Thursday, 11 June 2026

తాదిత్య గారు 2000 సంవత్సరంలో జన్మించారు ఇప్పుడు ఆ సంవత్సరం ఎందుకు చెప్పానంటే వారి వయసుని ఒక అంచనా వేసుకొని ఇప్పుడు వారు సాధించిన మీరు చూసి మీరు కొంత ప్రేరణ పొందుతారుని వారు 2000 సంవత్సరంలో అమెరికాలో జన్మించారు అమెరికాలోనే వారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ పట్టభద్దులు అయ్యారు తర్వాత సంస్కృతంలో వారు బిఏ ఆనర్స్ పట్టాన్ని కూడా పొందారు కౌతిల్యుని అర్థశాస్త్రంలో థీసిస్ కూడా చేశారు సాక్షాత్ శృంగేరి జగద్గురు విదశేఖర భారీ మహాస్వామి వారికి శిష్యులు వారి పాతి పద్మాల వద్ద శాస్త్రధ్యయనం చేస్తున్నారు మా జగద్గురువులు అంటే నడయాడే దక్షిణామూర్తులు అంటే దక్షిణామూర్తి స్వామి వారి దగ్గరే వారు సాక్షాత్ వారు అంటే కాకపోతే అక్కడ మౌనంగా చెప్తారు ఇక్కడ స్వామివారు పాఠాన్ని పాఠంగా చెప్తారు వారు 19వ వయసులోనే 19 ఏళ్లకే వారి మొదటి శతావధానాన్ని వారు చేశారు ఇప్పటివరకు నాలుగు శతావధానాలు తెలుగు సంస్కృత భాషల్లో చేశారు ఒక ఒక అవధానం వారు ఉభయ జగద్గురువుల సమక్షంలో లో చేసి వారి వారి అభినందనలకు వారి మనలకు పాత్రులారు ఇది చాలా చాలా అరుదైన ఘనత వారి ఉభయులు అక్కడుండి వారి వారి శిష్యుడు వారి శిష్యుడు అది చేసిన ఆనందాన్ని మీరు మీలో కొంతమంది వీడియోల్లో చూసే ఉంటారు అలాగే వీరు చాలా అనేక ప్రవచనాలు కూడా ఇచ్చారు రామాయణం భాగవతం భగవద్గీత శంకర దిగ్విజం లలితా సహస్రనామం ఇత్యాది అంశాలపై అలాగే వీరు శతకాలు కూడా రాశారు ఖండకావ్యాలు రాశారు గారు సంస్కృతంలో తెలుగులో జగద్గురువుల ఆదేశం మేరకు అభినవ శంకర్ విజయం అని చెప్పి మా జగద్గురువులపై ఒక కావ్యాన్ని కూడా మా 33వ జగద్గురువులపై ఒక కావ్యాన్ని కూడా రచించారు సో ఇంత చిన్న వయసులో వారు ఇన్ని ఘనతలు సాధించారు మేము మా శృంగేరి భక్తులం వారిని సింహం అని పిలుచుకుంటాం ఎందుకంటే వారికి వారికి భాషపై గాని శాస్త్రంలో గాని తిరుగులేని పట్టు ఉంది కనుక వారు జగద్గురువుల విజయాతర సందర్భంలో ఇక్కడ ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఎందుకంటే వారు సామాన్యంగా ఎక్కువ వారు ట్రావెల్ చేయరు ఎందుకంటే జగద్గురువుల దగ్గర పాఠం చెప్పుకుంటున్నారు అక్కడ పర్మనెంట్ గా వారు జగద్గురువుల పాదాల వద్ద శాస్త్రధ్యయనం కోసం వారు అమెరికా నుంచి శృంగేరి వచ్చేశరు పూర్తి సమయం కనుక ధర్మ విజేతల వల్ల మనకి జగద్గురువుల అనుగ్రహం ప్రత్యక్ష అనుగ్రహం వారి దర్శనంతో కలిగితే పరోక్ష అనుగ్రహం వారి శిష్యుల ప్రవచనాల ద్వారా కూడా జరుగుతాయి మీకు రానున్న గంటన్నర సమయంలో మా జగద్గురువుల అనుగ్రహమే బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య గారి ప్రవచన రూపంలో మీ అందరికీ లభించబోతుంది అని చెప్తూ తదుపరి ఇంకా ఆలస్యం చేయకుండా గురువుగారు మీ ప్రవచనాన్ని ప్రారంభించ

@@@@@@@@

 శ్రీ గురుభ్యో నమః శారదాం చంద్రమౌలీశం రత్నగర్భ గణేశ్వరం శంకరంచ చర్ష శృంగేషం తుంగా లోక గురున్ భజే శాస్త్రాబ్ధి పారదృష్వానం సంఘహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రోగదాయకం విధుశేకర భారత్యాః శ్రయామి చరణంభుజం విజ్ఞాన మకరందేచ్చు శిష్య భ్రమర జీవనం నతోస్మ్యాశక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సృగ్గస్థితి సంయమ గుణేస్వలీలయా సందహతేవ్యయాత్మనే బ్రహ్మాయేన కులాలవన్యమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేన దశావతార గహనే క్షిప్తో మహా సంకటే రుద్రోయేన కపాలిపాణి పుటకే భిక్షాశనం కారితః సూర్యో భ్రామ్యతి నిత్యమేవగహనే తస్మై నమః కర్మణే ఉభయ జగద్గురువుల శ్రీ చరణాలకు సభక్తి భక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ

మీరు ఇచ్చిన శ్లోకాలు ఇప్పటికే సంస్కృత భాషలో తెలుగు లిపిలో ఉన్నాయి. వాటిని అర్థవంతమైన తెలుగులో ఇలా అనువదించవచ్చు:

శ్రీ గురుభ్యో నమః

శ్రీ శారదాదేవిని, చంద్రశేఖరుడైన పరమశివుడిని, రత్నగర్భ గణేశ్వరుడిని, శృంగేరి పీఠాధిపతులైన శ్రీ శంకరాచార్యులను, తుంగానది తీరంలో లోకగురువులుగా వెలసిన వారిని నేను భజిస్తున్నాను.

శాస్త్ర సముద్రాన్ని దాటిన మహాజ్ఞానిని, ఆసక్తి-అహంకార రహితుడిని, తపస్సుకు నిలయమైన శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారిని నేను భజిస్తున్నాను. భక్తులకు శుభప్రదుడైన ఆ గురువును నమస్కరిస్తున్నాను.

శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి పాదపద్మాలను నేను ఆశ్రయిస్తున్నాను. వారి విజ్ఞానామృతాన్ని ఆస్వాదించాలనే తపనతో ఉన్న శిష్యజనులకు వారు జీవనాధారులవంటివారు.

అద్భుతమైన శక్తి, అపూర్వమైన పరాక్రమం, పవిత్రమైన కర్మలతో జగత్తును సృష్టించి, స్థితి చేసి, లయపరచే పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను.

ఎవరి సంకల్పముచేత బ్రహ్మదేవుడు కుండలను తయారు చేసే కుమ్మరి వలె బ్రహ్మాండాలను సృష్టిస్తున్నాడో, ఎవరి ఆజ్ఞచేత విష్ణుమూర్తి దశావతారాలను స్వీకరించి లోకరక్షణ చేస్తున్నాడో, ఎవరి నియమముచేత రుద్రుడు కపాలపాత్రలో భిక్షాటన చేస్తున్నాడో, ఎవరి శక్తిచేత సూర్యుడు నిరంతరం ఆకాశంలో సంచరిస్తున్నాడో, ఆ కర్మస్వరూప పరబ్రహ్మకు నమస్కారం.

ఉభయ జగద్గురువుల శ్రీచరణాలకు సభక్తి, శ్రద్ధ, వినయాలతో సాష్టాంగ ప్రణామములను సమర్పించుకుంటున్నాను. 🙏

॥ శ్రీ గురుచరణారవిందార్పణమస్తు ॥

 జగద్గురు శ్రీమద్దా ఆదిశంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన నాలుగు ఆమనాయ పీఠాలలో దక్షిణ దిక్కులో జగద్గురు శ్రీమద్దా శ్రీ సురేశ్వరాచార్యులని తొలి పీఠాధిపతిగా కలిగిన ఈ దక్షిణానాయ శృంగేరి శారదా పీఠం అవిచ్చిన్న గురుపరంపరతో వస్తున్నది ఈ జగద్గురు పరంపరకు గల అనేకానేక బాధ్యతలలో ధర్మ ప్రచారం చేస్తూ విజయ యాత్రలు చేసే బాధ్యత కూడా వారికి ఉన్నది తదనుసారంగా జగద్గురు శ్రీ విధశేఖర భారతీ మహాస్వామి వారు తెలుగునాట నేల మోపడం వారి తెలుగునాట వారి పాదాన్ని మోపడం అనేది మన యొక్క అదృష్టంగా భావిస్తూ తదనుసారంగా దక్షిణాంనాయ శృంగేరి శారద పీఠం యొక్క అంగ సంస్థ అయిన అహం బ్రహ్మస్మి ద్వారా ఎన్నో ధార్మిక కార్యక్రమాల ఆయోన జరుగుతున్నది దాంట్లో భాగమే ఈనాటి మన ఈ ఉపన్యాసము ఈరోజు ఉపన్యాసం ఉంటుందని చెప్పి అన్నప్పుడు దీనికి యోగ్యమైన విషయం ఏమిటి అని చెప్పి కొంత ఆలోచించాము సాధారణంగా తెలుగునాట ప్రజలకి ప్రవచనాలు కొత్తేమి కాదు బహుశా దక్షిణ పథనంలో మన దగ్గరే ఎక్కువ అవుతుంటాయి టీవీలో గాని ఇతరత్ర కాబట్టి సర్వజన ఉపాదాన యోగ్యముగా అందరికీ ఒక స్పష్టమైన అవగాహన కలిగించే విషయం ఏమిటి అని ఆలోచించినప్పుడు కర్మ సిద్ధాంతం మీద కొంత స్పష్టత ఉంటే మనకి ధర్మం గురించి తెలిసినట్టు ఉంటుంది మన జీవితానికి కూడా కొంత ఉపయోగం కలుగుతుందేమో అని భావించే ఈనాటికి ఈ అంశాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది సాధారణంగా మన శాస్త్రాల్లో కర్మ అనే పదం పలుమార్ల పలు చోట్ల్లో పలుతావుల్లో కనబడుతూ ఉంటుంది వ్యాకరణంలో చూసినట్లయితే కర్మ అంటే క్రియకి విషయము అని చెప్పి అర్థం నేను రాముడిని చూశాను అనే ఈ వాక్యంలో రాముడు అనే పదార్థము కర్మగా చెప్పబడుతుంది ఎందుకంటే చూడడం అనే క్రియకి అది విషయం ఉంది గనుక కర్తుపం కర్మ అని చెప్పి అక్కడ పాణ మహర్షి సూత్రం కూడా రాశారు అట్లా కాకుండా మనం ప్రస్తుతం ఏ కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే చేసే పనులు అని అర్థం కర్మకి క్రియతే కర్మ అని కర్మకి ఇంకో నిర్వచనం కూడా ఉంది చేయబడినది అని చెప్పి కూడా ఒక అర్థం ఉంది చేసేది చేయబడేది ఈ రెండు మనం ఒక చిన్న తేడా చూడాలి ఇప్పుడు చేసేది ఏమిటి అని చెప్పంటే ఏదో చెక్కడం చేయబడేది ఏమిటంటే శిల్పం అంటే క్రియ క్రియ యొక్క ఫలితం ఈ రెండు అర్థాల్లో కూడా మనకి కర్మ అనే పదం వాడుతూ ఉంటుంది అందుకనే మనం విశ్వకర్మ అనే ఒక దేవత ఉన్నారు మనకి ఉన్న దేవతల్లో విశ్వకర్మ అని చెప్పి చాలా ప్రధానమైన దేవత ఆయనకి విశ్వకర్మ అని పేరు పేరు ఎందుకు వచ్చింది అంటే అన్ని పనులని ఆయనే తయారు చేసి పెట్టారు అన్ని వస్తువులని ఆయనే చెక్కి ఆయనే సిద్ధం చేసి పెట్టారు కాబట్టి విశ్వము అంటే అన్నిటిని కర్మ అంటే ఆయన తయారు చేసినది అని చెప్పి అర్థం ఈ రకంగా కర్మ శబ్దం మనకి తయారు చేయబడినది అని అర్థంలో కూడా ఉంది ఈ కర్మలో మనకి ముఖ్యంగా ఐదు రకాలుగా ఉన్నాయి శాస్త్రాల్లో మనం చేసే పనులు నిత్య నైమిత్తిక కామ్య ప్రాయశ్చిత్త నిషిద్ధ కర్మలు అని చెప్పి ఈ కర్మలు ఐదు రకాలు వీటికి క్లుప్తంగా పరిచయం చేసుకోవాలంటే నిత్య కర్మలు అంటే తప్పక ప్రతిరోజు చేయవలసినవి అనేది నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తం వచ్చినప్పుడు అంటే దానికి కావాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఏ పనులనైతే చేస్తామో అవి నైమిత్తిక కర్మలు అంటే పిల్లవాడు పుట్టినప్పుడు ఏదో జాత కర్మ చేస్తామో యుక్త వయసు వచ్చినప్పుడు వివాహం చేస్తామో రోజు ఎవరు జాత కర్మలు వివాహాలు చేసుకోరు అంటే వాటికి నైమిత్తిక కర్మలు అని పేరు తర్వాత కామ్య కర్మలు ఇవి అసలు చేసి తీరాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఇవి మనకి ఏ కర్మకైతే ఏ ఫలం చెప్పారో ఆ ఫలం మనకు కావాలన్నప్పుడు మనకు కావాల్సినప్పుడు ఆ కర్మని చేసుకోవచ్చు తర్వాత ప్రాయశ్చిత్తాలు ప్రాయశ్చిత్తాలు అంటే చేయకూడనిది ఏమనా చేస్తే చేయవలసిన కర్మ దీని గురించి మనం మళ్ళీ విపులంగా మాట్లాడుకుంటాం అదేరకంగా నిషిద్ధ కర్మలు ఎప్పుడు కూడా చేయకూడని పనులు మనకి మనకి తెలిస్తే ఏమో దొంగతనాలు ఇతరులని హింసించడం అబద్ధాలు చెప్పడం అసత్యం పలకడం ఇట్లాంటివన్నీ కూడా నిషిద్ధాల కిందకి వస్తాయి అయితే ఇక్కడ మనకో సందేహం వస్తుంది అసలు ఈ కర్మలు చేయడం ఎందుకు ఇప్పుడు ఏవో శాస్త్రాల్లో ఈ ఐదు రకాలుగా మనం కర్మల్ని విడదీశారు అసలు కర్మ చేయడం చేయమని చెప్పడం ఎందుకు ఏదో మనకు కావాల్సినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా లేదా అసలు ఏది చేయకుండా ఉండొచ్చు కదా అని చెప్పంటే కర్మని పట్టించుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది ఎందుకంటే కర్మ చేయకుండా ఉండలేము కాబట్టి ఇది భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్పాడు నహికశత్ క్షణమపి జాతతిష్టతకర్మకృత కార్యతేహవషకర్మ సర్వ ప్రకృతిజైర్ గుణహి అని ఎవ్వరు కూడా అకర్మకృత ఏ పని చేయకుండా ఒక దగ్గర చక్కబొమ్మలాగా ఎవ్వరు కూర్చోలేరు అది అది సాధ్యం కాదు ఎందుకంటే ప్రకృతి జయర్ గుణేహి అవశహ కార్యతే లోకం యొక్క రీతి అనేది ఒకటి ఉంటుంది ఈ లోకం యొక్క ప్రవాహం ఈ లోకం నుండి అనాదిగా ఒక పద్ధతి ఒక వ్యవస్థలో ఈ లోకం నడుస్తుంది ఆ వ్యవస్థ అనేది ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని అతిక్రమించలేరు ఏదో ఒక రకంగా వాడిలో ఉండే ఆ గుణాలు వాడి మనసులో ఉండే ఆ గుణాలు వాడిని కర్మ వైపు నెట్టనే నెట్టుతాయి అందుకనే భగవంతుడు ఇంకో దగ్గర కూడా అంటాడు ప్రకృతియాంతి భూతాని నిగ్రహకింకరిషతి అని ఎవరి దారిలో వాళ్ళు పోతుంటారు దాన్ని ఎవరు కూడా నిగ్రహించలేరు అని కాబట్టి కర్మ పనులు చేయడం అనేది అందరికీ తప్పనిసరైనప్పుడు మనకి ఇప్పుడు ఈ కర్మ అంటే ఏమిటి ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది మనకి తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ కర్మలో ఏమిటి భాగాలు కర్మలో ఏమిటి అంశాలు అని చెప్పి చూసుకుంటే దీన్ని కూడా మనం రెండు రకాలుగా చూడొచ్చు ఆ కర్మ యొక్క పరిస్థితి కర్మను చేసేవాడు ఈ రెండిటిని మనం అర్థం చేసుకున్నాం అంటే కర్మ అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది కర్మ యొక్క పరిస్థితి అంటే ఏమిటంటే మనం దేశకాల వస్తువులు అని మీరు ఒక మాట వినిఉంటారు కర్మకి దేశం కాలం వస్తువు ఈ మూడు జాగ్రత్తగా చూసుకోవాల్సినవి ఎక్కడ చేయాలి ఎటువంటి సమయంలో చేయాలి దేనితో చేయాలి మనక శాస్త్రంలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి కొన్ని కర్మలు విశేషించి నదీ తీరంలో చేయాలి కొన్ని కర్మలు విశేషించి ఏదో గోశాలలో చేయాలి కొన్ని కర్మలు ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్క కర్మకే ఒక్క చోటు నిర్దేశింపబడి ఉంటుంది కొన్ని కర్మలకి కొన్ని కాలాలు ఇది ఫలాని తెల్లవారు గట్ట చేయాలి మధ్యాహ్నం పూట చేయాలి ఇప్పుడు పితృ కార్యాలు లాంటివి తెల్లారిగట్టలు లేచి చేయకూడదు జపాలవన్నీ కావాలంటే తెల్లవారి గట్టలే చేసుకోవచ్చు కానీ పితృ కార్యాలు లాంటివి పొద్దు పొద్దునే చేయకూడదు అలాగే సంధ్యావందనం సంధ్యావందనానికి ఒక లెక్క ఉంది పొద్దున పోటు అంటే చుక్కలు ఉండాలి సూర్యుడు ఇంకా ఉదయించకూడదు అప్పుడు మొదలు పెట్టాలి సంధ్యావందనం సాయంకాలం సూర్యుడు ఇంకా ఉండాలి చుక్కలు ఇంకా రాకూడదు అప్పుడు సాయంకాలం సంధ్యావందనం చేసుకోవాలి ఇటువంటి సమయాలు కూడా శాస్త్రంలో నిర్దేశించి ఉన్నారు అలాగే వస్తువులు ఈ కర్మలు మనం చేసేటప్పుడు దాంట్లో ద్రవ్యాలు అని చెప్పి ఉంటాయి ఆ ద్రవ్యాలు కూడా శాస్త్రం మనకు చెప్పిన దాని ప్రకారం మనం వాడాలి నువ్వులు అంటే నువ్వులు బియ్యం అంటే బియ్యం శ్వేతాక్షత శ్వేతాక్షతలు ఇవన్నీ కూడా ఆ వస్తువులు ఏ వస్తువులు వాడాలో కూడా మనం ఆ గ్రంథాలు ఏ గ్రంథాలు అయితే మనకు ప్రమాణంగా ఉన్నాయో వాటిని చూసి తెలుసుకొని ఈ మూడు దగ్గరలో మనం జాగ్రత్త పడాలి సరే ఇదంతా మనం పుస్తకాలు చూసుకొని చేసుకుంటే సరిపోయి ఉండేది దీనికంటే ముఖ్యమైనది కర్త ఎవరైతే పని చేస్తూ తున్నారో ఆ కార్యకర్త తనని తాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇతను ఏమేమ జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని కూడా భగవంతుడు గీతలో చెప్పాడు మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ పనిని సాధించడానికి మనం ఐదింటి యొక్క సహాయాన్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏమిటంటే అధిష్టానం తథా కర్తా కరణంచ ప్రథగ్విధం వివిధాశచ ప్రథ చేష్టాః దైవం చైవత్ర పంచమం అని చెప్పి ఐదు ఐదు హేతువులు చెప్పారు శరీరవా మనోభియత కర్మ ప్రారభతేనరః న్యాయంవ విపరీతంవా పంచతేతస్యహేతవః అని మనం ఏ పని చేయాలనా అది న్యాయమైన పని కావచ్చు లేదా న్యాయానికి విపరీతమైన పని కూడా కావచ్చు అంటే ధార్మికమైన పని కావచ్చు అధర్మం కూడా కావచ్చు ఏ పని చేసినా కూడా ఈ ఐదింటి యొక్క ఆలంబనతోనే మనం ఏ పనినా చేయగలము అవి ఏమిటి అంటే మొదట్లో అధిష్టానం అని చెప్పి అన్నారు తర్వాత కర్త కరణము చేష్ట దైవము ఈ ఐదు చెప్పారు ఇవేమిటి అని చెప్పంటే అధిష్టానం అంటే శరీరం అధిష్టానం అంటే అంటే మనందరికీ తెలిసినదే ఇంకొక ఇంకొక వస్తువుని ఉంచే చోటుని అధిష్టానం అని చెప్పి అంటారు శరీరంి ఎందుకు అధిష్టానం అన్నారు అని చెప్పంటే మన మనసుకి మన ఇంద్రియాలకి మన ప్రాణాలకి మన సంకల్పాలకి మనం ఏది చేయాలన్నా కూడా ఈ శరీరం లేకుండా ఏది కుదరదు అందుకనే మనకి తెలిసిందే కాళిదాసు కూడా అన్నమాట శరీర మాధ్యంకలు ధర్మ సాధనం మనం ఏ పని చేయాలన్నా కూడా ముందు ఈ శరీరం అనేది జాగ్రత్తగా రక్షించుకొని ఉండాలి కాబట్టి ఆ శరీరం మీదనే మనం ఏ పని చేయడం ఆధారపడింది కాబట్టి ఈ శరీరాన్ని అధిష్టానం అని చెప్పి అన్నారు ఇదొకటి ఈ అధిష్టానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మన ధర్మంలో ఎక్కడ కూడా ఆచారాల పేరు మీద శరీరాన్ని దుర్బలం పరుచుకో అని చెప్పి ఎక్కడ కూడా లేదు చాలామందికి అదో సందేహం వస్తూ ఉంటుంది మేము ఉపవాసాలు చేయలేము జాగరణలు చేయలేము ఇంతింతసేపు తినకుండా ఉండలేము మరి ఇవన్నీ చేయడం ఎలాగా అని చెప్పంటే అవన్నీ చేయకుండా అవన్నీ ఉపవాసాదులు మనవల్ల కావు అని ఉండకూడదు అని చెప్పి ఉపవాసాలు పెట్టింది ఇప్పుడు ఉపవాసాలు పెట్టింది మనం కష్టపడాలఅని చెప్పి కాదు ఉపవాసం ఉన్నా కూడా మనం కష్టపడకూడదు అని చెప్పే మనకు ఉపవాసాలు పెట్టింది అందుకని ఉపవాసాల్లో నక్తాలు ఉన్నాయి ఏకభుక్తాలు ఉన్నాయి అన్నం లేకుండా తినే ఉపవాసాల్లో చాలా రకాలు ఉండేది కూడా ఎందుకంటే ఆయా మనుషులకి ఆయా సందర్భాల్లో సౌకర్యం ప్రకారం వాళ్ళకి ఉపవాసాలని అలవాటు చేయించడానికి అందుకనే మనం ఏకాదశి వ్రతాలు ఇవన్నీ చూసుకుంటే చాలామంది ఏకాదశి గురించి అడుగుతూ ఉంటారు ఏకాదశ వ్రతం ఏకాదశి వ్రతం చేయాలా వద్దా నిత్యమా కాదా శాస్త్రం ప్రకారం ఏకాదశి నిత్యమే అయితే శాస్త్రంలో ఎక్కడెక్కడైతే ఏమన్నా మనకు చెప్పారో దాని పక్కనే ఒక మాట వస్తూ ఉంటుంది యథాశక్తి అని చెప్పి కాబట్టి ఒకవేళ ఏకాదశి చేయడం ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల ఆరోగ్యానికి దెబ్బ తినేటట్లయితే అంటే షుగర్ బీపి వగేర ఉండేవాళ్ళకి ఒకవేళ అట్లాంటి పరిస్థితులు ఉంటే అక్కడ ఏకాదశి వ్రతం చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా శాస్త్రం చెప్పింది అక్కడ కూడా మనకి కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఉత్తమం ఏమిటంటే నిర్జలమైన ఉపవాసం అది సామాన్యంగా ఈ కాలంలో జగద్గురువులు తప్ప ఇంకెవరికీ కాదు జగద్గురువులు అయితే నిర్జల ఉపవాసం చేస్తారు ఎంత పనులు ఎన్ని పనులు ఉన్నా కూడా వారు మాత్రం నిర్జల ఉపవాసమే చేస్తారు అయితే మనలాంటి వాళ్ళకి అది కొంచెం కష్టం కాబట్టి అది పక్కన పెట్టిన నక్తం అవిష్యన్నం అనోదనం అని చెప్పి ఒక్కొక్క పక్షం చెప్పుకుంటూ వచ్చారు తినకుండా ఉండడం నీళ్లు మాత్రం తాగి ఉండడం పండ్లు పాలు తాగి ఉండడం లేదా నైవేద్యంగా పెట్టగా మిగిలిన అన్నాన్ని తినడం అన్నం తినకుండా ఉండడం ఇట్లా రకరకాల పక్షాలు చెప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇటువంటి వ్యవస్థ కూడా పెట్టింది ఎందుకంటే శరీరాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆహారాలు వ్యవహారాలు అన్నపానాదులు నిద్రలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే ఏ పనైనా ముందుకు వెళ్లేది అందుకనే ఇక్కడ గీతలో కూడా భగవంతుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నాబోధస్య యోగభవతి దుఃఖః అనే మాట అన్నాడు తినడం తిరగడం తిరగడం అంటే మన శరీరాన్ని శ్రమ పెట్టడం శారీరక శ్రమని పడడం అలాగే నిద్రపోవడం ఈ మూడి రెండిటిని జాగ్రత్తగా చూసుకోలేని భగవంతుడు అన్నప్పుడు అక్కడ భగవత్పాదులు కూడా భాష్యాన్ని రాస్తూ మనం ఎలా తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా రాశారు అక్కడ ఆయుర్వేద శాస్త్రాన్ని నుటంకించారు భగవత్పాదులు అక్కడ అర్థం సవ్యంజనాన్నస్య తృతీయ ఉదకస్యచ వాయో సంచారణర్థంతు చతుర్థం అవశేషయేత్ అని సాధకాలతో కలిపిన అన్నానికి సగభాగం పావు భాగము నీళ్లకి మిగిలిన పావు భాగాన్ని వాయు సంచారం కోసం వదిలేయాలి అని ఏ ఆయుర్వాద ఏ ఆయుర్వేద వాక్యాన్ని అయితే చెప్పిఉన్నారో భగవత్పాదులు దాన్ని కూడా ఒటంకించారు కాబట్టి మనం ఈ రకంగా నడుచుకొని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఒకటి తథాకర్త ఎవరైతే పనిని చేస్తున్నారు దీన్నే వేదాంతంలో ఉపాధి లక్షణో భోక్త అని చెప్పి రాశరు అక్కడ భాష్యంలో అంటే ఎవరైతే నాకు ఈ ఫలము కావాలి అని చెప్పి శరీరంలో నుండి అనుకుంటున్నారో ఇప్పుడు శరీరం వేరు ప్రాణాలు వేరు ఇంద్రియాలు వేరు నేను ఇది కావాలి అని చెప్పి సంకల్పించే పని మొదలు పెట్టేవాడు వేరు ఇంచుమించు మనము అని చెప్పి అనుకోవచ్చు ఆ భోక్త అనేవాడు కర్మ కర్త అనేవాడు శరీరం అధిష్టాంత కర్త అని అక్కడ కర్త శబ్దం చేత చెప్పబడుతున్నారు అక్కడ కూడా భగవంతుడు సాత్వికమైన కర్త ఎలా ఉండాలో చెప్పారు గీతలో ముక్త సంఘః అనహంవాది దృత్యుత్సాహ సమన్వితః సిద్ధి సిద్ధ్యోర్ నిర్వికారః కర్తా సాత్విక వచ్యతే అని ముక్త సంఘః ఆ కర్మ ఫలంతో అధికమైన సంఘం పెట్టుకోకూడదు పని చేయడం వరకే నా కర్తవ్యం ఫలం ఏదివచ్చినా దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక భావన అనహంవాది ఆ పనిని చేసేటప్పుడు ఆ పని సఫలమ ఎలా అవ్వాలని ఆలోచించాలి తప్ప మన యొక్క అహంకారము ఆ పని యొక్క సాఫల్యానికి అడ్డు రాకుండా చూసుకోవాలి అలాగే దృత్యుత్సాహ సమన్వితః ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందురక వెళ్తూ ఆ పని చేయాలనే ఉత్సాహాన్ని కలిగి ఉండాలి సిద్ధి సిద్ధ్య నిర్వికారః మన మొదటి ప్రయత్నంలోనే పని ఫలించినా ఫలించకపోయినా మన యొక్క మనసు మీద అది ప్రభావం చూపకుండా మరొక్క ప్రయత్నం చేసే లక్షణం అనేది ఉండాలి ఇట్లా చూసుకుంటే ఈ కర్త ప్రయత్నం చేసేవాడు మనం సరిగ్గా చూసుకున్నట్టు లెక్క తర్వాత కరుణంజ ప్రథవిధం రకరకాల ఇంద్రియాలు అని చెప్పి అర్థం ఎందుకంటే చాలా సార్లు చెప్తుంటాయి ఇది మనం ఇంద్రియాలు అనంగానే మనకి వేదాంతం ఉపన్యాసాలు లేదా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు బాగా విని విని మనకి ఇంద్రియాలు అంటేనే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది దాని పట్ల ఒక వ్యతిరేక దృక్పదం ఏర్పడిపోయింది నిజానికి ఇంద్రియాలని అంత వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఇంద్రియాలు లేకుండా అవ్వదు మనకి శాస్త్రంలో కూడా అదన్నారు సంబంధార్థవృత్తిహి అని ఏ పని చేయాలన్నా మనకి బయట ప్రపంచంతో ఒక సంబంధం కావాలి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఏ పని అవ్వదు మనకి బయట ప్రపంచానికి సంబంధాన్ని కలిగించేదాన్ని ఇంద్రియాలు అని చెప్పి అన్నారు ఎందుకంటే మనసు ఉంటుంది కానీ మనసు ఏ విషయాన్ని గ్రహించాలి అనేది ఇంద్రియం నిర్ణయిస్తుంది మనసు కంటి ద్వారా విషయాన్ని గ్రహించినప్పుడు రూపాన్ని గ్రహిస్తుంది మనసు చెవి ద్వారా విషయాన్ని గ్రహించినప్పుడు శబ్దాన్ని గ్రహిస్తుంది ఈ రకంగా మన మనసు ఉన్నా కూడా బయట ప్రపంచంతో సంబంధం ఉండాలంటే అక్కడ తప్పకుండా మనం ఇంద్రియాల యొక్క సహకారం కావాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఇంద్రియాలని మనం కష్టపెట్టాలనో లేదా ఇంద్రియాలను తిరస్కరించాలనో ఎక్కడ కూడా శాస్త్రాల్లో లేదు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి అని మాత్రమే చెప్పారు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అనే మాట ఎటువంటిది అంటే మనం మన గమ్యాన్ని చేరాలంటే బండి యొక్క స్టీరింగ్ మన చేతిలో ఉండాలి అని చెప్పినట్టుగా అంత మాత్రాన ఏమి స్టీరింగ్ వదిలేయమని చెప్పి కాదు కళ్ళు మూసుకొని నడపని చెప్పి కాదు అయితే మనం ఎక్కడ నడుపుతున్నాము అనేది మన చేతిలో ఉండాలి ఇంద్రియాలు వాటి యొక్క సహజ స్వభావం కొద్ది ఏం చేస్తాయి అంటే వాటికి ఎక్కడ హాయిగా ఉందో వాటికి ఎక్కడ సుఖం కలుగుతుందో అటువైపుగా ప్రయాణిస్తుంటాయి మన యొక్క వివేకుల యొక్క కార్యం ఏమిటంటే మన బుద్ధిని వాడి వాటి దారిని చూసి అవి ఏ దారిలో వెళ్తున్నాయో అవి సరియా కాదా లేదా ఇంద్రియాలు ఏ దారిలో అంటే నా పనికి అవి ఉపకరిస్తాయి అనే ఈ దృష్టితో ఇంద్రియాలని సరిైన దారిలో పెట్టాల్సిన అవసరం ఈ వ్యక్తి మీద మనుష్యుడి మీద ఉంది అందుకనే ఉపనిషత్తులో కూడా చెప్తూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహమే వచ ఇంద్రియాని హయాన్యాహు విషయాస్తేషు గోచరాన్ ఆత్మే అట్లా అని చెప్పి అక్కడ మిగతా అంతా చెప్పారు ఇక్కడ ఒక రూపకం చెప్పింది ఏమిటంటే రథం ఈ శరీరం అనేది ఒక రథం లాంటిది ఈ రథం లో కూర్చున్న యోధుడు ఎవరు అని చెప్పంటే ఆత్మ జీవుడు ఈ రథాన్ని ముందుకు తోలేది ఎవరు అంటే బుద్ధి అనేవాడు సారధిగా ఉన్నాడు ఈ రథాన్ని ముందుకు లాగే గుర్రాలు ఏవి అంటే అవి ఇంద్రియాలు అయితే ఆ ఈ రకంగా చూసుకుంటే ఆ పగ్గాలు అనేవి మన ప్రగ్రహమేవచ మనసు అనేది పగ్గాలుగా ఉన్నాయి ఇక్కడ మనక ఏం చెప్పారంటే ఈర గుర్రాలు లాక్కపోవడం వల్లనే రథానికి పురోగతి ఉంటుంది అయితే ఈ గుర్రాలు ఏ దిశలో పోవాలో అనేది సారథి నిర్ణయించాలి అంటే ఇప్పుడు ఈ రూపకంలో శరీరం అనే రథము ఎటువైపు పోవాలి అనేదాన్ని గుర్రాలు లాక్కొని వెళ్తూ ఉంటే ఆ గుర్రాలు ఏ దారిలో వెళ్ళాలి అనేదాన్ని సారధి అయిన బుద్ధి నిర్ణయించాలి అందుకనే అక్కడ చెప్పారు వశ్య ఇంద్రియః ఎవరైతే ఆ ఇంద్రియాలని అదుపులో పెట్టుకుంటారో సోద్వన పారమాప్తమతి వాడు వాడి యొక్క మార్గం యొక్క చివరి లక్ష్యాన్ని పొందుతాడు అని కాబట్టి ఇంద్రియాల దగ్గర ఏం చెప్పారంటే వాటిని అదుపులో పెట్టుకోవాలి సరిగ్గా ఉపయోగించుకోవాలి అని చెప్పారు తప్ప వాటిని ఎక్కడ కూడా తిరస్కరించాలి అని చెప్పి లేదు ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాలు కన్ను చెవి ముక్కు నోరు ఇవన్నీ కూడా నాలిక ఇవన్నీ కూడా చర్మము ఇవన్నీ కూడా బయటికి మనం వాడే ఇంద్రియాలు అయితే వీటికంటే అంటే ముఖ్యమైన ఇంద్రియం లోపల ఉండే ఇంద్రియం దాన్ని అంతరింద్రియము అంతఃకరణము మనస్సు అని చెప్పి అన్నారు దాన్ని దారిలో పెట్టుకుంటే మిగతా ఇంద్రియాలన్నీ కూడా దారిలో పడతాయి నిజానికి ఈ మనసుని దారిలో పెట్టడానికే అసలు కర్మ చేసేది ఎందుకంటే దేనికైనా పరమ లక్ష్యం ఏమిటంటే చిత్తశుద్ధి అక్కడ ఎటువంటి సందేహం లేదు కర్మ ఎందుకు చేస్తున్నాము అని చెప్పంటే వేదాంత సిద్ధాంతంలో చివరి మాట ఏమిటంటే కర్మ చిత్త శుద్ధి కోసమే మోక్షం కోసం జ్ఞానం కావాలి కానీ జ్ఞానానికి శుద్ధమైన మనసు కావాలి కాబట్టి మనసు శుద్ధ పరచుకోవడానికి మనం కర్మ చేస్తున్నాము అని అందుకనే కర్మలో ఇన్ని నియమ నిబంధనాలు ఉండేది ఇప్పుడే చేయాలి ఇలానే చేయాలి ఈ సమయంలోనే చేయాలని ఇన్ని నిబంధనలు ఉండేది కూడా ఈ దృక్పథాన్ని మనకు అలవాటు చేయడానికి ఎందుకంటే చాలామంది ఏ కాలంలో అనుకుంటూ ఉంటారు కర్మలు చెప్పారు ఎందుకంటే దానికి ఏదో అంతరార్థం పెట్టుకొని మనసు బాగుంటే మొత్తం బాగుంటుంది అని ఒక మాట అంటూంటారు ఈ మధ్య చాలా ఈ నేటి ప్రపంచంలో ఒక మాట మనసు బాగుంటే మొత్తం బాగుంటుంది అని భగవత్పాదులు కూడా ఈ మాట చెప్పారు కశ్యుచరిహ అని ప్రశ్న వేసి ఎవరు శుగా ఉంటారు అంటే యస్యమానసం శుద్ధం భగవత్పాదులు కూడా ఇదే మాట అన్నారు ఎవరు శుద్ధం నిజంగా శుద్ధమైన వాళ్ళు ఎవరు అని చెప్పంటే ఎవరి మనసు శుద్ధంగా ఉంటుందో వాళ్ళు అని చెప్పి అన్నారు అయితే ఈ కాలంలో ఈ మాట మన యొక్క పనుల్ని సరిగ్గా చేయడానికి ప్రత్యామనాయగా వాడుకునే మాట అయిపోయింది పద్ధతి ఇది కదా అని చెప్పంటే పద్ధతుల్లో ఏముందండి మనసు మంచిగా ఉంటే చాలు అనేది మనకి చాలామందికి ఒక సమాధానం అయిపోయింది ఈ మాట ఎప్పుడు చెల్లు అని చెప్పంటే మనం గుండెల మీద చెయ్యి వేసుకొని నాకు ఇంకా రాగద్వేషాలు అస్సలు లేవు అని మనం అనగలిగితే అప్పుడు మనం ఈ మాట అనుకోవచ్చేమో కానీ ఎవరికీ కూడా అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం ఇంద్రియాలని మనసుని నిగ్రహించాలంటే దానికి ఉండే ప్రధానమైన సాధనం ఏమిటంటే కర్మ మనసుని నిగ్రహించడం అనేది వెంటనే సాధ్యం కాదు మనం మన మనసులో ఏమన్నా కూడని ఆలోచన లేదా అక్కర్లేని సంకల్పాలు ఏమనా వచ్చాయి అంటే ఒకళ్ళు ఒకసారి కళ్ళు మూసుకొని మనసా రేపటి నిమిషట్లు ఆలోచించకు అని గట్టిగా నేనేసుకుంటే పక్క రోజు నుంచి ఆలోచనలు ఏమి మానవు అది దాని పాటికి అది పోతూ ఉంటుంది మన మాట అది అట్లా వినదు కాబట్టి మనసుని నియంత్రించాలంటే ముందు నియంత్రించాల్సింది ఏంటంటే ఇంద్రియాలని ఇంద్రియాలను నియంత్రించేది మనసుని నియంత్రించడం కోసమే అయితే నేరుగా మనసుని నియంత్రించడం అనేది ఎవరికీ కూడా సాధ్యం కాదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇంద్రియాలకి ఒక తీరు తినుని పెడతాం ఇంద్రియాలు ఇలా మాత్రమే ప్రవర్తించాలి దీని ప్రకారమే నడుచుకోవాలి దీన్ని మాత్రమే చూడాలి దీన్ని మాత్రమే చేయాలి అని మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల కాలక్రమంలో క్రమశిక్షణతో మన మనసు కూడా అది అలవాటు అవుతుంది అది ఇప్పుడు ఒక ఒక ఆహార పదార్థం మీద మన జిహ్వకి ఒక ప్రత్యేకమైన రుచి ఉంది దాన్ని ఆ పక్కరోజు నుంచి నువ్వు దీన్ని ఇష్టపడకు అని చెప్పంటే అది ఇష్టపడుతూనే ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇష్టపడకు అని చెప్పి అనడం వల్ల ఇంకా ఇష్టపడుతూ ఉంటుంది దాన్ని దీనికి వెనకటిక కథ కూడా ఉంది ఒక గురువుగారి శిష్యుడికి ఒక ధ్యానం ఏదో చేయమని చెప్పారంట ఆ శిష్యుడికి ఆ ధ్యానం కుదరలేదు అప్పుడు ఆ గురువుగారు ఏం చేశరంటే పర్వాలేదులే నీకు ఫలాని దేవుడి రూపాన్ని ఏదో ధ్యానించమన్నాను కదా దాన్ని ధ్యానించడం అవ్వలేదు పర్వాలేదులే నీకు ఇంకోటి చెప్తాను నువ్వు ఒక వస్తువుని ధ్యానించక్కర్లేదు నువ్వు ఏమైనా ఆలోచ ఆలోచించుకో కోతి గురించి మాత్రం ఆలోచించకు అని చెప్పి అన్నారు గురువుగారు వెళ్లేసి వచ్చారు ఒక గంట తర్వాత వచ్చారు ఏరాని ధ్యానం కుదిరిందంట ఏందో గురువుగారు కోతి కోతి తప్పిస్తే ఏమి గుర్తు రాలేదు కోతి మాత్రమే గుర్తొచ్చింది అని చెప్పి అన్నాడు మన మనసు యొక్క లక్ష్యం ఏందంటే ఏదైతే కాదు అని చెప్తామో దాని మీదకి ఇంకా బలంగా పోతుంటుంది కాబట్టి నేరుగా మనసుని నిగ్రహించడం అనేది చాలా దుస్సాధమైన పని కాబట్టి ఏం చేయాలంటే మనం ముందు ఇంద్రియాలను నిగ్రహించాలి మన మనసుకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాలిక ఇది ఇప్పుడు తినకూడదు అనేది నియమం స్నానం చేయకుండా ఆహారం ముట్టద్దు మంచి మనకు ఇష్టమైన ఆహారం ఉన్నా కూడా స్నానం చేయకుండా నేను తినను ఇదఒక నియమం ఏదో పితృ పక్షాలు ఉంటాయి ఆ రోజు నేను ఫలాని రోజు ఉపవాసం ఉంటాను అది నియమం మన పండగలుఏవి ఉంటాయి ఆ రోజు మొత్తం నైవేద్యం అయ్యేవరకు తినడం అనేది లేదు ఏకాదశిలో ఉపవాసం అంటే కకృతి పడి ఇంకేవో తినకూడదు ఉపవాసం అంటే నిజంగానే ఉపవాసం ఉండాలి ఇవన్నీ పెట్టేది ఎందుకంటే మనసుని నిగ్రహించలేము కాబట్టి ముందు ఇంద్రియాలను నిగ్రహిస్తే కాలక్రమంలో ఇంద్రియ నిగ్రహం అలవాటయినప్పుడు సహజంగా మనసు ఇంకా దానికి అలవాటు పడిపోతుంటుంది దీనికే భగవత్పాదులు ప్రబోధ సుధాకరంలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఒక పులిని పట్టేటప్పుడు మామూలుగా ఇదివరకైతే ఇప్పుడైతే ఇంకా పులులు ఎక్కడఉన్నాయో పట్టేది ఏముంది కానీ ఇది ఒకప్పుడు ఈ దేశంలో పులులు ఉన్నప్పుడు ఏమ ఉండేది అంటే ఆ పులిని పట్టడానికి ఒక గోతుని తవ్వేవారు లోతుగా ఒక గొయ్యిని తవ్వి దాని మీద ఆకులు అలమలు పరిచేవారు ఆ పులి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గోతులో పడిపోయేది దాన్ని ఎలా కట్టేవారంటే ఆ పులికి నిజానికి పైకి దూకే శక్తి బాగా ఉంటుంది ఒక 10 అడుగులు 15 అడుగులు గాలిలోకి దూకగలదు అది దాని యొక్క శక్తికి మించిన లోతులోకి గోతును కట్టేసరికి అది ఒక 10 సార్లు దూకుతుంది 20 సార్లు దూకుతుంది ఒక అరగంట ప్రయత్నిస్తుంది అది అయిపోయేసరికి దానికి ఓపిక అయిపోయి ఆ గొయ్య చివరిలోనే నిశ్చలంగా కూర్చుంటుంది భగవత్పాదులు చెప్పింది కూడా అదే మనం ఇంద్రియాలను ఏం చేయాలంటే మన ఇంద్రియాలనే గోడలుగా పెట్టాలి మన మనసు దాటలేని గోడలుగా చుట్టూరు ఇంద్రియాలను పెట్టామంటే మనసు దాన్ని దాటడానికి ప్రయత్నించి ప్రయత్నించి ప్రయత్నించి ఒక్కనాటికి అలిసిపోతుంది అలిసిపోయేసరికి ఇంద్రియాలని దాటుదాము అనే ప్రయత్నాన్ని అది మానుకుంటుంది అప్పుడు ఇంకా మనం చెప్పినట్టుది వింటుంది ఇదే విషయాన్ని అక్కడ భగవత్పాదులు ప్రబోధ సుధాకర్ అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి ఇంద్రియ నిగ్రహం ద్వారా మనోనిగ్రహం కూడా కుదిరినప్పుడు మనం అనుకున్నట్లు ఈ మూడో అంశం ఈ శరీరము కర్త మూడో అంశమే ఇంద్రియాలు కూడా మన యొక్క అధీనంలోకి వచ్చినట్టు అవుతాయి మూడోది ఏందంటే వివిధాశ్య ప్రథ చేష్టాః ఇక్కడ భగవత్పాదులు చేష్టాః అంటే ప్రాణశక్తి అని చెప్పి రాశారు ఏ పని చేయాలన్నా కూడా మనకి ప్రాణశక్తి అనేది ఒకటి శరీరంలో ఉండాలి ప్రాణశక్తి అంటే ఒట్టే గాలి మాత్రమే కాదు నేటి భాషలో చెప్పుకోవాలంటే ఒక రకంగా మెటాలిజం అని చెప్పి చెప్పుకోవచ్చు ఏ ప్రక్రియ ద్వారానైతే మనం తీసుకుండే అన్నపానాలు శక్తిగా మారుతాయో ఆ శక్తికి ప్రాణశక్తి అని చెప్పి శాస్త్రంలో పేరు కాబట్టి అటువంటి ప్రాణశక్తి అనేది కూడా మన శరీరంలో ఉండాలి దీన్నే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఓపిక అని చెప్పుకుంటాం మనం ఓపిక అని చెప్పి అంటుంటే పని చేసే ఓపిక చాలా కాలం వాడు బాగా ఓపికగా ఉంటాడు ఓపికగా పని చేస్తాడు అని ఓపిక అనేది ఏదైతే అంటుంటామో ఇంచుమించుగా అదే ఈ ప్రాణశక్తి అనేదానికి అర్థం అది కూడా ఉండాలి ఐదవది ఏమిటంటే దైవం అని చెప్పి పేరు పెట్టారు ఇక్కడ దైవం అంటే విధి ఇక్కడ భగవత్పాదులు రాసింది ఏమిటంటే ఇంద్రియాలని ప్రవర్తింపజేసే భగవత్ శక్తికి దైవము అని చెప్పి ఇక్కడ పేరు అని చెప్పి కాబట్టి ఈ ఐదు అంశాలని మనం సజావుగా చూసుకున్నట్లయితే మనం చేసే ఏ పని అయినా కూడా తప్పకుండా అది విజయవంతం అవుతుంది అని ఒక మాటని ఇక్కడ భగవంతుడు చెప్పి ఉన్నాడు అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా మనకి అప్పుడప్పుడు ఫలితం వస్తుంది ఫలితం రాదు ఇది కూడా ఒక విషయం ఉంది అలాగే మన ప్రయత్నాలకే రకరకాల పరిణామాలు వస్తుంటాయి వీటిలన్నిటిని కూడా మనం చూసుకోవడం పట్టి మనం ముందుకు ఎట్లా వెళ్ళాలో నిర్ణయించుకోవడం ఉంటుంది ముందు మనం మాట్లాడుకోవాల్సిన ఒక విషయం మన సమయం కూడా నిజానికి ఆలస్యం అవ్వడం వల్ల మనకు సమయం కూడా అంత ఎక్కువగా లేదు అయితే మనం ప్రధానమైన విషయాలను మాత్రమే వచ్చే గంటపావ గంటలు చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మనం చెప్పుకున్న ఐదు రకాల కర్మలో నిత్య నైమిత్తిక కామ్య కర్మలో ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది లేదు నిత్య కర్మలు తప్పకుండా చేసుకోవాలి నైమిత్యక కర్మలు సందర్భం వచ్చినప్పుడు చేసుకోవాలి కామ్య కర్మలు కావాలంటే చేసుకోవచ్చు మనక ఎక్కువ సందేహాలు వచ్చేది ఎక్కడంటే కామ్య ఈ ప్రాయశ్చిత్త కర్మల దగ్గర అలాగే నిషిద్ధ కర్మల దగ్గర నిషిద్ధ కర్మల దగ్గర కూడా నిజానికి ఎక్కువ సందేహం ఏమ లేదు అది చేయొద్దు అని చెప్పారు దాన్ని చేయకూడదు అంతకంటే అక్కడ పెద్ద మర్మం ఏమీ లేదు అయితే ప్రాయశ్చిత్వం దగ్గరే మనకు కొంత ఆలోచన వస్తూఉంటుంది ఎప్పుడు ప్రాయ మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారు చేసే పనికి ఫలితాన్ని అనుభవించాలి అని చెప్తారు అయితే ప్రాయశ్చిత్తం చేస్తే ఆ పాపం మనకు ఉండదు అని చెప్పి కూడా చెప్తారు ఈ రెండిటిలో ఏ మాట నిజం ఇప్పుడు ఒకవేళ ప్రాయశ్చిత్తం చేయడం వల్ల కర్మఫలం పోయినట్లయితే దాన్ని అనుభవించాల్సిన అవసరం లేనట్టేగా కావాల్సిన అన్ని పాపాలు చేసుకోవడం దాని తర్వాత కావాల్సినన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉండడం ఈ వ్యవస్థ అనేది సనాతన ధర్మానికి అభ్యపగతమేనా సమ్మతమేనా అని చెప్పంటే మన శాస్త్రాలు కూడా అట్లా చెప్పలేదు అకామతఃకృతే పాపే ప్రాయశచిత్తం నకామతః అని చెప్పి స్పష్టంగా శాస్త్రం చెప్పింది ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా మనం పాపాన్ని చేయలేదో అప్పుడే ప్రాయశ్చిత్తాన్ని మనం అనుష్టించడానికి వీలుఉంటుంది అని చెప్పి ఒక మాట ఉంది అకామతఃకతే పాపే ప్రాయశ్చిత్తం మనం కావాలని చెప్పి పాపంే చేయకుండా ఉన్నప్పుడే ప్రాయశ్చిత్తాన్ని చేసే అధికారం మనకు ఉంటుంది ఈ యొక్క శ్లోకార్థాన్ని వినంగానే మనకి ఇది ఇంతే కదా బాగనే ఉందని చెప్పి అనిపిస్తుంది అయితే తే ఈ శ్లోకానికి ఉత్తరార్థం చూసుకుంటే మళ్ళీ మనకు సందేహం వస్తుంది ఎత్తు ద్విగుణం బుద్ధిపూర్వకే అని చెప్పి వస్తుంది ఎత్తు అకామకృతే కింతకామకృతాత్ ఎత్తో ద్విగుణం బుద్ధిపూర్వకే బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే బుద్ధిపూర్వకంగా పాపాన్ని బుద్ధిపూర్వకంగా కాకుండా పాపాన్ని చేసినప్పుడు ఏ ప్రాయశ్చిత్తం అయితే ఉందో దానికి రెండింతలు ప్రాయశ్చిత్తం బుద్ధిపూర్వకంగా చేసినప్పుడు అని అక్కడ చెప్పింది ఇప్పుడు మళ్ళీ మనకు సందేహం వస్తుంది ఇప్పుడు ఏమన్నారు మనం బుద్ధిపూర్వకంగా చేయనప్పుడే ప్రాహశ్చిత్తం అని చెప్పి అన్నారు దాని వెంటనే వచ్చే పంక్తిలోనే బుద్ధిపూర్వకంగా చేసినట్లయితే రెండింతల ప్రాయశ్చిత్తం మామూలుగా లేకపోతే ఒకటే అని చెప్పి అన్నారు అంటే ఈ రెండు వాక్యాలు మనం ఆలోచించుకునేటప్పుడు మనకు వచ్చే నిర్ణయం ఏమిటంటే యద్యపి ప్రాయశ్చిత్తం అనేది బుద్ధిపూర్వకంగా చేయని వాటికే ఉద్దేశించి చెప్పారు అయితే ఏమిటంటే కొన్ని కొన్ని పాపాలు మనం బుద్ధిపూర్వకంగా చేసి తర్వాత ప్రాయశ్చిత్త పడతాం మనం తర్వాత మనకు పశ్చాత్తాపం కలుగుతుంది అట్లాంటప్పుడు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వాలి కదా ఒక అవకాశం ఉండాలి న్యాయంగా అయితే కాబట్టి ఎప్పుడైతే బుద్ధిపూర్వకంగా చేయలేదో ప్రాయశ్చిత్తం ముఖ్యంగా వాడి కోసమే చేసింది తెలియకుండా చేసిన తప్పుకే ప్రాయశ్చిత్తం ఉండేది అయితే తెలిసి తప్పు చేసిన వాడికి తర్వాత ప్రాయశ్చిత్తం కలిగితే అప్పుడు వాడికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి అట్లా అని చెప్పి మళ్ళీ కావాలని చెప్పి పాపం చేసి రెండింతల ప్రాయశ్చిత్తం చేసుకోవడం కూడా సమ్మతం కాదు ఎందుకంటే పశ్చాత్తాపం ఎలా ఎలా పడాలో అనేది కూడా అక్కడ రాశారు అత్రఏమన్నారంటే నైవ కుర్యాం పునరితి నివృత్య పూయతే నరః అని చెప్పి ఒక మాట చెప్పారు అక్కడ అక్కడ ఏం చెప్పారంటే పశ్చాత్తాపం వల్ల ఆ పాపం యొక్క దుష్ఫలితాల నుంచి నరుడు విముక్తుడు అవుతాడు నైవకుర్యం పునరితే నేను ఈ పాపాన్ని ఇంకా నేను మళ్ళీ చేయను అనే సంకల్పం వాడికి వచ్చినట్లయితే అప్పుడు వాడు శుద్ధుడు అవుతాడు ఇప్పుడు ఉన్న మలినం పోవడం వేరు వాడు మళ్ళీ శుద్ధం అవ్వడం వేరు దీనికి దీనికి తేడా ఏమిటి అని చెప్పంటే మనం ఏదో బయటికి వెళ్లి వస్తాం మనం అప్పుడు మలినంగా ఏమి ఉండం అయితే చేతులు కడుక్కుంటే మళ్ళీ మన చేతులు శుభ్రం చేసుకున్నామ అని చెప్పి అయితే అంటాం దీనికి వ్యతిరేకంగా మనం ఏదో మట్టిలో తిరిగేసి వచ్చి అప్పుడు ఇంట్లోకి వచ్చామ అంటే పర్వాలేదు నేను బానే ఉన్నాను అని చెప్పి అనడానికి లేదు మలినం ఉన్నట్టు లెక్క కాబట్టి మలినంగా ఉండడానికి ఆ మలినం మాలిన్యం పోవడానికి శుద్ధుడు అవ్వడానికి మూడు లెక్కలు ఉన్నాయి దానికి కాబట్టి ఎప్పుడైతే వాడు పశ్చాత్తాప పడ్డాడో నిజంగా పశ్చాత్తాప పడ్డాడో అప్పటికీ ఆ కర్మ దుష్ఫలితం యొక్క మాలిన్యము వాడి నుంచి తొలగినట్టు ఎప్పుడైతే ఇంకా ఎప్పటికీ దీన్ని మళ్ళీ చేయను అని చెప్పి నిశ్చయించుకున్నాడో అప్పుడు వాడికి ఆ శుభ్రత అనేది మనసులో శుద్ధత అనేది కలిగినట్టు అయితే ఇక్కడ కూడా మనం శుద్ధత అంటే ఏంటో మనం ఆలోచించుకోవాలి కర్మ యొక్క ఫలమైన దుఃఖం నుంచి విడిపోవడం కాదు ఇక్కడ చెప్పేది ఎందుకంటే పాపము అనే మాటకి చాలా అర్థాల్లో వాడతారు పాపము చేసినవాడు అనే అర్థంలో వాడతారు పాపమైన మైన పని అనే అర్థంలోన వాడతారు పాపం యొక్క ఫలితము అనే అర్థంలో కూడా పాప శబ్దాన్ని వాడతారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పాపాలు పోతాయి పాపాలు నాశనం అవుతాయి ఏదో భగవంతుని కీర్తిస్తే పాపాలు పోతాయి అనే మాటకు అర్థం ఏమిటంటే పాప వాసనలు పోతాయి పాప సంస్కారాలు పోతాయి అని చెప్పి దీనికి అర్థం ఎందుకంటే చేసిన కర్మ అనుభవించాల్సింది అనేది శాసనం అది మరి భగవంతుని స్మరించగానే పాపాలు పోతాయి అని చెప్పి అంటే పాప సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఆ పని పట్ల ప్రావణ్యం శాస్త్రంలో దాన్ని ప్రావణ్యము ప్రవణత అని చెప్పి అంటారు ఇప్పుడు మీరు చూడండి మామూలుగా భూమి మామూలుగా ఉంటే నీళ్ళు పోసినప్పుడు దానికి ప్రత్యేకమైన దిశ ఏమ ఉండదు అయితే నీళ్ళు పోస్తుండే కొద్ది ఆ నీరు ఒక దారి వెతుక్కుండేసరికి తర్వాత పోసిన నీళ్ళన్నీ అదే దారిలో పోతుంటాయి అదేవిధంగా మనసుకి నిజంగా మంచి చెడు అనేది ఏమి మనసుకు ఉండదు మనం చేసే అలవాట్ల బట్టి దానికిఒక దారి ఒకటి వస్తుంది అందుకనే అన్నారు శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనాసరిత పౌరుషేన ప్రయత్నేన యోజనీయ శుభేపతి అని చెప్పి అన్నారు శాస్త్రంలో మనసు అనే నది రెండు పాయలుగా ప్రవహించగలదు వాసన సరిత్ మన యొక్క సంస్కారలనే నది ద్వివిధా వాసనా సరిత అది రెండు విధాలుగా ప్రవహిస్తుంటుంది ఒకటిఏమంటే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం ఒకటి పుణ్య మార్గం ఇంకొకటి పాప మార్గం మన యొక్క పని ఏమిటంటే పౌరుషేన ప్రయత్నేన మన ప్రయత్న పూర్వకముగా యోజనీయ శుభేపతి మన మనసులో మంచి సంస్కారాలు మాత్రమే ఉండట్టు చేసుకోవడం అనేది మన యొక్క బాధ్యత ఎందుకంటే మనం మన కళ్ళ ఎదుట చాలా కనబడుతుంటాయి నాకు ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుం కుంటాం భద్రం పశ్యామ భద్యం షుణయామ అని చెప్పి మనం మంచే చూడాలి మంచే వినాలి మంచి అనుకోవాలి భద్రం పశ్యమ అక్షయతేరంగస్తు మనం ప్రార్థన వేదంలో ప్రార్థన చేసేది కూడా అదే భద్రం కరణేశయమ దేవాహ ఓ దేవతలారా మా చెవులతో మేము మంచే వినాలి భద్రం పశ్యేమ అక్షయత్రహ ఓ యజ్ఞాన్ని రక్షించే దేవతలారా మేము కళ్ళతో కూడా మంచి విషయాలే చూడాలనిది మనం కోరుకుండేది అయితే మనం చేసే ప్రతిది చూసే ప్రతిది లోపలికి తీసుకునే ప్రతి విషయం కూడా శుద్ధంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పలేము అట్లా అవ్వదు కూడా లోకం అనేసరికి మనక అన్నీ ఎదురుగా కనబడుతుంటాయి అయితే దాన్ని మనం కనబడే దాంట్లో మనకు వినబడే దాంట్లో ఏది మన మీద ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం మన చేతుల్లో ఉంది అది మన పూర్తి ప్రయత్నం మీదనే ఉంది కాబట్టి ఆ ప్రయత్నంతో మనకి మంచి సంస్కారాలు మాత్రమే అలవడడానికి ఈ కర్మల్లో ఎన్నో చెప్పారు అక్కడే మనకు పురాణాల్లో ఇది వింటే పాపం పోతుంది ఈ పని చేస్తే పాపం పోతుంది అన్నప్పుడు క్రమక్రమంగా భగవత్ స్మరణ చేయడం ద్వారా భగవత్ ఆరాధన చేయడం ద్వారా మానవ సేవ చేయడం ద్వారా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా ఏమవుతుంది అని చెప్పంటే మన మనసులో చెడు అలవాట్లు పోయి ఈ పని మీద దృష్టి పెట్టడం వల్ల చెడు అలవాట్లు పోయి వాటి స్థానాల్లో మంచి అలవాట్లు వస్తాయి అనేది ఈ పని చేస్తే పాపం పోతుంది అని చెప్పి లేకపోతే మనం పురాణాలు చూస్తే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది వాడు బ్రహ్మహత్య చేసి సురాపానం చేసి అన్ని కావాల్సిన పాపాలు అన్నీ చేసేసి ఒక్కసారి రామ అని చెప్పంటే అన్ని పోతాయి అని చెప్పంటే ఎలా నమ్ముతాను దాన్ని అది అసలు ఏమాత్రం యుక్తి యుక్తంగా ఉండదు అయితే రామ అనంగా రామనామానికి ఆ మహాత్మం ఉన్నది మనం ఏమి కాదనలేము దాన్ని ఎలా ఉన్నది అని చెప్పంటే వాడు నిజంగా రామ నామాన్ని మనసులో జపిస్తున్నాడు అంటే నిజంగా రాముణని ఆదర్శంగా పెట్టుకొని వాడు జీవిస్తున్నాడు అంటే ఒకనాటికి వాడి మనసులో ఏ దుష్టమైన ఆలోచనలు అయితే ఉన్నాయో వాటిన్నిటిని తొలిచి వాటి స్థానంలో కూర్చుండగలిగే శక్తి రామనామ జపానికి ఉంది నిజానికి జపానికి కూడా అదే ప్రయోజనం మన మనసు సాధారణంగా 10 ఆలోచనలు చేస్తుంటే నువ్వు 10 ఆలోచించకు ఒకటి ఆలోచించు అని చెప్పి మనకి మంత్రాన్ని పెట్టారు అందుకే మంత్రాన్ని చేసేటప్పుడు మననము అనేది ప్రధానం మననం అంటే ఏమిటి లోపల దాన్నే పదే పది అనుకోవడం కాబట్టి 10 రకాలుగా వెళ్లే మనసుని ఒకదాని మీద పెట్టడమే మననం అనేది కాబట్టి నామ సంకీర్తనం నామ జపం అనేదానికి ప్రయోజనం ఏమిటంటే ఇది ఆ మనసులో ఉండే దుష్టమైన సంకల్పాలకి ప్రత్యామనాయక దానికి బదులుగా దాన్ని కాదు దాన్ని ఆలోచించకుండా దీన్ని ఆలోచిం చించండి అని పెట్టడం వల్ల ఆ మనసులో పాప సంస్కారాలు పోవడమే భగవన్ నామాన్ని స్మరిస్తే పాపాలు పోతాయి అనే దానికి అర్థం మరి ఈ ప్రాయశ్చిత్తం చేయడం ఎందుకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయడం వల్ల మనకి నిజంగా కర్మఫలాలు పోవు అని చెప్పఅంటే మరి దానికి ప్రయోజనం ఏమిటి మామూలుగా మనసుని మార్చుకోవడం అంటే మనసుని మార్చుకోవచ్చు కదా అని చెప్పంటే అక్కడ కూడా ఒక అవకాశం ఉంది మనం తప్పకుండా కర్మఫలాన్ని అనుభవిస్తామ అనే మాటలో ఎటువంటి సందేహం లేదు అయితే ఎటువంటి పరిస్థితుల్లో అనుభవిస్తాము అనేదానికి కూడా ఒక తేడా ఉంది ఉదాహరణకి ఏమిటంటే మనకఒక 50 రూపాయలు 50 రూపాయలు నష్టపోవాలని చెప్పి ఒక ఒకటి ఉంది మన కర్మ ప్రకారం 50 రూపాయలు పోవాలి మన చేతిలో చిల్లిగవ్వగూడ లేనప్పుడు మనం 50 రూపాయ 50 రూపాయలు అప్పుడడం మంచిదా చేతిలో 100 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు అప్పు పోవడం మంచిదా అనేది ఆలోచిస్తే రెండు కూడా ఒకటే కర్మ ప్రకారం జరుగుతున్నాయి అయితే పరిస్థితుల పట్ల అది మనకు అనుకూలంగా ఉంటుందో ప్రతికూలంగా ఉంటుందో మనం నిర్ణయించుకోవచ్చు మనకి అందుకనే పురాణాల్లో కూడా మీరు చూడండి చాలా దగ్గరల ధార్మికులైన వ్యక్తులకు శాపాలు కూడా వరాలుగా మారుతూ ఉంటాయి మనకు బాగా కనబడుతూ చాలా దగ్గరలో మనకు కనబడుతూ ఉంటుంది అర్జునుడికి ఊర్వశ శాపం ఇచ్చినప్పుడు అది ఆయనకి అజ్ఞాతవాస కాలంలో బాగా ఉపకారంగా మారింది అదేరకంగా మనకి నల చరిత్రలో ఆ కర్కోటకుడు నలుడిని కాటు వేసినప్పుడు నలుడి యొక్క రూపం పోయి మరుగుజ రూపం వచ్చి చాలా బలహీనమైన రూపం వస్తుంది అది కూడా నలుడికి అజ్ఞాతవాసం చేయడానికి బాగా ఉపయోగపడింది కాబట్టి ఇట్లాంటి పురాణ కథల ద్వారా చెప్పేది ఏమిటంటే ధర్మాత్ములు అనే వాళ్ళకి ఈ రకమైన సత్కర్మలు చేసే వాళ్ళకి దుష్కర్మ యొక్క ఫలితాలు తప్పించుకోవడం కాదు గానీ వీటివల్ల ఆ దుష్కర్మల వల్ల వాళ్ళు శాశ్వతంగా కూరుకుపోకుండా వాళ్ళు సర్వతా వాళ్ళు నష్టం కాకుండా వాళ్ళని ఒక ధర్మం రక్షిస్తూఉంటుంది కాబట్టి మనం తప్పులు చేసి ఉంటాము వాటిల్ని సరిదిద్దుకోవడానికి మనం చేసే ప్రయత్నం చేసుకుంటూ ఉండంగా వాటి యొక్క ఫలితాల్ని అనుభవించేటప్పుడు మనం నిజంగా పశ్చాత్తాప పశ్చాత్తాపం పడినట్లయితే ఆ పాపం యొక్క పరిణామాల వల్ల మనం సర్వధా మనం కూలిపోకుండా మనం ఇంకా నిలబడేటట్టుగా ఈ ప్రాయశ్చిత్తాది కర్మలు మనల్ని రక్షిస్తుంటాయి అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ కర్మలను చేసేటప్పుడు ఈ కర్మల యొక్క ఫలితాలను కూడా మూడు రకాలుగా విడదీశారు ఒకటేమ స్పష్టంగా గీతలో చెప్పింది ఏమంటే అనిష్టం ఇష్టం మిశ్రంచ త్రివిధం కర్మణఫలం ఒకటి ఇష్టం మనకి ఇష్టమైన ప్రయోజనం లభిస్తుంది అంటే మనం ఒక పని చేసేటప్పుడు మనం ఏదో అనుకొని దాన్ని చేస్తాం మనకేదో మనకేదో ఇష్టం కాబట్టి మనం ఏదో కోరుకొని మనం ఏ పనిైనా చేసేది మనకి లభించేది ఏమీ లేదు అని చెప్పంటే మనం ఏ పని కూడా మొదలు పెట్టాం కాబట్టి ఏదో కోరి మనం మొదలు పెడతాం మనం అటువంటి పనిని మొదలు పెట్టినప్పుడు ఆ పని యొక్క పరిణామాలు మూడు రకాలుగా ఉండొచ్చు ఒకటి అనిష్టం మనం కోరుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితం కూడా రావచ్చు ఇష్టం మనం అనుకున్న దాన్ని కూడా మనం సాధించవచ్చు మిశ్రంచ మనం అనుకున్న దాన్ని మనం సాధించినా కూడా మనం కోరుకొని కొన్ని పరిణామాలు కూడా దాని బదులుగా రావచ్చు ఇదేం మనకేం కొత్తఏం కాదు జీవితంలో అనుభవాలు ఇవన్నీ మనకి ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూనే ఉంటుంది అయితే ఇక్కడ భగవంతుడు ఒక మంచి మాట చెప్పాడు భవంతి అత్యాగినాం ప్రయత్య నతు సన్యాసినాం కచచిత ఈ మూడు రకాల ఫలితాలు ఎవరికి వస్తాయి అని చెప్పంటే త్యాగం చేయడం నేరని వాళ్ళకి ఇవన్నీ వస్తాయి సన్యాసులకి ఇటువంటి ఫలితాలు రావు అని చెప్పి ఇక్కడ కూడా సన్యాసులు అంటే సన్యాస ఆశ్రమం అని చెప్పి కాదు ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఉద్దేశం భగవంతుడు ఇక్కడ సన్యాసులు అంటే ఎవరైతే కర్మఫలం మీద ఆసక్తి పెట్టుకొని ఉంటారో నాకు ఇది ఇష్టం కాబట్టి ఇది చేస్తున్నాను ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకే ఇష్టము అనిష్టము రెండు అనే ఫలితం ఉంటుంది తప్ప ఇది నాకు ఇష్టం కాబట్టి నేను పని చేస్తున్నా అని చెప్పి ఎవరైతే చేయరో నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నా అని చెప్పి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫలితం ఇష్టమని ఉండదు అనిష్టమని ఉండదు రెండు మిశ్రమని ఉండదు మన చాలా స్పష్టమైన తర్కం ఇది మనం ఫలానిది ఇష్టం అనుకొని చేసామఅంటే అది ఇష్టమైన ఫలితం రావచ్చు అనిష్టమైన ఫలితం రావచ్చు రెండు రావచ్చు నాకు ఒకటి ఇష్టం కాబట్టి నేను పని చేయట్లేదు నేను పని చేయాలి నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను దానికి ఫలితం తో నాకు సంబంధం లేదు నేను చేయాలి కాబట్టి నా పని నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నామో ఇంకా ఆ ఫలితం మనకి ఇష్టమనో అనిష్టమనమనో మిశ్రమనో ఏది ఉండదు అప్పుడు చాలా స్పష్టమైన తర్కం ఇది అందుకనే భగవంతుడు అంటాడు కార్యమిత్యేవయత్కర్మనియతం క్రియతేర్జున ఈ పని చేయాల్సి ఉంది కాబట్టి దీన్ని చేస్తున్నాను అది ఉత్తమమైన కార్యము అని చెప్పి భగవంతుడు అన్నాడు అలాగే మన కర్మఫలాల్ని ఇంకో రకంగా మూడు విధాలుగా తీశారు ఇది కూడా మీరు వినిఉంటారు ప్రాయశ్చిత్తము ప్రారబ్ధము సంచితము ఆగామి అని మీరు ఈ మాటలు కూడా వినిఉంటారు ఇది కర్మ ఫలాలని ఇప్పుడు ఇప్పుడు మనం విడదీసిన మూడు విధానాలు కర్మకి మనకి ఉండే సంబంధాన్ని బట్టి అది మనకు కావాలా వద్దా అనేదాన్ని బట్టి మనం మూడు విధాలుగా విడదీసాం ఈ ప్రారబ్ధము సంచితము ఆగామి అనేది ఈ కర్మ ఎప్పుడు ప్రభావాన్ని చూపిస్తుంది అనే దాన్ని బట్టి చేసిన విధానం ప్రారబ్ధం వీటి పేర్లు చూసుకుంటేనే వీటి యొక్క స్వభావాలు స్పష్టంగా అర్థమైపోతుంటాయి సంచితము అంటే కూడబెట్టుకున్నది అని చెప్పి అర్థం మన జన్మ జన్మలుగా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాము వాటి యొక్క ఫలితాలని అనుభవించాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా రాసి పోసినట్లయితే అది సంచిత కర్మ అని చెప్పి తరువాత ప్రారబ్ధం ప్రారబ్ధం అంటే ప్రారబ్ధం దాని పని అది చేయడం మొదలు పెట్టేసింది ఆ కర్మ ఏదైతే మనకి ఫలాన్ని ఇవ్వాలో సంచితం రాశిగా పోసి ఉంది అయితే ప్రారబ్ధం ఏందంటే దాని ఫలితాన్ని అది జనింప చేయడంలో అది మొదలు అయిపోయింది కాబట్టే ప్రారబ్ధం మనం తప్పించలేము అని చెప్పి అంటూంటాం ఎలాగ దానికి ఇంకో ఉదాహరణ కూడా చెప్దాం మనం మూడవది ఆగామి అది ఇంకా రానేలేదు ఆ ఆ కర్మ యొక్క ఫలితము ఇంకా రానేలేదు కాబట్టి ఈ మూడు రకాలుగా మనం ఈ కర్మల్ని విడదీసాం దీంట్లో కూడా ప్రారబ్ధం ఏమిటంటే ఒక శరీరాన్ని చాలించాక మనకు ఉండే సంచితం యొక్క రాశి పుణ్య పాపాల యొక్క రాశి నుంచి కొంత భాగాన్ని ఈ శరీరం కోసం తీసిపెట్టుకుంటారు తీసిపెట్టుకుంటాం అంటే ఈశ్వరుడు నిర్ణయిస్తాడు ఏ పాప పుణ్యాలనైతే ఈ శరీరంతో అనుభవించాల్సి ఉందో వాటిని ప్రారబ్ధ కర్మలు అని చెప్పి అంటారు కాబట్టి ఆ ప్రారబ్ధ కర్మలు ఈ శరీరానికి నిర్దేశింపబడిన పుణ్య పాపాలు ఏవి ఏవైతే ఉన్నాయో ఇవి తరిగిపోకుండా ఈ శరీరం రాలిపోదు ఒకవేళ ఆ పాప పుణ్యాల యొక్క అనుభవం అయిపోయిందంటే దానికి మించి ఒక్క క్షణం కూడా ఈ శరీరం ఉండదు ఈ శరీరం ఏదైనా అనుభవించాలన్నా కూడా దానికి ప్రారబ్ధ కర్మ అనేదే దాని యొక్క ఆసర కాబట్టి మనం జీవితంలో జరిగేవన్నీ కూడా మన ప్రారబ్ధం పట్టి జరుగుతూ ఉంటాయి అందుకనే మనకి విధి అనేది ఒకటి ఉంది దీంట్లో మనం పుట్టేసరికి ఐదు నిశ్చయం పడతాయి అని చెప్పి అంటారు ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచయతాని సజ్యంతే గర్భస్తస్యవదేహినః మనం గర్భంలోనే ఉండగా అంటే మనం ప్రారబ్ధ కర్మతో శరీరాన్ని తీసుకోవడానికి సిద్ధపడిపోయినప్పుడే ఐదు సామాన్యంగా నిర్ణయించబడి ఉంటాయి ఆయుహు వీడు ఎన్నేళ్ళు బతుకుతాడు కర్మచ చ వీడు ఎటువంటి పనులు చేస్తూఉంటాడో విత్తంచ వీడు ఐశ్వర్యవంతుడు అవుతాడా కాదా విద్య వీడు విద్యావంతుడు అవుతాడా కాదా నిధనం వీడు ఎప్పుడు చనిపోతాడు ఈ ఐదు విజయ ఈ ఐదు విషయాలు పంచతాని శ్రజ్యంతే గర్భస్తేవదేహినః వీడు గర్భంలో ఉండంగానే అంటే శరీరాన్ని గ్రహించిన విను వెంటనే ఈ ఐదు నిశ్చయం అయిపోతాయి అయితే అవి మార్చలేమ అని చెప్పంటే మార్చగలం ఈ ఐదు సామాన్యమైన నిశ్చయాలు దీర్ఘాయుష్యుతో అంటాడో లేదా అల్పాయుషుతో అంటాడో బాగాచ చదువుకుంటాడో లేదా అంత పెద్దగా చదువు రాదు ఇట్లాంటి నిశ్చయాలు తప్ప వాడు ఎంటెక్ పాస్ అవుతాడా లేదా వాడు ఎంపిసి చేస్తాడా బైపిసి చేస్తాడా ఇటువంటి నిశ్చయాలు వాడు గర్భంలోనే ఉండగా చేయరు అంటే ఎటువంటి విశేషమైన నిశ్చయాలు కాకుండా సామాన్యంగా ఇటువంటి నిశ్చయాలు గర్భంలోనే ఉండగా జరుగుతూ ఉంటాయి అని అయితే మరి ఇంకోటి వస్తుంది మరి ప్రారబ్ధం అనేటువంటిది నిశ్చయించినప్పుడు మరి ఈ ప్రాయశ్చిత్తాలు మనం ఎప్పుడే అనుకున్నాం ఈ ప్రాయశ్చిత్తం అనేది మన యొక్క ఫలితాలని కొంత తగ్గించడమో లేదా అనుకూలంగా మార్చడమో లేదా అనుకూలమైన సమయంలో తెప్పించడమో చేయగలదు అని దీని ప్రకారం అయితే కొన్ని కొన్ని విషయాలు ప్రారబ్ధం ప్రకారమే నిశ్చయించుకుపోయాయి ప్రారబ్ధంలో లేనిదే అనేది మనం అనుభవించము ప్రారబ్ధంలో ఉన్నదాన్ని అనుభవించక తప్పదు మరి మన జీవితంలో మనకి జరిగేదాన్ని మార్చుకోగలమా లేదా అనే సందేహం వస్తుంది ఇప్పుడు ప్రారబ్ధం ద్వారా మనకి జరిగేదంతా నిశ్చయించ నిశ్చయం అయిపోయింది అని చెప్పంటే మరి మనం ప్రయత్నం చేయాలా వద్దా అనే దగ్గర తప్పకుండా ప్రయత్నం చేసి తీరాలి ఎందుకంటే ప్రారబ్ధం ఉన్నప్పటికీ ప్రారబ్ధానికి ఇంకొన్ని కర్మలని చేర్చే అవకాశం ఉన్నది అయితే అది ఎటువంటి ప్రయత్నం ఉండాలిఅంటే బాగా తీవ్రమైన ప్రయత్నం ఉండాలి అందుకని అక్కడ కూడా శాస్త్రాన్ని చెప్పారు ఏమిటంటే తిబిర్ వర్షైహి త్రిభిర్మాసైహి త్రిభిర్ పక్షిభిర్దినహి అత్యుత్కటే పుణ్యపాపైహి ఇహవ ఫలమషనుతే అని అత్యుత్కటమైన పుణ్య పాపాలు చేస్తే దాని యొక్క ఫలితాన్ని వాడు ఈ జన్మలోనే అనుభవిస్తాడు అది మూడు ఏళ్లకు కావచ్చు మూడు నెలలకు కావచ్చు మూడు పక్షాలకు కావచ్చు మూడు రోజులకు కావచ్చు కానీ బాగా తీవ్రంగా పుణ్యపా పాపాలను చేసినట్లయితే వాటి యొక్క ఫలితాలు వాడి ప్రారబ్ధంలోనే జతకూడుతాయి కాబట్టి మనకి ఏవైతే వ్రతాలు పూజలు ఫలాన దానికి ఫలానే ప్రయోజనం అని ఏవైతే చెప్పారో అవన్నీ ఇటువంటి కర్మలే ఎటువంటి ఇప్పుడు అవి మన దృష్టికి తెలివు లౌకిక దృష్టికి తెలియవు కానీ అలౌకికమైన దృష్టి కలిగిన శాస్త్రకారులకి మాత్రం ఏ కర్మని ఎలా చేస్తే దాని యొక్క తీవ్రత మన యొక్క ప్రస్తుత జన్మలో ప్రారబ్ధంలో జత కలవడానికి వీలవుతుంది అనేదాన్ని తెలిసి తదనుసారంగా మనకి ఆయా ఫలితాల కోసం ఆయా కర్మాచరణలని చెప్పారు ఉదాహరణకి ఇప్పుడు పుత్రకామేష్టి అనేది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు పుడతారో లేదో అనేది దానికి ప్రారబ్ధంలో ఒక లెక్క ఉంటుంది అయితే ఎవరైతే ఎటువంటి లోపం లేకుండా ఆ కర్మని చక్కగా చేస్తారో వాళ్ళకి పిల్లాడు పుట్టే అవకాశము అనే ఈ పుణ్య పాపాల యొక్క సమూహం అనేది వాళ్ళ యొక్క ఆ ప్రారబ్ధంలోకి చేరి తద్వారా వాడికి ఈ జన్మలోనే సంతానాది ఉపయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రారబ్ధం జన్మతః మనతో వచ్చినప్పటికీ ఆ ప్రారబ్దంలో మార్పులు చేర్పులు అనేవి సాధ్యం అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ ప్రారబ్ధం అనేది మనకి జరిగే దాన్ని నిర్ణయిస్తుంది తప్ప మనం చేసేదాన్ని నిర్ణయించదు ఇక్కడ కూడా చాలా మందికి ఇప్పుడు ఈ ప్రారబ్ధం ఉంది కాబట్టి ఇప్పుడు స్వతంత్రత అనేది ఉందా లేదా ఇంగ్లీష్ లో ఫ్రీ విల్ అని చెప్పి అంటాం అది ఉందా లేదా అనే ఒక సందేహం ఉంటుంది నిజానికి ఈ రెండిటికి అసలు విరోధమే లేదు ఎందుకంటే ప్రారబ్ధం ఏం నిర్ణయిస్తుంది మనకి ఎటువంటి అనుభవాలు వస్తాయి అనేది ప్రారబ్ధం నిర్ణయించేది పుణ్యం ఉంటే సుఖం వస్తుంది పాపం ఉంటే దుఃఖం వస్తుంది అని నిర్ణయిస్తుంది తప్ప నువ్వు ఇప్పుడు ఏమి చేస్తావు అనేది ఇది నిర్ణయించదు కాబట్టి నీ ప్రవర్తన నీ చేతుల్లోనే ఉంది మనం ఏదైతే చేయాలనుకున్నామో అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది కర్మ వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది అనే పరిస్థితి ఎక్కడ కూడా లేదు కర్మ వల్ల నేను దీన్ని అనుభవించాల్సి వచ్చింది అనే మాట ఉంటుంది తప్ప కర్మ వల్ల నా కర్మ ఫలితం వల్ల ఈ పని చేశాను అనే పరిస్థితి మాత్రం ఎన్నటికీ ఉండదు కాబట్టి ఇటువంటి యొక్క స్వతంత్రత అనేది జీవుడికి ఉన్నది కాబట్టే వాడు కర్మఫలాలు అనుభవిస్తున్నాడు ఇక్కడ కూడా మనం ఇంకో విషయం అనుకోవాలి ఇప్పుడు మన శాస్త్రంలో జీవుడు అనేవాడు నిస్సంగుడు ఆత్మ పనులు చేసేదంతా ఏమిటి శరీరము ఇంద్రియాలు మనసు శరీరేంద్రియాలు చేసిన పనులకి జీవుడు ఎందుకు ఫలితాన్ని అనుభవించాలి చాలా మందికి ఇది కూడా ఒకటి అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మంచి చేస్తే సుఖాన్ని అనుభవించడం చెడు చేస్తే దుఃఖాన్ని అనుభవించడం అనేది చాలా న్యాయమైన ఒప్పందం మంచి చేస్తే మంచి రావడం చెడు చేస్తే చెడు రావడది చాలా న్యాయంగా ఉంది అయితే నేను పూర్వ జన్మలో చేసిన తప్పుకి ఇప్పుడు ఎందుకు అనుభవించాలి ఇది న్యాయంగా ఉందా పూర్వజన్మలో నేను చాలా దుష్టుడిని అయి ఉండొచ్చు దానికి ఫలితాన్ని ఈ జన్మలో నేను మంచివాడిగా ఉన్నప్పుడు ఎందుకు అనుభవించాలి ఇది న్యాయమైన ఒప్పందమేనా అనేది కూడా చాలా మందికి వచ్చే సందేహం ఇక్కడ కూడా దీనికి సందేహం మనకి సమాధానం ఎక్కడ వస్తుంది అంటే అసలు మనం కర్మ ఫలితాలను ఎందుకు అనుభవిస్తున్నామో తెలిస్తే ఆ ముందు వెనుకలు మనకి స్పష్టంగా అర్థం అవుతాయి జీవుడు నిజానికి ఆత్మ స్వరూపుడే శరీరేంద్రియాల కంటే వ్యతిరేకంగా ఉన్నప్పటికీ శరీరేంద్రియాలు చేసిన పనులుకి తప్పకుండా ఫలితాన్ని అనుభవిస్తాడు ఎందుకు అని చెప్పంటే అక్కడే అభిమానము అనేది ఒక మాట మనకి శాస్త్రాల్లో వాడుతుంటారు మనం పని చేసేటప్పుడు నా శరీరం పని చేస్తోంది నా మనసు చేస్తోంది నా ఇంద్రియాలు పని చేస్తున్నాయి అని చెప్పి ఎవడు అనుకోవడం లేదు నేనే చేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి శాస్త్రంలో నియమం ఏమిటంటే కర్తృత్వం ఎక్కడఉందో భోక్తృత్వం అక్కడే ఉండాలి అనేది శాస్త్రంలో నియమం కర్తృత్వ భోక్తృత్వాలకి ఐకాధికారణ్య ఉండాలి అని శాస్త్రీయన పరిభాషలో చెప్పేది లౌకికమైన భాషలో చెప్పుకోవాలంటే ఇది నేను చేస్తున్నాను అని ఎవరైతే నిర్ణయించుకున్నారో వాడే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి ఇప్పుడు నిర్ణయించుకున్నది ఎవరు అనే ప్రశ్న వేసినప్పుడు మనసు నిర్ణయించుకున్నది జీవుడు తన మనసుతో నిర్ణయించుకున్నాడు ఈ మనసు అనేది జన్మాంతరంలోకి వస్తున్నది శరీరాన్ని స్థూల శరీరాన్ని మనం వదిలేసినా కూడా మనసు ఇంద్రియాలు ప్రాణాలు అనేవి శరీరాన్ని నుంచి శరీరానికి వస్తూ ఉంటాయి కాబట్టి ఏ జీవుడైతే మనసుతో కూడి ఒక జన్మలో సంకల్పం చేశాడో అదే జీవుడు ఆ మనసుతో పాటు దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే ఇంకా లోతుగా మనం చూసామంటే మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అనుభవించేది శరీరం కాదు ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనుభవం అనేది శరీరం జడమైనది దానికి అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది శరీరానికి అనుభవం ఉంటే శవానికి కూడా అనుభవం అనేది ఉండాలి కాబట్టి ఏదైనా కూడా అనుభవించేది మనసు సుఖము వేసినా అది మనసు అనుభవిస్తుంది దుఃఖం వచ్చినా కూడా మనసే అనుభవిస్తుంది కాబట్టి పూర్వ జన్మలోనూ ఈ జన్మలోనూ వచ్చే జన్మలోనూ శరీరం మారింది తప్ప మనసు మారలేదు కాబట్టి ఏ మనసైతే పుణ్య కార్యాన్ని సంకల్పించిందో అదే మనసు పుణ్యం యొక్క ఫలితమైన సుఖాన్ని అనుభవిస్తుంది ఏ మనసయతే పాప కార్యాన్ని తలపెట్టిందో అదే మనసు పాప కార్యం యొక్క ఫలితాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఒకడు పని చేస్తే ఇంకొకడు అనుభవించాడు అనేదానికి ఇక్కడ ఆస్కారం లేదు శరీరం మారితే మారొచ్చు కానీ సుఖ దుఃఖాల యొక్క అనుభవం ఎక్కడైతే వస్తుందో అది మాత్రం ఎక్కడ కూడా మారట్లేదు అందుకనే మనకి బౌద్ధులకి కొంత తేడా వచ్చింది ఈ బౌద్ధుల్లో నాలుగు రకాల్లో ఒకళ్ళు క్షణిక విజ్ఞానవాదులు అని చెప్పి ఉంటారు వాళ్ళ సిద్ధాంతంలో ఏమిటంటే ఈ జీవుడి యొక్క స్వరూపం క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది అని అంటే ఇదివరకు క్షణంలో ఉండే జీవుడు పై క్షణంలో ఉండడు అని ఎందుకంటే వాళ్ళు దానికి చెప్పే యుక్తి ఏమిటంటే ఇదివరకటి క్షణంలో ఉండే మన పరిస్థితి వచ్చే క్షణంలో లేదు కదా మనసే కదా జీవుడి యొక్క ముఖ్యమైన స్వరూపం కాబట్టి మనసు మారిపోయింది అంటే జీవుడు కూడా మారిపోయాడు అనేది వాళ్ళు వాళ్ళు క్షణిక విజ్ఞానంలో పెట్టుకున్నది దాన్ని కాదంటూనే మన వాళ్ళు ఈ మాట చెప్పారు ఏమిటంటే ఒకవేళ నిజంగా ఇది అయ్యి ఉంటే ఒకవేళ నిజంగా జీవుడు క్షణక్షణానికి మారిపోయ మారిపోతున్నట్లయితే అప్పుడు ఈ కర్మ వ్యవస్థ అంతా దెబ్బ తింటూ ఉండేది ఎందుకంటే పక్క జన్మ మాట పక్కన పెడితే నేను దేనికోసమో పూజ చేస్తే ఆ ఫలితం నాకు రాకుండా పోతుంది ఎందుకంటే నేను పూజ చేసింది ఫలాని క్షణంలో కొన్ని ఏళ్ల తర్వాత నాకు దాని ఫలితం వస్తుంది లేదా కొద్ది రోజుల్లో దాని ఫలితం వచ్చినా కూడా జీవుడు క్షణంలో మారిపోయేటట్టయితే పూజ చేసింది ఒకటి ఫలితం వచ్చింది ఒకడికి కాబట్టి ఒకవేళ ఇట్లా అనుకుంటే వ్యవస్థ పూర్తిగా తారుమారు అయిపోతుంది అస్తవ్యస్తం అయిపోతుంది ఇంకోటి కూడా అది యుక్తి యుక్తం కాదు ఎందుకంటే ఒకవేళ జీవుడు నిజంగా మారిపోతున్నట్లయితే స్మరణ అనేది కుదరదు నేను దీన్ని ఇదివరకు చేశాను అనే జ్ఞాపకం అనేది కుదరదు నేను ఇదివరకు ఒక పని చేశాను అనే మాట అనాలంటే ఆ పని చేసినప్పుడు ఇప్పుడు కూడా మారకుండా ఒక వ్యక్తి రెండిటికీ సాక్షిగా ఉండిఉండాలి ఎవరైతే ఒక 10 రోజుల క్రితం పనిని చూశారో వాళ్లే ఈరోజు నేను దాన్ని చూశను అని పనగలుగుతారు కాబట్టి ఇటువంటి జ్ఞాన మనకు వస్తున్నాయి కాబట్టి నిత్యంగా అన్ని కర్మలకి సాక్షి అయినవాడు ఒకడు లోపల ఉన్నాడు వాడు మనసు కంటే వ్యతిరిక్తంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనవాళ్ళు చెప్పారు కాబట్టి ఈ సాక్షి సాక్షి అయిన జీవుడు మనసుతో కూడి ఏ నిర్ణయాలయతే తీసుకుంటాడో ఆ నిర్ణయాల యొక్క ఫలితాలని వాడు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది మనసే అనుభవిస్తుంది శరీరం కాదు అనుభవించేది శరీరం ఎప్పుడు కూడా భోగ ఆయతనము అని చెప్పి అన్నారు లేదా భోగ సాధనము అని చెప్పి అన్నారు సుఖ దుఃఖ దుఖలు రావడానికి శరీరం ఒక్క దారే తప్ప సుఖ దుఃఖాలు వచ్చేది శరీరానికి కాదు వచ్చేది మనసుకే కాబట్టి మనం ఏ జన్మలో ఏది చేసినా కూడా అది ప్రారబ్ధ రూపంలో తప్పకుండా మనం అనుభవిస్తాము అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు అయితే ఈ కర్మలన్నీ ఈ రకంగా ఉన్నాయి కర్మలని పోగొట్టుకోవడం ఎలాగ అనేది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే కర్మలు చేస్తూ వెళ్లొచ్చు మనం అనుకున్నట్లుగా మొదట్లో అనుకున్నట్లుగా ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు కర్మ చేసినప్పుడు పుణ్యమో పాపమో తప్పదు అయితే మనకి శాస్త్రంలో నైష్కర్మ్యము అని చెప్పి ఒక మాట ఉంది కర్మ నుండి పూర్తి విడుదల పొందుట కర్మ బంధముల నుండి పూర్తిగా విముక్తిని పొందుట అని మరి ఈ స్థితి కూడా శాస్త్రాల్లో వర్ణించి ఉన్నారు కదా కాబట్టి మనం పని చేయక తప్పదు పని చేయక తప్పదు ఆ పని వల్ల పాప పుణ్యాల యొక్క అనుభవం అనివార్యము అయితే వీటిల్ని అతిక్రమించే విధానం ఒకటి ఉంది ఇది ఎలాగ అని ఒక సందేహం వస్తుంది మనకి ఆ కర్మని క్షయం చేసుకోవడానికి మూడు రకాల మార్గాలు మనకి శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు మొదటిది ఏమిటంటే సామాన్యంగా అందరికీ ఏదంటే అనుభవం అనుభవం చేస్తే ఏ కర్మైనా అది పుణ్యమైనా పాపమైనా అనుభవిస్తే అది అక్కడికి అయిపోతుంది రెండవది ఏం చెప్పారంటే ప్రాయశ్చిత్తాలు మనం అనుకున్నట్లుగా ఈ పాప కర్మలని అడ్డుకోవడానికి ప్రాయశ్చిత్తాలు కొంతవరకు ఉపయోగపడతాయి ఎటువంటి కర్మలు ఈ ప్రాయశ్చిత్తాలు అని చెప్పంటే అక్కడ గౌతమ సూత్రాలు చెప్పారు తస్య నిష్క్రయణాని జపః తపః హోమః ఉపవాసః అని చెప్పి చెప్పారు అక్కడ జపము తపము హోమము ఉపవాసము ముఖ్యంగా ఈ నాలుగు అయిన ప్రాయశ్చిత్తాలని చెప్పారు వీటిల్లో కూడా ఉపవాసం అనేది చాలా ప్రధానం ైన ప్రాయశ్చిత్తం చాంద్రాయణాది వ్రతాలు ప్రాయశ్చిత్తాలు గాన శాస్త్రాలు ఉపదేశించా అన్నారు ఉపవాసానికి ప్రాయశ్చిత్తానికి ఏమిటి సంబంధం అని చెప్పి అనుకుంటే మనం అనుకున్నట్లుగా అసలు ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి ప్రాయః పాపమితి ప్రోక్తం చిత్తంతస్య విశోధనం అని చెప్పి అక్కడ నిర్వచనం చెప్పారు ప్రాయము అంటే ఈ సందర్భంలో ప్రాయమ అనే మాటకి మనస్సు అని చెప్పి అర్థం చిత్తము అనే మాటకి ఈ సందర్భంలో శోధించడం దాన్ని శుభ్రపరచడం అని చెప్పి అర్థం కాబట్టి మనసుని శుభ్రపరిచే ప్రక్రియ ప్రాయశ్చిత్తము దీంట్లో చాలా ముఖ్యమైనది ఉపవాసము అనే చెప్పారు ఎందుకు అని చెప్పంటే ఇక్కడ విద్యార్ల వారు వేదభాషణలో ఒక మాట రాశారు ఇంద్రియాలకి ఎప్పుడైతే అన్నం యొక్క శక్తి అందుతుందో అప్పుడు అవి బాగా బలంగా బయటికి ప్రవర్తిద్దాం అని చెప్పి బయలుదేరుతాయి ఎప్పుడైతే వాటికి అన్నం అందదో వాటికి బయటికి వెళ్లే అంత ఓపిక ఉండకుండా పోతుంది ఇది మనందరికీ అనుభవంలో ఉండేది మనం తినకపోతే మనం తెలుగులో కొన్ని నుడికారాలు ఉంటాయి అవి చాలా అందంగా ఉంటాయి లోపల నుంచి లాగేస్తుంది అని చెప్పి అంటాం ఈ మాట మీరందరూ వినిఉంటారు చాలాసేపు మనం నిద్రపోకుండా తినకుండా ఉన్నామ అంటే నాకేదో లోపల నుంచి లాగేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటాం నిజానికి చాలా మంచి నుడికారం అది చాలా మంచి వాచోయుక్తి అది లోపల నుంచి లాగేస్తుంది అనే దానికి అర్థం ఏమిటంటే ఈ ఇంద్రియానికి దానికి ఇష్టమైన చోటు పోవడానికి కావాల్సినంత ఓపిక లేదు అని చెప్పి దానికి అర్థం మనం ఏదైతే చేయాలనుకున్నామో అది చేసేటంత ఓపిక లేదు దీనికి కారణం ఏంటంటే తినకపోవడం వల్లనే కాబట్టి ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇంద్రియాలని పోషించకపోవడం వల్ల వాటి యొక్క ప్రకోపాలను మనం అదుపులో పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు మీరు చూడండి మావటి వాళ్ళు ఏనుగుల్ని అవి వన్యగజాలని అడవి ఏనుగులని వాళ్ళకి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ముందు దానికి చేసేది ఏమంటే దానికి ఆహారాన్ని మాచేస్తారు ఎందుకంటే ఏనుక్కి అది రోజుక ఒక 20 గంటలు తింటే తప్ప దానికి నడవదు దాని యొక్క శరీరానికి ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాని యొక్క మదాన్ని వాడు విరచాలని చెప్పి అంటే ముందు మాటి వాడు ఏం చేస్తాడు అంటే దానికి అన్నం పెట్టడం మానేస్తాడు ఎప్పుడైతే దానికి ఆ ఓపిక అయిపోయిందో అది ఆ మదంలో హటాత్తుగా తొండం విసరడమో లేదా కాళ్ళతో తొక్కడమో అటువంటి హటాత్ పరిణామాలకి దారిలు ఇవ్వకుండా అయిపోతుంది అప్పుడు ఎప్పుడైతే దానికి కొంత నీరసంగా వచ్చిందో అప్పుడు అది వాడు తప్పకుండా వాడు అంకుశం పెట్టి పొడవంగానే వాడు చెప్పిన మాటని అది వింటుంది అదేవిధంగా ఈ ఇంద్రియాలకు కూడా మనం ఉపవాసం ద్వారా ఏం చేస్తామ అంటే దానికి ఇంకా పుష్టిని శక్తిని అందివ్వకుండా వాటి యొక్క శక్తిని మనం కొద్దిగా తగ్గించినట్లు అవుతుంది తగ్గించేసరికి ఏమవుతుంది అంటే అది హఠాత్ నిర్ణయాలు తీసుకోవడానికి ఉండకుండా ఉంటుంది మనకి వెంటనే కోపం రాంగానే ఏదో అనే ఏదో చూడంగానే ఏదో చేసేయడం ఇటువంటి ఆ తాత్కాలికమైన స్పందనలు క్షణికమైన స్పందనలు అనేవి మనం నియంత్రించినట్టు అవుతుంది అటువంటి నియంత్రించిన స్థితిలో ఆ ఇంద్రియాలు బలహీన పడిన స్థితిలో వాటిల్ని సరిైన దారిలో పెట్టుకోవడానికి కావాల్సిన సమయం మనకు దొరుకుతుంది ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా బాగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసమే పని చేస్తున్నారు అంటే వాడిని దానినుంచి పక్కకు తప్పించడం చాలా కష్టం ఎప్పుడైతే వాడు ఒక పనిని మానేసి దాని వెనకాల పెట్టి ఇంకో పని చేస్తున్నాడో వాడిని ఆ పనిలోనే కానిచ్చేసి రెండో పనికి వెళ్ళకుండా చేయడం అనేదే తేలిక ఒక పనిలో ఒక వ్యక్తిని పెట్టినప్పుడు ఆ పనిని మానిపించడమే కష్టం కానీ వాడికి ఇంకో పనిని ఇచ్చేసరికి వాడు మొదటి పనిని అప్రయత్నంగా మానుతాడు అదేవిధంగా ఇంద్రియాలు కి వాటి పని నుండి దారి తప్పించడానికి వాటి యొక్క బలాన్ని హరించి మనకు కావాల్సిన దారిలో పెట్టడానికి కావాల్సిన గడువే ఈ ఉపవాస సమయాలు అనేది కాబట్టి ఉపవాసాలు అనేవి కూడా చాలా ముఖ్యమైనవి అలాగే జపము అని చెప్పి అన్నారు మనం జపం గురించి కూడా మనం అనుకున్నాం ఆ నామస్మరణ చేయడం వల్ల ఎక్కడెక్కడైతే మనకి తప్పుడు ఆలోచనలు రావడానికి అవకాశం ఉందో ఆ ఆలోచనల యొక్క స్థానంలో భగవన్ నామం పెడతాం ఈ భగవన్ నామం పెట్టడం వల్ల ఇంకోటి ఏమిటంటే సాధారణంగా మనక దైవభక్తి ఈషత్తు ఉండే వాళ్ళకి భగవంతుడు అనంగానే కొంచెం నీతి న్యాయం భగవంతుడు చూస్తున్నాడు అనే విషయం గుర్తొస్తుంది కూడా కాబట్టి ఆ భగవత్ జపం వల్ల మూడు ప్రయోజనాలు ఏమిటంటే ఒకటి చెడు ఆలోచనల యొక్క స్థానాన్ని ఇవి ఆక్రమిస్తాయి అనేది ఒకటి రెండవది భగవంతుడు గుర్తుకు రాంగానే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పనులు చేస్తాం అనేది రెండు మూడవది తప్పకుండా భగవంతుడి యొక్క నామాలు మంత్రాత్మకాలు కాబట్టి తజన్యమైన పుణ్యం కూడా ఉంటుంది ఆ పుణ్య సంస్కారం కూడా మనకి కావాల్సినవి జరిగేటట్టుగా చూసుకుంటాయి అనేది మూడు ప్రయోజనాలు జపాన్ని కూడా చెప్పుకున్నారు తపస్సు కూడా చెప్పారు తపస్సు తపస్సు కూడా చాలా నిర్వచనాలు ఉన్నాయి వేదంలో తపో నానశనాత్పరం అని చెప్పి అన్నారు ఉపవాసం కంటే గొప్ప తపస్సు లేదు అని చెప్పి అన్నారు అయితే తపస్సు ఒక మంచి నిర్వచనం ఏమిటంటే ఆపస్సు తమ్ముడు నియమేషు తపస్శబ్దః అని ఒక మాట అన్నాడు ధర్మ సూత్రాల్లో నియమబద్ధమైన జీవితాన్ని పాటించడమే తపస్సు అని చెప్పి మనం మొదట్లో అనుకున్నట్లుగా మన ఇచ్చ ప్రకారం జీవించకుండా నియమాల ప్రకారం జీవించినప్పుడు మనం చేసే ఎన్నెన్నో తప్పుడు పనులు అప్రయత్నంగా పక్కక వెళ్ళిపోతాయి ఏ పనులైతే కూడవో అవి ఇటువంటి నియమబద్ధమైన జీవితం వల్ల క్రమబద్ధమైన జీవితం వల్ల చాలా తప్పులు అప్రయత్నంగానే మనకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అటువంటి నియమబద్ధమైన జీవనమే తపస్సు ఈ రకంగా ఎన్నో ప్రాయశ్చిత్తాలు మనకు చెప్పుకున్నారు వీటి ద్వారా కూడా ఆ కర్మలని ఆ కర్మ యొక్క శక్తిని కొద్దిగా హరించి వాటిని తొలగించుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా ఏమిటంటే తాత్కాలికమైనవి ఎందుకంటే మనం కర్మ చేస్తూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాము మళ్ళీ కర్మ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికీ కూడా కర్మ కర్మఫలాన్ని అనుభవించని స్థితి మనకి కర్మానుభవం వల్ల వస్తుందని చెప్పలేం అదేవిధంగా ప్రాయశ్చిత్తాలు అసలు ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన అవసరం లేకుండా జీవించాలని చెప్పే మన యొక్క ఉద్దేశం తప్పుడు పనులు చేయకుండా ఉంటే ప్రాయశ్చిత్తాలు చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రాయశ్చిత్తాలు చేసేస్తూ నేను కర్మల్ని జయిస్తాను అంటే అది కుదరదు కాబట్టి శాస్త్రం మనకి పెట్టిన ముఖ్యమైన మార్గం ఏమిటంటే జ్ఞానం అదే భగవంతుడు గీతలో చెప్పాడు జ్ఞానాజ్ఞ సర్వ కర్మాణి భస్మసాత్ కురతేతః నాకు తెలిసి ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ వేయలేదు కానీ మామూలుగా అహం బ్రహ్మస్మి పోస్టర్స్ లో అదే చెప్తూఉంటారు జ్ఞానాజ్ఞ సర్వకర్మాణి భస్మసాత్కురతర్జున అని అక్కడ వాడుతూ ఉంటారు ఈ జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే కర్మలని మళ్ళీ మొలకెత్తకుండా దహిస్తుంది ఎలాగైతే విత్తనాలు ఉండేటప్పుడు వాటిల్ని అట్లానే నాటామ అంటే అవి మళ్ళీ మొలకెత్తుతాయి వాటిల్ని అగ్నిలో వెయించి నాటామ అంటే ఇంకా ఎప్పటికీ మొలకెత్తవు కాబట్టి జ్ఞానానికి ఒక విశేషమైన శక్తి ఒకటి ఏముంటుందంటే దానివల్ల కర్మ తన వీర్యాన్ని కోలిపోతుంది అనేది ఒకటి ఉంది ఎందుకు అని చెప్పి అనుకుంటే మనం మళ్ళీ ఈ సిద్ధాంతానికి వద్దాం మనం కర్మని ఎందుకు అనుభవిస్తున్నాము నేను చేశాను అనే భావన ఉంది కాబట్టి దాని యొక్క ఫలితాన్ని అనుభవించేది కూడా నేనే నేను అని చెప్పి మనం ఏమని అనుకుంటున్నాము శరీరేంద్రియాలు మనసు అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే ఇవి నేను అనుకొని పని చేస్తున్నామో అవి చేసిన పనులకు కూడా మనం కూడా బాధ్యులం అవుతున్నాము జ్ఞానం అంటే ఏమిటి ఈ శరీరేంద్రియాలు ఏవి కూడా నా స్వరూపంలో భాగాలు కావు నా యొక్క నిజ నిజమైన స్వరూపం ఏంటంటే శుద్ధ చైతన్యం మాత్రమే ఆత్మ శరీరం ఇంద్రియాలు ఇవన్నీ వచ్చి వెళ్లేవి తప్ప నా నిజ స్వరూపం కాదు అని ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో ఇప్పుడు మామూలుగా తెలుసుకో అంటే నేను చెప్పేసాను మీరు వినేసారు మనందరికీ జ్ఞానం వచ్చేసిందా అంటే అట్లా కాదు అనుభవాల్లోకి రావాలి ఇది ఇది ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అటువంటి వ్యక్తికి ఈ పని నేను చేస్తున్నాను అనే భావన ఎప్పటికీ రాదు ఎందుకంటే గుణాగుణేషు వర్తంతే ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి శరీరం దాని పని అది చేసుకుంటుంది మనసు దాని పని అది చేసుకుంటుంది అనేవాడు చూస్తాడు తప్ప ఇది నేను పని చేస్తున్నాను అని చెప్పి వాడు అనుకునే అవకాశమే లేదు కాబట్టి ఎవరికైతే జ్ఞానం వచ్చిందో అటువంటి జ్ఞాని చేసే పనులకి కర్మ బంధం అనేది ఉండదు అనే విషయాన్ని చెప్పారు ఇదంతా యుక్తియుక్తంగా ఉంది అదేవిధంగా వాడికి పూర్వ కర్మలతో కూడా సంచిత కర్మలతో కూడా ఇది ప్రారబ్ధాన్న ఇది ఇది సంచిత కర్మలకు చెప్పిన విషయం ఎందుకంటే సంచిత కర్మలు కూడా వాడు దేనితో చేశడు మనసుతో చేశాడు సంచిత కర్మలకి సంబంధం ఏమిటి మనసులో కర్తృత్వం పెట్టుకొని ఆ పనులు చేశడు కాబట్టి సంచిత కర్మలు లాగానే అది వాడితో పాటు వస్తున్నాయి జన్మ జన్మలకి ఎప్పుడైతే వాడికి మనసుకి ఒక విడి ఏర్పడిపోయిందో ఎప్పుడైతే వాడు మనసు నుంచి తన యొక్క అస్తిత్వాన్ని విడదీసుకున్నాడో మనసుతో సంబంధం లేకపోయేసరికి మనస్ సంబంధం వల్ల వల్ల వచ్చే కర్మ ఫలితాలతో ఇది నీకు ఇంకా సంబంధం లేదు కాబట్టి కాబట్టి జ్ఞానికి జ్ఞాని చేసే పనులకి కర్మఫలాలు పుట్టవు అలాగే తాను కూడపెట్టుకున్న సంచితానికి కూడా జ్ఞానికి సంబంధం ఉండదు అయితే మన సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది ఏది కూడా అకౌంట్స్ పుస్తకాన్ని మూసాడు అనుకుండదు అకౌంట్స్ తేల్చాక ఏదైనా మూసేది కాబట్టి సంచిత కర్మ ఊరికనే పోతుంది అని చెప్పి అనడానికి లేదు కాబట్టి జ్ఞాన కూడపెట్టుకున్న జ్ఞాని కూడపెట్టుకున్న కర్మ ఏదో అవ్వాలి అది వాడికి రాదు అయితే మరి ఆ కర్మ ఏమవుతుంది అనే సందేహం మనకి వస్తుంది సహజంగానే వస్తుంది అక్కడ మనకి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే తస్య పుత్రాదాయముపయాంతే సుహృదసాధుకృత్యాన్ దషంతపాపకృత్యాం అని మాట అన్నారు అక్కడ అతని యొక్క పుత్రులు అతని యొక్క ఆస్తిని అనుభవిస్తారు ఎవరైతే జ్ఞానియో ఆ జ్ఞానం అంతా అయిపోయి వెళ్ళేసరికి అతని యొక్క ఆస్తి పాస్తులు ఏవైతే మిగులుతాయో అది వాళ్ళ పిల్ల పాపలందర బంధువులందరూ పంచుకుంటారు అతని యొక్క అతని యొక్క పుణ్యం ఏదైతే ఉందో కూడపెట్టుకున్న పుణ్యం ఏదైతే ఉందో సుహృద సాధుకృత్యం ఆ జ్ఞాని యొక్క పుణ్య కర్మలని ఆ జ్ఞానిని సేవించే వారికి ఆ జ్ఞాని దగ్గర వినయంగా ఉండే వాళ్ళకి ఆ జ్ఞాని పట్ల అనుకూలంగా ఉండే వాళ్ళకి ఆ పుణ్యాలు వస్తాయి ద్విషంత పాపకృత్యం ఎవరైతే ఆ జ్ఞానికి వ్యతిరేకంగా ఉంటారో ఆ జ్ఞానిని నిందిస్తారో ఆ జ్ఞాని పట్ల అపచారం చేస్తారో ఆ జ్ఞానికి జన్మ జన్మలుగా కూడగట్టుకున్న పాపం అంతా మెల్లిమెల్లిగా వాళ్ళకి పంచబడుతుంది అని చెప్పిన మాట కాబట్టి దీని ద్వారా మనకి తెలుసండి ఆ జ్ఞానుల్ని యోగుల్ని ఎతుల్ని సేవించుకోవడం అనేది ఎందుకు ముఖ్యమో మనం స్వామి వారిని చూస్తే పుణ్యము అని చెప్పి అంటాం చూస్తే పుణ్యం అనే మాట నిజమే ఎందుకు పుణ్యము అంటే వారి నిజమైన జ్ఞానులై ఉంటే వారి యొక్క సేవ వల్ల ఒక ప్రత్యేకమైన ఉపకారం మనకు ఉండనే ఉంటుంది అనే విషయం కూడా ఇక్కడ శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ జ్ఞానికి ఇటువంటి కర్మ సంబంధం లేకపోగా ఆ జ్ఞానితో వ్యవహరించే వాళ్ళకి ఆ వ్యవహారాన్ని పట్టి వాళ్ళకి ఆ జ్ఞాని యొక్క పుణ్య పాపాలు అనేవి పంచడం అయిపోతుంది మరి జ్ఞాని యొక్క ప్రారబ్ధం యొక్క ఆగామి ఆగామితో గొడవే లేదు అసలు రానే లేదు అది కాబట్టి ఆగామిని అసలు పట్టించుకొని అక్కర్లేదు రాని ట్రైన్ ఆగామిని తప్పించుకోవడం ఎట్లాంటిది అంటే రాని బస్సు నేను ఎక్కకూడదు అని చెప్పి అనుకోవడం లాంటిది ఆ బస్సు ఇంకా రానే లేదు నేను దాన్ని ఎక్కకూడదు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు మిగిలింది ఇంకా ప్రారబ్ధం ఒక్కటే ప్రారబ్ధం ఏమిటంటే ఒక రకంగా చూస్తే జ్ఞాని తప్పించుకోలేడు ఒక రకంగా చూస్తే జ్ఞాని తప్పించుకోగలడు భగవత్పాదులు అపరోక్షానుభూతి అనే గ్రంథంలో ఏం రాశరంటే జ్ఞానికి ప్రారబ్ధం కూడా ఉండదు అని చెప్పి రాశారు ఎందుకంటే మనం అనుకున్నట్లుగా అనుభవం అనేది వచ్చేది దేనికి శరీర మనసులకి శరీరం ద్వారా మనసుకు అనుభవం వస్తుంది ఎప్పుడైతే జ్ఞాని నేను శరీరము కాదు మనసు కాదు అని చెప్పి అనేసుకున్నాడో అతనికి ప్రారబ్ధం యొక్క అనుభవం మాత్రం వచ్చే అవకాశం ఏముంది అని చెప్పి రాశారు ఈ మాట వాస్తవమే అయితే లోక దృష్ట్య మనం చూస్తుంటే ఆ జ్ఞాని సుఖాన్ని అనుభవిస్తున్నాడు ఆయన దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటా ఉంటాం కాబట్టి నిజానికి ప్రారబ్ధం అనేది తప్పించుకోవడం వల్ల కాదు ఎందుకు అని చెప్పంటే దాని యొక్క ఫలితాన్ని చూపించడం అది మొదలు పెట్టేసింది కాబట్టి దీనికి ఉదాహరణ శాస్త్రంలో ఏం చెప్పారంటే అది వదిలిపెట్టిన బాణం లాంటిది ఏ బాణాన్ని అయితే అసలు తీయనేలేదో ఆ బాణంతో మనకు గొడవే లేదు కానీ నారి మీద ఎక్కువ పెట్టి వదిలిపెట్టేసిన బాణాన్ని ఎవరు కూడా ఆపలేరు ఆ బాణం యొక్క గతి మొదలైపోయింది కాబట్టి ఆ మొదలైపోయిన గతిని నిరోధించడం అనేది అసంభవం ఎవరికైనా అదేరకంగా ఇది ప్రారబ్ధం అంటే ప్రారబ్ధం ఆ కర్మ దాని ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టేసింది కాబట్టి దాన్ని ఆపడం కుదరదు ఇక్కడ ఇంకో యుక్తి ఏమిటంటే కర్మలు అనేవి ఎవ్వరికీ కూడా స్వతంత్రంగా ఉండవు అంటే నా కర్మలు నా అనుభవం ఇంకా ఎవరికీ సంబంధం లేదు అనే పరిస్థితి లేదు మన యొక్క కర్మానుభవాలన్నీ కూడా వేరే వాళ్ళతో ముడిబెడి ఉంటాయి వేరే వాళ్ళ మనకి కొంత సుఖం రాసి పెట్టి ఉంటుంది మన వల్ల వేరే వాళ్ళకు సుఖ దుఃఖాలు రాసి పెట్టి ఉంటాయి కాబట్టి ఈ మానవ సంబంధాల వల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఉంటాయి కాబట్టి ఈ జ్ఞానికి వేరే వాళ్ళ వల్ల సుఖం దుఃఖం రాకపోయినా ఈ జ్ఞాని వల్ల వేరే వాళ్ళకి సుఖ దుఃఖాలు రాసిపెట్టి ఉంటాయి అంతే కదా ఇప్పుడు మన వల్ల స్వామి వారికి ఏమి పుణ్యమో పాపము రాదు అయితే స్వామి వారి వల్ల మనకి సుఖ దుఃఖాలునే వస్తాయి మన వల్ల జ్ఞానులు అనే వాళ్ళకి సుఖ దుఃఖాలు రాకపోవచ్చు కానీ జ్ఞానుల వల్ల మనకి సుఖ దుఃఖాలు రావచ్చు కాబట్టి ఈ సంబంధాలన్నీ కూడా విధి ప్రకారం నిర్ణయింపబడి ఉంటాయి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ద్వారా ఈ ఫలాన్ని సుఖం రాసి పెట్టుంది ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ద్వారా దుఃఖ రాసి పెట్టుంది అని ఈ వ్యక్తుల మధ్యలో సంబంధాలు నిర్ణయింపబడి ఉన్నాయి ఎందుకంటే ఈ కర్మలు వాటి ఫలితాన్ని ఇవ్వడానికి మొదలు పెట్టేసాయి కాబట్టి కాబట్టి ఇది ఎట్లాంటిది అంటే ఈ జ్ఞాని వైపు నుంచి ఆ కర్మఫలం మానిన అవతలవాడి వైపు నుంచే కర్మఫలం ఉండనే ఉంటుంది కాబట్టి ఏ పరిస్థితి అయితే ఆ జ్ఞాని యొక్క సుఖ దుఃఖ అనుభవానికి వీలుగా ఉంటుందో ఆ సందర్భంలో జ్ఞాని ఒక్కడే భాగస్వామి కాదు ఆ జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా ఆ సందర్భంలో భాగస్వాములు అవుతారు కాబట్టి ఆ సందర్భం వల్ల జ్ఞానికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రాకపోయినా కూడా ఇటువైపు ఉండే అజ్ఞానికి ఈ సందర్భం వల్ల సుఖమో దుఃఖమో రాసిపెట్టి ఉంటుంది కాబట్టి జ్ఞానికి దాని వల్ల అనుభవం లేకపోయినా కూడా ఈ అజ్ఞానికి అనుభవం రావాలి కాబట్టి ఆ సందర్భం అనేది అట్లానే జరిగి తీరుతుంది అనేది అందుకనే భగవత్పాదులు ఏమన్నారంటే ప్రారబ్ధం బలవత్తరంకలో ఆ ప్రారబ్ధం ఈ మూడు రకాల కర్మల్లో బలమైనది విదాం విదాం భోగేన తస్యక్షయః జ్ఞానులైనా సరే ఆ శరీరానికి అనుభవం అయితే తప్ప ఆ ప్రారబ్ధం అనేది పోదు మరి మిగతా వాటికి ఏమిటి అని చెప్పంటే సమ్యజ్ఞాన హుతాశనేన విలయః ప్రాక్సంచితాగ గమినాం అని చెప్పి అన్నారు వివేక చూడామణిలో ఆ జ్ఞాన అగ్నిలో సంచితము ఆగామి రెండు కూడా పోతాయి ప్రారబ్ధం అనుభవంతో పోతుంది తద్వారా జ్ఞాని అనేవాడికి పూర్తిగా కర్మల నుండి విముక్తి పుడుతుంది అని కర్మల నుంచి విముక్తి ఎందుకండి అని చెప్పంటే మన శాస్త్రంలో ఒక వరుసు గీశారు మనక ఏం కావాలి సుఖంగా ఉండాలి దుఃఖంగా ఉండకూడదు అయితే ఎవ్వరూ కూడా దుఃఖాన్ని తప్పించుకోలేకపోతున్నారు సుఖాన్ని పొందట్లేదు మనం జీవితంలో ఏవో కొన్ని కొన్ని సుఖ పొందుతున్నాం కానీ మనం పొందాలనుకుండే సుఖం ఇది కాదు మనక ఎటువంటి సుఖం కావాలంటే తంవిద్యా దుఃఖ సంయోగ వియోగం దుఃఖ సంస్పర్శ లేని సుఖం కావాలి నిత్యమైన సుఖం కావాలి దానికంటే ఇంకా పై సుఖం లేదు అన్నంత సుఖం కావాలి ఇటువంటి సుఖం మనం నిజంగా కోరుకుంటూ ఉండేది ఇటువంటి సుఖం మనకి లోకంలో రాకపోగా లోకంలో ఉండడం వల్ల మనకి దుఃఖం అనేది కూడా వస్తున్నది దుఃఖం అనేది ఎందుకు వస్తున్నది అని చెప్పి ఆలోచించినట్లయితే శరీరం ఉంది కాబట్టి దుఃఖం అనేది తప్పదు శరీరం ఉన్నంత కాలం లోకంలో సుఖము దుఃఖము రెండు వస్తూనే ఉంటాయి శరీరం ఎందుకు వస్తుంది అని చెప్పంటే మనకి తీర్చుకోవాల్సిన కర్మలు ఉన్నాయి కాబట్టి శరీరం వస్తుంది కర్మలు ఎందుకు చేస్తున్నాము అని చెప్పంటే రాగద్వేషాలు ఉండడం వల్ల మనం కర్మ చేస్తున్నాం మనకు కొన్ని విషయాలు అంటే ఇష్టం కాబట్టి వాటిని పొందడానికి కొన్ని కర్మలు చేస్తాం కొన్ని విషయాలు అంటే ఇష్టం లేదు కాబట్టి దాన్ని వదిలేయడానికి కొన్ని కర్మలు చేస్తాం కాబట్టి దుఃఖానికి కారణం శరీరం శరీరానికి కారణం కర్మ కర్మకి కారణం రాగద్వేషాలు రాగద్వేషాలకు కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం శాస్త్రాలు ఏం చెప్పారంటే అన్యతా జ్ఞానము అని చెప్పి అన్నారు ఉన్న వస్తు స్థితిని వస్తు స్థితిగా చూడకుండా దాన్ని వేరేగా అనుకోవడం అంటే ఈ శరీరం యొక్క యోగక్షేమాలే నా యోగ క్షేమాలు ఈ మనసు యొక్క సుఖ దుఃఖాలే నా సుఖ దుఃఖాలు ఈ శరీరానికి ఉండే సౌకర్యాలే నా సౌకర్యాలు అని ఒక భ్రాంతి వల్ల ఈ శరీరాన్ని మనసుని సుఖ పెట్టడానికి మనం పని చేస్తున్నాం ఇది భ్రాంతి నేను అంటే ఆత్మని అనుకోకుండా శరీరం అని చెప్పి అనుకోవడం వల్ల శరీరానికి అనుకూలమైన వాటి పట్ల రాగము శరీరానికి ప్రతికూలమైన వాటి పట్ల ద్వేషం పెట్టుకొని వాటిని సాధించుకోవడానికి కర్మలు చేసి కర్మల ద్వారా రకరకాల శరీరాలను పొంది ఆ శరీరద్వాల ద్వారా మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి దీన్ని పోగొట్టాలంటే ఏం చేయాలంటే మూలచ్చేదం చేయాలి కాబట్టి ఒట్టిగా మనం కర్మలని మార్చుకోవడం వల్లనో ఏవో చేయడం వల్లనో ఈ పరంపర యొక్క అడ్డు అనేది రాదు అందుకనే దీనికి ఏం చెప్పారంటే న్యాయసూత్రాలు ఉత్తరోత్తరాపాయే తదనంతరపాయ అపవర్గః పూర్వ పూర్వమైన కారణాన్ని పోగొట్టుకుంటే దాని యొక్క ఫలితమైనది పోతుంది కాబట్టి మూల కారణాన్ని పోగొట్టుకుంటే మోక్షం అనేది వస్తుంది కాబట్టి మనకు సరైన జ్ఞానం వచ్చిందంటే జ్ఞానం వల్ల మనకి కర్మ సంఘం అనేది ఉండదు కర్మ సంఘ మనకి జ్ఞానం అనేది వచ్చిందంటే దానివల్ల మనకి రాగద్వేషాలు అనేవి ఉండవు మనకి ఎందుకంటే ఆత్మలో ఉండే సుఖం నిత్యమైన సుఖం కాబట్టి ఆ సుఖాన్ని పొందడానికి వస్తువుల మీద రాగద్వేషాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రాగద్వేషాలు ఎప్పుడైతే లేవో అప్పుడు వాటిని తీర్చుకోవడానికి పని చేయనక్కర్లేదు పని కర్మ చేయకపోతే ఫలితాలు లేవు ఫలితాలు లేకపోతే శరీరం లేదు కాబట్టి మనం సరిైన జ్ఞానాన్ని పొందగలిగితే పూర్తిగా కర్మల్ని జయించగలుగుతాము అనేది కూడా మనకి ఇక్కడ శాస్త్రాల్లో చెప్పబడి చెప్పి ఉన్నారు చివరిగా మనం ఒక్క విషయం అనుకొని మనం ముగించుకుందాం ఇప్పటివరకు మనం చాలా విషయాలని మాట్లాడుకున్నాం అయితే ఎక్కడ కూడా ఈశ్వరుడు గురి యొక్క పాత్ర గురించి ఎక్కువ మనం మాట్లాడుకోలేదు ఇప్పటి వరకు మనంఅంతా ఏం మాట్లాడుకుంంటే మనం చేస్తే ఏది వస్తుంది మనం చేస్తే ఏది వస్తుంది ఇలా చేస్తే అలా అవుతుంది అని చెప్పి ఇదంతా సందర్భం అయితే ప్రక్రియ అంతా ఇట్లా నడుస్తున్నట్లయితే ఈశ్వరుడితో పని ఏముంది అనేది ఒక సందేహం ఉండనే ఉంటుంది ముందు ఒకటి ఏమిటంటే అసలు కర్మ వ్యవస్థని పెట్టింది ఎవరు ఈ నియమం చేసిన దానికి తిరిగి ఫలితం ఉంటుంది అనే నియమాన్ని ఎవరు ఏర్పరిచారు అనే ప్రశ్నకి తప్పకుండా అందరూ చెప్పాల్సిన సమాధానమే ఈశ్వరుడు అని చెప్పి కాబట్టి ఈశ్వరుడి యొక్క ప్రమేయం ముందు అక్కడ మొదలైంది ఆ రెండో విషయం ఏమిటంటే ఈ కర్మలు జడాలు జడ జడములు అంటే ఏమిటి వాటికి నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు కాబట్టి ఏ కర్మ ఎప్పుడో ఎవరిని ఆ ఏ కర్మ ఎప్పుడో ఎవరి దగ్గరికి రావాలి అనేది ఆ కర్మలు స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకోలేవు కాబట్టి ఫలాని కర్మ ఫలాని సందర్భంలో ఫలాని వ్యక్తికి ఇట్లా అందాలి అనే నిర్ణయం చేసేవాడు ఒకడు ఉండాలి వాడు ఈశ్వరుడు అంటే కాబట్టి ఈశ్వరుడికి పక్షపాతం లేదు అని చెప్పి మనం అంటాం నిజానికి ఈ కాలంలో చాలామంది దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించడానికి ఏమంటారంటే ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది ఒకవేళ దేవుడు మంచివాడైతే ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు ఒకవేళ కొంతమందికి దుఃఖాన్ని ఇస్తున్నట్లయితే దేవుడు మంచివాడు కాదు లేదా దేవుడు అందరికీ దుఃఖాన్ని ఆపలేడు అని చెప్పంటే సర్వశక్తుడు కాకుండా పోతాడు కాబట్టి అతను దేవుడే కాకుండా పోతాడు ఇంతేగా మామూలుగా అందరికీ ఉండే ఆలోచన దుఃఖాన్ని కలిగిస్తున్నాడు దుఃఖం దుఃఖం కలుగుతోంది లోకంలో దేవుడు కావాలని చెప్పి దుఃఖాన్ని ఇస్తున్నాడు అని చెప్పంటే అసలు మంచివాడు కాదు చాలా క్రూరుడు అని చెప్పి అర్థం లేదా వాడికి దుఃఖం వస్తుంది దేవుడు దాన్ని ఆపలేకపోతున్నాడు అని చెప్పంటే దేవుడు అసహాయుడు నిశక్తుడు అశక్తుడు అని చెప్పి అర్థం వస్తుంది అట్లాంటప్పుడు అట్లాంటి దేవుని ఆరాధించి అసలు ప్రయోజనం లేదు కాబట్టి ఒకవేళ దేవుడు ఉంటే ప్రపంచంలో ఎవరికీ దుఃఖం ఉండదు కాబట్టి దేవుడు లేడు అనే ఇటువంటి ఒక ఆలోచన పద్ధతి ఒకటి ఉంది నిజంగా కర్మ సిద్ధాంతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఎటువంటి సందర్భానికి తావు లేదు ఎందుకంటే మనకి శాస్త్రంలోనే దీనికి చక్కని సమాధానం చెప్పున్నారు వైషమ్య నైర్గ్రణ్యేన సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి అని చక్కగా బ్రహ్మ సూత్రాల్లో వ్యాసమహర్షి ఒక సూత్రాన్ని రాసి పెట్టారు భగవంతుడికి వైషమ్యము నైర్గ్రణ్యము అనేవి రెండు లేవు వైషమ్యం అంటే పక్షపాతం కొంతమందికి దుఃఖం కొంతమందికి సుఖం అనేది భగవంతుడు తన యొక్క పక్షపాతంతో ఇవ్వడు రెండోది నైర్గ్రణ్యం వాళ్ళ పాటికి వాళ్ళు పాపాలు అనుభవిస్తూ ఉంటే నాకు సంబంధం లేదు అనే కరడుగట్టిన మన స్వభావం కూడా కాదు ఇతరులని నొప్పిద్దాము అనే మనస్వభావం కూడా లేదు ఎందుకు అని చెప్పంటే ఈ అనుభవాలన్నీ కూడా సాపేక్షాలు కాబట్టి దేనికి సాపేక్షాలు అని చెప్పంటే మనం చేసుకున్న దానికి సాపేక్షాలు భగవంతుడు అన్నిటికీ కారణం ఏమిటంటే భగవంతుడు అన్నిటికీ సాధారణమైన కారణం దీనికే భగవత్పాదులు అక్కడ రాశారు ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్యః అని ఒక మాట రాసారు స్వామి వారు కూడా జగద్గురువులు కూడా ఆ మాట చెప్తూ ఉంటారు ఏమిటంటే ఏ మొక్క మొలవాలన్నా కూడా దానికి కారణం వర్షం అయితే అది విషవృక్షమా లేదా ఫలవంతమైన వృక్షం అనేదానికి మాత్రం వర్షం కారణం కాదు దానికి కారణం ఏందంటే బీజం అది అది సత్ఫలాన్ని ఇస్తుందా విషఫలాన్ని ఇస్తుందా అనేది బీజం నిర్ణయిస్తుంది తప్ప వర్షానికి సంబంధం లేదు అయితే వర్షం లేనిదే ఏ ఫలం ఏ వృక్షం కూడా ఏ ఫలాన్ని ఇవ్వదు అదేవిధంగా భగవంతుడు అనేవాడు జీవుడికి కర్మని చేసే స్వాతం తంత్రయాన్ని ఇచ్చాడు ఇచ్చేసరికి ఏం చేస్తాడుఅంటే ఆ కర్మకి తగిన ఫలితాన్నే ఇస్తున్నాడు తప్ప కొంతమందిని నొప్పించాలనో కొంతమందిని సుఖపెట్టాలనో లేదు చాలా మంది ఏంటంటే చిన్న చిన్న పిల్లలుండి తెలియని పిల్లలు వాళ్ళకే వ్యాధులు వస్తున్నాయి వాళ్ళకే రోగాలు వస్తున్నాయి అని చెప్పంటే దేవుడు ఎంత క్రూరుడండి చిన్న పిల్లలకి కూడా ఆ అటువంటి పరిస్థితిని పెట్టాడు అని చెప్పంటే మరి నిజమే మరి వాళ్ళు పూర్వజన్మలో చేశారో మనకు తెలుసా పూర్వజన్మలో వాళ్ళు ఏం చేసి ఇట్లా అయ్యారో మనకు తెలుసా నిజానికి ఆ పిల్లవాడి యొక్క ఒకవేళ ఇంకా ఇంకోటి కూడా కావచ్చు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడైతే వాడికి ఇంతకంటే దుఃఖం వస్తుంది కాబట్టి ఇంత దుఃఖంతో సరిపెట్టేసాడేమో దేవుడు ఆ ఒక్క పరిస్థితిని చూసి మనం మొత్తం వ్యవస్థని వ్యాఖ్యానించే అర్హత మనకు ఎట్లా వస్తుంది కాబట్టి కాయంగా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో చెప్పింది ఏమిటంటే నీ యొక్క సుఖ దుఃఖాలకి బాధ్యత నీదే అయితే ఆ సుఖ దుఃఖాలు నీకు ఎలా అందుతాయి అనేది మాత్రం ఈశ్వరుడి చేతుల్లో ఉంది కాబట్టే మనం ఈశ్వరుని ఆరాధిస్తాం ఈశ్వరుని ఆరాధించడం ఎందుకంటే మన యొక్క భవిష్యత్తు అనేది ఒకటి ఉంది అది మన చేతుల్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది భగవంతుడి చేతుల్లో మనం పెడితే ఒక రకంగా ఉంటుంది ఈ రెండు దగ్గర కర్మఫలాన్ని అనుభవించాల్సిందే దాంట్లో ఎటువంటి వ్యత్యాసం లేదు మన చేతుల్లో పెడితే జరగాల్సింది జరిగింది మనకు తెలియదు కాబట్టి మనకు తెలిసినంత మనం ఒక మంచి దారిని ఏర్పరచుకోవడానికి వీలవుతుంది అదే భగవంతుడి చేతుల్లో పెడితే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎవరికైతే తెలుసో అతను ఏర్పరిచిన దారి మనకి అంతతః శ్రేయస్తును కలిగిస్తుంది అదే భగవంతుడు అంటాడు వేదాహం సమతీతాని వర్తమానాంచార్జున భవిష్యానచ భూతాని జరిగింది జరుగుతున్నది జరగవలసినది నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం అందరి కర్మలు ఎలా అయితే సరిపెట్టొచ్చో దాన్ని నేను చేస్తుంటాను కాబట్టి భగవంతుడి యొక్క పాత్ర ఏమిటంటే అందరిని కూడేటట్టుగా చేయడం విడిపోయేటట్టుగా చేయడం ఎవరికైతే అనుభవం ఎప్పుడు ఎవరి ద్వారా రాసి పెట్టుందో అప్పుడు వాళ్ళని కలుపుతాడు ఎప్పుడైతే వాళ్ళకి కి ఆ అనుభవం అయ్యే యోగ్యత అయిపోతుంది అప్పుడు విడదీస్తాడు కాబట్టే ఇంకా స్పష్టంగా మనక జీవితంలో కనపడాలంటే పిల్లవాడు తల్లిదండ్రులకు ఎప్పుడు పుడతాడు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎప్పుడైతే తల్లిదండ్రులకి ఆ సంతానం ద్వారా సుఖ దుఃఖాది అనుభవం రాసి పెట్టి ఉందో అటువంటి సందర్భంలో తల్లిదండ్రులకి పిల్లవాడు పుడతాడు ఈ తల్లిదండ్రులు ఎప్పుడు కాలం చేస్తారు అని చెప్పంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆ పిల్లవాడి ద్వారా సుఖ దుఃఖాలు అనుభవించే బాధ్యత తీరిపోతుంది తుందో అప్పుడు వాళ్ళు కాలం చేస్తారు అంటే మనం కర్మ బంధం ప్రకారం మనం ఆలోచించుకుంటే ఆ సంబంధం వచ్చేది ఎప్పుడు అంటే వాళ్ళ ద్వారా మనకఏమనా అనుభవం రాసి ఉన్నప్పుడు ఆ సంబంధం విడిపోయిందంటే వాళ్ళ ద్వారా మనకు అవ్వాల్సిన కర్మ బంధం అయిపోయింది అని లెక్క కాబట్టి దీన్ని కలిపేది విడదీసేది ఎవరు అని చెప్పంటే అటువంటి వ్యక్తినే మనం ఈశ్వరుడు అని చెప్పి అన్నాం కాబట్టి మనం ఈ కర్మానుభవం యొక్క బాధ్యతని ఈశ్వరుడి మీద పెట్టామంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమిద్దాం అని చెప్పి అనుకున్నామఅంటే ఆధ్యాత్మికమైన పురోభివృద్ధికి అనుగుణమైన కర్మ ప్రణాళికని ఈశ్వరుడు మనకి అనుక్రమంగా ఇస్తాడు మనకి కర్మఫలాలని ఏమి పాపాలని పుణ్యాలని తీసేసుకోడు అయితే ఏమిటంటే ఈ పాప పుణ్యాల యొక్క అనుభవం ఏ రకంగా అయితే మనకి ఆధ్యాత్మికమైన పురోగతి కలుగుతుందో అటువంటి పాప పుణ్యానుభవం యొక్క ప్రణాళికని మాత్రం భగవంతుడు మనకి చేసి ఇస్తాడు అందుకనే అన్నాడు నాదత్తే కస్యచత్పాపం నచైవ సుకృతం విభహు భగవంతుడు ఎవ్వరికీ కూడా ప్రత్యేకిం ంచి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ ఇవ్వాలని చెప్పి అనుకోడు వాళ్ళ పుణ్యఫలాన్నే వాళ్ళ పాపాలే వాళ్ళకి ఇస్తాడు అందుకనే ఇంకా బలమైన మాట ఏమిటంటే మన శాస్త్రంలో విధికి ప్రయత్నానికి తేడా లేదు అని చెప్పి అనేసారు మన శాస్త్రంలో పురుష ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఇంకో పేరే విధి అని చెప్పి ఒక శ్లోకం ఉంది అది ఏమన్నారంటే యదేవ తీవ్ర సంవేగాత్ దృడం కర్మ పురాకృతం తదేవ దైవ శబ్దేన పర్యాయేణేహ కత్యతే అని చెప్పి తీవ్ర సంవేగంతో బలమైన సంకల్పంతో మనం ఏదైతే శుభాశుభ కర్మలని చేశమో దాన్నే ఇంకో పేరు పెట్టి పర్యాయేణ దానికే పర్యాయ పదం ఏంటంటే దైవము విధి అని చెప్పి ఎందుకంటే మనం చేసుకున్న పనికి పరిణామమే మనకు జరిగిపోయేది కాబట్టి ఆ పురుష ప్రయత్నానికి విధికి తేడా అనేది లేదు కాబట్టి ఆ విధిని ఎవరైతే నిర్ణయించుకోదలుచుకున్నారో వాళ్ళు వాళ్ళ ప్రస్తుత నిర్ణయాలని వాళ్ళు సరిచేసుకోవాలి ప్రస్తుత అభుతమైన నిర్ణయాలలో బాధ్యత మనం పెట్టుకున్నామ అంటే మన యొక్క తెలివి తేడల యొక్క పరిమితిలోనే పరిణామాలని మనం ఆలోచించగలం ఎప్పుడైతే ఆ బాధ్యతని భగవంతుడి చేతిలో పెట్టామో అప్పుడు ఇంకా మనక ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకనే గీతలో చివరిక అంటే కర్మ సిద్ధాంతంలో చివరి మాటగా భగవంతుడు ఏం చెప్పాడంటే కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అనేది అక్కడ చెప్పాడు భగవంతుడు దీనికి చాలా మంది చాలా రకాల వాళ్ళ తోచిన అర్థాలున్నీ చెప్తూఉంటారు దీనికి చాలా స్పష్టమైన అర్థం ఏమిటంటే అధికారము అని చెప్పంటే యోగ్యత అని చెప్పి అర్థం నీ చేతుల్లో ఉండేది కర్మ మాత్రమే దాని యొక్క ఫలితం నీ చేతుల్లో లేదు ఎందుకంటే నీకు తెలిసింది నీ ప్రయత్నం ఒక్కటే ఇదే సందర్భంలో ఇతర జీవుల యొక్క ప్రయత్నం ఎంతవరకు ఉందో నీకు తెలియదు నీ యొక్క కర్మలు దీన్ని అడ్డుకుంటాయో ముందుకు తోస్తాయో కూడా నీకు తెలియదు అదే కాకుండా ప్రకృతి అప్పుడు ఎలా ఉంటుందో నీకు తెలియదు ఇన్ని విషయాలు ఒక పని అవ్వాలంటే ఇన్ని విషయాలు ఉండాల్సినప్పుడు ఉండ దానికి కావాల్సిన 10 విషయాల్లో తొమ్మిది విషయాలు నీకు తెలియనప్పుడు ఫలితం నీ చేతుల్లో ఉంది అని చెప్పి నువ్వు అసలు ఎలా అనుకుంటావ్ కాబట్టి నేను పని చేస్తే ఫలితం దక్కి తీరుతుంది అనేది ఎవ్వరు కూడా అనలేరు ఫలితాన్ని నిర్ణయించే యోగ్యత ఏ జీవుడికి కూడా లేదు వాడు ఏమి నిర్ణయించగలడు అంటే వాడి కర్మని మాత్రమే నిర్ణయించగలి నేను ఈ పనిని ఇప్పుడు ఇలాగా చేస్తాను అనే విషయం మాత్రమే వాడికి యోగ్యంగా ఉంది తప్ప ఫలితం ఇదే ఉంటుంది అని చెప్పి ఎవ్వరు కూడా నిర్ణయించలేరు అనేది ఆ కర్మణ్యవాధికారస్తే అనే మాటకు అర్థం కాబట్టి మనం భగవంతుడికి మనం చేసే ప్రార్థన ఏమిటంటే నా కర్మల సంగతి నాకు తెలియదు నువ్వు నాకు ఈ శరీరాన్ని ఇచ్చి ఏవో కర్మలు అనుభవించమని చెప్పి పుట్టావు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు ఈ శరీరంతో పాటు వచ్చే ధర్మాలు కొన్ని ఉంటాయి ఆ శరీరాన్ని వచ్చిన ధర్మాలని నేను రాగద్వేషాలు లేకుండా నువ్వుఇచ్చిన బాధ్యతగా భావించి నా కర్తవ్యాన్ని నేను చేస్తాను రాగద్వేషాలు పెట్టుకొని దీన్నే కర్మయోగం అని చెప్పి అన్నారు ఎవరైతే నిజంగా ఈ కర్మయోగాన్ని చేయగలుగుతారో వాళ్ళకి కర్మ ఈ పాప పుణ్యాలు అంటవు అని చెప్పి అన్నారు ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్లుగా భగవంతుడు నాకుఇచ్చిన కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అన్నామో మనకి తద్వారా కావలసినది అని చెప్పి ఏమీ లేదు మన స్వప్రయోజనం కోసం మనం కర్మ చేసినట్టు అవ్వదు కాబట్టి దాని యొక్క ఫలితాలు తో కూడా మనకి భగవంతుడే చూసుకుంటాడు తప్ప మనకి ఇది ఇష్టము ఇది అనిష్టమ అనే సంబంధం ఉండదు కాబట్టి నేను అట్లా ప్రయత్నిస్తాను చివరికి నీ యొక్క యదార్థ స్వరూపాన్ని తెలుసుకొని నాకు జ్ఞానం వచ్చినప్పుడు ఏ అజ్ఞానం వల్లనైతే నాకు కర్మ బంధం కలిగిందో ఆ బంధం కూడా విడిపోతుంది అప్పుడు పూర్తిగా కర్మ యొక్క ప్రభావం వల్ల వచ్చే దుఃఖము నాకు ఏమాత్రం అంటకుండా ఉంటుంది అనేది మనవాళ్ళు ఈ కర్మలో వేసిన ప్రణాళిక కాబట్టి సారాంశంగా మనం ఒక రెండు మాటలు చెప్పుకోవాలంటే నిత్య నిత్య నైమిత కామ్య నిషిద్ధ ప్రాయశ్చిత్తాలలో నిత్య నైమిత కర్మలని మాత్రమే చేయాలి కామ్య కర్మలు చేయాలంటే చేసుకోవచ్చు నిషిద్ధ కర్మలు మనం వీలైనంత వరకు చేయకూడదు కానీ మనకి మనం మనుషులం కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అప్పుడు దానికి యోగ్యమైన ప్రాయశ్చిత్తాన్ని చేస్తూ ఉండాలి అలాగే మనం అనుకున్న ఐదు అంశాలు కర్మకి ఏ ఐదు అంశాలు అయితే సహకరిస్తాయి శరీరం ఇంద్రియాలు మనసు ఇటువంటివి వాటిని కూడా వీలైనంత వరకు శిక్షణలో పెట్టి దారిలో పెట్టే అవకాశాన్ని చేయాలి తరువాత మనక ఏది జరిగినా కూడా ఇది మా ప్రారబ్ధం అని చెప్పి గ్రహించాలి తప్ప నేనేదో చేసేయాలి నాకేదో అయిపోవాలి అని చెప్పి అనుకోవడంలో పెద్ద ప్రయోజనం లేదు నీకు జరగాల్సిన దాన్ని నువ్వు నిర్ణయించలేవు కానీ నువ్వు చేసేదాన్ని మాత్రమే నువ్వు నిర్ణయించగలవు అది కూడా నీకు జరిగేది ఎవరి చేతుల్లోనైతే ఉందో ఆ భగవంతుని ఆరాధించి నీకు సన్మార్గంలో బుద్ధి వచ్చేటట్టుగా నీ యొక్క కర్మానుభవాన్ని మునగోచమని చెప్పి భగవంతుని ప్రార్థించుకుంటే తద్వారా ఈ కర్మ బంధాల నుంచి బయటికి వెళ్ళడానికి సరైన అనుభవాలన్నీ కూడా నీకు వస్తాయి అందుకని చాలామంది ఉంటుంటారు ఇప్పుడు మాకు ఈ విషయాలు తెలియాలండి మాకు గురువుగారు సరైన గురువు దొరకాలండి అని చెప్పంటే అవును దానికి మరి ప్రార్థించాల్సింది భగవంతుడినే ఎందుకంటే సరిైన గురువు సరైన సమయంలో దొరకడము సరిైన సత్సాంగత్యం సరిైన సమయంలో దొరకడము చెడు సాంగత్యం ఎప్పటికప్పుడు దగ్గర రాకుండా ఉండడం ఇవన్నీ కూడా దేన్ని బట్టి ఉంటాయి మళ్ళీ అవి కూడా మన సుఖ దుఃఖ అనుభవాలు బట్టి ఎవరితో సాగత్యం ఉంటుంది ఎవరితో సాంగత్యం ఉండదు అని చెప్పట్టు ఉంటుంది ఇప్పుడు మనకు ముందు దుష్టుల సాంగత్యం వచ్చి తర్వాత సత్సంగత్యం వచ్చింది అనుకోండి దుష్ట సాంగత్య ప్రభావం వల్ల మనం సత్సంగత్యాన్ని పూర్తిగా వినియోగించలేకపోతాం అదే ఈ రెండు అనుభవాలని మనం తారుమారు చేసాం అనుకోండి ముందు సత్సాంగత్యం వల్ల మన మనసులో ఎప్పుడైతే మంచి సంస్కారం వచ్చిందో దుష్ట సాంగత్యం తర్వాత వచ్చినా కూడా మన మీద అంత ప్రభావాన్ని చూపించదు కాబట్టి ఉన్న అనుభవాలు జరగాల్సిన అనుభవాలు కొన్ని ఉన్నప్పటికీ వాటి యొక్క ముందు వెనకాల వల్ల వాటి యొక్క పరిణామాలు మన యొక్క తద్వారా వచ్చే బాగోగులన్నీ కూడా నిర్ణయింపబడి ఉంటాయి కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకి శ్రేయోదాయకంగా శ్రేయో మార్గంలో నడిపించాలి అనేదాన్ని మనం భగవంతుని తప్పకుండా రోజు ప్రార్థించాల్సిన విషయం కాబట్టి కర్మ మార్గం అనేది కర్మ సిద్ధాంతం అనేది ఏమాత్రం కూడా ఆ ఒక నిరాశావహమైన దృక్పథం కాదు ఇంకా ఇంకా బలంగా చెప్పాలంటే అంటే చాలా ఆశావహమైన దృక్పథం ఎందుకంటే అది మనకి ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ ప్రయత్నాన్ని అయితే పెట్టావో ఇది ఎన్నటికీ కూడా నీకు వ్యర్థం కాకుండా పోదు నువ్వు అనుకున్న ఫలితాన్ని అది ఇవ్వకపోవచ్చు కానీ అది ఒట్టి మాత్రం ఒట్టిపోదు నువ్వు ఒక ఏదో అనుకొని నువ్వు పని చేశవు నీ కర్తవ్యానికి తగినంత ఫలితం ఎందుకంటే మనం మామూలుగా దీన్ని చాలా ప్రతికూలంగా తీసుకుంటుంటావు నువ్వు చేసింది నువ్వు అనుభవించి తీరాల్సిందే నువ్వు చేసుకుంది ఎప్పుడప్పుడు నీకు తిరిగి కొడుతుంది అని చెప్పి మనం ఎప్పుడ చాలా చాలా నెగిటివ్ గా అనుకుంటూ ఉంటాం మనం దీని గురించి మనం దీనికి అనుకూలమైన తర్కం కూడా ఉంది అని చెప్పి మనం గుర్తించాం నువ్వు ఏ మంచి పని చేసినా ఏ సత్ప్రయత్నం చేసినా ఏ మంచి సంకల్పం చేసినా దాని పట్ల ఏ ఒక్క అడుగు వేసినా కూడా దాని యొక్క మంచి ఫలితాన్ని ఎప్పటికైనా నువ్వు పొంది తీరుతావు అది నువ్వు అనుకున్న ఫలితం కాకపోవచ్చు నీకు అనుకున్న ఫలితం అన్నంత మాత్రాన నువ్వు ఏమి నువ్వు సంతోషపడకు కృంగిపోకు అయితే దానికి తగినంత ఫలితం నీకు ఎప్పటికప్పుడు నీ ప్రయత్నానికి నీ కృషికి తగినంత ఫలితం నీకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడు అనే యొక్క భరోసా నిజానికి మనకు కర్మ సిద్ధాంతం ఇది ఇస్తుంది కాబట్టి ఇటువంటి ఒక స్పష్టమైన అవగాహన మనకి కర్మ సిద్ధాంతం పట్ల ఉంటే మనం మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులని చక్కగా మనం ఎదుర్కొనగలుగుతాం మన కర్తవ్యాన్ని మనం చక్కగా నిశ్చయించుకోగలుగుతాం ఏది మన చేతుల్లో ఉంది ఏది మన చేతుల్లో లేదు అని చెప్పి తెలిసినప్పుడు మనం నిజానికి హాయిగా ప్రశాంతంగా ఉంటాం జరగాల్సింది ఏదో జరుగుతుంది మన పని మనం చేసుకుంటూ పోవడమే అనేది కర్మయోగానికి వచ్చే సారాంశం కాబట్టి దీన్ని తెలుసుకొని దీన్నంతా ఏర్పరిచిన వాడు పైవాడు ఉన్నాడు వాడిని తప్పకుండా రోజు ప్రార్థించి అర్థం చేసుకోవాలి అనేది కూడా భగవద్భక్తి కూడా కర్మ సిద్ధాంతంలో అంతర్భాగంగానే ఉంటుంది కాబట్టి దీని ప్రకారం మన పూర్వీకులందరూ కూడా మన పూర్వులందరూ కూడా వాళ్ళు ఈ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సాగించడం వల్ల వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు సంతోషంగా శాంతిగా మనశశాంతిగా ఉండగలిగారు మనం దానికి దూరంగా వెళ్ళిపోవడం వల్లనే ఎటువంటి మనశశాంతులు గాని ఆలజడులు గాని వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనం చక్కగా ఈ సాంప్రదాయికమైన శాస్త్రబద్ధమైన యుక్తి యుక్తమైన తర్కబద్ధమైన సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకున్నామ అంటే తప్పకుండా మనకు కూడా ఒక మనస్థైర్యం జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా కావాల్సిన స్థైర్యం లభిస్తుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు దీనికి మనకి తప్పకుండా భగవత్ అనుగ్రహం గురువు అనుగ్రహం కావాలి కాబట్టి ఆ ఇద్దరిని మనం ప్రార్థించుకుందాం ఈ కర్మ సిద్ధాంతం గురించి ఉపన్యాసాన్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం 

No comments:

Post a Comment