Wednesday, 27 March 2024

సహస్ర శీర్ష రంజీతం

సహస్ర శీర్ష రంజీతం 
సహస్ర నేత్ర విలసితం
సహస్ర హస్త రాజితం 
సహస్ర పాద పూజీతం 
సహస్ర విధ విభాసితం
సహస్ర వర్ణ సంస్రితం
సహస్ర రూప దీపికం
సహస్ర నామ సరళితం 
సమస్త సద్గునోనతం 
సమస్త విశ్వ సన్నుతం 
సమస్త దైవకాద్భుతం 
సమస్త  సత్ఫలమృతం
సమస్త శక్తి మండితం 
సమస్త భక్త వందితం
సమస్త ముక్తి సుహితం
నమామి కృష్ణ దైవకం||6

గోకులమున ఏ కులమైన గోపాలుని కోలిచేదెందులకుకులము అనే వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు

కృష్ణ హరే.... శ్రీ కృష్ణ హరే 
హరే కృష్ణ  హరే కృష్ణ 
భజే కృష్ణ హరే  కృష్ణ భజే

బృందావనమున అందెల  రవళిలు చిందులు వేసేది ఎందులకు
గోవిందును లీలా మకరందం అందరికీ అందిచుటకు
అందరికీ అందిచుటకు
గోకులమున ఏ కులమైన గోపాలుని కోలిచేదెందులకు
కులము అనే వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు
నల్ల నల్లని మేఘం లాగా నడిచోస్తాడు ఎందులకు
చల్లని కరుణామృత ధారలలో మనలను ముంచీ వెల్లుటకు
మనలను ముంచీ వెల్లుటకు
చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసే దెందులకు
ఎందులకు
చెంతచేరి గోవిందుని సన్నిధి పరమపదమని చాటుటకు
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే
హరే కృష్ణ హరే
కృష్ణ హరే ||4......

అల వైకుంఠము వీడి నను గూడిఅటలాడగా.. వచ్చితివా....ప్రేమ మీరగా రంగా అని పేరుపెట్టి నను పిలిచితివాతలిదండ్రుల సేవల మైమరచిన తనయునిపైనే అలగితివా

నీల మేఘవర వర్ణ నిగమ నిగమాంత నిజ నివాస
శరస్చంద్రిక సౌమ్య సౌందర్య చారు చంద్రహాస
మధుర మధుర మణి కుండల మండిత గండ యుగవికాస
పద్మ పత్రనయనా పరమాత్మ పాహిచిద్విలాస
పాహిచిద్విలాసా పాహిచిద్విలాసా...
అల వైకుంఠము  వీడి నను గూడి
అటలాడగా.. వచ్చితివా....
ప్రేమ మీరగా రంగా అని పేరుపెట్టి నను పిలిచితివా
తలిదండ్రుల సేవల మైమరచిన తనయునిపైనే అలగితివా
శ్రీత మృదుల శ్రీ మాధవా శిల వైతివా శ్రీ కీశవా ఆ...

నాకోసం నా ఇంటికి వచ్చిన భువన మోహన భూ భరణ 
కనుల ఎదుట సాక్షాత్కరించిన కాననైతినే కలిహరణా
రాధ హృదయ బృందా రసమయ గరుడ తురంగా
రావ నే రంగని బ్రోవ రాజది రాజ శ్రీరంగా
రంగా పాండురంగా ||2.....

అనేకమందితో తుతో అందులో ఒక్కరితో ఏం చేసావో చెప్పు

కోసలదేశపు కోమలితో
కొంకిని నగరపు కామినితో
హస్తినాపురపు అశ్వినితో
పాటలిపుత్ర పద్మినితో
తరికిట తోమ్ అందరితో
తదిగిన తోం ఎందరితో
ఒక్కర ఇద్దర ముగ్గురా తెలియదు లెక్కెంతో ఎంతో ఓ..
సింధూ తీరపు సుందరితో తో తో తో
పుంతల ప్రాంతపు కాంతలతో ఓ..

కన్యాను కవ్వించ చుంబనాలతో ఆ
ముగ్ధను మురిపించ మర్దనాలతో
ప్రౌడను ఆలరించా పీడనాలతో
తరుణ్ అందర్నీ మెప్పించ తరుణోపాయంతో మ్మ్

సరస ప్రవీణ హా హా
శృంగార రత్న హా హా హా పడుచు ప్రసన్న
పడక ప్రపూర్ణ అను పిలుపులతో
పలు బిరుదులతో ప్రసంశించరు నన్నెంతో
ఎంతో ఓ ఓ ఓ వోహోహో
వుజ్జయిని సమ వుజ్జయితో తో తో తో
ద్రావిడ లో ఒక ఆవిడతో ఓ...

అనేకమందితో  తుతో అందులో ఒక్కరితో ఏం చేసావో చెప్పు
రసికుల తిలక పూర్తి వివరణలతో
తనువును తడిపాను పాలు తేనెతో
తదుపరి తుడిచాను పేదవి దూదితో
పరిమళం మద్ధాను పంటి పూల తో ఓ..
కొంటే సేవలను చేసాను ఒంటి చేతితో...
 తోలి సారి గీచి మరి సారి మార్చి సుక శికరమేదో చూపను మేచ్చి
నా విత్వత్తు రస విద్యుత్తు అది నబూతో నా భవిష్యత్తు హా హా హా
నానా జాతుల వనితలతో ఇతరత్ర పలు ఇంతులతో ఓ హో హో.

అనుదిన జన దూప దీప సంబ్రంబలోదీన జనుల కన్నీళ్లు కనపడవా మాధవాగణ గణ గణ గణ గణ గుడి గంటారావంలోనిను నమ్మిన గుండె గోష వినపడదా కేశవ

హే కృష్ణ ముకుందా
హే కృష్ణ ముకుందా మురారీ
శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ శ్రీ మాధవ శ్రీధరా
దామోదర నీ దర్శనము ఈ జన్మకు దొరకదా
హే మాధవ పుండరీక హే వనమాలీ
గోవిందా భక్తహృదయ బృందా విహారీ
అ గజేంద్ర ప్రాణదాత నీవేకద శ్రీహరీ
కోన వూపిరి వూపిరివై కనిపించగా రారా హరీ
హే మాధవ పుండరీక హే వనమాలీ

అనుదిన జన దూప దీప సంబ్రంబలో
దీన జనుల కన్నీళ్లు  కనపడవా మాధవా
గణ గణ గణ గణ గణ గుడి గంటారావంలో
నిను నమ్మిన గుండె గోష వినపడదా కేశవ
వినపడదా కేశవ వినపడదా కేశవ ||2
విన్నా వినపడనట్టు  వుంటావా రాయిలా
వింటే మనసుంటే కనులుంటే కనుగొంటే
 కరుణ ఉంటే రాయిలా || హే మాధవ పుండరీక హే వనమాలీ

యశోద వకుళ  గా  వేచివున్నదని వెంకటేశునిగ వెళ్ళావే 
నరకాసుర చేర వనితల కొరకై సమరార్బటి గావించావే గోపాల గోపాల గోకులనందన గోపాల..
నీకై జనించి నీకై జపించీ
నీకై తపించి నీకై జ్వలించే
దాసురాలికే దర్శేనమివ్వగా
గర్భమోలే నిర్బంధించే ఈ గర్బగు
డా నీకు అడ్డంకా
నీలి మేఘమే నిప్పు రాల్చదా నేమలి పింఛమే జడిపిస్తే 
ప్రబంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి అజ్ఞాపిస్తే
తలుపులు తెరిపించూ దర్శేనమిప్పించూ || హే కృష్ణ.... ముకుందాహే కృష్ణ ముకుందా మురారీ

మాతృదేవోభవమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచాను

వాగర్థవీవా సంప్రిక్తౌ వాగర్థః ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥

మాతృదేవోభవ
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నాపైనే నాకేంతో ద్వేషంగా ఉందమ్మా
నీ చేసిన పాపాలకు నిష్కృతిలెదమ్మా
అమ్మ ఒక్కసారి నిన్ను చూసి చనిపోవలని ఉన్నది
నాన్నా అని ఒక్కసారి పిలిచి కను మూయలని ఉన్నది
అమ్మ నాన్నా అమ్మ ||2

అమ్మ నీ కలలే నా కంటి పాపలైనవని
నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని
నీ నేతుటి ముద్దయే న అందమైన దేహమనీ
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురనీ
తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మ
కదుపుతీపినే హేలన చేసిన జులయిని
కన్న పెగు ముడిని తెంపివేసిన కసాయినీ
మరచిపోయి కూడా నను మర్నించవద్దు అమ్మా
కలనైన నను కరుణించొద్దు నాన్నా

నాన్న నీ గుండెపై నడక నేర్చుకున్నానీ
నీ చూపుడు వెలితో లోకన్నే చూసానని
నాన్నని పూజిస్తే ఆదిదేవునికది అందుననీ
అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన
తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న
నాన్నంటే నడిచె దేవాలయమని మరచితిని
ఆత్మ జ్యోతి చెజెతుల ఆర్పివేసుకొంటిని 
మరచిపోయి కూడ నను మర్నించవద్ద అమ్మా
కలనైన నను కరుణించొద్దు నన్నా
కన్న నిను ఇచిన కన్నయ్యే
ఇచ్చాడు క్షమించే హృదయం

గోపాల బాలకృష్ణ గోకులాష్టమీఆబాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ..

గోపాల బాలకృష్ణ గోకులాష్టమీ
ఆబాల గోపాల పుణ్యాల పున్నమి 
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని 
నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ..

గోపికా ప్రియ కృష్ణహరే 
నమో కోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే 
నమో వేదాంగ దివ్యా కృష్ణ హరే 

ఆఆఆ.. ఆఆఆఆ....
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా
నవ మోహన జీవన వరమిచ్చెనమ్మా
ఇకపై ఇంకెపుడు నీ చేయివిడిచి వెళ్లనని
చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా

దేవకీవసుదేవ పుత్ర హరే 
నమో పద్మ పత్రనేత్ర కృష్ణహరే
యదుకుల నందన కృష్ణహరే 
నమో యశోద నందన కృష్ణహరే 

ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చేనమ్మా .
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మా
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి
వెండివెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
కళ్యాణ రాగ మురళి కళలు చిలికినమ్మా
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా

గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 

తప్పటడుగు తాండవాలు చేసెనాడమ్మా
తన అడుగుల ముగ్గులు చూసి మురిసి నాడమ్మా
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి
మన తప్పటడుగులు సరి దిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిసిమెరిసేనమ్మా
కలకాల భాగ్యాలు కలిసోచ్చేనమ్మా
హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా
శ్రీ పాదం ఉన్నచోట సిరులు విరుయునమ్మా

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

ఆపదోద్దారక కృష్ణహరే 
నమో ఆనంద వర్ధక కృష్ణహరే 
లీలా మానుష కృష్ణహరే 
నమో ప్రాణ విలాస కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవర్ధనోద్దార కృష్ణహరే 
నమో గోపాల భూపాల కృష్ణహరే 

గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే 
గోవింద గోవింద కృష్ణహరే 
నమో గోపిక వల్లభ కృష్ణహరే