Thursday, 28 March 2024

దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది

దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ
మీ కోసం రాసింది మీ మంచి కోరింది మీ ముందుకొచ్చింది
సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖ శాంతి ఒసగేనిది మనసంత వెలిగించి నిలిపే నిధి
సరి దారిని జనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరధ రాజు అతనికి కులసతులు గుణవతులు ముగ్గురు
పుత్రకామ యాగం చేసేది రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికి శ్రీ వర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు
రఘు వంశమే వెలిగే ఇళముదముండిరి జనులే
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

దశరధ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడేతెంచెను
తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకినె చంపే యాగమే సఫలమై కౌశిక ముని పొంగే
జయరాముని గోని ఆ ముని మిధిలాపురి కేగె

శివ ధనువధీగో నవ వధువుదిగో రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందర వదనం చూసిన మధురం నగుమోము వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం ఫెళ ఫెళ ధ్వని లో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగా సాగునింకా జానకి అని సీత నొసగే జనకుడు శ్రీ రామ మూర్తికి
ఆ స్పర్శకి ఆలపించే అమృత రాగామే రామాంకితమై హృదయం కలికి సీతకి
శ్రీకారం మనోహరం ఇది వీడని ప్రియా బంధమని
ఆజాను బాహుని జతకూడి అవనిజాత
ఆనంద రాగామే తానాయే గృహిణి సీత
దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది
సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడీ

No comments:

Post a Comment