Wednesday 27 March 2024

మాతృదేవోభవమాతృదేవోభవ అన్న సూక్తి మరిచానుపితృదేవోభవ అన్న మాట విడిచాను

వాగర్థవీవా సంప్రిక్తౌ వాగర్థః ప్రతిపత్తయే |
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥

మాతృదేవోభవ
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నాపైనే నాకేంతో ద్వేషంగా ఉందమ్మా
నీ చేసిన పాపాలకు నిష్కృతిలెదమ్మా
అమ్మ ఒక్కసారి నిన్ను చూసి చనిపోవలని ఉన్నది
నాన్నా అని ఒక్కసారి పిలిచి కను మూయలని ఉన్నది
అమ్మ నాన్నా అమ్మ ||2

అమ్మ నీ కలలే నా కంటి పాపలైనవని
నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని
నీ నేతుటి ముద్దయే న అందమైన దేహమనీ
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురనీ
తెలియనైతి తల్లి ఎరుగనైతి నమ్మ
కదుపుతీపినే హేలన చేసిన జులయిని
కన్న పెగు ముడిని తెంపివేసిన కసాయినీ
మరచిపోయి కూడా నను మర్నించవద్దు అమ్మా
కలనైన నను కరుణించొద్దు నాన్నా

నాన్న నీ గుండెపై నడక నేర్చుకున్నానీ
నీ చూపుడు వెలితో లోకన్నే చూసానని
నాన్నని పూజిస్తే ఆదిదేవునికది అందుననీ
అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన
తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న
నాన్నంటే నడిచె దేవాలయమని మరచితిని
ఆత్మ జ్యోతి చెజెతుల ఆర్పివేసుకొంటిని 
మరచిపోయి కూడ నను మర్నించవద్ద అమ్మా
కలనైన నను కరుణించొద్దు నన్నా
కన్న నిను ఇచిన కన్నయ్యే
ఇచ్చాడు క్షమించే హృదయం

No comments:

Post a Comment