Wednesday 17 April 2024

ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగానుఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడుఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు

ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు
ఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు
నిత్యం సత్యం పలికే వాడు
నిరతము ధర్మమూ నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యునివలనే వెలిగే వాడు
ఎల్లరికి చలచల్లని వాడు
ఎదనిండా దయగల వాడు
ఎవడు ఎవడు ఎవడు

అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు
ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఏలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు
పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవు నెలరేడు
మాటకు నిలబడు ఎలారేడు
దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడు
అతడే శ్రీరాముడు శ్రీరాముడు

No comments:

Post a Comment