Friday 22 March 2024

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనామహారాజుల జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజుల జీవించాలి నిండు నూరేళ్లు

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు

జాబిల్లి జాబిల్లి జాబిల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి

నాలో మురిపెంత పాలబువ్వై పంచని
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచని
మదిలో మచ్చలేని చందమావే నువ్వని
ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని

కలకాలము కనుపాపల్లె కాసుకొని
నీ నీడలో పసిపాపల్లె చేరుకొని

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చ మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకొన అమ్మ రుణమే తీరగా

తోడుండగా నను దీవించే కన్నా ప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా

సిరులొలికించే చిన్ని నవ్వులే మని మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మాలాగని దీపాలు
బుడిబుడి నడకలా తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు

ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజుల జీవించాలి నిండు నూరేళ్లు

No comments:

Post a Comment