సంగీతం లో డిగ్రీలు చేయవచ్చు....పి.హెచ్.డి లు కూడా చేయవచ్చు. ఎందరో ఉన్నారు అలా చేసినవారు.
కానీ పాట పాడి మెప్పించాలంటే కమ్మని స్వరం ఉండాలి. భావం చక్కగా పలికించే సామర్ధ్యం కూడా ఉండాలి.
కొందరికి మంచి స్వరమే ఉంటుంది. కానీ పాటలో భావం ఉండదు.
గట్టిగా అరిచి పాడేస్తే....పాటైపోతుందనుకుని అపోహ పడుతారు మరి కొందరు.
ఏ స్థాయి లో పాడినా...గమకాలు చక్కగా పలకాలి.
రావు బాలసరస్వతి గారు...టంగుటూరి సూర్య కుమారి గారు....చక్కటి గాయనీ మణులుగా చలామణి అవుతున్న రోజుల్లో...
గొంతులో మాధుర్యాన్ని...మార్ధవాన్ని నింపుకుని....ఓ చిన్న 8 ఏళ్ళ పిల్ల వచ్చింది....1945 లో.
1949 దాకా బాలనటి గా తన పాటలు తనే పాడుకుంటూ కొన్ని చిత్రాలలో నటించింది.
మనదేశం లో(1949)....మొదటిసారిగా...
మరువలేనురా నిను నేను మరువ లేనురా...
ఓ పంచదార వంటి పోలీసెంకట స్వామి....
ఘంటసాల సంగీత దర్శకత్వంలో నేపథ్య గీతం పాడింది. ఆ స్వరం...అప్పుడప్పుడే హిందీ చిత్రసీమలో పాడుతున్న లతా మంగేష్కర్ వాయిస్ ను పోలి ఉంది.
ఇక అక్కడ నుండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
తనకప్పుడు....పోటీ ఘనాపాటి పి.లీల గారు.
అయినా ఎవరికి తగ్గ పాటలు వారు పాడుకున్నారు.
మరి ఈ గాయనీమణుల జీవితాలు......వారి పాటలాగా....హాయిగా...తియ్యగా... సాగిపోతాయా అంటే....
అది ఎండమావే!
@@@@
ఆ మ్యుజిక్ డైరెక్టర్ కు నాకు పడదు. నువ్వు వాడి దగ్గర పాడటానికి వీల్లేదు!
అగ్రిమెంట్ ప్రకారం నేను పాడాలి తప్పదండి.
పైగా...రిహార్సల్స్ కూడా అయిపోయి...రెడీగా ఉన్న పాటలు.
నిన్న ఏదో మీతో గొడవయ్యిందని...ఇప్పుడు నన్ను పాడొద్దంటే ఎలాగండి?....భార్య అభ్యర్థన.
వాడంతగా చెప్తున్నాడుగా...భర్తంటే లక్ష్యం లేదా నీకు!
వాడెలా చెప్తే అట్లాగే చెయ్.....
అత్తగారి సన్నాయి నొక్కులు.
నా గౌరవం నీకు ముఖ్యం కాదనుకుంటే....నీ ఇష్టం. పోయి పాడు......
భర్త గారి అలక...బెదిరింపు!
అసలు కొంత కాలం ఈ సినిమాల్లో పాడటం మానేయ్.....
భర్త గారి ఆర్డర్.
పిల్లల తోటే ఖర్చులూ పెరుగుతున్నాయి. ఈ టైం లో పాడటం మానేస్తే ఎలాగండి?......భార్య.
అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లు ఇంట్లోనే ఉండు.....భర్త తీర్మానం.
@@@@
వేల వత్సరాలైనా....వసంత ఋతువు సొగసు.... నిత్య నూతనమే.
గల గల పారుతున్న జీవ నది గమనం.... ఎక్కడ నుండి చూసినా ఆహ్లాదంగానే ఉంటుంది......
కాలం కాని కాలంలో ....కూసినా......కోయిల గొంతు....
గుండె గూటిని తట్టి లేపుతూనే ఉంటుంది.
పశువులను...శిశువులను కూడా జోకొట్టి...మరో లోకంలో విహరింప చేసే శక్తి...
అమృత గానానికి ఉంది.
అలాంటి గాన మాధుర్యాన్ని గళసీమలో నింపుకున్న మెలొడీ పాటల మహారాణి....
పిల్లాపాలు. గజపతి. కృష్ణవేణి(పి.జి. కృష్ణవేణి).
సింపుల్ గా జిక్కి గా పేరొందిన సుమధుర గాయని.
@@@@
పి.జి.కృష్ణవేణి ని చిన్నప్పటి నుండి జిక్కమ్మా అని వారి నాన్నగారు పిలిచేవారంట.
అది అలా ఫిక్స్ అయిపోయింది.
2వ తరగతి తో చదువు ఆపినా...మద్రాసు లోనే పుట్టి పెరగడంవల్ల తమిళం మాత్రం వ్రాయగల్గి,....
శాస్త్రీయ సంగీతంలో అసలు ఓనమాలు రాకపోయినా...దైవదత్తమైన స్వరమాధురితో జిక్కి గారు...
తెలుగులో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు.
అల్లదే..అవతల...అదిగో నా ప్రియా కుటీర వాటిక..
పులకించని మది పులకించు...
రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...
హాయి హాయిగా ఆమని...
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా...
గుత్తొంకాయ్ కూరోయ్ బావ కోరివండినానొయ్ బావ..
ఎన్నొ మధురాతి మధురమైన గీతాలు జాలువారాయి ఆ మధుర అమృత గళం నుండి.-
బాలనటి గా పంతులమ్మ (1943), వాల్మీకి (1945), ఇది మా కథ (1946)లలో నటించి తన పాటలు తనే పాడుకున్న జిక్కి...
మన దేశం (1949) లో లక్ష్మీకాంత కు తొలిసారి నేపథ్య గీతాలు పాడింది.
మరువలేనురా..నిను నేను మరువలేనురా. .
ఓ పంచదార వంటి పోలిసెకంట స్వామి..
ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో పాడారు జిక్కి గారు.
ఇక ఆ స్వర వాహిని అలా భాషా బేధాలనధిగమించి...ఎన్నో భాషలలో వేలాది మధుర గీతాలను అందించారు.
@@@@
తన పై ఆధారపడ్డ 4గురు సోదరులు,ముగ్గురు సోదరీమణులు, తాగుబోతు తండ్రి....
ఆ పరిస్థితిలో శ్రీ.ఎ.ఎం.రాజా తో ప్రేమ వివాహం,...
కాలక్రమేణా..6గురు సంతానం...
కుటుంబ బాధ్యతల మధ్య కూడా...ఎన్నో ప్రయాసలకోర్చి...సినీ గీతాలు, కచేరీలు..చేసేవారు జిక్కి.
1989లో భర్త రాజా అకాల మరణం తో కృంగి పోయినా...
తోటి గాయనీ మణులు...చక్కటి స్నేహితురాళ్ళు అయిన జమునారాణి, పి.లీల & ఎ.పి.కోమల గార్లతో దేశ, విదేశాలలో కచేరీలు చేసేవారు జిక్కి.
సీతారామయ్య గారి మనవరాలు (1991), అమ్మ కొడుకు (1993), నిన్నే పెళ్ళడుతా (1996) & మురారి (2001) దాకా పాడారు.
2001 లోనే బ్రెస్ట్ కేన్సర్ వస్తే... చికిత్స చేయించుకునే స్తోమత కూడా లేని పరిస్థితి!
చిరకాల మిత్రురాలు...గాయని జమునారాణి గారు కచేరీలు చేసి...
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభ్యర్థన లేఖలు వ్రాసి...నిధులు సమకూర్చవలసి వచ్చింది!
సర్జరీ తరువాత కూడా సెకండరీస్ తో 16 ఆగస్ట్ 2004 న అనంత విశ్వంలో లీనమైనా వారి పాటలతో చిరస్మరణీయులయ్యారు శ్రీమతి.జిక్కి గారు.
#ఈ_రోజు_సుమధుర_గాయని_జిక్కి_గారి
#జయంతి (3-11-1937)
#స్మృత్యంజలి.🌹
(ఇక్కడ నేను ఎన్నో పాటల లింక్స్ ఇస్తాను. అవన్నీ మీరు చూడలేకపోవచ్చు.
కానీ మీకు ఇష్టమైనవి మళ్ళీ చూస్తే చాలు...ఆనందం అర్ణవమౌతుంది.
జిక్కి గారి మధుర గీతాలను ఓ చోట చేర్చాలని మాత్రమే నాప్రయత్నం.)
🌹🌿🌹🌿🌹🌿🌹
#జిక్కి_గారి_స్వగతాలు...
https://youtu.be/HWmu8ICbBAw?si=tHisWDJqffPK-wst
రారే రారే పిల్లలారా, బొమ్మలపెళ్ళి చేద్దాము.......త్యాగయ్య(జిక్కి నటిస్తూ పాడిన పాట-1946).
https://youtu.be/yjyskG6BKY4
మరువలేనురా నిను నేను మరువలేనురా.....మన దేశం.
https://youtu.be/iu5g_P-_emY
ఆహా అందం అద్భుతమే...లాలాల లం...లాలాలా..లం....
https://youtu.be/qMsX8doxIa8
అల్లదే..అవతల ..అదిగో..నా ప్రియ కుటీర వాటిక..
https://youtu.be/gCe3KtXYoB8
మ్రోగింపవే హృదయవీణ..పలికింపవే మధుర ప్రేమ...
https://youtu.be/3JTgb032TOk
గుత్తొంకాయ్ కూరోయ్ బావ.....కోరి వండినానోయ్ బావ..
https://youtu.be/voR_C-IfonA
చాంగురే బంగారు రాజా..చాంగు చాంగురే బంగారు రాజా...
https://youtu.be/35a7Fykppgc
పులకించని మది పులకించు...
https://youtu.be/vThrTWa5kSc
వద్దురా కన్నయ్యా...ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా.....
https://youtu.be/EW8MTNPSq_Q
అంద చందాల సొగసరి వాడు...
https://youtu.be/d23NCHutdTA
హాయి హాయిగా ఆమని సాగె...
https://youtu.be/O5ajXn9j1bM
రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...
https://youtu.be/VIryMqxwijc
ఏరువాక సాగారో రన్నో చిన్నన్న...
https://youtu.be/VH72kvy0y98
ఎక్కడమ్మా చంద్రుడు....చక్కనైన చంద్రుడు.....
https://youtu.be/0YpXvG8GvMI
ఒహో బంగారు చిలుక..అహా ఎందుకె అలుక.....
https://youtu.be/3TJt8i4C9kU
నీలీలలన్నీ చాలించవోయి...నీకన్న నేను నెరజాణ నోయి....
https://youtu.be/djGMxiB04B4
దాగుడు మూతలు చాలునురా...నీ ఆగడమంతా తేలెనురా.....
https://youtu.be/Y4ktKsCmvEU
వగలాడి వయ్యారం భలే జోరు...నీ ఒయ్యారం ఒలికించు వన్స్ మోర్....
https://youtu.be/2VT1R5evweM
గులాబీల తోట....బుల్ బుల్ పాట...లే గులాబీల తోట.....
https://youtu.be/wDWIMMg_34g
అందాలసీమలో....చందమామ కాంతిలో....
https://youtu.be/_IEpFWGSdqY
ఓ...దేవదా...చదువు ఇదేనా.......
https://youtu.be/lRs-xF6e95o
పొద్దైనా తిరగకముందే....చుక్కైనా పొడవకముందే......
https://youtu.be/OxePGmmr5ME
నీ షోకు చూడకుండా నవనీతమ్మా.....
https://youtu.be/HKmwEVE4cHw
కులాసా రాదోయ్ రమ్మంటే....మజాకా కాదోయ్ వలపంటే.....
https://youtu.be/GS8ylXbMD8M
టౌను పక్కకెళ్ళొద్దురో...డింగరీ......
https://youtu.be/DzV6CWyslwY
పందిట్లో పెళ్ళవుతున్నది..కనువిందవుతున్నది..
https://youtu.be/FDCzwTPxQ84
ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేచేను......
https://youtu.be/QzMfouXUEII
నీవెవ్వరవో...చిరునవ్వులతో...నీరూపు నను మంత్రించె.......
https://youtu.be/gRoZJ1uFB4I
చిందు వేయవోయి చిన్ని కృష్ణయ్య.......
https://youtu.be/Fu7SVORE9aY
పట్నమెల్లగలవా బావా పర్మిటు తేగలవా......
https://youtu.be/ZsubahA4Wf4
వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు........
https://youtu.be/r6Vfdb9HKls
జీవితమే సఫలము...రాగసుధా భరితము......
https://youtu.be/SvHfiigQbPA
కొమ్ములు తిరిగిన మగవారు...కొంగు తగిలితే పోలేరు...
https://youtu.be/QzMfouXUEII
రారోయి మా ఇంటికి...మావో మాటున్నది.....
https://youtu.be/FL_r6QyUAow
కనులకు దోచి చేతికందని ఎండ మావులున్నాయ్......
https://youtu.be/FKx4fffOOFA
నవనీత చోరుడు..... నంద కిశోరుడు....
https://youtu.be/UJOlhjlKt5M
ఏటి ఒడ్డున మా ఊరు....ఎవ్వరు లేరు మావారు....
https://youtu.be/jBWLvac7tfY
లేవోయి చినవాడా....లే లేవోయి చినవాడా.....
https://youtu.be/6UmAxyh0kJ4
కళ్ళు తెరచికనరా....సత్యం ఒళ్ళు మరచి వినరా.....
https://youtu.be/OFbSEpoZvS0
ఇంత చల్లని రేయి..... ఇంత చక్కని హాయి....
https://youtu.be/xArYDK_xYIk
అన్నా అన్నా విన్నావా...చిన్ని కృష్ణుడు వచ్చాడు......
https://youtu.be/sWYEyBG712c
తల్లిని మించి ధారుణి వేరే దైవము వేరే లేదుగా.......
https://youtu.be/WObC7stH1wI
విరిసింది వింత హాయి....మురిసింది నేటి రేయి.
https://youtu.be/_9SsBWpSjHY
తీరెను కొరిక తియ్యతియ్యగా....హాయిగ మనసు తేలిపోవగ....
https://youtu.be/6y_3wegadSs
కం కం కం కంగారు నీ కేలనే........
https://youtu.be/6vDylVuQYQs
ఓ పరదేశి.. ప్రేమపిపాసి, యవ్వనరాశి రావోయి.....
https://youtu.be/bgLLOuApIwg
చిగురాకులలో చిలకమ్మా...చిన్న మాట వినరావమ్మా.....
https://youtu.be/65gt3xXLNtM
వలపు తేనె పాట...తొలి వయసు పూల తోట.......
https://youtu.be/IrSX36oeoEg
ఓహో బస్తీ దొరసాని...బాగా ముస్తాబయ్యింది.......
https://youtu.be/gkbFfqs5IhE
పడుచుదనం రైలు బండి పోతున్నది......
https://youtu.be/Pbf6nycgqAA
అందాల చిందు తార...డెందాన దాచనేల......
https://youtu.be/TOqcHzEgVVY
రావే రావే జాబిలి...ఈ దరి రావే జాబిలి.....
https://youtu.be/KZpBhP0VscA
వేణు గానమ్ము వినిపించెనే..చిన్ని కృష్ణయ్య కనిపించెనే......
https://youtu.be/mfh1cTXg7GQ
రావె రాధ రాణి రావె...రాధ నీవె కృష్ణుడ నేనె......
https://youtu.be/A4W6ijCahs8
కలిసె నెలరాజు కలువ చెలిని.......
https://youtu.be/PaaXa352iOk
కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల......
https://youtu.be/0A4B9JnsETA
నీకొరకే నీకొరకే చేసేదంతా నీకొరకే......
https://youtu.be/QV0QpIuetn0
చక చక ఝణతా ..తకథిమి కిటతా......
https://youtu.be/8xTGmAuv5Ek
పలు వన్నెల చిన్నెల దానా ..వన్నెల చిన్నదాన.....
https://youtu.be/2_iTtgSvQkM
ఓహో వరాల రాణి...ఓహో వయ్యారి రాణి.....
https://youtu.be/gIqsrdA58c8
ఒయ్యారంగా నడిచేదానా..ఓరగంటితో చూసేదానా....
https://youtu.be/0ehiBFc7gAg
చిటారు కొమ్మమీద చెట్టాపట్టాలేసుకోని...చిలకలల్లే....
https://youtu.be/B-zFvNHmhoo
చీటికి మాటికి చీటీ కట్టి వేధించేవా నాడు.......
https://youtu.be/t341XJ_GqwQ
ఈ తీయని రేయి తెలవారుటె మానే....ఇలా నిలిచి కవ్వించనీ.....
https://youtu.be/9K6tYEm0iBY
చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా.....
https://youtu.be/16EtZWj0co4
నన్ను పెళ్ళాడవొయ్ నాసామీ చెంచితనయ్యా నా సామి.....
https://youtu.be/B8ZRvmUseNI
సిపాయి బిరాన రావోయి...ఓ సిపాయి...మన తరాన.....
https://youtu.be/6yzbtxP6ewo
ఆశలు తీర్చవె ఓ జనని...ఆదరముంచవె జాలిగొని.....
https://youtu.be/3pEymqk93OE
శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే......
https://youtu.be/f--x3dOFVA0
అమ్మా అమ్మా అమ్మా అని ఎంత హాయిగా పిలిచాడే...
https://youtu.be/UUbNH_2KCrM
ఎంత వెదికిన కానరావిది ఏమి మాయో......
https://youtu.be/5hndK_VjieQ
చిన్ని నాన్న చల్లగుండాలి బాబు పేదవైనా పేరు తేవాలి...
https://youtu.be/A_hBmleI8wM
చిట్టిపొట్టి బొమ్మలు....చిన్నారి బొమ్మలు......
https://youtu.be/j_wOdMS76GQ
చిలకా గోరింక కులికే పక పక........
https://youtu.be/IfyDycXxCHQ
ప్రేమ జగాన విషాదాంతమేనా.......
https://youtu.be/8IfUGAypItY
ఆనందమే.....అందాలు చిందేటి ఆనందమే.......
https://youtu.be/v4R9dOPD8EY
చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది.......
https://youtu.be/KvWnyuKEk0Q
నెరజాణవులే....వరవీణవులే....కిలికించితాలలో....
https://youtu.be/JZ6EiyoCfsU
నిన్నే పెళ్ళాడేస్తానంటూ...మాట ఇస్తే ఊరుకుంటామా......
https://youtu.be/BbU2DhfIUhw
వెలుగు రేఖల వారు తెలవరి తామొచ్చి...ఎండ ముగ్గులు పెట్టంగా....
https://youtu.be/Hec_wMFQftA
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి.....
https://youtu.be/EO3JWdSL1mk
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
- డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.
No comments:
Post a Comment