నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఈ వయస్సులో ఒక్కో క్షణం..ఒక్కో వసంతం..
నా మనస్సుకే ప్రతీ క్షణం..నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులలోనా అడుగులు వేస్తూ..నడిచిన దూరం ఎంతో వున్నా..
అలసట రాదు గడిచిన కాలం ఇంతని నమ్మను గా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే..
నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే..
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే..
పెదవికి చెంపా తగిలిన చోటా..
పరవశమేదో తోడవుతుంటే..పగలే అయినా గగనం లోనా..తారలు చేరెనుగా..
నిజంగా నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమే నా..ఎన్నొ వింతలు చుస్తున్నా..
ఎదలో ఎవరో చేరి..అన్నీ చేస్తున్నారా..
వెనకే వెనకే వుంటూ..నీపై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా..
హరే హరే హరే హరే హరే రామా..
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా..
ఎంతో హుషారుగా ఉన్నాది లోలోనా..ఏమ్మా
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
భారమంతా..నేను మోస్తా..అల్లుకో ఆశాలత..
చేరదీస్తా సేవ చేస్తా..రాణిలా చూస్తా..
అందుకేగా..గుండెలో నీ పేరు రాశా..
తెలివనుకో..తెగువనుకో మగ జన్మ కదా..
కథ మొదలనుకో..తుది వరకు నిలబడగలదా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
ఓ..కే..అనేశా..దేఖో నా భరోసా..నీకే వదిలేశా..నాకెందుకులే రభసా..
పరిగెడదాం పదవే చెలీ..ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ ..ఎక్కడున్నాం
ఎగిరెళదాం ఇలనొదిలి..నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్ని..ఎవరాపినా
మరోసారి అను ఆ మాట..మహారాజునైపోతాగా
ప్రతి నిమిషం నీ కోసం ..ప్రాణం సైతం పందెం వేసేస్తా
పాత ఋణమో కొత్త వరమో..జన్మ ముడి వేసిందిలా
చిలిపితనమో చెలిమి గుణమో..ఏమిటీ లీలా
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా..అదిగదిగో మదికెదురై కనబడలేదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..
పిలిచినదా చిలిపి కలా..వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా..పరుగుతీశా
వదిలినదా బిడియమిలా..ప్రశ్నల్ని చెరిపేశా
ఎదురవదా చిక్కు వల..ఎటో చూసా..
భలేగుందిలే నీ ధీమా..భరిస్తుందిలే ఈ ప్రేమ
అదరకుమా బెదరకుమా..పరదా విడిరా సరదాపడదామా
పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా..
చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా..
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా..
మమతనుకో..మగతనుకో..మతి చెడిపోదా
కథ మొదలనుకో..తుది వరకూ నిలబడగలదా..ఆ..ఆ..ఆ..ఆ..
నీ ప్రశ్నలు నీవే..ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే..ఎవ్వరూ విడిపించరుగా..
ఏ గాలో నిన్ను..తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో..తెలియదంటే చెల్లదుగా..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా....ఓ..ఓ..ఓ..ఓ..
అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా..
వలపేదో వల వేసింది..వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే రుజువేముంది..ఓ..ఓ..ఓ..ఓ..
సుడిలో పడు ప్రతి నావా..ఓ..ఓ..ఓ..ఓ..చెబుతున్నది వినలేవా..
పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా..
కడ తేరని పయనాలెన్ని..పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేశాయా చరిత పుటలు..వెనుజూడక ఉరికే వెతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు....ఓ..ఓ..ఓ..ఓ..
ఇది కాదే విధి రాత....ఓ..ఓ..ఓ..ఓ..అనుకోదేం ఎదురీత..
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో..సాగనంపక ఉంటుందా..
బతుకుంటే బడి చదువా..అనుకుంటే అతి సులువా..
పొరబడినా పడినా..జాలిపడదే కాలం మనలాగా..
ఒక నిమిషం కూడా..ఆగిపోదే నువ్వొచ్చేదాకా ....ఓ..ఓ..ఓ..ఓ..
నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..
మొదటి సారి..మదిని చేరి..
నిదర లేపిన ఉదయమా
వయసు లోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా..మరో పుట్టుకా..అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా
నేననీ నీవనీ వేరుగా లేమనీ..చెప్పినా వినరా..ఒకరైనా..
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ..ఒప్పుకోగలరా ఎపుడైనా..
రెప్ప వెనకాలా.. స్వప్నం..ఇప్పుడెదురయ్యే సత్యం..తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం..కొత్త బంగారు..లోకం..పిలిస్తే..
పదము నాది..పరుగు నీది..రథము వేయ్‌రా ప్రియతమా..
తగువు నాది..తెగువ నీది..గెలుచుకో పురుషోత్తమా..
నువ్వే దారిగా నేనే చేరగా..ఎటూ చూడక వెనువెంటే రానా..