ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ఓరయ్యో జంగమ్మ గుండె నిండిపో గంగుమ
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
హ జనక జనక జనక జనక లయల హొయలు సోలె దాక
కులుకులొలుక మేలమాడి పొద్దుపొడిచి పోయేదాకా
జాగరణ పండగే పండునమ్మో గౌరాంమో
కోరికల కొలువై తీరునమ్మో కొండమ్మో
ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
సత్యమూర్తి ఆమ్మో సళ్ళ సల్లనిరేడు సయ్యంటూ వచ్చేసిండు
యమకే దాసుడై పిల్ల మనసు దోచిండు
ఈశాన్య దిక్కుకాడ పుట్టిన సలిగాలినంత పగోర్తీ పడక దిక్కుకే
శివ శివ అంటూ ఉరికించి పట్టిన చెమటలు ఆర్చిండు
మహాశివరాత్రిని జోడు తాళాలు కొట్టి
ఆరు నాట్య శాస్త్రాలను ఒక్క గజ్జ కొసకు గట్టి
కొండాకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే
కొండాకోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే
మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే
మదన కామరాజా తీరు కోరి కోరి కులుకుతాడే
పిట్టకన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే
పిట్టకన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే
ఈడు ఆట వీడి లాగ ఇంకా ఎవడు ఆడలేడే
ఈడు ఆట వీడి లాగ ఇంకా ఎవడు ఆడలేడే
తోలుబొమ్మలాటలోనా వీడికేవాడు సాటిరాడే
తోలుబొమ్మలాటలోనా వీడికేవాడు సాటిరాడే
జంగమ్మ
ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ధింతక్క జంగమ్మ గుండె నిండిపో డిండిమ
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ఏడేడు లోకాలను ఏలే దొర వీడేలే
పిసరంత బిల్వపత్రికే
లొంగునే పొంగునే తీరని మొక్కులు తీర్చునె
సతీమతి సిరిమతి అదిశక్తిని కలిసి ఆనందమూర్తి సిందులే
వేసేలే వెచ్చని అంగనా ముంగిట ముగ్గులు
హే ఎనకముందు మాటలేక భక్తికి పొంగిపోయి
అసరులకు వరాలు ఇస్తాడు రెచ్చిపోయి
తుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే
తుంబురునికి నారదునికి లాలపోసి లాగుతాడే
జీవితంతు నాదతంతు మీటుతాడే మీటుకుతాడే
జీవితంతు నాదతంతు మీటుతాడే మీటుకుతాడే
సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే
సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే
ప్రణయ విందు ప్రణవమంటూ సాటిచాళ్లు చిలుకుతాడే
ప్రణయ విందు ప్రణవమంటూ సాటిచాళ్లు చిలుకుతాడే
ఓనమాలు జీవాలే ఓంకారమంటాడే జంగమ్మ
ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
ఓరయ్యో జంగమ్మ గుండె నిండిపో గంగుమ
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే
హ జనక జనక జనక జనక లయల హొయలు సోలె దాక
కులుకులొలుక మేలమాడి పొద్దుపొడిచి పోయేదాకా
జాగరణ పండగే పండునమ్మో గౌరాంమో కోరికల కొలువై తీరునమ్మో కొండమ్మో
ఓలమ్మో గౌరంమో బలే జోరంమో చుడమ్మో
జంగమ శివ జంగమ శివ జంగమ శివుడే