ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ
యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
చరణం 1 :
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు
కరగిపోయెరా.. నా బ్రతుకు
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
చరణం 2 :
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట..
ఆ.. ఆ.. ఆ.. ఆ...
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట
పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
యీ తల్లి హృదయము ఓర్వలేదయా..
ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
No comments:
Post a Comment