జాంపండువె
దోర జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే
నీ పాల బుగ్గ
ఎర్రమొగ్గలేస్తే
నా మనసున తైతక్క
రవి చూడని
రవికని చూస్తే
నా వయసుకి తలతిక్క
జాంపండునే
దోర జాంపండునే
పూచెండునే
మల్లె పూచెండునే
ఊగింది ఊగింది
నా మనసు ఊగింది
నీ కంటి రెప్పల్లో
అవి ఏం చిటికెలో
అవి ఏం కిటుకులో
ఉరికింది ఉరికింది
నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో
అవి ఏం కులుకులో
అవి ఏం మెలికలో
ఇది పంచదార చిలక
అంచులని కొరక
మీదికొచ్చి వాలమాకా
ఓయ్ చందనాల చినుక
కుందనాల మొలక
కోకడాబు కొట్టమాకా
నువ్వే నేనుగా
తిరిగాం జంటగా
నిప్పే లేదుగా
రగిలాం మంటగా
జాంపండునే
దోర జాంపండునే
పూచెండువే
మల్లె పూచెండువే
వొళ్ళంత తుల్లింతై
చెమటెంత పడుతున్న
ఆ చెమట చేరనిచోటు
చూపించవే అది చూపించవే
కళ్లంత కవ్వింతై
ఓ వింత చెబుతున్న
ఆ చెమట చేరని చోటు
ఈ పెదవులే కొరికే పెదవులే
నువ్వు ఆడ సోకు చూపి
ఈడ కొంత దాచి
కుర్ర గుండె కోయమాకా
నన్ను కౌగిలింతలడగ
కచ్చికొద్దీ కోరగ
కన్నె సైగ కోరమాకా
మరుగే ఉందిగా
చొరవే చేయగా
తరుగేమ్ పోదుగా
వొడిలో చేరగా
జాంపండువె దోర
జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే
నా పాల బుగ్గ
ఎర్రమొగ్గలేస్తే
నీ మనసున తైతక్క
రవి చూడని
రవికని చూస్తే
నీ వయసుకి తలతిక్క
జాంపండువె
దోర జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే
No comments:
Post a Comment