Sunday, 3 December 2023

ధీర ధీర ధీర మనసాగలేదురా... చేర రార సూర సొగసందుకో దొరా....

(పల్లవి):-
(She):- ధీర ధీర ధీర మనసాగలేదురా... చేర రార సూర సొగసందుకో దొరా....
అసమాన సాహసాలు చూడరాదు నిద్దుర.. నియమాలు వీడి రాణివాస మేలుకోరా ఏకవీర...ధీర....
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార సూర సొగసందుకో దొరా...
సఖి....సా....సఖి........

(చరణం1):-
(She):- అఅఆ అఅఅఆ అఅఅఅఆ అఅఅఅఅఆఆ అఅఅఅఅఅఆఆఆఆ అఅఅఅఆఆఆఆ
సమరములో దూకగా చాకచక్యం నీదేరా...సరసములో కొద్దిగా చూపరా..
(He):- అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా.. అధిపతి నై అదికాస్తా దోచేదా....
(She):- మ్ మ్ మ్ మ్ మ్....
కోరుకైన ప్రేమకై నా దారి ఒకటేరా...
(He):- చెలి సేవకైన దాడికైన చేవ ఉంది గా...
(She):- ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోరా ఇంద్ర పుత్ర...
ధీర ధీర ధీర మనసాగలేదురా..
చేర రార సూర సొగసందుకో దొరా.....
(He):- సువెరాధీరా...హో...
సువెరాధీరా... హా........
సువెరాధీరా..... హో....
సువెరాధీరా..హా ....

(చరణం2):- 
(He):- శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా....
కుసుమముతో ఖడ్గమే ఆడదా.
(She):- మగసిరితో అందమే అంటు తడిపే అంతేగా...
అణువణువు స్వర్గమే ఐపోదా.
(He):- శాసనాలు ఆపజాలని..తాపముందిగా...
(She):- చెరసాలలోని ఖైదు కాని కాంక్ష ముందిగా.....
(He):- శతజన్మలైన ఆగిపోని అంతులేని..యాత్ర చేసి....
నింగిలోని తార నను చేరుకుంది రా 
గుండెలో నగారా ఇక మోగుతుంది రా...
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దుర
ప్రియ పూజలేవో చేసుకోన చేతులార సేదతీర.....
(She):- ధీర ధీర ధీర మనసాగలేదురా.....
ధీర ధీర ధీర మనసాగలేదురా

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....
నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు...
నాలోనే నువ్వు నాతోనేనువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నాపెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నా ఒళ్లంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ... మెగ్గల్లే నువ్వు...ముద్దేసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతినిముషం నువ్వూ         

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....
చ: నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నాప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు
నాప్రియ శత్రువు నువ్వూ....నువ్వూ....
మెత్తని మల్లై గిల్లె తొలిచినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ... ||నువ్వు||
చ: నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
ముని పంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరం దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ....నువ్వూ....
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ...నువ్వూ....                 

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ....
నా పంతం నువ్వు....నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ.

నువ్వు...నువ్వు...నువ్వు నువ్వు, నువ్వు...నువ్వు ...నువ్వు....
నువ్వు...నువ్వు..నువ్వు,నువ్వు.....నువ్వు...నువ్వు...నువ్వు.....        

సాహసం నా పథం రాజసం నా రథంసాగితే ఆపడం సాధ్యమా

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా

కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసు పడితే ఏ కళలనైనా
ఈ చిటిక కొడుతూ నే పిలవనా

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా

అదరనీ బెదరనీ ప్రవుత్తి ఒదగనీ మదగజమే మహర్షి

వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందిలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలుపెడితే ఏ సమరమైనా నా కెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతి ఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిదాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమిఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంటఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటాఅయ్యో ఈ ఆటకి అంతే లేదు గాఅయినా లోకానికి అలుపే రాదు గా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి

దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి

ఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంట

ఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటా

అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా

అయినా లోకానికి అలుపే రాదు గా



యెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు

పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు

బంధం అనుకున్నది బండగ మారున

దూరం అనుకున్నది చెంతకు చేరున

మరుగేలరా ఓ రాఘవా

మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా అ...
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా అ.

అన్ని నీవనుచు అంతరంగమునా
అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా
నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అ

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిదాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమిఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంటఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటాఅయ్యో ఈ ఆటకి అంతే లేదు గాఅయినా లోకానికి అలుపే రాదు గా

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి

దాగుడుమూతలు దండాకోరు వీరి పేరేమి

ఇది మనుషులు ఆడె ఆట అనుకొంటారె అంట

ఆ దెవుడు ఆడె ఆట అని తెలిసెదెపుడంటా

అయ్యో ఈ ఆటకి అంతే లేదు గా

అయినా లోకానికి అలుపే రాదు గా



యెవరికి వారొక తీరు చివరికి ఏమౌతారు

పైనున్న దెవుడు గారు మీ తెలివికి జోహారు

బంధం అనుకున్నది బండగ మారున

దూరం అనుకున్నది చెంతకు చేరున

ప్రేమ ప్రేమ ప్రేమ....♡♡♡ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా....

ప్రేమ ప్రేమ ప్రేమ....♡♡♡
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా....
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా....
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా
ప్రేమ ప్రేమ ప్రేమ...
ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా....
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా....

కనులే కరువైతే అందమెందుకు
వనమే ముళ్ళైతే కంచె ఎందుకు
కలలే కథలై బతుకే చితులై
సాగే పయనం నీదా ప్రేమా....

ప్రేమా ప్రేమా నీకు ఇది న్యాయమా....
ప్రేమా ప్రేమా ప్రేమించడం నేరమా....
కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే
మౌనగానాలు నీవే పంచప్రాణాలు నీవే
కాలం ముళ్ళ ఒడిలో బతుకే పతనమా
దైవం కరుణిస్తే మాదే విజయమా

చెలియా శిల లేక కోవెలెందుకు
జతగా నువు లేక నేను ఎందుకు
మమతే కరువై మనసే బరువై
లోకం నరకం కాదా ప్రేమా