విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం... ఓం....
ప్రాణనాడులకు స్పందన నొసగిన అది ప్రణవనాదం.... ఓం ....
కనుల కొలనులో ప్రతిభింబించిన విశ్వ రూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....
సరస్వర సురఝ రీ గమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం ...... ఈ గీతం ....
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రార్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రుల పైన ....
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిల కిల త్వనములు స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా
విరించినై విరించితిని ఈ కవనం ....
విపంచినై విని పించితిని ఈ గీతం
జనించు ప్రతి శిశు కాలమును పలికిన జీవన నాద తరంగం ....
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం ...
అనాదిరాగం అది తాళమును అనంత జీవన వాహిని గా
సాగిన సృష్టి విలాసము నే
వించినాయి విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉఛ్వ్యాసం కవనం నా విశ్వాసం గానం
సరస్వర సుర ఝరీగమనమౌ సామవేద సారమిది
నేపాడిన జీవిన గీతం .... ఈ గీతం