Thursday, 16 April 2026

కాలం గూర్చి ఆత్మీయ పుత్రులు సామవేదం షణ్ముఖ శర్మ గారి వివరణ.. అక్షరబద్ధం.

అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ కాలం గురించి భారతీయ మహర్షులు చాలా పరిశోధన పరిశీలన అధ్యయనం ఆవిష్కారం చేశారు ఇక్కడ కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎందుకంటే సర్వలోకములు సర్వజీవులు కాలబద్ధులే కాలాన్ని అనుసరించితేనే జన్మిస్తారు కాలాన్ని అనుసరిస్తేనే సాగుతూ ఉంటారు అందుకే కలయతి నియతి ఇతి కాలః అని ఒక మాట ఉన్నది కాలానికి మరొక పేరు నియతి నియతి అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరగడం నియతి సూర్యుడు ఉదయించడం అది ఒక నియతి అది ఎవరు మార్చలేరు అదేవిధంగా ప్రతివాడు జీవితం గడవడం కూడా నియతి అయితే అది తెలుసుకుని అలా ఉన్న నియతి రూపమైన కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అది కాలం అనగా పరిణామ స్వరూపం అర్థం చెప్పారు ఇక్కడ కాలం మనకు కనబడుతుందా ఎవరికైనా కాలం కనబడదు అలాగని కాలం లేదంటారా ప్రతివాడికి వస్తువులు కనబడితే విషయాలు కనబడతాయి కానీ కాలం కనబడదు కదా అంటే జరుగుతున్న మార్పే కాలం యొక్క స్వరూపం అన్నారు అంటే కాలం అనగా పరిణామ శక్తి అని అర్థం ఇక్కడ మార్పు అని అర్థం ఇక్కడ మార్పు రూపంలో కాలం కనబడుతూ ఉంటుంది ఒకప్పుడు బాలురుగా ఉన్నవాళ్ళు తర్వాత యువకులు కావడం ఆ తర్వాత వృద్ధులు కావడం ఆ రూపంగా కాలం కనబడుతుంది కనుక కనబడుతున్న వాటి యందు కాలాన్ని తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం పరిణామం రూపంలో అయితే మంచి పరిణామం రావాలి అంటే కాలం కూడా తన ఇష్టానుసారం ఇవ్వదు మనం చేసేదాన్ని గమనిస్తూనే కాలం ఇస్తున్నది కనుక కాలం పరమేశ్వరుడు ధరించిన స్వరూపంగా భావిస్తూ కాల రూపంగా పరమేశ్వరుడు కర్మ ఫల ప్రదాత అవుతున్నాడు అందుకే కాలం చాలా ముఖ్యమైనది గనుకనే కాలాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అది ఎలా చేయాలంటే కాల విభాగజ్ఞః అని ఒక మాట ఉంది దీన్నే కాలజ్ఞత అంటారు కాలజ్ఞత కాలజ్ఞానం అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తుని చెప్పడం అని కాదు ఇక్కడ కాలజ్ఞానము అంటే ఏ కాలంలో ఏమి చేయాలో తెలుసుకోవడమే కాలజ్ఞానము ఇది కాలజ్ఞత అది ఒక మహా పురుష లక్షణంగా చెప్తూ రామాయణంలో రాముని గురించి చెప్తూ వాల్మీకి ఒక మాట అంటాడు దేశ కాల విభాగజ్ఞః ఆ అంటే ఏ దేశంలో అంటే ఏ చోట ఎలా ప్రవర్తించాలి ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలి ఈ రెండు తెలిసినవాడు ఉత్తమ పురుషుడు వాడు తన జన్మని సార్ధకం చేసుకుంటాడు జన్మని సార్ధకం చేసుకోవడం అంటే ఎన్నో సాధించగలగడం ఎన్నో సాధించగలిగిన గొప్ప జన్మ మనక వచ్చింది ఆ జన్మని సార్ధకం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలంటే కాలాన్ని సద్వినియోగ పరుచుకోగలగాలి అందుకే ధర్మం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు నువ్వు ఎక్కడున్నావో దాన్ని బట్టి ధర్మం ఆచరించాలి నువ్వు నువ్వు ఏ కాలంలో ఉన్నావో ఆ కాలాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలి అంతేగని మండి వేసవలో నాగలు పట్టుకొని దున్నుతాను అంటే కుదరదు అది వర్షాలకు అనుకూలమైనప్పుడు దాన్ని దున్నాలి అంతేకాని నేను కష్టపడ్డాను కదండీ నాగరితో దున్నాను కదా కష్టే ఫలే అన్నారు కనుక వర్షాలు కురవకపోయినా నేను పని చేస్తాను అంటే అలాగా కనుక నువ్వు కష్టపడ్డప్పటికి సరైన కాలం ఉండాలి ఇక్కడ అది కాలజ్ఞత దేశము ఈ రెండిటి యొక్క విభాగాలు తెలుసుకోవడం చాలా ప్రధానం ఇది గమనించినప్పుడు ప్రతి క్షణం విలువైనది అనే భావం ప్రతి వ్యక్తికి ఉండాలి అంతేగాని ఆ కాలాన్ని అనవసరపు కార్యక్రమాలతో వ్యర్థం చేయరాదు అన్నారు ఇక్కడ కనుక జీవనశైలి అంటే కాలానికి అనుగుణంగా ప్రవర్తించడం జీవనశైలి ఇది ఎలా ఉంటుందంటే కాలం యొక్క విలువ తెలియాలి సృష్టిలో అత్యంత విలువైనది ఏంటంటే కాలమే గొప్ప విలువైనది అందుకే ఆ కాలం యొక్క విలువ తెలుసుకొని కాలాన్ని సద్వినియోగ పరుచుకోవడమే కాలానుగుణంగా ప్రవర్తించ కాలంలో వచ్చిన మార్పులని నీకు అనుకూలంగా చేసుకోగలగాలి అటువంటి విధానాన్ని చెప్తూ ఎప్పుడు కూడా ఆలస్యం పనికి రాదు అన్నారు ఇక్కడ ఆలస్యము అంటే సోమరితనము వాయిదా వేయుట దీనికి దీర్ఘ సూత్రత అని కూడా పేరుఉన్నది ఇక్కడ అంటే బద్ధకము సోమరితనము వాయిదాలు వేయడం ఇవాళ అనుకున్న పని రేపు చేద్దామని అనుకోవడం ఇలాంటివి కూడదు అని చెప్తూ కాలం యొక్క సద్వినియోగమే ఉత్తమ జీవన శైలి అని చెప్తుంది ఇది వేద జీవన నిర్దేశిస్తున్న అద్భుతమైన అంశం అంటే ప్రతిక్షణం సార్ధకం చేసుకోగలగాలి ఇంకా చెప్పాలంటే ప్రతిక్షణం జ్ఞా జ్ఞానంతో ప్రకాశించాలి జ్ఞానంతో ప్రకాశించడం అంటే అర్థం ఏంటంటే తెలివిగా ప్రవర్తించాలి అని అర్థం ఇక్కడ పైగా జ్ఞానాన్ని సముపార్జించడం కోసం కాలం వినియోగింపబడాలి జ్ఞానంతో కాలం వినియోగింపబడాలి అంటే మంచి తెలివి ఉంటేనే కాలాన్ని సద్వినియోగ పరుచుకుంటాడు మూర్ఖుడు బాగా శ్రమపడతాడు కానీ ఇది సాధించలేడు కానీ తెలివైన వాడు తక్కువ శ్రమతో ఎక్కువ సాధించగలడు ఎందుకంటే తెలివితో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అందుకే ఎప్పుడైనా సరే సకాలంలో సరి అయిన పని చేయడమే చాలా ముఖ్యమైన అంశము అందుకే ఒక ప్రవర్తన సరలి మనకి ఏర్పరిచారు ఒక దినచర్యను ఏర్పాటు చేశారు అందులో నిద్రతో ఎక్కువ కాలం వెళ్ళకూడదుట అలాగన చెప్పి నిద్ర లేకపోయినా ప్రమాదమే నిద్ర ఎందుకంటే మళ్ళీ శక్తి పుంజుకోవడం కోసం నిద్ర అది విశ్రాంతి విశ్రాంతి అంటే విరామం కొన్ని పనుల మధ్య ఉన్నటువంటి విరామాన్ని విశ్రాంతి అంటున్నారు కానీ ఏ పని లేకుండా విశ్రాంతి తీసుకుంటే దాన్ని విశ్రాంతి శబ్దం అన్నారు అక్కడ అది విరామం కాదు పని పాటు లేనితనం అంటారు కానీ సోమరితనం బద్ధకం వీటి వీడికి విశ్రాంతి అని పేరు పెట్టుకోకూడదు బాగా కష్టపడ్డవాడికే కాస్త పుంజుకుని మళ్ళీ పనిలోకి దిగడానికి కావలసిన విరామం పేరు విశ్రాంతి అన్నాం కదా అందుకే ప్రతి క్షణం సార్ధకం చేసుకోగలగాలి నిద్రకి ఎంత సమయం ఇవ్వాలో కూడా మన పెద్దవాళ్ళు నిర్దేశించేశారు ఆ రాత్రి అనేది దానికి చెప్పారు పైగా ఆ బ్రాహ్మీ ముహూర్త కాలం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ సమయం దైవంతో అనుసంధానం చేసుకోవాలి ఏ సమయం ప్రపంచంతో అనుసంధానం చేసుకోవాలి ఏ సమయం వ్యక్తిగత భోగాలు అనుసంధానం చేసుకోవాలో విభాగం చేశారు ఈ దేశకాల విభాగముల గురించి కూడా మనకి రామాయణంలో భరతులతో మాట్లాడుతున్నప్పుడు రాముడే చెప్తాడు ముఖ్యంగా ప్రాతక్కాలం భగవత్ కార్యాలకి ధర్మ కార్యాలకు వినియోగించాలి అటు తర్వాత మధ్యాహ్న కాలం అంతా లౌకికమైన కార్యక్రమాలు అది వృత్తి వ్యాపారం ఇత్యాదులు వినియోగించాలి రాత్రివేళ ఒక విచారణకి ఒక శాంతికి ఒక భోగానికి వినియోగించుకోగలగాలి మానవుడి శరీరం అన్నాక అది ఇంద్రియాల లక్షణమే భోగాన్ని కోరుకుంటుంది కానీ ఆ భోగం ధర్మబద్ధమైన భోగం కావాలి దానికి సమయం అదే విధంగా నీకంటూ ఆత్మ విచారణకు కూడా సమయం కావాలి కదా వీటికి గాను ఒక కాలం చెప్పారు ఇలా విభాగం చేసుకోవాలి అని చెప్తున్నారు కాలం ఒక అవకాశం ఇస్తుంది నీకు అవకాశాన్ని అలసత్వం చేతో వాయుధా చేత పక్కన పెట్టకూడదు అది అందుకోగలగాలి ఆ సమయానికి నువ్వు హాజరు కాగలగాలి లేకపోతే అది అందుకోలేవు హాజరు అంటే సన్నద్ధంగా ఉండడం సద్వినియోగం చేసుకోవడం ఇది హాజరు అవ్వడం దీని గురించి చెప్తూ స్మృతుల్లో ఒక మాట ఉన్నది విలంబం నాచరే ధర్మం చలం చిత్తం వినశ్యతి ఇంద్రియే నాగత్య సంవాద యవ ధర్మ ఉదాహృతః అని ఒక మాట కనబడుతుంది ఇది స్మృతుల్లో చెప్తున్నారు ఎప్పుడు కూడా విలంబం చేయకూడదు విలంబం అంటే ఆలస్యం చేయకూడదు ఎందుకంటే ఆలస్యం చేసేమంటే అవకాశం చేయజారిపోవచ్చు బుద్ధి కూడా మారిపోవచ్చు అది గొప్ప మాటండి చలం చిత్తం వినశ్యతి బుద్ధి కూడా మారిపోవచ్చు ఒకప్పుడు ధర్మరాజు ఏదో ఒక దాన కార్యం గురించి మాట్లాడేటప్పుడు తర్వాత చేద్దామని అన్నాట భీముడు వెంటనే అప్పుడే చేసేసాడు నువ్వు ఇప్పుడే చేసావఏంటి రేపో మాపో చేయవచ్చు కదా అంటే అప్పుడు భీముడు ఒక మాట అంటాడు రేపు మీద నీకు అంత నమ్మకం ఉందా అన్నయ్యా అని అంటే రేపని ఉంటుంది అప్పుడు నేను ఉంటాను అనుకుంటున్నావా కానీ ధర్మాచరణ చేసేటప్పుడు మాత్రము ఈ క్షణమే శాశ్వతం అనుకొని చేయాలి అందుకని ఇంకా కాలం ఉంది కదా అనుకూడదు అలాగని గన రేపు నేను ఉండనేమో అనేటువంటి భయంకరమైన భావము కూడదు అంటే ధర్మం ఆచరించేటప్పుడు అలా చేయాలన్నారు ఇక్కడ నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్్రహః అనేటువంటి సూక్తి ముడుకడం మనకు కనబడుతుంది ఇందులో చెప్తున్న గొప్ప మాట ఇంద్రేనాగత్య సంవాద యేష ధర్మ ఉదాహృతః అనే మాట ఇంద్ర అగస్త్యుల సంవాదంలో ఈ ధర్మమే చెప్పబడుతోంది అని స్మృతి స్మృతి అంటేనే శృతిలో ఉన్నదాన్ని స్మరించేది స్మృతి అంటే వేదంలో చెప్పినదాన్ని స్మరిస్తున్నది ఈ వేదంలో ఇంద్ర అగస్త్య సంవాదమనకు వృత్తాంతం ఉంది ఆ వృత్తాంత ప్రకారంగా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే విలంబం నాచరేత్ ధర్మే ధర్మమునందు ఆలస్యం పనికి రాదు ఎందుకంటే చలం చిత్తం చిత్తం ఎప్పుడ ఒకలా ఉండదు అది మారిపోతూ ఉంటుంది గనుక ఎప్పుడు ధర్మం తోచిన వెంటనే చేయాలి ఇవాళ దానం చేయాలి అనిపించింది వెంటనే చేసేయాలి అంటే మంచి ఆలోచన ఇప్పుడు వెంటనే చేయాలి ఇక్కడ దీనికి ఉదాహరణగా ఈ కథను చెప్తున్నారు ఇంద్ర అగస్త్య సంవాదం అని ఇంద్రాగస్త్య సంవాదం అనేది ఋగ్వేదంలో కనబడేటువంటి గొప్ప కథ ఒకప్పుడు అగస్త్య మహర్షి ఆహుతులు ఇస్తున్నాడు అందులో మహస్చిత్ అనేటువంటి మంత్రం చెప్తూ ఇంద్రుని ఉద్దేశిస్తూ ఆహుతి ఇవ్వబోతుంటే ఇంద్రుడు అప్పుడు రాజ్యాభిమాన వసాత్ రాజ్యాభిమానము వలన ఆ సమయానికి ఆహుతి అందుకోలేదు రాజ్యాభిమానం అంటే అనేక రకాల కారణాలు చెప్పవచ్చు దీనికి వ్యాఖ్యానం అనేక విధాలుగా చెప్పవచ్చు ఒకటి ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి గనుక ఆ పనిలో ఉండడం వల్ల అనొచ్చు లేదా ముల్లోకాలకు అధిపతిని నేను కదా అని అభిమానం అంటే అహంకారం ఏర్పడి అందుకోవడంలో ల ఆలస్యం చేశాడు ఆయన అహంకారం ఉంటే వెంటనే బయల్లి అహంకారం వల్ల అభిమానం వల్ల కొంచెం ఆలస్యం చేశాడు ఎప్పుడైతే ఎత్తిన ఆహుతి అతడు అందుకోలేదో దాన్ని వ్యర్థం చేయకూడదు ఆ వ్యర్థం చేయకుండా అప్పుడు మరుద్గణమునకు ఆహుతిని ఇచ్చాడు అగస్త్య మహర్షి మరుద్గణమును అందుకున్నారు కొంతసేపు ఇంద్రుడు వచ్చాడు వచ్చిన ఆహుతి ఏది అన్నట్టు చూసాడు పిలిచినప్పుడు అసలు ఆహుతి అంటే ఆహుత నేను ఆహ్వానించినప్పుడు నువ్వు అందుకోవాలి స్వాహా అన్నాను ఎప్పుడో ఆ దేవత ఆహ్వానవాచకం అప్పుడు నువ్వు వచ్చి అందుకోవాలి ఆ సమయం నువ్వు అందుకోలేదు ఆ విలంబం కారణంగా మరుద్గణములకు ఇవ్వవలసింది అయినా పర్వా పర్వాలేదులే తర్వాత నీకు ఇస్తాను అన్నాడు ఆ తర్వాత ఇస్తానని ఎప్పుడు అగస్త్యుడు అన్నాడో అప్పుడు ఇంద్రుడు అన్నాడు తర్వాత ఎవరు నమ్మగలరయ్యా ఆ కాలమే ముఖ్యం తరువాత అన్నప్పుడు చిత్తము మారవచ్చు ఆ తర్వాత ఎన్నో మార్పులు జరగవచ్చు అందుకే ఎప్పుడు విలంబం అనేది ఆలస్యం అనేది ప్రమాదకారి వచ్చినప్పుడు అందుకోగలగాలి నూనమస్తి నో స్వహ కస్తద్వేద యదృతం ఈ మాటలు ఏంటంటే నూనమస్తి నోస్వః రేపు అనేది లేదు కస్త తస్తద్వేద యద్భుతం ఏది జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే అన్యస్య చిత్తమభి సంచరేన్ యముతాదీతం వినస్యతి అనే మాట చెప్పారు ఇక్కడ ఎప్పుడు చిత్తం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు ఇది ఋగ్వేదంలోని మంత్రం మనం అర్థం చేసుకోవడానికి ఎలా చదువుకోవాలో అలా చదువుకున్నాం మళ్ళీ మంత్ర ప్రకారంగా స్వరాలతో కాకుండా విషయాన్ని తెలుసుకున్నాను ఇక్కడ ఇది ఇంద్రగస్త్య సంవాదం అని చెప్పారు ఈ కథలో చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే మానవులకు ఉపదేశిస్తున్న గొప్ప అంశము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం అనేది కూడదు అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలగాలి ఇలాంటి విషయం చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పినట్లయితే కాలాన్ని సద్వినియోగ పరుచుకుంటారు లేకపోతే బద్ధకంతోనో తత్కాల సుఖం కోసమో చేయవలసిన పనిని వాయిదా వేస్తే తర్వాత కాలం ఇలాగే అనుకూలంగా ఉంటుంది అని చెప్పలేము కదా అప్పుడు మళ్ళీ తెచ్చుకున్న వెనక్కి రాదు అందుకే బాల్యంలో చదువుకునేటప్పుడు ఆ చదువు మీద దృష్టి పెట్టి ఇతరతర వినోదాల వైపు విందుల వైపు పరిగెత్తకుండా దాని మీద ఏకాగ్రం పరిచినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది అప్పుడు అలా కాకుండా ఆ చదువు విషయంలో విలంబం చేస్తే తర్వాత అయ్యో అప్పుడు నేను చదువుకుంటే బాగుండేదో అని బాధపడవలసి వస్తుంది అందుకే భగవంతుడు మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయంలో చేయగలిగిన ఒక శక్తి మనలో ఉంటుంది తర్వాత ఈ శక్తి తర్వాత సమయంలో వస్తుందని చెప్పలేం అందుకే యవ్వనంలో చేయగలిగినది వృద్ధాప్యంలో చేయలేం ఆ కారణం చేత యవ్వనంలో చేయగలిగింది యవ్వనంలోనే చేయాలి ఈ విషయాన్ని అనేక రకాలుగా చెప్తూ ఎవడైతే వర్ష ఋతువులో కష్టపడి పండిస్తాడో వాడు వర్షాలు లేని కాలంలో సుఖంగా ఉంటాడు కదా అని చెప్తారు ఇక్కడ అంటే అర్థం వర్షం రూపంలో కాలం మనకు అనుకూలించినప్పుడు దానిని పంటలు పొందడం కోసం వినియోగించుకొని శ్రమ పడితే వాటి తర్వాత వచ్చిన ఫలంతో చక్కగా క్షేమంగా ఉండవచ్చు అందుకే కాలాన్ని సద్వినియోగపరుచుకోవడం అనేది అనేక విధాలుగా అన్నిటికి అన్వయిస్తుంది ఇక్కడ ఎందుకంటే జీవితమే ఒక కాలానికి నిబద్ధమైన ఉంటుంది ఇక్కడ ఈ జీవితంలో వివిధ దశలు ఉంటాయి మనకి ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి చేయగలం అందుకే యవ్వనము మొదలైన వచ్చినప్పుడు వినోదించాలి అనిపిస్తుంది ఎందుకంటే ఇంద్రియాలు బాగా పని చేస్తున్నాయి గనుక భోగాలు అనుభవించాలి అనిపించి కేవలం భోగాలు అనుభవించడం కోసమే జీవితంంతా విచ్చించేస్తుంది ఎంత భోగం అనుభవిస్తే ఇంద్రియ బలం అంత క్షీణిస్తుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ అప్పుడు తర్వాత ఇంద్రియములు తొందరగా బలహీనమైపోతాయి కొందరికి నిజానికి వార్ధక్యం కంటే జ్వర వచ్చేస్తుందండి వార్ధక్యం అంటే పెద్దరికం జర అంటే కృషించుట అని అర్ధం ఇక్కడ వయస్సు పెద్దవడం వేరు శరీరంలో అవయవాలు క్షీణించడం వేరు అవయవాలు ఎందుకు క్షీణించాయి అంటే యవ్వన కాలంలో ఉన్న శరీరాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియక కేవలం భోగాలు అనుభవించడం కోసమే అని ప్రవర్తించడం వల్ల రజోగుణ తమోగుణము లేని సుఖములు ప్రోగు చేసుకోవడం వల్ల బలహీనపడ్డాడు అదే ఆ సమయంలో జాగ్రత్తగా ఉండి శరీరాన్ని వ్యాయామంతోను అదేవిధంగా నియమితమైనటువంటి ఆహారంతోను నియంత్రించి ఉన్నట్లయితే అంటే భోగాన్ని నియంత్రించగలిగితే శరీరంలో శక్తి పెరుగుతుంది అందుకని భోగాన్ని విడిచిపెట్టమని కాదు భోగాన్ని నియంత్రించాలి ఆ నియంత్రించడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది అలా శక్తి పెరిగితే నీకు వృద్ధాప్యం వచ్చిన జ్వర రాదు అన్నారు అంటే ఆయువు కూడా పెరుగుతుంది అందుకే కొందరు చెప్తూఉంటారు వృద్ధాప్యం అంటే ఏమిటంటే యవ్వనంలో నవ్వుతూ చేసిన దాన్ని ఏడుస్తూ అనుభవించే కాలమే వృద్ధాప్యం అంటూ ఉంటారు ఎందుకంటే యవ్వనంలో ధర్మం గురించి చెప్పినా భగవంతుని గురించి చెప్పినా పట్టదు ఎందుకంటే ఇంద్రియాలు పని చేస్తున్నాయి కదా వాడు తర్వాత యవ్వనం దాటిపోయిన తర్వాత శరీరానికి ఒకవేళ సాధన చేద్దామన్న శరీరం అనుకూలించదు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదంతా చూస్తూ ఉంటే కాలాన్ని ఎలా సద్వినియోగ పరుచుకోవాలి అని ఆ సద్వినియోగం ఎలా పరుచుకోవాలి నియంత్రణ ఎలా చేయాలి అనే రెండు ప్రశ్నలకు సమాధానమే ధర్మం అనేది అక్కడ ప్రవేశిస్తుంది అందుకే ధర్మం చెప్తుంది భోగం ఏ పరిధిలో చేయాలి ఏ హద్దులో భోగం ఉండాలి అలా హద్దులో ఉన్నప్పుడు నువ్వు కాలాన్ని చక్కగా విభాగం చేసుకోగలవు అందుకే భోగానికి సమయం ఎంత వినియోగించాలి జ్ఞానానికి జ్ఞాన సౌభాజ్యానికి ఎలా వినియోగించుకోవాలి ధర్మాచరణకి ఎలా వినియోగించుకోవాలి ఇవి తెలిసి కాలాన్ని మనం ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోగలిగితే ఆ కాలం సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది మన జీవితమంతా కూడా మేనేజ్మెంట్ అఫ్ టైం కాలాన్ని ఎలా నిర్వహిస్తున్నాం అన్నదే జీవిత శైలి అవుతుంది ఇక్కడ ప్రతి కాలంలో ఒకానొక అనుకూలమైన అవకాశం ఉంటుంది అదేదో పట్టుకోగలిగారు ఇక్కడ భగవంతుడు యవ్వనం ఇత్తాడు అంటే అది గొప్ప అవకాశం ఇచ్చాడు అని అర్థం ఇక్కడ శరీరానికి బుద్ధి బాగా పని చేస్తుంది ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నాయి కనుక వాటిని మంచి పనుల కోసం అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనల కోసం వినియోగించుకోవాలి అయితే ఆధ్యాత్మిక సాధన చేస్తే ఏం ఏం ప్రయోజనం అని చాలా మంది అంటూ ఉంటారు ఏం ప్రయోజనం అంటే ఆధ్యాత్మిక సాధన వల్ల నీలో నిద్రాణమైన మహాశక్తి జాగృతం అవుతుంది అది గొప్ప రహస్యం అందుకని ఆధ్యాత్మిక సాధన వల్ల ఎక్కడో పైలోకాల నుంచి ఎవరో వచ్చి కింద పడతారు వరాలు ఇచ్చేస్తారు అనుకోవద్దు ఆధ్యాత్మిక సాధన వల్ల మనలో ఉన్న ఒక దివ్యశక్తి జాగృతం అవుతుంది అలా జాగృతం చేసుకోవాలంటే ఆయువు ఉన్నప్పుడే బుద్ధి ఉన్నప్పుడే చక్కగా ముందే చేయగలగాలి అంతేగన ముందు భోగాలన్న అనుభవించేద్దాంఅండి తర్వాత ఆ సాధన చేద్దాం అంటే అలాగా కనుక మనకి ఇంద్రియాలు బాగా పని చేస్తున్నప్పుడు సాధన చేయాలి ఈ విషయాన్ని దూర్జ్యుడు చెప్తూ దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూడి యున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలె నీ పదాంభుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అని అద్భుతంగా తెలియజేశాడు అందుకే దీపం ఉండగ ఇల్లు దిద్దుకోవాలి అనే మాట కూడా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు విద్యార్థి దశలోనే మానవుడు తెలుసుకోగలగాలి విద్యార్థి దశ అంటే మళ్ళీ కళాశాలకు వెళ్లి దశ కాదు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడే తెలుసుకోవాలి అలా గమనించితే అప్పటి నుంచి తానేమిటి తన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది అదే ధర్మం కదా విద్యార్థి కర్తవ్యం ఆ పేరులోనే తెలియజేస్తున్నది అంటే విద్యని నేర్చుకునే వాడే విద్య కావాలనుకునేవాడే విద్యార్థి కనుక ఆ సమయంలో ప్రాధాన్యం ఏమిటి విద్య దానికోసం కాలాన్ని వినియోగించుకోవాలి అంతేగన విద్యని పక్కన పెట్టి వినోదాల కోసమో ఇతర వైపో వెళ్ళినట్లయితే ఏమవుతారు కనుక ఎప్పుడు ఏ పని చేస్తున్నామో అప్పుడు ఆ పనిని చక్కగా చేయగలిగితే ఆ పని సత్ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది ఇలాగ కాలాన్ని చక్కగా నిర్వహించే వాడికి అనవసరపు దిగులు ఉండవు బెంగలు ఉండవు భయాలు ఉండవట ఎవరైతే కాలాన్ని చక్కగా వినియోగించుకోరో వాళ్ళకి ఇవన్నీ ఏర్పడతాయి అది ఉత్తమ పురుషుల కాలం ఎలా నడుస్తుంది మిగిలిన వాళ్ళ కాలం ఎలా నడుస్తుంది అని చెప్తూ కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్ఛత ధీమతం వ్యసనేనచ మూర్ఖానాం నిద్రయా కలహేనవా అని కూడా చెప్పారు ఇక్కడ అంటే మంచి అభిరుచి కలవాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి విద్యలు నేర్చుకుని ఆ విద్యల్లో నేర్చుకున్న దాని ప్రకారం ఆలోచిస్తారు దాని ప్రకారం ఆచరిస్తారు కనుకనే కాలం విద్యా సముపార్జనికి సముపార్జించిన విద్యను ఆచరణలో పెట్టడానికి వినియోగించుకోటా మహాత్ములు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యసనేనచ వ్యసనాలతో కాలాన్ని వ్యర్థం చేస్తారు వ్యసనాలు అంటే ఎప్పుడు ఎంజాయ్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ శరీరంతో ఏవో సుఖాలు పడాలి ఆ సుఖాల కోసం వెంపర్లాడడమే వ్యసనం అలాగే వ్యసనం అంటే మరొక అర్థం దుఃఖం రెండిటికి ఒకటే పదం ఎందుకు వాడారు అంటే రెండు కలిసే ఉంటాయి గనుక కానీ సుఖాల కోసం వెంపర్లాడే వాడికి దుఃఖాలు వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడు సుఖ దుఃఖాల గురించి ఆలోచించుకుంటూ సుఖపడాలి దుఃఖం పోవాలి సుఖపడాలి దుఃఖం పోవాలి ఇదే అనుకుంటారు కానీ జ్ఞానం సంపార్జించాలి మంచి చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది అండి కనుకనూకి 99 మంది సుఖపడాలి అనుకునే వాళ్లే తప్ప జ్ఞానం సంపార్జించాలి ఆ జ్ఞానంతో మంచి పనులు చేయాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకునే వాళ్ళు తక్కువ అందుకే ఆ సుఖాల వెనక వెంపర్లాట దుఃఖపడ్డాన్ని వ్యసనం అన్నారు ఇక ఆ తర్వాత నిద్రయా నిద్ర ఇది కాలం లేకుండా నిద్రపోవడం కానీ సకాలంలో సరైన నిద్ర ఉంటే ఆరోగ్యకరమే ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రపోతే అది ప్రమాదకరం అసలు నిద్ర లేకపోవడం అనారోగ్యకరమే కానీ అతి నిద్ర కూడా ప్రమాదమే కదా అతినిద్ర కుంభకర్ణ లక్షణం పైగా నిద్ర తంద్ర ఇవన్నీ తమోగుణాన్ని పెంచుతాయి కనుకనే మూర్ఖులేని వాళ్ళు అయితే నిద్రతో లేదా వ్యసనాలతో లేదా కలహాలతో అన్నారు ఇదొకటి పెద్ద ప్రమాధికారి కలహాలు కలహాలు అంటే ద్వేషభావంతో వాడి గురించి చెడుగా అనుకోవడం వీడి గురించి చెడ్డుగా భావించడం లేదా చెడు చేయడం చెడు రెండు విధాలు ఇంకోడి గురించి చెడ్డగా అనుకోవడం ఒకటి వాడు చెడు చేయడం ఒకటి పగ వాడు వీడు పడకపోవడం పడకపోవడం వల్ల మాట తూలుతారు పనుల్లో కూడా ప్రమాదాలు ఆ ద్వేషం చూపిస్తారు కలహం ఇన్ని రకాలుగా ఉంటుందండి కేవలం పడి కొట్టుకోవడం మాత్రమే కాదు వాడి గురించి వీడి గురించి చెడ్డగా అనుకోవడం కూడా కలహమే అంతే కాదు వాడిని చూసినప్పుడల్లా ద్వేషభావం కలగడం కూడా కలహమే ఇలా లోకంలో ఉన్న చెడు గురించి చర్చ చేస్తూ వాడి పట్ల వీడి పట్ల ద్వేషంతో కొందరు కాలక్షేపాలు చేస్తారు కొందరు నిద్రతో కాలక్షేపం చేస్తారు కొందరు వ్యసనాలతో కాలక్షేపం చేస్తారు మహాత్ములు మాత్రము విద్యని కావ్యశాస్త్రాదుల ద్వారా గ్రహిస్తూ ఆ గ్రహించడంలో ఆనందిస్తారండి జ్ఞానం సంపాదించడమే గొప్ప ఆనందం జ్ఞానం అంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అవి కావ్య శాస్త్రాదుల నుంచి వస్తాయి అ ఉత్తమ శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం కోసం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలా సంపార్జించినటువంటి జ్ఞానం తమ ఆలోచనగా ఆచరణగా చూపిస్తూ ఆ కాలం యొక్క ప్రభావా వినియోగించుకోగలుగుతారయ్యా అని చెప్పారు ఇలాగా కాలం గురించి గొప్ప ప్రణాళికలు మనకు అనేక చోట్ల గోచరిస్తూ ఉంటాయి ముఖ్యంగా మన కావ్యాలన్నీ విట్టి చెప్తూ ఉంటాయి అందుకే వినోదాలు భోగాలు అనుభవించడం కోసం కాలాన్ని వినియోగించినవాడు దుర్యోధనుడు అలా కాకుండా విద్యని తపస్సుని శక్తిని జ్ఞానాన్ని పోగు చేసుకోవడం కోసం కాలాన్ని సద్వినియోగ పరుచుకున్నాడు ధర్మరాజు దానికి వనవాస కాలమే మనకి పెద్ద ఉదాహరణ వనవాస కాలం అంతా నిజానికి భోగాలు లేవు ధర్మరాజుకి ఒకవేళ రాజుగా ఉన్నా అని బాధ్యత చూపిస్తాడు కానీ భోగం చూపించాడు అంతేగాని నాకు కాలం ప్రతికూలించింది అని ఏడుస్తూ కూర్చోలేదు ఆ కాలాన్ని తపస్సుకు వినియోగించుకున్నాడు మహర్షులతో సంభాషణ చేశాడు తరువాత చేయబోయే యుద్ధానికి కావలసిన శక్తినంతటినీ పోగు చేసుకున్నాడు మహానుభావుడు తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత రాజ్యానికి వచ్చిన ధర్మరాజు వాళ్ళని ఎలా చేసాడో మనకి భారతం వర్ణిస్తుంది ఆయన భోగ అనుభవంతో కాలం గడపలేదు కొందరికి అధికారం పదవి రాగానే భోగం అనుభవించాలి సంపాదించాలి తనకోసం పోగు చేసుకోవాలి అనుకొని కాలాన్ని దుర్వినియోగ పరుచుకుంటారు కానీ తనకు సంప్రాప్తించినటువంటి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలన చేయడం కోసం ప్రతిక్షణం సార్ధకం చేసుకున్నాడు అంటే సంపద లేనప్పుడు సార్ధకం చేసుకున్నాడు సంపద ఉన్నప్పుడు సార్ధకం చేసుకున్నాడు కనుక కాలం నాకు సంపద ఇవ్వలేదని కాలం సంపద ఇచ్చిందని కాలం మీద నెపం వేయకూడదు సంపద లేని కాలంలోనూ సంపద ఉన్న కాలంలోనూ లేకపోవడాన్ని సద్వినియోగ పరుచుకోవాలి ఉన్నదాన్ని సద్వినియోగ పరచుకోవాలి ఎందుకంటే తనకి పదవి సంపద లేనప్పుడు పలకరించేవాడు ఎవడు లేడు పలకరించేవాడు ఎవడు లేనప్పుడు సాధన హాయిగా చేసుకోవచ్చు దాని తర్వాత ఏం చేశారు వచ్చిన తర్వాత వాటిని ఎలాగ ప్రజా క్షేమానికి వినియోగించుకోవాలి ఎలా ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే ఎంతున్న జీవితం చిన్నది ఈ చిన్నదైన జీవితంలో దొరికిన అవకాశాన్ని ఎలా సద్వినియోగ పరుచుకోవాలి జీవితం చిన్నది అంటే ఇప్పుడున్న జీవితం ఒక పుట్టుకో ఒక చావు మధ్య ఉండది కానీ జీవితం చిన్నదే కానీ జీవుడు శాశ్వత తెలుసుకోవాలి కరెక్ట్ కనుక తనకున్న జీవితం చిన్నదే అని తెలుసుకొని ఇందులో ఉన్న ప్రతి భాగాన్ని ప్రతి భాగం అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య అవస్థని సార్ధక పరుచుకోవాలి బాల్య కౌమార యవ్వనాల్లో క్రమశిక్షణ కాలాన్ని సద్వినియోగ పరుచుకుంటే వాడికి వార్ధక్యం బరువు కాదు వాడు ఇంకొకరికి బరువు కాడు కూడా అప్పటికి కూడా చైతన్యవంతంగా ఉండగలడు కనుక అనేకమంది బాల్యకో కుమారి యవ్వన కాలాల్లో వాళ్ళు సంపార్జించిన జ్ఞానం శరీరానికి అందించిన శిక్షణ నిగ్రహణ వీటి వల్ల ఒక శక్తి కలిగి ఆ శక్తితో జీవితమంతా హాయిగా ఉంటారు ఎందరికో జీవితాన్ని ఇవ్వగలరు కనుకనే జీవితం కాలం ఈ రెండిటి గురించి అర్థం చేసుకొని కాలానుగుణంగా జీవితం మలచుకోవాలి అనే అద్భుత భావాన్ని వివిధ వృత్తాంతాలతో వివిధ వాక్యాలతో అందించిన వేద ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి 


అపదామపహర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం

శివాయ గురవే నమః
శ్రీమాత్రే నమః
శ్రీ విష్ణురూపాయ నమః
నమఃశివాయ

కాలం గురించి భారతీయ మహర్షులు
చాలా పరిశోధన పరిశీలన అధ్యయనం ఆవిష్కారం చేశారు

ఇక్కడ కాలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడం
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం

ఎందుకంటే సర్వలోకములు సర్వజీవులు కాలబద్ధులే
కాలాన్ని అనుసరించితేనే జన్మిస్తారు
కాలాన్ని అనుసరిస్తేనే సాగుతూ ఉంటారు

అందుకే కలయతి నియతి ఇతి కాలః
కాలానికి మరొక పేరు నియతి

నియతి అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో
అలా జరగడం

సూర్యుడు ఉదయించడం అది ఒక నియతి
అది ఎవరు మార్చలేరు

అదేవిధంగా ప్రతివాడు జీవితం గడవడం కూడా నియతి

అయితే అది తెలుసుకుని అలా ఉన్న నియతి రూపమైన కాలాన్ని
ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి

కాలం అనగా పరిణామ స్వరూపం
కాలం అనగా పరిణామ శక్తి

ఇక్కడ మార్పు రూపంలో కాలం కనబడుతూ ఉంటుంది

ఒకప్పుడు బాలురుగా ఉన్నవాళ్లు
తర్వాత యువకులు కావడం
ఆ తర్వాత వృద్ధులు కావడం

ఆ రూపంగా కాలం కనబడుతుంది

కనుక కనబడుతున్న వాటి యందు కాలాన్ని తెలుసుకోవాలి

మంచి పరిణామం రావాలి అంటే
కాలం తన ఇష్టానుసారం ఇవ్వదు

మనము చేసేదాన్ని గమనిస్తూనే కాలం ఇస్తుంది

కాలం పరమేశ్వరుడు ధరించిన స్వరూపం
కాల రూపంగా పరమేశ్వరుడు కర్మఫలప్రదాత

అందుకే కాలం చాలా ముఖ్యమైనది

కాలాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

కాల విభాగజ్ఞః అని ఒక మాట ఉంది
దీనినే కాలజ్ఞత అంటారు

కాలజ్ఞానం అంటే భవిష్యత్తు చెప్పడం కాదు
ఏ కాలంలో ఏమి చేయాలో తెలుసుకోవడం

ఇది మహాపురుష లక్షణం

దేశ కాల విభాగజ్ఞః
ఏ చోట ఎలా ప్రవర్తించాలి
ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలి

ఇవి తెలిసినవాడు ఉత్తమ పురుషుడు

తన జన్మని సార్థకం చేసుకుంటాడు

జన్మ సార్థకం అంటే
ఎన్నో సాధించగలగడం

సార్థకం కావాలంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ధర్మం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు
దేశం కాలం ఆధారంగా మారుతుంది

వేసవిలో దున్నలేం
వర్షకాలంలోనే దున్నాలి

కష్టపడటం సరిపోదు
సరైన కాలం కూడా అవసరం

ప్రతి క్షణం విలువైనది
కాలాన్ని వ్యర్థం చేయరాదు

జీవనశైలి అంటే
కాలానికి అనుగుణంగా ప్రవర్తించడం

కాలమే సృష్టిలో అత్యంత విలువైనది

కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఉత్తమ జీవనం

ఆలస్యం పనికిరాదు
వాయిదా వేయడం ప్రమాదకరం

దీర్ఘసూత్రత
బద్ధకం
సోమరితనం

ఇవి అన్నీ కాల నష్టం

ప్రతిక్షణం జ్ఞానంతో ప్రకాశించాలి

తెలివైన వాడు తక్కువ శ్రమతో ఎక్కువ సాధిస్తాడు

సకాలంలో సరైన పని చేయడం ముఖ్యము

దినచర్య అవసరం

నిద్ర అవసరం
కానీ అతినిద్ర ప్రమాదం

విశ్రాంతి అంటే పని మధ్య విరామం

బ్రాహ్మీ ముహూర్తం
దైవసంబంధం

మధ్యాహ్నం
లౌకిక కార్యక్రమాలు

రాత్రి
విచారణ
శాంతి
భోగం

భోగం ధర్మబద్ధంగా ఉండాలి

కాలం అవకాశం ఇస్తుంది
అవకాశాన్ని వదలకూడదు

విలంబం నాచరేత్ ధర్మే
చలం చిత్తం వినశ్యతి

బుద్ధి మారిపోతుంది

ధర్మం వెంటనే చేయాలి

రేపు అనేది నమ్మదగినది కాదు

ఇంద్ర అగస్త్య సంవాదం
ఆలస్యము ప్రమాదకరం

సమయాన్ని వెంటనే ఉపయోగించాలి

బాల్యంలో చదువు ముఖ్యం
వాయిదా వేస్తే పశ్చాత్తాపం

యవ్వనంలో చేయాల్సినది
యవ్వనంలోనే చేయాలి

భోగం నియంత్రణలో ఉండాలి

ఇంద్రియబలం తగ్గుతుంది
అతి భోగం వల్ల

వ్యాయామం
నియమిత ఆహారం
శక్తిని పెంచుతాయి

ఆధ్యాత్మిక సాధన
మహాశక్తిని జాగృతం చేస్తుంది

దీపం ఉండగ ఇల్లు దిద్దుకోవాలి

విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి

విద్యార్థి అంటే
విద్యను కోరేవాడు

కాలాన్ని విద్యకు వినియోగించాలి

సరైన సమయంలో సరైన పని
సత్ఫలితాలు ఇస్తుంది

కాలాన్ని సరిగ్గా వినియోగించే వాడికి
దిగులు
భయం ఉండవు

కావ్యశాస్త్ర వినోదేన కాలోగచ్ఛత ధీమతాం
వ్యసనేన చ మూర్ఖానాం
నిద్రయా కలహేనవా

ధీమంతులు
జ్ఞానం సంపాదిస్తారు

మూర్ఖులు
వ్యసనాలు
నిద్ర
కలహాలు

ఇవితో కాలం గడుపుతారు

జ్ఞానం సంపాదించడమే ఆనందం

దుర్యోధనుడు భోగంలో కాలం వృథా చేశాడు
ధర్మరాజు కాలాన్ని సద్వినియోగం చేశాడు

వనవాసంలో తపస్సు
జ్ఞానం సంపాదన

అధికారంలో ధర్మపాలన

సంపద ఉన్నా
లేకపోయినా
కాలాన్ని సద్వినియోగం చేయాలి

జీవితం చిన్నది
జీవుడు శాశ్వతుడు

బాల్యం
కౌమారం
యవ్వనం
వార్ధక్యం

ప్రతి దశను సార్థకం చేయాలి

క్రమశిక్షణతో జీవితం సులభం

కాలం
జీవితం
అర్థం చేసుకుని
కాలానుగుణంగా జీవించాలి

వేద ఋషులకు నమస్కారం

స్వస్తి

No comments:

Post a Comment