Thursday, 28 March 2024

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన

దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన
నిత్య కారుణ్య సౌజన్య సద్భావన
దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన
నిత్యా కారుణ్య సౌజన్య సద్భావన
సర్వ శాస్త్రస్తా శక్తి ప్రబధారణ
సత్య సింహాసన ధర్మ సంస్థాపన
న్యాయ విశ్లేషణ పోషణ
స్నేహ సంభాషణ భూషణ
వేద వేదంగా శాశ్త్రహాదా విద్యాదాన
ఆది కావ్యామృత ఆనంద సంవర్ధన
రామ సీత సతి ప్రాణ నాధ
సదా జానకి ప్రేమ గాథ
మహారాగ్ని వైదేహి వీణ వినోద
నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమః
నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమస్తేయ్ నమః

దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడుఅతడే శ్రీరాముడు శ్రీరాముడు

ఒక నాడు నారద మహర్షుల వారిని నేనొక ప్రశ్న అడిగాను
ఎవడున్నాడు ఈ లోకంలో ఇదివరకెరుగనివాడు
ఎవడున్నాడు ఈ కాలంలో సరియగునడవడివాడు
నిత్యం సత్యం పలికే వాడు
నిరతము ధర్మమూ నిలిపే వాడు
చేసిన మేలు మరువని వాడు
సూర్యునివలనే వెలిగే వాడు
ఎల్లరికి చలచల్లని వాడు
ఎదనిండా దయగల వాడు
ఎవడు ఎవడు ఎవడు

అపుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు
ఒకడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు
ఏలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు
విలువులు కలిగిన విలుకాడు
పలుసుగుణాలకు చెలికాడు
చెరగని నగవు నెలరేడు
మాటకు నిలబడు ఎలారేడు
దశరధ తనయుడు దానవ ధవానుడు జానకిరామనుడు
అతడే శ్రీరాముడు శ్రీరాముడు

దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది

దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది
సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖ శాంతి ఒసగేనిది మనసంత వెలిగించి నిలిపే నిధి
సరి దారిని జనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరధ రాజు అతనికి కులసతులు గుణవతులు ముగ్గురు
పుత్రకామ యాగం చేసేది రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికి శ్రీ వర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు
రఘు వంశమే వెలిగే ఇళముదముండిరి జనులే
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

దశరధ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినె చంపే యాగమే సఫలమై కౌశిక ముని పొంగే
జయరాముని గోని ఆ ముని మిధిలాపురి కేగె

శివ ధనువధీగో నవ వధువుదిగో రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం నగుమోము వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం ఫెళ ఫెళ ధ్వని లో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగా సాగునింకా జానకి అని సీత నొసగే జనకుడు శ్రీ రామ మూర్తికి
ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగామే రామాంకితమై హృదయం కలికి సీతకి
శ్రీకారం మనోహరం ఇది వీడని ప్రియా బంధమని
ఆజాను బాహుని జతకూడి అవనిజాత
ఆనంద రాగామే తానాయే గృహిణి సీత
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

రామాయణము శ్రీ రామాయణము

రామాయణము శ్రీ రామాయణము

రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ
అడుగడుగున త్యాగము అణువణువున ధర్మమూ
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరగభీరము
సహన శీల ధీర వీర వరగభీరము
రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము

శ్రీ రామ పట్టాభిషేకం
శ్రీ రామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం
శ్రీ రామ పట్టాభిషేకం
దశరధుడు చేసే ఆదేశం
ఉప్పొంగి పోయే ఆ దేశం ఉప్పొంగి పోయే ఆ దేశం
కలవరం తెచ్చింది కైక కిచ్చిన వరం
కానలకు పంపమని లేక ఏ కనికరం పదునాలుగేళ్ళు శ్రీ రాముని
వనవాసమును చేయమన్నది వనవాసమును చేయమన్నది

చెదరని దరహాసం కదిలేను వనవాసం
చెదరని దరహాసం కదిలేను వనవాసం
వదిలి రాణివాసం వచ్చే మగణి కోసం
తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం
తండ్రి మాటకోసం కొడుకు తండ్రి కోసం
భార్య మగని కోసం లక్ష్మన్న అన్న కోసం
జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం జనమంతా ఆక్రోశం

ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా
ఏమయ్యా రామయ్యా ఏమైపోవాలయ్యా మేమేమైపోవాలయ్యా
అటు పుర జనులు ఇటు దశరధుడు వెక్కి యేడ్చినారు మొక్కి ఆపినారు
సత్య వచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించేను సతి
లక్ష్మణుడేగెను వినయశీలుడై
అయోధ్య మిగిలెను అమావాస్యాయై అయోధ్య మిగిలెను అమావాస్యాయై

రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము
అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ
అడుగడుగునా త్యాగము అణువణువునా ధర్మమూ
అనురాగము అనుబంధము అనుపమానము
అనురాగము అనుబంధము అనుపమానము
సహన శీల ధీర వీర వరగభీరము
సహన శీల ధీర వీర వరగభీరము
రామాయణము శ్రీ రామాయణము
రామాయణము శ్రీ రామాయణము

సీతా సీమంతం రంగ రంగ వైభవములేప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములేకోసల దేశమే మురిసి కొయిలై ఆశల పల్లవి పాడేపున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసేమన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ ఔతోందిసీతా సీమంతం రంగ రంగ వైభవములేప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే

సీతా సీమంతం రంగ రంగ వైభవములే 
ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే 
కోసల దేశమే మురిసి కొయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ ఔతోంది
 సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే అమ్మలక్కలంతా చేరి చెమ్మ చెక్కలాడిపాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్తగారు దగ్గరయ్యేనే కాశ్మీరామే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంపే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే అరేయ్ వద్దు వద్దు అంటున్న ముగ్గురు అక్కలు కూడి ఒక్క పని చెయ్యనివ్వరే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నెల సంబరమ్ములే పుట్టినింటి వారు వచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడుపోసినట్టు జరుగులే మెట్టినింటి వారు నేడు పట్టరాని సంబరంతో పసుపు కుంకుమ ఇచ్చినట్టులే రామ నామ కీర్తనలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లి బిడ్డలు ఇల్లు చేరులే ముత్తయిదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమె ఎక్కడున్ననూగాని చక్కనైన కల్యాణి రామ రక్షా నీకు ఎప్పుడూ దేవి సీమంతం సంతసాల వంతపాడేనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే అంగనలందరు కలిసి కోమలి కి మంగళ హారతులనిరే వేదము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనలొసగే శుభ యోగాలతో వెలిగే సాగే సుతుని కనవమ్మా దేవి సీమంతం సంతసాల వంతపాడేనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే

రాముని ప్రాణానికా జానకి దేహానికాసూర్యుని వంశానికా ఈ లోకం నోటికాఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షాశ్రీ రామా ఆఆఆ

సీతారామ చరితం
శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం
ప్రతి పదపదమున శృతిలయాన్వితం చత్రువేదవినుతం
లోకవిదితం ఆదికవి వాల్మీకి రచితం
సీతారామ చరితం
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
కోదండపానియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా
అండదండగా దమ్ముడుంన్దగా అడవితల్లికి కనుల పండుగా

సుందర రాముని మోహించె రావణా సోదరి సుర్పణకా
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైపడగా
తప్పనిసరి ఐ లక్మనుడే ముక్కు చెవులను కోసే
అన్న చూడని అక్కసుకక్కుతూ రావణు చేరెను రక్కసి ఈఈ

దారుణముగా మాయచేసెను రావణుడూ
మాయలేడి ఐనాడూ మరీచుడూ
సీత కొరకు దాని వెనుక పరిగెడే శ్రీరాముడూ
అదను చూసి సీతని అపహరించే రావణుడూ
కడలి నడుమ లంక లోన కలికి సీతనుంచే
తలుపుగుండెలోపాసుల కాపలాగా ఉంచేయీ

శోకాజేలది తానైనది వైదేహీయే
ఆశోకాజేలదిలో మునిగే దాశరధి ఆఅ
సీత సీతాయా సీత సీతా అని సీతకి వినిపించేలా
రోదసికం పెంచేలా
రోదించేయీ సీతాపతి

రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీత కెందుకీ విషాదమ్ రామునికేలా వియోగమ్మ్మ్
కమలనయనములు మునిగే పొంగి కన్నీటిలో
చూడాలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో
చూడలేకా ఆ సూర్యుడే దూకేను మున్నీటిలో

వానర రాజకు సుగ్రీవునితో రాముని కలిపే మారుతీ
జలధిని దాటి లంకను చేరగా కనపడనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చే వయనుమ వచ్చే సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపే పూస గుచ్చియి

వాయువేగమున వానర సైన్యము కడలీకి వారధి కట్టేరా
వాన వేగమున రామభద్రుడా రావణ తల పడ కొట్టేరా
ముదమున చేరేటి కులసతి సీతని దూరముగా నిలబెట్టేరా
అంత బాధపడి సీతకోసమని ఇంత చేసి శ్రీ రాముడూ ఊఊఉ
చెంత చెర జగమంతచూడగా వింత పరీక్ష విదించేను

ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా
ఎందుకు ఈ పరీక్షా ఎవ్వరికీ పరీక్షా
శ్రీ రాముని భార్యకా శిలా పరీక్ష
కొలువునిజకీయావనిజక అగ్ని పరీక్షా
దశరధుని కోడలికఆ ధర్మ పరీక్షా
జనకుని కూతురికా అనుమాన పరీక్షలా
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీ పరీక్షా ఎందుకు ఈ పరీక్షా
శ్రీ రామా ఆఆఆ

అగ్గిలోకి దుకే అవమానంతో సతి
అగ్గిలోకి దుకే అవమానంతో సతి
నిగ్గు తేలి సిగ్గు పడే సందేహపు జగతి
అగ్ని హోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా
సీత మహాపతివ్రతని జగమే ప్రణమీల్లగా
లోకులందరికి సీతే పునీతని చాటే నేటీ శ్రీ రాముడు
ఆ జానకితో అయోద్య కేగెను సకల వర్మ సందీపుడు
సీతా సమెత శ్రీ రాముడూ

అక్కడితో అయిపోకుండా ఎక్కడ ఆ ఇల్లాలేరక్కసి విధికి చీకిందా ఈ లెక్కన దైవమ్మ్మ్ ఉందాసుగుణంతో సూర్యుని వంశం వెలిగించే పునసతినిఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి ఐయ్యిందాఏ తప్పు లేని ఈ ముప్పు ఏమికాపాడలేరా ఎవరైనా కానిఈ మాటే నీడ వేరేదారీ ఏమి లేదా

గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ
ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ
రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
సాగె ఈ మౌనం సరేనా ఆఆ
కొండా కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఈదెనా ఆఆ
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామ వద్దనలేరా ఒకరు ఉఉఉ

ముక్కోటి దేవతలంతా ధీవించినది ఈ బంధమ్
ఇక్కడ ఇప్పుడు వీడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా
అందరికి ఆదర్శం అని కీర్తించే ఈ లోకం
రాముని కోరగా పోలేదా ఈ రధముని ఆపగా లేదా
విధినైనా కాన్ని ఎదిరించే వాడే
విధి లేక నేడు విలపించినాడే
ఏడెడు లోకాలకి సోకేను ఈ శోకమ్మ్మ్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ

అక్కడితో అయిపోకుండా ఎక్కడ ఆ ఇల్లాలే
రక్కసి విధికి చీకిందా ఈ లెక్కన దైవమ్మ్మ్ ఉందా
సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే పునసతిని
ఆ వెలుగే వెలివేసిందా ఈ జగమే చీకటి ఐయ్యిందా
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి
కాపాడలేరా ఎవరైనా కాని
ఈ మాటే నీడ వేరేదారీ ఏమి లేదా

నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరూ
ఘోరం ఆపేదెవరు ఎవరు ఊఊఉ
రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు
అడగండి న్యాయం ఏదెనా ఆఆ
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరు
రామా వద్దనలేరా ఒకరు ఉఉఉ