ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే
మేఘాలు ఉరిమితే
మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే
ఈ నేల చేరిన చినుకువే నువ్వే
గుండెలో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిన్ను చేరడం కొరకే
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కోటి కళలను గుండె లోతులో దాచి ఉంచిన నేస్తమా
వేయి అలలుగా నిన్ను చేరగా కదులుతున్న ప్రాణమా
వెన్నెల్లో గోదారి నువ్వేనా వయ్యారి
నే నీటి చుక్కైపోవాలి
నవ్వేటి సింగారి వెళ్లొద్దు చేజారి
నిన్ను చేరి మురిసిపోవాలి
చిగురాకు నువ్వై చిరు జల్లు నేనై
నిను నేను చేరుకుంటే హాయి
నిను నేను చేరుకుంటే హాయి
నీవు ఎదురుగ నిలచి ఉండగ మాట దాటదు పెదవిని
నన్ను మృదువుగ నువ్వు తాకగా మధువు సోకెను మనసుని
నీ చెంత చేరాలి స్వర్గాన్నే చూడాలి
నే నీలో నిండి పోవాలి
నీ కంటి చూపుల్లో నీ ప్రేమ వానల్లో
నిలువెల్లా నేనే తడవాలి
నా లోని ప్రేమ ఏనాటికైనా
నీకే అంకితం అవని
నీకే అంకితం అవని
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్
ఐ అం ఇన్ లవ్ విత్ యు
కనులలో దాచిన కావ్యమే నువ్వు
కావేరి కదిలితే
మేఘాలు ఉరిమితే
మనసులో నువ్వే
ఆ నింగి కరిగితే
ఈ నెల చేరిన చినుకువే నువ్వే
గుండె లో చిరు కలవరం తొలిసారిగా నువ్వే
అర్పితం ఈ జీవితం నిన్ను చేరడం కొరకే