Monday, 1 April 2024

రామా ఆ ఆ రామా ఆ ఆఅందరి బందువయ్యా భద్రాచల రామయ్య

రామా ఆ ఆ రామా ఆ ఆ
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
రామా ఆ ఆ రామా ఆ ఆ

తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకేగెనయా
మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయా
ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా
అసురుని త్రుంచి అమ్మను తెచ్చీ అగ్ని పరీక్ష విధించెనయా
చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ఆ ఆ
నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా
సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా
కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం
పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ
సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ
పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో
సీతారాములు జలకములాడిన శేషతీర్దమదిగో
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ ఆ
రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా
శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన జన్మ ధన్యమయ్యా

అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య
చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య
అందరి బందువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్య

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభానిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ ఆ ఆ ఆ

బాహుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవ
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి
కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రామాణం ధర్మ దేవతకు నిలపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగా మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండము నీ బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు
లాభము శుభము కీర్తిని కూర్వగ లక్ష్మీ గణపతివైనావు
వేదపురాణములఖిలశాస్త్రములు కళలు చాటున నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీకీర్తనం

జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక
శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక
ఆ ఆ ఆ ఆ

సాగర ఘోషల శృతిలోహిమ జలపాతాల లయలో

సాగర ఘోషల శృతిలో
హిమ జలపాతాల లయలో
సంగీతం భారత సంగీతం
సునోరే భాయి సునోరే
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
ఓ సత్యాహింసలు శృతిలయిలైన
మానవతా గీతం ప్రేమసుధా భరితం
సత్యం శివ సుందరం సకల మత సమ్మతం
ప్రపంచ శాంతి సంకేతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం
ఈ లోకమే స్వర సందేశమే
ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా
అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా
జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే
మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే
హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి
కర్ణాటక భావాలు కమ్మనైనవి
సగమ గమగ మగని సానిద సానిదనిసా
ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన
ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్

సరిగరి సరిగరి సనిదని
పదనిస పదనిస పమగమ
నిస నిదప మపదప
గరి మగ పమ దప మగ పమ దప నిద
నిసాస దనీని పమగప పమగప పమగప
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది

దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా
ఆనందమే మధురానందమే
పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్
తూరుపు పడమర విశ్వగానమే చేయగా
శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా
అణు యుద్దములే జరగవులే
సరిహద్దుల గొడవలు తీరునులే
ప్రతిరోజు ఒక పండుగలే
ఇల మానవులందరూ బందువులే
సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట
నయాగరా హోరులో ఆలపించగా

సగమ గమగ మదని సానిస
నిదమ గమగ మగస నిసగ మదనిస
గమదనిస నిస గమదనిస
మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు
పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు
శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము
భావరాగ తాళయుక్త భారతీయ గానము
సరిగరి రిగమగ గమపమ
మపదప పదనిద దనిసని నిసరిస
సనిదప మగరి నిదప మగరిస సని
దనిస నిసని సరిగ రిగమ
రిగమ గమప మపద పదనిసా ఆ ఆ

శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది
శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం

తికమకపెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం

తికమకపెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం
అలాగ వుంటాం ఇలాగవుంటాం ఆకతాయిలం మేము
హే చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా
అరెభాయ్ ఇస్ర్టెటుగానే చెప్తా ఇసుకో

హే సత్యం పలికే హరిశ్చంద్రులం
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం
నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం
హే సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం
నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం
నమ్మితే ప్రానాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం నచ్చకుంటే మీ ఖర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్

వందనోటు జేబులో వుంటే నవాబునైజం
పర్సుఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం
కళ్లులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళికిలిస్తాం

ప్రేమా కావాలంటాం పైసా కావాలంటాం
ఏవోకలలేకంటాం తిక్కతిక్కగా వుంటాం
ఏడేళ్ళయినా టివి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళిరికార్డు డాన్సింగ్ చెస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికో టేస్తాం
అందరుదొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం

రూలు వుంది రంగూవుంది
రూలు వుంది రంగూవుంది తప్పకు తిరిగే లౌక్యం వుంది
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం

వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

కలలు కన్నీళ్లెన్నో మన కళ్లల్లో
ఆశయాలు ఆశలు ఎన్నోమన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిల్చినా రక్తం మనదీ
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనదీ

ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసు
దేవుడికెందుకు జెండా కవాలా పార్టీఅండా
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చగాళ్ల పనిపట్టు
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయిఒట్టు
కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు
దమ్మేవొంది ధైర్యంవుంది
దమ్మేవొంది ధైర్యంవుంది తలవంచని తెగపొగరుంది

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్

సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం
హే సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం
నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం
నమ్మితే ప్రానాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం
అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం నచ్చకుంటే మీ ఖర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం

మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్

నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు

నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మెగ్గల్లే నువ్వు ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నాప్రతి యుద్దం నువ్వు నా సైన్యం నువ్వు
నాప్రియ శత్రువు నువ్వూ నువ్వూ
మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వూ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ నువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ

మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ

ఓం కారనాదంతొ అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం

ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
ఓం కారనాదంతొ అంకురించిన వేద ధాత్రికి సంకేతం ఈ ఖడ్గం
హ్రీంకార నాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం
యుగయుగాలుగ గమనమాగని ఘనత ఈ ఖడ్గం
తరతరాలుగా కదలివచ్చిన చరిత ఈ ఖడ్గం

తనకళ్లముందె సామ్రాజ్య శఖరాలు మన్నుపాలైనా
క్షణమైన తనగాధ గతములో విడిచి మృతిఒడి చేరనిదీ ఖడ్గం
పూటకో పడమరను దాటి పూర్వద్రిపై నిత్య ప్రభాతమై
వెలుగుతున్నదీ భరత ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహ్ద్భుతం వున్నది ఈ ఖడ్గం
కేవలం ఆయుధం కాదు ఈ ఖడ్గం
ఏదో మహ్ద్భుతం వున్నది ఈ ఖడ్గం
మూడువన్నెల కేతనముగా మింటికి ఎగసి
కాలానికి ఎదురేగు యశోరాశి ఈ ఖడ్గం

ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
హరిని ధరపై అవతరించిగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం
నరులోని దైవాంశమే అర్శించి కొలిచిన ముక్తిమార్గం
ఆర్తరక్షకై ధరించిన ధీరగుణమీఖడ్గం
ధూర్త శిక్షణకై వహించిన కరుకుతనమీ ఖడ్గం
హుంకరించి అహంకరించి అతిక్రమించిన ఆకతాయుల
అంతుచూసిన క్షాత్రస్తత్వం
అస్తమించని అర్క ఖడ్గం
శరణుకోరి శిరస్సువంచి సమాశ్రయించిన అన్నిజాతుల
పొదువుకున్న ఉదారతత్వం జగపతిమరువని ధర్మఖడ్గం

నిద్దురమత్తును వదిలించే కెంజాయుల జిలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
చిక్కటి చీకటి చీల్చుకువచ్చే తెల్లని వెలుగీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
మట్టిని చీల్చుకు చిగురించే సిరిపచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం
కెంజాయల జిలుగీ ఖడ్గం
తెలతెల్లని వెలుగీ ఖడ్గం
సిరిపచ్చని చిగురీ ఖడ్గం
ఖడ్గం ఖడ్గం ఖడ్గం ఖడ్గం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గాపరాశక్తి లలితా శివానంద చరితా

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాదరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు అధిశక్తి
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్ర మూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిని మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరితా