ఇలా వచ్చేయమండి మనం. వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వస్తాం. ఆ జయ విజయుల దాకా వచ్చి ఒకసారి ఆ నామమో, ఆ కిరీటమో కొంచెం కనిపిస్తే నమస్కారం చేసుకుని వచ్చేస్తాం. అప్పటివరకు కూడా మన సర్వేంద్రియాలు కూడా ఆ వెంకటేశ్వర స్వామి వైపుకి తిరుగే ఉంటాయండి. మనసులో ఇంకెటువంటి ఆలోచనలు రావు. ఎవడన్నా అడ్డొచ్చినా సరే మనకి వీడు అడ్డొచ్చాడనే చికాకే తప్ప మనకి ఏ ఆలోచనా రాదు. ఈ అనుభూతి మీద నేను ఒక పాట రాశా. ఎంత క్షణ మాత్రం ఆ అది అసలు దర్శనం అయ్యిందో లేదో కూడా తెలియనటువంటి ఒక సమ్మోహన శక్తిలోకి ప్రవేశిస్తామండి మనం. ఒక లోకంలోకి ప్రవేశించి ఆ సమ్మోహనత్వం నుంచి బయటికి వచ్చేస్తాం. ఆ అనుభూతి మీద ఒక పాట రాశాను.
ఓ తిరుపతి వెంకట దేవా
నా ఎదలో నిలువగా రావా
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
నీ గర్భగుడిని చేరాక
నీ దివ్య స్వరూపం చూశాక
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
వేచి వేచి నీ గుడి ముంగిట
పది జాముల పైదాకా
వెంకటేశ నిను వేడుకొనుచు
పడిగాపులు గాచాక
ఆలయ ప్రవేశమైనాక
పలు భక్తులు అడ్డుగ నిలిచాక
నీ రూపం కనబడి కనబడక
నా మనసా నీపై నిలబడక
ఒక్క క్షణం నిను చూచినంత
పూజారులు పదపదమంటుంటే
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
వజ్ర కిరీటం చూసే భాగ్యం
కలుగనే లేదు
శంఖ చక్రములు చూసే కోరిక
తీరనే లేదు
వక్షస్థలమున లక్ష్మిని గాని
మెడలో కౌస్తుభహారం కాని
చూసే సమయం లేదు
నీ కరుణా వీక్షణ నా పై
ప్రసరించెదవను ఆశతో
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
నీ గర్భగుడిని చేరాక
నీ దివ్య స్వరూపం చూశాక
వెనక్కి వెనక్కి తిరుగుతూ
వెళ్ళలేకనే వెడుతున్నా
వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా
No comments:
Post a Comment