Friday, 26 January 2024

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ .......Divine intervention..as word's that guided Sun and planets as divine intervention...as witnessed by witness minds.....in the orginal language and music accompaned as it is as happened ...on January 2003 1St.............శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ

శ్రీ పన్నగాద్రి వర శిఖరాగ్రవాసునకు పాపాంధకార ఘన భాస్కరునకూ 

ఆ పరాత్మునకు నిత్యానపాయినియైన మా పాలి అలమేలుమంగమ్మకూ (1) 

జయ మంగళం నిత్య శుభమంగళం

జయ మంగళం నిత్య శుభమంగళం

శరణన్న దాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్న పర దైవమునకూ

మరువ వలదీ బిరుదు నిరతమని పతిని ఏమరనీయనలమేలు మంగమ్మకూ (2)  

జయ మంగళం నిత్య శుభమంగళం

జయ మంగళం నిత్య శుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వసియించి దీనులను రక్షించు దేవునకునూ  

కానుకల నొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకూ (3) 

జయ మంగళం నిత్య శుభమంగళం

జయ మంగళం నిత్య శుభమంగళం

పరమొసగ నా వంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకునూ

సిరులొసగ తన వంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధిసుతకూ (4) 

జయ మంగళం నిత్య శుభమంగళం

జయ మంగళం నిత్య శుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళిగించి గైకొనెడి అచ్యుతునకూ

ఎలమి పాకంబు జేయించి అందరకన్న మలయకెపుడొసగె మహామాతకూ (5)

జయ మంగళం నిత్య శుభమంగళం

జయ మంగళం నిత్య శుభమంగళం

మరియు చిత్రవిచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్య తీర్ఠములకూ 

పరగ కనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకూ (6) 

తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శ్రుంగారవన పంక్తులకునూ  

మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకునూ (7) 

అహి వైరి ముఖ్యవాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకునూ  

బహు విధ ధ్వజములకు పటు వాద్య వితతులకు విహిత సత్కళ్యాణ వేదికలకూ (8)  

జయ మంగళం నిత్య శుభమంగళం 

జయ మంగళం నిత్య శుభమంగళం 

దర చక్ర ముఖ్య సాధనములకు, మనిమయాభరణ దివ్యాంబర ప్రతతులకునూ  

కరచరణ ముఖ్యాంగ గణసహితమై శుభాకరమైన దివ్య మంగళ మూర్తికీ (9)     

జయ మంగళం నిత్య శుభమంగళం  

జయ మంగళం నిత్య శుభమంగళం 

కలిత సుఙ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పునమిత ప్రభావమునకూ

వలగొనిన సకలపరివారదేవతలకును చెలగి పనులొనరించు సేవకులకూ (10) 

జయ మంగళం నిత్య శుభమంగళం  

జయ మంగళం నిత్య శుభమంగళం 

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకునూ   

పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకునూ (11)   

జయ మంగళం నిత్య శుభమంగళం  

జయ మంగళం నిత్య శుభమంగళం

అరయ తరిగొండ నరహరియగుచు నందరికి వరములొసగే శ్రీనివాసునకునూ   

మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికీ (12)

జయ మంగళం నిత్య శుభమంగళం  

జయ మంగళం నిత్య శుభమంగళం 

No comments:

Post a Comment