Sunday, 3 December 2023

ఏ కులము నీదంటే గోకులము నవ్విందిమాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! ఏ కులము నీదంటే గోకులము నవ్విందిమాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! 

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది



ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది
ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది

ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది
ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది



ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది 

ఆదినుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది 
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు 

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు



ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !! 

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన ......

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన ......

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ 
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో 
 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా 
ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం 
అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ 
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా 
ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన 

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలాఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలాచెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలుఆకాశం నా నడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు
ఆకాశం నా నడుము నెలవెంక నా నుదురు సిగలో నువ్వేరా

పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే ! తెస్తానే !!
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే ! తీస్తానే !!
ఆ... పట్టుతేనె నీకన్నా తీయ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా 
అంతేనా అంతేనా... అవును అంతేరా...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా 

సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే ! చేస్తానే !!
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే ! దిద్దేనే !!
ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
అంతేనా అంతేనా... అవును అంతేరా... 
మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదంతనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలఝుమ్మంది నాదం సయ్యంది పాదంతనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా 

చలిత లలిత పద కలిత కవితలెద
సరిగమ పలికించగా
స్వర మధురిమలొలికించగా
సిరిసిరిమువ్వలు పులకించగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసి
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే ఒంగె నీకోసం
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

మెరుపుంది నాలో అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల

అయ్యా నేను చదివి బాగు పడతాఓరయ్య నేను చదివి బాగు పడతా పుస్తకాలు చదివి నేను మన బతుకులు మారుస్త అయ్యా నేను చదివి బాగు పడతాఓరయ్య నేను చదివి బాగు పడతా

అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా 
పుస్తకాలు చదివి నేను మన బతుకులు మారుస్త అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా

అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీస్తవెంది, 
చదువు బూతం పడితే నువ్వు సంక నాకి పోతావు
బి ఏ , ఎం ఏ , చదివినోల్లె బికర్లయ్యి తిరుగుతుండ్రు చదువు గోల నీకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,
ఒరేయ్ ఒరేయ్ చదువు గోల నీకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా

ఆ డాకటేరు కొడుకులాగా డాబు దూబు ఉంటాను,
ప్లీడరు గారి కొడుకు లాగ నెక్కు టై కడతాను , 
ఎస్ ఐ గారి కొడుకు లాగ సైక్లెక్కి బడికేలత , అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా

మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలు వాళ్ళు ,
వాళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడకా,
పని పాట లేనోల్లకి చదువే ఓ పెద్ద పని ,
చదువు గిదువు అన్నావంటే సెంప పగలగొడతాను ,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

దండించకు ఓరయ్య దండం బెదతా నీకు,
వీదుల్లో బడులున్నాయి, ఇస్కూలు బడులున్నాయి ,
పంతుల్ల కాళ్ళు మొక్కి చదువు బిక్ష పెట్టమంట ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,
ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటున్నాయి, అందుల్లో పంతుళ్ళు తేక తురారాలాడి,
ప్రివేటులు చదివితేనే పాసు చేత్తమంతండ్రు, చదువుకునే రోజులేల్లి, చదువులు కొనే రోజులోచ్చే, చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

డబ్బు గోల నీకెందుకు , ఆ బాదలు నేబడత, గవర్నమెంట్ చదువంట గరిబొల్ల చదువంట,అనాదొడి బిడ్డనని ,
హాటల్లో జేరత ,పుస్థలు బట్టలు ఉత్తినే ఇత్తరంట ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,

నమ్మకురా ఆ మాట నంజ కొడకా చేదిబోతావు, అనాదోల్ల పుత్తకాలు అస్సలు లేదంటారు ,
షాపు లోన పుత్తకాలు చాటు మాటు గమ్ముతుండ్రు , 
పసి పిల్లల కంచం లో పాసి కూడు పెడుతుండ్రు , కొటాల నాయకులు వాటాలు పన్చుకునీ...
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుండ్రు, చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు , ఇంగిలీషు చదివి నేను ఇంజినీరునై వత్త,
ఈ రిచ్చ బతుకు నీకెందుకు , కారు నీకు కొని దెత్త ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,

నీ కాన్వెంటు చదువుకి కరుతాయి నా కండలు,
ఇంజినీరు చదువుకి ఇంకుతాది నా నెత్తురు ,
నువ్వు కారు గొనేలోపు నేను కాటి కెళ్ళి బోతాను,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

ఫై చదువులు చాదుకొని పట్టాని పట్టుకొని , మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని,
ఆదోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి విసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే,
ముందు గానే ఈ పనులు ముచ్చటగా చేసుకోర,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా

కన్నోళ్ల కలలే పండించినావుఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై

పల్లవి :

పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు

మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥

దానవీరశూరకర్ణ నరసింహరాజు

సింహరాశిలో నువు పుట్టినావయ్యా

జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా


పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు

మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు ॥



చరణం : 1

పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు

నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు

బ్రతుకు బరువై లేకున్న చదువు

చదువులమ్మకు అయినాడు గురువు

మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు

మా కంటిచూపుల్లో సూరీడే నీవు

ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై

॥॥


చరణం : 2

కటిక నేలే నీ పట్టుపరుపు

పూరి గుడిసెను గుడి చేసినావు

కట్టుపంచే నీకున్న ఆస్తి

కోట్లు ఉన్న నిరుపేదవయ్యా

కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు

కన్నోళ్ల కలలే పండించినావు

ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై



మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి

కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి

సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి

పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది

గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది

మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా..

) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా.. 
(M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా
 (F) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
(M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా
(F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా.. 
(M) ఏ, జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా

(F) హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా
(M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా

చరణం 1

(M) ఎంత దాహం ఓ మన్మధా… ఎంగిలైనా తేనే కదా.. 
(F) పూల వయసు ఓ తుమ్మెదా… కాటు పడ్డా తీపే కదా
(M) వాలేదా ఇలా మీదా… సఖీ రాధా రారాదా.. 
(F) దా దా దా.. దయే రాదా… ప్రియం కాదా నా మీదా... 
(M) ముక్కు పచ్చ ఈడు గిచ్చే ముద్దులిచ్చేదా.. 
(F) హేహెహె… సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా

హే,   మన్మధా హ్ మన్మధా హ్ మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా

(M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా

చరణం 2

(F) ఆకలేసి సోకులన్నీ… సొమ్మసిల్లీ పోతయ్ కదా.. 
(M) సోకులన్నీ చిలకా చుట్టి… నోటికిస్తే ముద్దే కదా
(F) రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా
(M) ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా
(F) చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా
(M) ఓ ఓ… మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా

(F) హే హే హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరాఆ.. 
(M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా
(F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారాఆఆ.. 
(M) జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా