Sunday, 3 December 2023

అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో ఎందుకో ఎందుకో

పల్లవి: 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 1: 

అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో 
ఏమని చెప్పాలి నీతో 
ఒక్క మాట అయినా తక్కువేమి కాదే 
ప్రేమకు సాటేదీ లేదే 
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా 
రెండు మనసులొకటయ్యేనా 
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళ 
కాలి మువ్వ గొంతు కలిపెనా 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 

చరణం 2: 

ఓర నవ్వుతోనే ఓనమాలు నేర్పి 
ఒడిలో చేరిందా ప్రేమ 
కంటి చూపుతోనే కొంటె సైగ చేసి 
కలవర పెడుతోందా ప్రేమ 
గాలిలాగ వచ్చి ఎద చేరెనేమో ప్రేమ 
గాలి వాటు కాదే మైనా 
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా 
అందుకోవే ప్రేమ దీవెన 

అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
ఎందుకో అసలెందుకో అడుగెందుకో 
మొదటిసారి ప్రేమ కలిగినందుకా 
అందమైన మనసులో ఇంత అలజడెందుకో 
ఎందుకో ఎందుకో ఎందుకో 
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో 
ఎందుకో ఎందుకో మ్మ్..

లాహిరి లాహిరి లాహిరిలో

లాహిరి లాహిరి లాహిరిలో

ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ

తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో


లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ

అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో

లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2)


చరణం :1
కుందనం మెరుపు కన్నా .... వందనం వయసు కన్నా ....
చెలి అందం నేడే అందుకున్నా యా 
గుండెలో కొసరుతున్న ..... కోరికే తెలుపుతున్న ....
చూపే వేసి బ్రతికిస్తావనుకున్న ......
కంటి పాపలా పూవులనీ ... నీ కనులలో కన్నా ..
నీ కళ్ళే వాటి పోనీ పువ్వులమ్మ ...(2)   

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....


చరణం :2
మనసులో నిన్ను కన్న ..... మనసుతో పోల్చుకున్నా ....
తలపుల పిలుపులు విన్నానా .....
సెగలతో కాలుతున్న .... చలికి నే వణుకుతున్న ....
నీదే లేని జాదే తెలుసుకున్న .....
మంచు చల్లన ..... ఎండా చల్లన .....
తాపం లోన మంచు చల్లన ......
కన్నా నీ కోపం లోన ఎండా చల్లన ... (2) .... 

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2)

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునైకొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగలనీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజలనీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడ
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఎటులైనా ఇచటనే ఆగిపోనా

దేహో దేవాలయో ప్రోక్తోజీవో దేవస్సనాతనః

పల్లవి :

దేహో దేవాలయో ప్రోక్తో
జీవో దేవస్సనాతనః

దేహమేరా దేవాలయం
దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం

నేనే బ్రహ్మ... నేనే విష్ణువు
నేనే బ్రహ్మ... నేనే విష్ణువు
నేనే శివుడై నిలబడితే....
ఏ అర్హత నాకుండాలీ?
ఏ అధికారం కావాలీ?

అహం బ్రహ్మస్మి... అహం బ్రహ్మస్మి
దేహమేరా... దేవాలయం 

చరణం 1 : 

ఆత్మాత్వం గిరిజా మతిః
పరిజనాః ప్రాణః శరీరం గృహం

అనలేదా అది శంకరుడు...
అంతకు మించిన వారా మీరు?

ఆడంబరమూ బాహ్యవేశము
అర్బాటలే మీ మతమా
అస్థికులంటే మీరేనా
అస్థికలంటే శరీరమా

శిలా గోపురం ఆలయమా
శఠగోపురమే అర్చనమా

దేహమేరా దేవాలయం
జీవుడే సనాతన దైవం 

చరణం 2 : 

అద్వేష్టా సర్వ భూతానాం
మైత్రః కరుణ యేవచ
నిర్మమో నిరహంకారః
నమ దుఃఖ సుఖ క్షమీ

సంతుష్ట స్సతతం యెగీ
యదాత్మా దృఢ నిశ్చయః

మై అర్పిత మనో బుద్దిర్యోహో
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః
మద్బక్త స్సమే ప్రియః

మరుగేలరా ఓ రాఘవా

మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా అ...
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా అ.

అన్ని నీవనుచు అంతరంగమునా
అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా
నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అ

సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల

సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా
సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల
దయాలవాల మాంపాలయ సామజ వరగమనా
ఆమని కోయిలా ఇలా _ నా జీవన వేణువులూదగా
మధుర లాలసల మధు పలాలనల _ పెదవిలోని మధువులాను
వ్రతముపూని జతకు చేరగా
నిసా _ దనీ మదా గమా సమమగ గదదమ
మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద
మదదని గమదని సనిదమగస సామజవరగమనా
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరులపాన్పు పరచి నిన్ను పలుకరించగా
గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని
మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా
సాసా సానీ సదా సగమద గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ