల్లుమని మువ్వా సవ్వడుల ముద్దు బాలుడేవారే
వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే
ఆ ఆ ఆఆ ఆ ఆ

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
పదుగురి నిందలతొ పలుచన కాకయ్యా
నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

ఏ నోటా విన్నా నీ వార్తలేనా
కొంటె చేష్టలేలరా కోణంగిలా
ఆ ఆ ఊరంతా చేరి ఏమేమి అన్నా
కల్లబొల్లి మాటలే నా రాధికా

చెలువలు చీరలు దోచినా చిన్నెలు చాలవా
ద్రోపది మానము కాచినా మంచిని చూడవా
తెలియని లీలలతో తికమక చేయకయా
మనసును చూడకనే మాటలు విసరకలా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన
దినాన దినాన దిననాన దీన దీన దిన దిననాన
దినాన దినాన దినాన దీనానా

ఆవుల్ని కాచిన ఆటల్లో తేలినా
అంతతోనే ఆగేనా ఆ బాలుడు
ఆ ఆ ఆ అవతార మూర్తిగా తన మహిమ చాటేగా
లోకాల పాలుడు గోపాలుడు

తియ్యని మత్తున ముంచిన మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కథ తరములు నిలిచే కదా
తలిచిన వారి ఎద తరగని మధుర సుధా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా
అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా
అందేలా సందడితో గుండెలు మురిసేనురా
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసేనురా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నిస్వతంత్రమందామాస్వర్ణోత్సవాలు చేద్దామాఆత్మా వినాసపు అరాచకాన్నిస్వరాజ్యమందామాదానికి సలాము చేద్దామా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతికపోతపు కుట్టుక తెంచి
తెచ్చ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగా దిద్దిన
ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల
స్వేఛ్చాను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

కులాల కోసం గుంపులు కడుతూ
మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు
ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతుందని
నిజం తెలుసుకోరేం
తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరపున
ఎవరో ఎందుకు పోరాడాలీ
పోరి ఏమిటి సాధించాలీ

ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో
సాగించే సమరం
ఈ ఛిచ్ఛుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరచిన
జనాల భారతమా
ఓ అనాధ భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

అన్యాయాన్ని సహించని శౌర్యం
దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా
దాక్కుని ఉండాలా
వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువుతో పోరాడే సైన్యం
శాంతిని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల అణ్నాచే వీధిలో
కవాతు చెయ్యాలా
అన్నల చేతిలో చావాలా

తనలో ధైర్యం అడవికి ఇఛ్చి
తన ధర్మం చట్టానికి ఇఛ్చి
ఆహ్ కలహం చూస్తూ
సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో
తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సింధూరం
వేకువ వైపా చీకటిలోకా
ఎటు నడిపెవమ్మా
గతి తోచని భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

తన తలరాతను తానే రాయగల
అవకాశాన్ని వదులుకొని
తనలో భీతిని తన అవినీతిని
తన ప్రతినిధులుగా ఎన్నుకొని
ప్రజాస్వామ్యాన్ని తలచే జాతిని
ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని
నడిపిస్తుంది ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని
శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున
సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా
విశాల భారతమా
ఓ విషాద భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతికపోతపు కుత్తుక తెంచి
తెచ్చ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం
నీ పాపిటలో భక్తిగా దిద్దిన
ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మా వినాసపు అరాచకాన్ని
స్వరాజ్యమందామా
నిత్యం కొట్టుకు ఛచ్ఛే జనాల
స్వేఛ్చాను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

నరుడి బ్రతుకు నటనఈశ్వరుడి తలపు ఘటనఆ రెంటి నట్టనడుమనీకెందుకింత తపననరుడి బ్రతుకు నటనఈశ్వరుడి తలపు ఘటనఆ రెంటి నట్టనడుమనీకెందుకింత తపన

నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
నీకెందుకింత తపన

తెలుసా మానస
నీకు ఇదీ తెలిసి అలుసా
తెలిసి తెలియని ఆశల
వయసే ఏ వరస
తెలుసా మానస
నీకు ఇది తెలిసి అలుసా
తెలిసి తెలియని ఆశల
వయసే ఏ వరస

ఏటిలోని ఆలల వంటి
కంటిలోని కళలు కదిపి
గుండె అలను అందే ఎలాగ చేసి

తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జాతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాలానా
తడిసిన పెదవుల రేయిగిన రాగానా
శ్రుతిని లాయని ఒకటి చేసి

తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జాతుల గతుల తిల్లాన

కంటి పాపకు నేను లాలా పొసే వేళా చంటి పాపా
చంటి పాపా నీకు లాలినవతనంది
ఉత్తరాన చుక్క ఉలికి పడతా ఉంటే
చుక్కానిగా నాకు చూపు అవతనంది
గుండెలో రంపాలు కోతపెడతా ఉంటే
పాత పాటలు మల్లి పాడుకుందామంది

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

ఆన్నదేదో అంది ఉన్నదేదో ఉంది
తలపైన ఆ గంగ తలంపులో పొంగింది

ఆది విష్ణు పాదం అంటి
ఆకాశాన ముగ్గుపెట్టి
జంగమయ్య జంటకట్టి
కాశీలోన కాలుపెట్టి
కడలి గుడికి
కదలి పోయే గంగా

తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జాతుల గతుల తిల్లాన
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జాతుల గతుల తిల్లాన

హరి పాదానా పుట్టావంటే గంగమ్మశ్రీ హరి పాదానా పుట్టావంటే గంగమ్మాఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మాకడలి కౌగిలిని కరిగావంటే గంగమ్మా

హరి పాదానా పుట్టావంటే గంగమ్మ
శ్రీ హరి పాదానా పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలి కౌగిలిని కరిగావంటే గంగమ్మా

నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా నీ రంగేదమ్మా
నడి సంద్రంలో నీ గడపెదమ్మా గంగమ్మా

నీలాల కన్నుల్లో సంద్రవే హైలెస్సో
నింగి నీలవంత సంద్రవే హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రవే
నింగి నీలవంత సంద్రవే

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలురఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలుసీతమ్మ అందాలు రామయ్య గోత్రాలురఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రలు
ఏకమైనా చోట వేద మంత్రాలు
ఏకమైనా చోట వేద మంత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

హరివిల్లు మా ఇంతి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయి శ్రీ వారి చేయి
హరి విల్లు మా ఇంతి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంపమేయంగా

శీనుకు శీనుకు గారాలే సిత్ర వర్ణాలు
సొంపులన్నీ గుండె గంపాకేతంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ సిలికా తాపాలు

తళుకులై రాలేను తరుణీ అందాలు
తళుకులై రాలేను తరుణీ అందాలు
ఉక్కలై మెరిసెను ఉలుకు ముత్యాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

మువ్వాకు చీర పెడతా
మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడతావా కన్నె సిలకా
అరేయ్ మువ్వాకు చీర పెడతా
మొగిలి రేకులు పెడతా
నన్నే పెళ్లాడతావా కన్నె సిలకా

అబ్బో ఆశ
శృంగార పెళ్లి కొడకా
ఇది బంగారు వన్నె సిలకా
శృంగార పెళ్లి కొడకా
బంగారు వన్నె సిలకా
మొవ్వకులిస్తే రాదు మోజుపడక
మొవ్వకులిస్తే రాదు మోజుపడక

ఓయ్ రవ్వంటి దాన
నిప్పురవ్వంటి చిన్నదాన
ఎంఇఛ్చి తెచ్చుకొనే దీపకనిక
రవ్వంటి దాన
నిప్పురవ్వంటి చిన్నదాన
ఎంఇఛ్చి తెచ్చుకొనే దీపకనిక

రాయంటి చిన్నవోడా
మా రాయుడోరి చిన్నవోడా

మనసిచ్చి పుచ్చుకోరా మామ కొడకా
మనసిచ్చి పుచ్చుకోరా మామ కొడకా
మనువాడతాను గాని మాను అలకా

ఘాటైన ప్రేమ ఘటనదీటైన మేటి నటనఅందంగా అమరిందిలేఇక ఆనందం మిగిలుందిలేనిజమెరుగవే పసిచిలకఘాటైన ప్రేమ ఘటన

ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలుందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

కోరుకున్నవాడే
తగు వేళా చూసి జాతకుడే
సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే
అందించమంటూ దరిచేరే
సందేశం ఎద విన్నది

లేని పోనీ లోని శంక
మానుకోవే బాలిక
ఏలుకోవా గోరువంక
లేతమేని కానుక
కులుకా రసగుళిక కలలొలుక
తగు తరుణము దొరికేనుగా

ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలె
తెరమరుగిక తొలగునులే

పూజలన్నీ పండే
పురివిప్పి మెనూ జతులాడే
అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే
మగతోడు చేరు ఈనాడు
సుఖభోగం మొదలౌనుగా

ఊసులన్నీ మాలగా
పూసగుచ్చి వేయనా
రసకన్నె నేలగా
దూసుకొచ్చి వాలన
కరిగా తొలకరిగా రసజరిగా
అనువనువొక చినుకవగా

ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
అందంగా అమిరిందిలే
ఇక ఆనందం మిగిలుందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
దీటైన మేటి నటన
ఆనందం చిందించేలే
నా అందం నీ వశమాయెలె
తెరమరుగిక తొలగునులే

విరిసినది వసంత గానంవలపుల పల్లవిగావిరిసినది వసంత గానంవలపుల పల్లవిగా

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినది

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం
రమ్మంది మొహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం

పరువాల వాహిని
ప్రవహించే ఈ వని
ప్రభవించే ఆమని
పులకించే కామిని
వసంతుడే చెలికాంతుడై
దరిచేరే మెల్లగా

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరితేనే
జడివానై కురిసే తియ్యగా
లతలు పెనవేయ మైమరచి
మురిసెను తరువు హాయిగా

రాచిలుక పాడగా
రాయంచ ఆడగా
రాసలీలా తోడుగా
తనువెల్ల ఊగగ
మారుడే సుకుమారుడై
జతకూడే మాయగా

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా

మనసే మందారమై
వయసే మకరందమై
అదేదో మాయ చేసినది

విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా
విరిసినది వసంత గానం
వలపుల పల్లవిగా